మతంపై ప్రశ్న.. ఊహించని సమాధానం! | Shirish Kunder's Perfect Reply When Asked About His Children's Religion | Sakshi
Sakshi News home page

మతంపై ప్రశ్న.. ఊహించని సమాధానం!

Published Thu, Jan 5 2017 3:25 PM | Last Updated on Sat, Aug 25 2018 6:37 PM

మతంపై ప్రశ్న.. ఊహించని సమాధానం! - Sakshi

మతంపై ప్రశ్న.. ఊహించని సమాధానం!

ముంబై: మీ పెదాలపై చిరునవ్వు విరియాలని కోరుకుంటున్నారా? అయితే బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్- దర్శకురాలు ఫరాఖాన్‌ భర్త శిరీష్‌ కుందర్‌ ట్వీట్‌ చూస్తే మీ అధరాలపై చిరునవ్వు చేరడం ఖాయం. ఓ నెటిజన్‌ సంధించిన ప్రశ్నకు అతడు ఇచ్చిన సమాధానం నెటిజన్ల మెప్పు పొందింది.

అమెరికాలో గ్రాండ్‌ కెన్యన్‌ పర్వత శిఖరంపై తన భార్య ఫరాఖాన్‌, పిల్లలు సీజర్‌, అన్య, దివా దిగిన ఫొటోను కుందర్‌ తన ట్విటర్‌ పేజీలో పోస్టు చేశాడు. తమ వాళ్లు ఇక్కడ ఫొటో తీసుకోవడం చాలా గర్వంగా ఉందని కామెంట్‌ పెట్టాడు. దీనిపై ఫాతిమా ఆర్య అనే యూజర్‌ వింత ప్రశ్న సంధించింది. మీ పిల్లలు హిందువులా, ముస్లింలా అంటూ ఆరా తీసింది. దీనికి కుందర్‌ ఊహించని సమాధానం ఇచ్చారు. తన పిల్లలు ఏ మతానికి చెందిన వారు అనేది తర్వాత వచ్చే పండగ మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. గత నెలలో క్రిస్మస్ చేస్తుకున్నారు కాబట్టి అప్పుడు క్రైస్తవులని చెప్పారు.

కుందర్‌ ఇచ్చిన సమాధానం సోషల్‌ మీడియాలో సూపర్‌ హిట్‌ అయింది. కుందర్‌ ట్వీట్‌ కు 4,600 లైకులు రాగా, 2,300 మంది రీట్వీట్‌ చేశారు. అంతేకాదు కుందర్‌ సమాధానం తమను ఆకట్టుకుందని ఎంతోమంది మెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత ట్విటర్‌ లో మంచి స్పందన చూశానని ఓ నెటిజన్‌ వ్యాఖ్యానించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement