Nepali filmmaker
-
ప్రపంచ సినిమా చూపు తెలుగు సినిమా వైపు!!
బాహుబలి,పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో యావత్ ప్రపంచం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారని నేపాల్ సూపర్ స్టార్ భువన్ కెసి అన్నారు. తెలుగు సినిమాల స్థాయి చూసి చలన చిత్ర నిర్మాణ సంస్థలు, సాంకేతిక నిపుణులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. నేపాల్ రాజధాని ఖాట్మాండు లోని నేపాల్ ఫిలిం బోర్డ్ ఆడిటోరియంలో నిర్వహించిన ఇండో నేపాల్ ఫిలిం ఎక్స్చేంజి - 2023 సదస్సుకి ఎఫ్టిఫైసి అధ్యక్షులు చైతన్య జంగా,కార్యదర్శి వీస్ వర్మ పాకలపాటి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సౌత్ సినిమాలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరు అబ్బురపరిచేలా ఉందని నేపాల్ సీనియర్ హీరో భువన్ కె సి సహా, యంగ్ హీరో ఆయుశ్మాన్ జోషి కొనియాడారు. నేపాల్ చిత్రాలకు భారత్ దేశంలో వ్యాపార అవకాశాలు కల్పించడంతో పాటు నేపాలీ చిత్రాలు ఇండియాలోని పలు లొకేషన్లలో,అలాగే ఇండియన్ మూవీస్ నేపాల్‌లో షూటింగ్ జరుపుకొనేలా కృషి చేస్తున్న ఎఫ్టిపిసి ఇండియా సంస్థ సేవలు అమోఘమని నేపాల్ ఫిలిం ప్రమోషన్ సర్క్యూట్ సంస్థ అధ్యక్ష కార్యదర్సులు నూతన్ నిపాడే, హిమాల్ ప్రశంసించారు. -
ఆ సినిమాను యూట్యూబ్ లో చూడలేరు!
ముంబై: మనోజ్ బాజపేయి, రాధిక ఆప్టే నటించిన షార్ట్ ఫిలిమ్ 'కృతి' యూట్యూబ్ నుంచి తొలగించారు. కాపీ రైట్ వివాదం తలెత్తడంతో ఈ సినిమాను యూట్యూబ్ తొలగించింది. ఈ విషయాన్ని దర్శకుడు శిరీష్ కుందర్ ధ్రువీకరించారు. యూట్యూబ్ నుంచి తమ సినిమాను తొలగించారని ట్వీట్ చేశారు. తమకు మద్దతుగా నిలిచినందుకు ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'కృతి' షార్ట్ ఫిలిమ్ ను యూట్యూబ్ లో 25 లక్షల మంది వీక్షించారు. 18 నిమిషాల నిడివున్న ఈ సినిమాను యూట్యూబ్ లో జూన్ 22న విడుదల చేశారు. తన షార్ట్ ఫిలిమ్ 'బాబ్'ను కాపీ కొట్టి 'కృతి' తీశారని నేపాల్ దర్శకుడు అనీల్ న్యుపనె ఆరోపించడంతో వివాదం రేగింది. 'కృతి' కంటే ఏడు నెలల ముందే 'బాబ్' తీశానని వెల్లడించాడు. అనీల్ న్యుపనె ఆరోపణలను శిరీష్ తోసిపుచ్చాడు. తనపై ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అతడికి లీగల్ నోటీసు పంపాడు. -
దర్శకుడికి లీగల్ నోటీసు
ముంబై: నేపాల్ దర్శకుడు అనీల్ న్యుపనెకు 'కృతి' షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ శిరీష్ కుందర్ లీగల్ నోటీసు ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకముందు ఎటువంటి కామెంట్స్ చేయరాదని హెచ్చరించారు. 'కృతి' బాగుదంటూ సోషల్ మీడియాలో ప్రముఖులు ప్రశంసించారు. అయితే తన షార్ట్ ఫిలిమ్ 'బాబ్'ను కాపీ కొట్టి 'కృతి' తీశారని అనీల్ న్యుపనె ఆరోపించాడు. దీంతో స్పందించిన శిరీష్ తన లాయర్ ద్వారా లీగల్ నోటీసు పంపాడు. తమ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తైందని, జూన్ 22న యూట్యూబ్ లో విడుదల చేశామని శిరీష్ తెలిపాడు. 'బాబ్' షార్ట్ ఫిలిమ్ మే 12న యూట్యూబ్ లో పెట్టారని వెల్లడించారు. రెండు సినిమాలకు సారూప్యత ఉన్నంత మాత్రానా కాపీ కొట్టారని ఆరోపణలు సమంజసం కాదని పేర్కొన్నారు. 'కృతి' సినిమా బాగుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. -
నా ఫిలింను కాపీ కొట్టారు
బాలీవుడ్ తారలు మనోజ్ వాజ్‌పేయి, రాధికా ఆప్టే, నేహా శర్మలో దర్శకుడు శిరీష్ కుందర్ తీసిన షార్ట్ ఫిలిం కృతి ఓ వివాదంలో చిక్కుకుంది. పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతున్న ఈ షార్ట్ ఫిలింను.. తన షార్ట్ ఫిలిం బాబ్ను కాపీ కొట్టి తీశారని నేపాల్‌కు చెందిన దర్శకుడు అనీల్ న్యుపనె ఆరోపిస్తున్నాడు. బాబ్ ఏడు నెలల క్రితం విడుదలైనట్టు అనీల్ తెలిపాడు. ఇందులోని పాత్రలు, కథాంశంతోనే కృతిని తీసినట్టు చెప్పాడు. అయితే యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందని అన్నాడు. తన షార్ట్ ఫిలింకు, దీనికి ఎన్నో సారూప్యతలు ఉన్నాయని, కృతి షార్ట్ ఫిలింను చూసి షాకయ్యానని చెప్పాడు.