
పుష్ప డైలాగ్స్‌తో టాలీవుడ్ ప్రియులను ఆకట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. బన్నీకి అభిమాని అయిన ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ టాలీవుడ్ సినిమా డైలాగ్స్‌తో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు. గతంలో అల్లు అర్జున్ పుష్ప మూవీ డైలాగ్స్‌తో తగ్గేదేలా అంటూ అభిమానులను అలరించాడు. ఆయన తాజాగా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ వివరాలేంటో మీరు కూడా చూసేయండి.
నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న తాజా చిత్రం రాబిన్ హుడ్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనుంది. భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే తాజాగా కింగ్‌స్టన్ మూవీ ఈవెంట్‌కు హాజరైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై రవిశంకర్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ చిన్న రోల్ చేశారని తెలిపారు. దీంతో నితిన్ ఫ్యాన్స్‌తో పాటు వార్నర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో అల్లు అర్జున్ మూవీ పుష్ప డైలాగ్‌లో డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చాలాసార్లు బన్నీ డైలాగ్స్ చెబుతూ తనదైన స్టైల్లో అలరించాడు. తాజాగా రాబిన్ హుడ్ మూవీతో డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో అటు క్రికెట్ ఫ్యాన్స్.. ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. డేవిడ్ వార్నర్ గతంలో ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment