బాహుబలి,పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్ వంటి సినిమాలతో యావత్ ప్రపంచం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారని నేపాల్ సూపర్ స్టార్ భువన్ కెసి అన్నారు. తెలుగు సినిమాల స్థాయి చూసి చలన చిత్ర నిర్మాణ సంస్థలు, సాంకేతిక నిపుణులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.
నేపాల్ రాజధాని ఖాట్మాండు లోని నేపాల్ ఫిలిం బోర్డ్ ఆడిటోరియంలో నిర్వహించిన ఇండో నేపాల్ ఫిలిం ఎక్స్చేంజి - 2023 సదస్సుకి ఎఫ్టిఫైసి అధ్యక్షులు చైతన్య జంగా,కార్యదర్శి వీస్ వర్మ పాకలపాటి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సౌత్ సినిమాలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరు అబ్బురపరిచేలా ఉందని నేపాల్ సీనియర్ హీరో భువన్ కె సి సహా, యంగ్ హీరో ఆయుశ్మాన్ జోషి కొనియాడారు.
నేపాల్ చిత్రాలకు భారత్ దేశంలో వ్యాపార అవకాశాలు కల్పించడంతో పాటు నేపాలీ చిత్రాలు ఇండియాలోని పలు లొకేషన్లలో,అలాగే ఇండియన్ మూవీస్ నేపాల్లో షూటింగ్ జరుపుకొనేలా కృషి చేస్తున్న ఎఫ్టిపిసి ఇండియా సంస్థ సేవలు అమోఘమని నేపాల్ ఫిలిం ప్రమోషన్ సర్క్యూట్ సంస్థ అధ్యక్ష కార్యదర్సులు నూతన్ నిపాడే, హిమాల్ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment