షార్ట్‌ఫిలింలో నటిస్తున్న సూపర్‌ స్టార్లు! | Manoj Bajpayee, Radhika Apte in Shirish Kunders short fim | Sakshi
Sakshi News home page

షార్ట్‌ఫిలింలో నటిస్తున్న సూపర్‌ స్టార్లు!

Published Mon, Feb 22 2016 6:47 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

షార్ట్‌ఫిలింలో నటిస్తున్న సూపర్‌ స్టార్లు!

షార్ట్‌ఫిలింలో నటిస్తున్న సూపర్‌ స్టార్లు!

ముంబై: ఒకప్పుడు షార్ట్‌ఫిలింలంటే చులకన భావం ఉండేది. సినిమాల కంటే నిడివి తక్కువగా ఉండే వీటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. షార్ట్‌ ఫిలింలు అంటే డాక్యుమెంటరీలు అన్న భావన ఉండేది. ఇంటర్నెట్, సోషల్ మీడియా రాకతో ఇది పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ హీరోయిన రాధికా ఆఫ్టే ఇటీవల షార్ట్ ఫిలిం 'అహల్య'తో సంచలనం సృష్టించింది. ఈ ష్టార్‌ఫిలిం ఇటు వీక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలందుకుంది. తాజాగా డైరెక్టర్ శిరీష్‌ కుందర్‌ కూడా ఇలాంటి ప్రయోగానికి సన్నాహాలు  చేస్తున్నాడు.

మనోజ్ బాజ్‌పేయి, రాధికా ఆఫ్టే వంటి బాలీవుడ్ స్టార్‌లతో 'క్రితి' అనే చిన్న సినిమాను ఆయన నిర్మిస్తాడు. 15 నిమిషాల నిడిమి మాత్రమే ఉండే ఈ సినిమా ఓ సైకాలజికల్ థ్రిల్లర్‌. ఇందులో హీరోయిన్ నేహా శర్మ కూడా ఓ పాత్రలో కనిపిస్తుంది. 2006లో జానేమన్ సినిమా తీసిన శీరిష్‌.. ఈ పొట్టి చిత్రంతో షార్ట్‌ఫిలిం రంగంలోకి అడుగుపెడుతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కన్నా షార్ట్‌ఫిలింలోనే సబ్జెక్ట్‌ను నేరుగా చెప్పే స్కోప్ ఎక్కువగా ఉంటుందని ఆయన అంటున్నాడు.

ఉత్కంఠ కలిగించే ఎక్సైటింగ్ స్టోరీలను చెప్పడానికి షార్ట్‌ఫిలింలు ఎంతోగానో ఉపయోగపడతాయని, ఇందుకు అందుబాటులో ఉన్న డిజిటల్ స్పేస్‌ ఎంతగానో తోడ్పాటు అందిస్తోందని ఆయన అంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు నిర్మించేందుకు, వాటిని విడుదలచేసేందుకు ఎంతగానో సమయం పడుతుందని, ఇబ్బందులూ ఎదురవుతాయని, షార్ట్‌ఫిలింలకు ఆ చిక్కులు లేవని ఆయన చెప్పారు. గతంలో పలు షార్ట్ ఫిలింలలో నటించిన రాధిక, మనోజ్ తొలిసారి ఈ ప్రాజెక్టు కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ షార్ట్ ఫిలిం సెట్‌పైకి వెళ్లనుంది. ఏప్రిల్ 22న విడదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement