Shirish Kunder
-
‘ఎల్జీ’ ట్వీట్‌పై పేలుతున్న జోకులు
న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. రాష్ట్రం హక్కుల్ని కేంద్రం కాలరాస్తుందని, ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్, మంత్రులు ఈ నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. వీరు తన కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తుండటంతో, గవర్నర్ తన ఉద్యోగాన్ని ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, ఇతర డిపార్ట్మెంట్లకు చెందిన ఫైల్స్‌ను మాత్రమే చూసుకుంటున్న గవర్నర్, ఢిల్లీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ ఒక్క ఫైల్‌ను ముట్టడం లేదు. అంతేకాక ఇన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మంత్రుల్ని, ఢిల్లీ ముఖ్యమంత్రిని అసలు పట్టించుకోవడం లేదు. ఢిల్లీలో జరుగుతున్న ఈ హైడ్రామాపై డైరెక్టర్ శిరిష్ కుందర్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతోంది. సీరియస్ సమస్యలపై కూడా హాస్యాభరితమైన ట్వీట్ చేసే శిరిష్ కుందర్, నేడు కూడా ఇదే విధంగా హాస్యం పండించారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌ను అడగండి.. ఢిల్లీలో సర్వీసు సెంటర్ ఉందా? అని.. అక్కడ ఎల్జీ పనిచేయడం లేదు... అని హాస్యాస్పదంగా కామెంట్ చేశారు. అయితే శిరిష్ కుందర్ చేసిన ఈ ట్వీట్ నిజంగా ఎల్జీ కంపెనీ గురించి అనుకున్నారామో? కాదు. లెఫ్టినెంట్ గవర్నర్ గురించి. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోని ఎల్జీ ఎలక్ట్రానిక్స్... నిజంగా తమ వస్తువులపై ఫిర్యాదు చేశారేమోనని భావించి.. వెంటనే జవాబిచ్చింది. ‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. దయచేసి మీ కాంటాక్ట్ వివరాలు మాకు అందించండి. దీంతో వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తాం ’ అని ట్వీట్ చేసింది. శిరిష్ కుందర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ చేసిన ట్వీట్లు కొన్ని గంటల్లోనే తొలగించారు. శిరిష్ కుందర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మధ్య జరిగిన సంభాషణపై ట్విటర్లో జోకులు పేలుతున్నాయి. OMG!! This one is killer — Sushil Jain (@SushilJ1960) June 16, 2018 Wow ... his is what we call humour! Even @LtGovDelhi must be smiling ~ 😀😀😀🙏 — Dr.S.P.Singh MD (@medico956) June 16, 2018 -
మతంపై ప్రశ్న.. ఊహించని సమాధానం!
ముంబై: మీ పెదాలపై చిరునవ్వు విరియాలని కోరుకుంటున్నారా? అయితే బాలీవుడ్ కొరియోగ్రాఫర్- దర్శకురాలు ఫరాఖాన్ భర్త శిరీష్ కుందర్ ట్వీట్ చూస్తే మీ అధరాలపై చిరునవ్వు చేరడం ఖాయం. ఓ నెటిజన్ సంధించిన ప్రశ్నకు అతడు ఇచ్చిన సమాధానం నెటిజన్ల మెప్పు పొందింది. అమెరికాలో గ్రాండ్ కెన్యన్ పర్వత శిఖరంపై తన భార్య ఫరాఖాన్, పిల్లలు సీజర్, అన్య, దివా దిగిన ఫొటోను కుందర్ తన ట్విటర్ పేజీలో పోస్టు చేశాడు. తమ వాళ్లు ఇక్కడ ఫొటో తీసుకోవడం చాలా గర్వంగా ఉందని కామెంట్ పెట్టాడు. దీనిపై ఫాతిమా ఆర్య అనే యూజర్ వింత ప్రశ్న సంధించింది. మీ పిల్లలు హిందువులా, ముస్లింలా అంటూ ఆరా తీసింది. దీనికి కుందర్ ఊహించని సమాధానం ఇచ్చారు. తన పిల్లలు ఏ మతానికి చెందిన వారు అనేది తర్వాత వచ్చే పండగ మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. గత నెలలో క్రిస్మస్ చేస్తుకున్నారు కాబట్టి అప్పుడు క్రైస్తవులని చెప్పారు. కుందర్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. కుందర్ ట్వీట్ కు 4,600 లైకులు రాగా, 2,300 మంది రీట్వీట్ చేశారు. అంతేకాదు కుందర్ సమాధానం తమను ఆకట్టుకుందని ఎంతోమంది మెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత ట్విటర్ లో మంచి స్పందన చూశానని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. @ShirishKunder Your Kids Hindus or Muslims ? — Fatima Arya (@XMuslimFatima) 3 January 2017 -
ఆ సినిమాను యూట్యూబ్ లో చూడలేరు!
ముంబై: మనోజ్ బాజపేయి, రాధిక ఆప్టే నటించిన షార్ట్ ఫిలిమ్ 'కృతి' యూట్యూబ్ నుంచి తొలగించారు. కాపీ రైట్ వివాదం తలెత్తడంతో ఈ సినిమాను యూట్యూబ్ తొలగించింది. ఈ విషయాన్ని దర్శకుడు శిరీష్ కుందర్ ధ్రువీకరించారు. యూట్యూబ్ నుంచి తమ సినిమాను తొలగించారని ట్వీట్ చేశారు. తమకు మద్దతుగా నిలిచినందుకు ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'కృతి' షార్ట్ ఫిలిమ్ ను యూట్యూబ్ లో 25 లక్షల మంది వీక్షించారు. 18 నిమిషాల నిడివున్న ఈ సినిమాను యూట్యూబ్ లో జూన్ 22న విడుదల చేశారు. తన షార్ట్ ఫిలిమ్ 'బాబ్'ను కాపీ కొట్టి 'కృతి' తీశారని నేపాల్ దర్శకుడు అనీల్ న్యుపనె ఆరోపించడంతో వివాదం రేగింది. 'కృతి' కంటే ఏడు నెలల ముందే 'బాబ్' తీశానని వెల్లడించాడు. అనీల్ న్యుపనె ఆరోపణలను శిరీష్ తోసిపుచ్చాడు. తనపై ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అతడికి లీగల్ నోటీసు పంపాడు. -
దర్శకుడికి లీగల్ నోటీసు
ముంబై: నేపాల్ దర్శకుడు అనీల్ న్యుపనెకు 'కృతి' షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ శిరీష్ కుందర్ లీగల్ నోటీసు ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకముందు ఎటువంటి కామెంట్స్ చేయరాదని హెచ్చరించారు. 'కృతి' బాగుదంటూ సోషల్ మీడియాలో ప్రముఖులు ప్రశంసించారు. అయితే తన షార్ట్ ఫిలిమ్ 'బాబ్'ను కాపీ కొట్టి 'కృతి' తీశారని అనీల్ న్యుపనె ఆరోపించాడు. దీంతో స్పందించిన శిరీష్ తన లాయర్ ద్వారా లీగల్ నోటీసు పంపాడు. తమ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తైందని, జూన్ 22న యూట్యూబ్ లో విడుదల చేశామని శిరీష్ తెలిపాడు. 'బాబ్' షార్ట్ ఫిలిమ్ మే 12న యూట్యూబ్ లో పెట్టారని వెల్లడించారు. రెండు సినిమాలకు సారూప్యత ఉన్నంత మాత్రానా కాపీ కొట్టారని ఆరోపణలు సమంజసం కాదని పేర్కొన్నారు. 'కృతి' సినిమా బాగుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. -
షార్ట్‌ఫిలింలో నటిస్తున్న సూపర్ స్టార్లు!
ముంబై: ఒకప్పుడు షార్ట్ఫిలింలంటే చులకన భావం ఉండేది. సినిమాల కంటే నిడివి తక్కువగా ఉండే వీటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. షార్ట్ ఫిలింలు అంటే డాక్యుమెంటరీలు అన్న భావన ఉండేది. ఇంటర్నెట్, సోషల్ మీడియా రాకతో ఇది పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ హీరోయిన రాధికా ఆఫ్టే ఇటీవల షార్ట్ ఫిలిం 'అహల్య'తో సంచలనం సృష్టించింది. ఈ ష్టార్ఫిలిం ఇటు వీక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలందుకుంది. తాజాగా డైరెక్టర్ శిరీష్ కుందర్ కూడా ఇలాంటి ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నాడు. మనోజ్ బాజ్‌పేయి, రాధికా ఆఫ్టే వంటి బాలీవుడ్ స్టార్లతో 'క్రితి' అనే చిన్న సినిమాను ఆయన నిర్మిస్తాడు. 15 నిమిషాల నిడిమి మాత్రమే ఉండే ఈ సినిమా ఓ సైకాలజికల్ థ్రిల్లర్. ఇందులో హీరోయిన్ నేహా శర్మ కూడా ఓ పాత్రలో కనిపిస్తుంది. 2006లో జానేమన్ సినిమా తీసిన శీరిష్.. ఈ పొట్టి చిత్రంతో షార్ట్‌ఫిలిం రంగంలోకి అడుగుపెడుతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కన్నా షార్ట్ఫిలింలోనే సబ్జెక్ట్‌ను నేరుగా చెప్పే స్కోప్ ఎక్కువగా ఉంటుందని ఆయన అంటున్నాడు. ఉత్కంఠ కలిగించే ఎక్సైటింగ్ స్టోరీలను చెప్పడానికి షార్ట్‌ఫిలింలు ఎంతోగానో ఉపయోగపడతాయని, ఇందుకు అందుబాటులో ఉన్న డిజిటల్ స్పేస్ ఎంతగానో తోడ్పాటు అందిస్తోందని ఆయన అంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు నిర్మించేందుకు, వాటిని విడుదలచేసేందుకు ఎంతగానో సమయం పడుతుందని, ఇబ్బందులూ ఎదురవుతాయని, షార్ట్‌ఫిలింలకు ఆ చిక్కులు లేవని ఆయన చెప్పారు. గతంలో పలు షార్ట్ ఫిలింలలో నటించిన రాధిక, మనోజ్ తొలిసారి ఈ ప్రాజెక్టు కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ షార్ట్ ఫిలిం సెట్‌పైకి వెళ్లనుంది. ఏప్రిల్ 22న విడదల కానుంది.