AUstralia cricketer
-
డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ.. ఆ హీరో సినిమాతో అరంగేట్రం
పుష్ప డైలాగ్స్‌తో టాలీవుడ్ ప్రియులను ఆకట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. బన్నీకి అభిమాని అయిన ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ టాలీవుడ్ సినిమా డైలాగ్స్‌తో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు. గతంలో అల్లు అర్జున్ పుష్ప మూవీ డైలాగ్స్‌తో తగ్గేదేలా అంటూ అభిమానులను అలరించాడు. ఆయన తాజాగా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ వివరాలేంటో మీరు కూడా చూసేయండి.నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న తాజా చిత్రం రాబిన్ హుడ్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా కనిపించనుంది. భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే తాజాగా కింగ్స్టన్ మూవీ ఈవెంట్‌కు హాజరైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై రవిశంకర్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ చిన్న రోల్ చేశారని తెలిపారు. దీంతో నితిన్ ఫ్యాన్స్‌తో పాటు వార్నర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గతంలో అల్లు అర్జున్ మూవీ పుష్ప డైలాగ్‌లో డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చాలాసార్లు బన్నీ డైలాగ్స్ చెబుతూ తనదైన స్టైల్లో అలరించాడు. తాజాగా రాబిన్ హుడ్ మూవీతో డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో అటు క్రికెట్ ఫ్యాన్స్.. ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. డేవిడ్ వార్నర్ గతంలో ఐపీఎల్లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. -
ఇలాగే ఉంటే ప్లంబర్ పనికి రావాలి.. మారి చూపించాడు! టెస్టుల్లో టీ20 ఇన్నింగ్స్‌తో..
సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం.. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం తమ జట్టును ఎంపిక చేసేందుకు ఆస్ట్రేలియా సెలక్టర్లు కూర్చున్నారు. ఆ సమయంలో డేవిడ్ వార్నర్ అనే కుర్రాడి పేరు ప్రస్తావనకు వచ్చింది. అతను అప్పటికే రెండేళ్లుగా టి20ల్లో రాణిస్తూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆసీస్ సంప్రదాయం ప్రకారం దేశవాళీ క్రికెట్లో నాలుగు రోజుల ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడని ఆటగాళ్లను జాతీయ జట్టుకు ఎంపిక చేసే అవకాశం లేదు. టి20 ఫార్మాట్లో ఎంపిక చేసేందుకైనా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాలనేది గట్టి అభిప్రాయం. దీనిపై సెలక్టర్ల సమావేశంలో తీవ్ర చర్చ సాగింది. అతని దూకుడైన ఆటతో కొత్తగా ప్రయోగం చేయవచ్చని ఒక వాదన. అయితే అది ఫస్ట్‌క్లాస్ క్రికెట్ విలువను తగ్గిస్తుందనేది మరో వాదన. చివరకు మొదటి వాదనే నెగ్గింది. ఆసీస్ చరిత్రలో 1877 తర్వాత ఫస్ట్‌క్లాస్ స్థాయి క్రికెట్ ఆడకుండానే టీమ్‌లోకి ఎంపికైన తొలి ఆటగాడిగా వార్నర్ పేరుపొందాడు. అతనూ తన సత్తా చాటి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. టి20 శైలి దూకుడుతో టెస్టు క్రికెట్లో అనూహ్య ఫలితాలు సాధించి తర్వాతి ఏడేళ్ల పాటు ప్రపంచ క్రికెట్లో నంబర్‌వన్ టెస్టు బ్యాటర్‌గా నిలిచాడు. అంతే కాదు.. కెరీర్ ఆసాంతం మూడు ఫార్మాట్లలోనూ రికార్డులు కొల్లగొట్టిన అరుదైన ఆటగాళ్ళలో ఒకడిగా వార్నర్ తన పేరు రాసుకున్నాడు. ‘నువ్వు క్రికెట్‌ను ఇష్టపడ్డావని, బాగా ఆడతావని నాన్న నీకు అవకాశం కల్పించాడు. నువ్వు ఇలాగే ఉంటే ఆట అవసరం లేదు. నేను ప్లంబర్‌ను. నా పని ఎలా ఉంటుందో నీకు తెలుసు. నీ ప్రవర్తన మార్చుకోకపోతే నాతో పాటు పనికి వచ్చేయ్. నీకూ కొన్ని డబ్బులు వస్తాయి. ఇద్దరం కలసి ఇంటిని నడిపిద్దాం’ 20 ఏళ్ల డేవిడ్‌కు అతని అన్న స్టీవ్ హెచ్చరిక ఇది. చిన్నతనంలో వార్నర్‌కు క్రికెట్‌ను ఎంచుకోవడంలో ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఆటపై అతనికి మొదటనుంచీ ఆసక్తి ఉంది. అభ్యంతరాలు లేకుండా అతని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి అందులో చేర్పించారు. తగిన మార్గనిర్దేశనంతో సరైన శిక్షణ కూడా ఇప్పించారు. ప్రొఫెషనల్ క్రికెటర్ చేయాలనే వారి ఆలోచనకు తగినట్లుగా వార్నర్ సాధన చేశాడు. స్కూల్ స్థాయి క్రికెట్లో అపార ప్రతిభ కనబరచి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందేందుకు వార్నర్ అవకాశం దక్కించుకున్నాడు. అయితే బ్రిస్బేన్‌లోని ఈ కేంద్రంలో క్రమశిక్షణ తప్పడంతో అకాడమీవాళ్లు అతడిని ఇంటికి పంపించేశారు. దాంతో అతని అన్న ఆ రకంగా క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. అంతే.. ఆ తర్వాత డేవిడ్ ఏ తప్పూ చేయలేదు. ప్రత్యేక విజ్ఞప్తితో మళ్లీ అకాడమీలో చోటు దక్కించుకున్నాడు. మరో ఆలోచన లేకుండా తీవ్రంగా శ్రమించాడు. మూడేళ్లు తిరిగేసరికి ఏకంగా ఆస్ట్రేలియా టి20 జట్టులోకి ఎంపికై తనను తాను నిరూపించుకున్నాడు. వార్నర్ సోదరుడితో పాటు అతని తల్లిదండ్రులూ వార్నర్ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసి ఆనందబాష్పాలు రాల్చారు. మెల్బోర్న్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ పోరులో 43 బంతుల్లోనే 89 పరుగులు చేసిన వార్నర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తోనే అతను తన రాకను ప్రపంచ క్రికెట్‌కు పరిచయం చేశాడు. వేగంగా దూసుకుపోయి.. క్రికెట్లోకి అడుగు పెట్టాక వార్నర్ ఏరోజూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. స్కూల్, అండర్–13, అండర్–15, అండర్19.. ఇలా జూనియర్ స్థాయి క్రికెట్ నుంచే సంచలన ప్రదర్శనలు కనబరచిన అతను చాలా వేగంగా ఎదిగిపోయాడు. గ్రౌండ్ బయటకు బంతులను పంపించే భారీ షాట్లు, ప్రతీ అడుగులో దూకుడు, అద్భుతమైన ఫీల్డింగ్ వార్నర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. నాలుగు రోజుల మ్యాచ్ అయినా, వన్డే అయినా, టి20లు అయినా ఒకటే ధాటి.. ఒకే తరహా మెరుపు ప్రదర్శన. సొంత జట్లు సిడ్నీ, న్యూసౌత్వేల్స్ల తరఫున అతను అన్ని రికార్డులు కొల్లగొడుతూ పోయాడు. అందుకే ఆస్ట్రేలియా జట్టులో అవకాశం కూడా తొందరగా వచ్చింది. పెర్త్‌లోని వాకా మైదానంలో భారత్‌పై టెస్టులో 69 బంతుల్లో చేసిన శతకం వార్నర్ స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వైస్ కెప్టెన్సీ అవకాశం వచ్చి చేరింది. కెరీర్ ఆరంభంలో ఉడుకు రక్తంతో ఇంగ్లండ్ ఆటగాడు రూట్‌పై పబ్‌లో దాడి చేసినా.. అతని ప్రదర్శన ముందు ఆ ఘటన వెనక్కి వెళ్లిపోయి చెడ్డ పేరును తుడిచిపెట్టింది. వరుసగా ఏడేళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఓపెనర్‌గా వార్నర్ కెరీర్ అద్భుతంగా సాగింది. పాతాళానికి పడేసిన క్షణం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించరాదనేది సాధారణంగా ఆటగాళ్ల లక్షణం. కానీ ఏం చేసైనా, ఎలాగైనా ఆటలో గెలవాలనేది ఆస్ట్రేలియన్ల సూత్రం. ఎక్కువ సందర్భాల్లో ఇది బాగా పని చేసినా.. పరిధి దాటినప్పుడు అది సమస్యను తెచ్చి పెడుతుంది. 2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్.. అంతకు ముందు మ్యాచ్‌లో ఆసీస్ ఓటమిపాలైంది. పైగా గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కీపర్ డి కాక్‌తో వ్యక్తిగత దూషణలతో వార్నర్ గొడవ పెట్టుకున్నాడు. ఆ కసి ఇంకా మనసులో ఉంది. దాంతో ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించే ఆలోచనతో అతను చేసిన ప్రయత్నం కెరీర్‌ను దెబ్బ కొట్టింది. కెప్టెన్ స్మిత్, మరో ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌తో కలసి కుట్రకు వార్నర్ తెర లేపాడు. స్యాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేయడం అంతా బహిర్గతమైంది. దాంతో ఏడాది పాటు క్రికెట్ ఆడకుండా నిషేధంతో పాటు జీవితకాలం కెప్టెన్సీ ఇవ్వకుండా వేటు పడింది. దాంతో ఒక్కసారిగా అతను నైతికంగా కూడా నేలకూలాడు. తిరిగొచ్చి కొత్తగా.. సంవత్సర కాలపు నిషేధంలో వార్నర్ తనను తాను మార్చుకున్నాడు. ముందుగా ఎక్కువ సమయం కుటుంబంతో గడపడంతో పాటు ఆట కారణంగా కోల్పోయిన వ్యక్తిగత సంతోషాన్ని వెతుక్కున్నాడు. ఈ క్రమంలో కొత్త పరిచయాలు, స్నేహాలు అతడికి గుడ్ బాయ్ ఇమేజ్ను తీసుకొచ్చాయి. క్రికెటర్‌గా వార్నర్ ఘనమైన రికార్డు కారణంగా జట్టులో పునరాగమనానికి ఇబ్బంది కాలేదు. ఏడాది పూర్తి కాగానే మళ్లీ జట్టులోకి వచ్చేసిన అతను తిరిగి చెలరేగి తన విలువేంటో చూపించాడు. వన్డే వరల్డ్ కప్, యాషెస్ సిరీస్, సొంతగడ్డపై పాకిస్తాన్‌తో చేసిన ట్రిపుల్ సెంచరీతో వార్నర్ పరుగుల ప్రదర్శన జోరుగా కొనసాగింది. ఈసారి అన్నింటికంటే పెద్ద మార్పు మైదానంలో అతని ప్రవర్తనే. ఒక్కటంటే ఒక్క వివాదం రాకుండా జాగ్రత్తపడిన అతను గ్రౌండ్లో తన ఆట తప్ప మరొకటి పట్టించుకోలేదు. మాటల్లో దూకుడు, ప్రత్యర్థులపై స్లెడ్జింగ్ ఎక్కడా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే తన కలుపుగోలుతనంతో అందరికీ ఇష్టుడయ్యాడు కూడా. వార్నర్‌ను మళ్లీ కెప్టెన్ చేసే చర్చలో భాగంగా అతడిని ట్యాంపరింగ్ వివాదంలో కుటుంబంతో సహా బహిరంగ విచారణకు హాజరు కావాలని ఆసీస్ బోర్డు సూచించింది. అయితే తన తప్పునకు తన కుటుంబాన్ని లాగడం అనవసరం అంటూ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తాను సాధించినదాంతో ఇలాగే బాగున్నానంటూ వార్నర్ దండం పెట్టేశాడు. ఐపీఎల్‌తో భారత అభిమానులకు చేరువై.. ఐపీఎల్ ఆరంభంలో ఢిల్లీ జట్టుకు ఆడిన వార్నర్ ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు వరుస విజయాలు అందించిన అతను 2016లో ఒంటిచేత్తో టీమ్‌ను ఐపీఎల్ విజేతగా కూడా నిలిపాడు. ఈ క్రమంలో తెలుగు పాటలు, డాన్స్‌లతో అతను మన అభిమానులకూ చేరువయ్యాడు. ఎంతగా అంటే వార్నర్ అంటే మనోడే అన్నంతగా హైదరాబాద్ ఫ్యాన్స్ అతడిని సొంతం చేసుకున్నారు. కరోనా టైమ్‌లో అతను తన ఇంట్లో తెలుగు సినిమా పాటలకు చేసిన డాన్స్‌లు, అతని అమ్మాయిలు కూడా అదే తరహాలో కనిపించడం విశేషంగా ఆకట్టున్నాయి. ఆ తర్వాత ఎప్పుడు మైదానంలోకి దిగినా ఈ వినోదాన్ని అందించడానికి అతను సిద్ధంగా ఉండేవాడు. ముఖ్యంగా పుష్ప తగ్గేదేలే సిగ్నేచర్ సైన్.. శ్రీవల్లి పాటకు డాన్స్ మైదానంలో రొటీన్ అయిపోయాయి. అల్లు అర్జున్ బుట్టబొమ్మ పాటకు కూడా అంతే ఉత్సాహంతో వార్నర్ డాన్స్ చేసి చూపించడం విశేషం. వివిధ కారణాలతో సన్‌రైజర్స్ టీమ్ వార్నర్‌ను కాదనుకున్నా.. తెలుగు ఫ్యాన్స్ మాత్రం ఇంకా అతడిని తమవాడిలాగే చూస్తున్నారనేదానికి ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్ కప్ వామప్ మ్యాచ్‌లో అతనికి లభించిన ఆదరణే ఉదాహరణ. అన్నీ సాధించి.. టెస్టు, వన్డే క్రికెట్‌కు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ వచ్చే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉంది. ప్రపంచ క్రికెట్లో ప్రతిష్ఠాత్మక విజయాలన్నింటిలో భాగమైన అతి అరుదైన ఆటగాడిగా వార్నర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు వన్డే వరల్డ్ కప్‌లు, ఒక టి20 వరల్డ్ కప్, టెస్టుల్లో వరల్డ్ కప్‌లాంటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలిచిన జట్లలో అతను సభ్యుడు. 2021.. టి20 వరల్డ్ కప్‌లో మెరుపు బ్యాటింగ్‌తో అతను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా కూడా నిలిచాడు. ఐపీఎల్ టైటిల్‌ను, అదీ కెప్టెన్‌గా సాధించిన ఘనత కూడా వార్నర్ సొంతం. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు వార్నర్ 111 టెస్టులు, 161 వన్డేలు, 99 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. -∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
Australian cricketer: వన్డేలకు వార్నర్ గుడ్‌బై
ఆ్రస్టేలియా డాషింగ్ ఓపెనర్ వార్నర్ వన్డే ఫార్మాట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్యాటింగ్‌లో మెరుపులు, నోటితో తూటాలు పేల్చే అతను పలు వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచాడు. అతని ఖాతాలో సెంచరీలున్నట్లే కెరీర్లో సస్పెన్షన్లు, బాల్ టాంపరింగ్ మరకలూ ఉన్నాయి. ఇప్పుడా ఆట, దూకుడు ఇక మీదట టి20లకే పరిమితం కానున్నాయి. సిడ్నీ: డేవిడ్ వార్నర్ అంటే విజయవంతమైన ఓపెనరే కాదు... వివాదాస్పద క్రికెటర్ కూడా! బ్యాట్‌తో బాదడం ఎంత బాగా తెలుసో... ‘సై అంటే సై’ అని నోటికి పని చెప్పడం కూడా తెలిసినోడు. విధ్వంసకర బ్యాటర్‌గా ఎలా గుర్తుండిపోతాడో అంతే స్థాయిలో తెంపరితనం ఉన్న వ్యక్తిగానూ ముద్ర వేసుకున్నాడు. ఇక మన తెలుగు ప్రేక్షకులకైతే సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఇప్పుడు లేడు)తో బాగా కనెక్టయ్యాడు. తెలుగు హీరోల మేనరిజాన్ని, పాటలకు నప్పే స్టెప్పులతో సోషల్ మీడియాలో వినోదం పంచిన ఈ ఆస్ట్రేలియన్ తాజాగా వన్డే క్రికెట్‌కు సైతం వీడ్కోలు పలికేశాడు. పాకిస్తాన్‌తో స్వదేశంలో ఆఖరి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న వేళ వన్డేలపై నిర్ణయాన్ని ప్రకటించాడు. సిడ్నీలో 3 నుంచి జరిగే మూడో టెస్టు అనంతరం అతను కేవలం అంతర్జాతీయ క్రికెట్లో టి20 ఫార్మాట్లోనే కొనసాగుతాడు. సోమవారం మీడియా సమావేశంలో 37 ఏళ్ల వార్నర్ మాట్లాడుతూ ‘భారత్‌లో జరిగిన ప్రపంచకప్ సమయంలోనే రిటైర్మెంట్ గురించి చెప్పాను. విశ్వవిజేత జట్టు సభ్యుడిగా ఎంతో సంతృప్తికరమైన వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నాను. దీనివల్ల నేను ఫ్రాంచైజీ టి20 లీగ్‌ను మరింత శ్రద్దపెట్టి ఆడేందుకు వీలవుతుంది. ఈ ఫార్మాట్లో అంతర్జాతీయ కెరీర్‌నూ కొనసాగిస్తాను. అయితే 2025లో చాంపియన్స్ ట్రోఫీ నాటికి ఫామ్‌లో ఉంటే, జట్టుకు అవసరమనిపిస్తే అందుబాటులో ఉంటాను’ అని అన్నాడు. సఫారీతో అరంగేట్రం దక్షిణాఫ్రికాతో 2009 జనవరిలో జరిగిన టి20 మ్యాచ్‌తో 22 ఏళ్ల వార్నర్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే నెల అదే ప్రత్యర్థితోనే తొలి వన్డే కూడా ఆడాడు. 15 ఏళ్ల కెరీర్లో 99 టి20 మ్యాచ్‌ల్లో 2894 పరుగులు చేశాడు. ఒక సెంచరీతోపాటు 24 ఫిఫ్టీలు అతని ఖాతాలో ఉన్నాయి. 161 వన్డేలాడిన వార్నర్ 45.30 సగటుతో 6932 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 33 అర్ధసెంచరీలున్నాయి. 111 టెస్టుల్లో 44.58 సగటుతో 8695 పరుగులు చేశాడు. 26 శతకాలు, 36 అర్ధశతకాలు బాదాడు. ఇవీ విజయాలు ► మరకలు పక్కనబెట్టి కేవలం క్రికెట్‌నే పరిగణిస్తే మాత్రం వార్నర్ పరిపూర్ణ సాఫల్య క్రికెటర్ అని చెప్పొచ్చు. ఆ్రస్టేలియా సాధించిన 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లలో అతను కీలకపాత్ర పోషించాడు. 2021 టి20 వరల్డ్‌కప్ విజయంలో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. 2023 ఐసీసీ టెస్టు చాంపియన్íÙప్ విజేత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. ఇవీ వివాదాలు ► 2013 చాంపియన్స్ ట్రోఫీ సమయంలో జో రూట్ తో వాగ్వాదానికి దిగడంతో క్రికెట్ ఆ్రస్టేలియా అతనిపై రెండు టెస్టుల నిషేధం విధించింది. దీంతో అతను ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్ని ఆడలేకపోయాడు. ► కేప్‌టౌన్ టెస్టులో బాల్ టాంపరింగ్ ఉదంతం వార్నర్ కెరీర్‌కే మాయని మచ్చ. దీంతో అతనితో పాటు, స్మిత్ (అప్పటి కెపె్టన్) ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు. ఇవి చాలవన్నట్లు అదుపులేని నోటి దురుసుతనంతో జీవితకాలం సారథ్యం చేపట్టకుండా శిక్షకు గురయ్యాడు. -
IPL 2023: వైరలవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ పెళ్లి ఫోటోలు
Mitchell Marsh: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఇటీవలే తన లాంగ్ టర్మ్ పార్ట్నర్ గ్రెటా మాక్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలోని గ్రేస్టౌన్లో అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం నిరాడంభరంగా జరిగింది. వివాహ వేడుకలో మార్ష్ బ్లాక్ కలర్ సూట్లో మెరిసిపోగా.. మాక్, సంప్రదాయ తెల్లని గౌనులో తళుక్కుమంది. నూతన వధూవరులకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, పెళ్లి నిమిత్తం మార్ష్ ఐపీఎల్-2023 మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు మార్ష్ అందుబాటులో లేడు. డీసీ ఆడబోయే మరో 3, 4 మ్యాచ్‌లకు మార్ష్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. మార్ష్ గైర్హాజరీలో డీసీ రోవ్‌మన్ పావెల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అయితే ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్‌లో అతను దారుణంగా నిరాశపరిచాడు. దీంతో మార్ష్ లేని లోటు డీసీ శిబిరంలో స్పష్టంగా కనిపించింది. ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఏప్రిల్ 11న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తలపడబోయే ఇరు జట్లు ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలు కాగా.. ముంబై ఇండియన్స్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో రేపు జరుగబోయే మ్యాచ్‌ను ఇరు జట్లు చాలా సీరియస్‌గా తీసుకోనున్నాయి. గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. -
ఐదేళ్ల వయసులో జాతి వివక్ష.. కట్‌చేస్తే స్టార్ క్రికెటర్ హోదా
ఉస్మాన్ ఖవాజా.. ఆస్ట్రేలియా క్రికెటర్‌గా మాత్రమే చాలా మందికి పరిచయం. కానీ ఖవాజా క్రికెటర్‌గా మాత్రమే గాక సోషల్ యాక్టివిస్ట్ కూడా. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్లో కొనసాగుతున్న నల్లజాతీయ క్రికెటర్ అతను. ఖవాజా ఐదేళ్ల వయసులో అతని కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వచ్చింది. ఖవాజా తండ్రి కర్రీ మేకర్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. తన ఐదేళ్ల వయసులో ఖవాజా .. 'Fuking Curry Maker Son' అంటూ జాతి వివక్షకు గురయ్యాడు. అలా జాతి వివక్షను తొలిసారిగా ఎదుర్కొన్న ఉస్మాన్ ఖవాజా ఆ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. ఖవాజా ఒక క్రికెటర్‌గా రాణిస్తూనే నల్లజాతీయులపై జరిగిన వివక్షకు వ్యతిరేకంగా నిలబడి తన పోరాటాన్ని కొనసాగించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఖవాజా పౌండేషన్ పేరుతో చారిటీ సంస్థను స్థాపించి మైనారిటీలకు, వలసదారులకు, శరణార్థులకు, మానసికంగా కుంగిపోయిన చిన్నారులకు ఆశ్రయం కల్పించాడు. అలా కర్రీ మేకర్ కొడుకు ఇవాళ స్టార్ క్రికెటర్ హోదా సంపాదించాడు. వ్యక్తిగతంగాను నలుగురికి సహాయపడే పనులు చేస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నాడు. ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్‌గా రాణిస్తున్న ఉస్మాన్ ఖవాజా టీమిండియాతో జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో జట్టుకు కీలకం కానున్నాడు. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన ఖవాజా గతేడాది నుంచి టెస్టుల్లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియన్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అయితే వీసా సమస్య కారణంగా జట్టుతో పాటు రాలేకపోయిన ఖవాజా ఒకరోజు ఆలస్యంగా భారత్ గడ్డపై అడుగుపెట్టాడు. వచ్చీ రాగానే ప్రాక్టీస్‌లో తలమునకలయ్యాడు. పశ్చిమాసియా మూలాలున్న క్రికెటర్ కావడంతో ఖవాజా స్పిన్‌ను సమర్థంగా ఆడగలడు. ఇదే అతన్ని ఈ టెస్టు సిరీస్‌కు ప్రత్యేకంగా నిలబెట్టింది. భారత్ లాంటి ఉపఖండపు పిచ్‌లపై ఖవాజా లాంటి బ్యాటర్ సేవలు చాలా అవసరం. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించాయి.ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. The two facets of the Usman Khawaja Foundation: 1: Allowing kids from low socio-economic backgrounds to play sport for free 2: Giving grants, scholarships and things needed for kids' education Both close to Khawaja's ❤️ pic.twitter.com/REQ6CzAQcP — 7Cricket (@7Cricket) January 30, 2023 చదవండి: భారత్‌తో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్! భార్యకు చిత్రహింసలు.. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు -
భారత్‌తో టెస్టు సిరీస్.. ఫ్లైట్ మిస్సయిన ఆసీస్ క్రికెటర్
టీమిండియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు బుధవారం భారత్‌కు బయలుదేరనుంది. అయితే ఆసీస్ టెస్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం ఒకరోజు ఆలస్యంగా వెళ్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) పేర్కొంది. వీసా సమస్యే అందుకు కారణమని సీఏ తెలిపింది. ''ఆస్ట్రేలియా జట్టులో ఉన్న అందరికి వీసాలు మంజూరు అయ్యాయని.. ఉస్మాన్ ఖవాజాకు మాత్రం వీసా ప్రాబ్లమ్ ఏర్పడింది. బుధవారం సాయంత్రం వరకు అది పరిష్కారమవుతుంది. ఈరోజు సాయంత్రంలోగా ఖవాజాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తామని.. గురువారం ఉదయం కొంతమంది సహాయక సిబ్బందితో కలిసి భారత్‌కు వెళ్తాడని'' క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుకు చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే తాను ఫ్లైట్ మిస్సయిన విషయాన్ని ఖవాజా ఒక పాపులర్ మీమ్‌తో సరదాగా ట్విటర్లో పంచుకున్నాడు. భారతీయ వీసా కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నట్లుగా నా పరిస్థితి తయారూంది. అంటూ పేర్కొన్నాడు.ఇక టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. టెస్టు సిరీస్ అనంతరం ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా జరగనుంది. ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు కీలకం కానుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిస్తే టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్ ఉంటుంది. View this post on Instagram A post shared by Usman Khawaja (@usman_khawajy) Me waiting for my Indian Visa like... #stranded #dontleaveme #standard #anytimenow https://t.co/pCGfagDyC1 — Usman Khawaja (@Uz_Khawaja) February 1, 2023 చదవండి: నెగెటివ్ ట్వీట్‌ను లైక్ చేసిన క్రికెటర్.. కోపాన్ని చెప్పకనే చెప్పాడు IND Vs AUS: తొలి టెస్టుకు శ్రేయాస్ దూరం.. జడ్డూ రీఎంట్రీ -
ఒక్క బంతికే 16 పరుగులు.. ఎంత పని చేశావయ్యా స్టీవ్ స్మిత్
సాధారణంగా ఓ బంతికి 7 పరుగులు (నోబాల్+సిక్స్), మహా అయితే 13 పరుగులు (నోబాల్+సిక్స్+సిక్స్) రావడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఓ బంతికి ఏకంగా 16 పరుగులు వచ్చాయి. దీంతో ఇదెలా సాధ్యపడిందని క్రికెట్ ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌తో ఇవాళ (జనవరి 23) జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ బౌలర్ జోయల్ పారిస్ ఓ బంతికి 16 పరుగులు సమర్పించుకున్నాడు. సిక్సర్స్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన పారిస్.. తొలి రెండు బంతులను డాట్ బాల్స్ వేశాడు. ఆ తర్వాత బంతిని స్టీవ్ స్మిత్ భారీ సిక్సర్‌గా మలిచాడు. ఈ బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. 15 runs off one legal delivery! 😵💫 Steve Smith's cashing in once again in Hobart 🙌#BucketBall #BBL12 pic.twitter.com/G3YiCbTjX7 — KFC Big Bash League (@BBL) January 23, 2023 దీంతో బంతి కౌంట్ కాకుండానే సిక్సర్స్ జాబితాలో 7 పరుగులు చేరాయి. ఆతర్వాతి బంతికి కూడా 5 పరుగులు (వైడ్+ఫోర్) రావడంతో బంతి కౌంట్లోకి రాకుండానే సిక్సర్స్ ఖాతాలో 12 పరుగులు జమయ్యాయి. ఇక పారిస్ నెక్స్ వేసిన లీగల్ బంతిని స్మిత్ బౌండరీకి తరలించడంతో ఒక్క బంతి పూర్తయ్యే సరికి సిక్సర్స్ ఖాతాలో 16 పరుగులు వచ్చి పడ్డాయి. ఈ రేర్ ఫీట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ (33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 66 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్.. తమ కోటా ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితం కావడంతో 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హరికేన్స్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిక్సర్స్ బౌలర్లలో జాక్సన్ బర్డ్, సీన్ అబాట్, హేడెన్ కెర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. నవీద్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. -
స్టీవ్ స్మిత్‌కు ఏమైంది, అస్సలు ఆగట్లేదు.. మరోసారి విధ్వంసం
Steve Smith: బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఆసీస్ మాజీ కెప్టెన్, సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్ స్టీవ్ వీర విధ్వంసకర ఫామ్ కొనసాగుతోంది. ప్రస్తుత సీజన్లో ఓపెనర్ అవతారమెత్తిన స్మిత్.. వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. టెస్ట్ క్రికెటర్‌గా ముద్రపడిన స్టీవ్ ఈ సీజన్లో ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారి, ఊచకోత అన్న పదానికి బెస్ట్ ఎగ్జాంపుల్లా మారాడు. గత నాలుగైదు ఇన్నింగ్స్‌లుగా పట్టపగ్గాలు లేకుండా ఎడాపెడా సెంచరీలు, హాఫ్ సెంచరీలు బాదుతున్న స్మిత్.. ఇవాళ (జనవరి 23) హోబర్ట్ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. తానాడిన గత రెండు మ్యాచ్‌ల్లో (అడిలైడ్ స్ట్రయికర్స్పై 56 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులు, సిడ్నీ థండర్స్‌పై 66 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 125 నాటౌట్) సునామీ శతకాలతో చెలరేగిన స్మిత్.. ఇవాళ మరో మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేసి ప్రత్యర్ధి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. స్మిత్ తన హాఫ్ సెంచరీని కేవలం 22 బంతుల్లో పూర్తి చేశాడు. అతని టీ20 కెరీర్లో ఇదే వేగవంతమై హాఫ్ సెంచరీ కావడం విశేషం. స్మిత్‌తో పాటు హెన్రిక్స్ (23 నాటౌట్), వార్షుయిస్ (30) ఓ మోస్తరుగా రాణించడంతో సిక్సర్స్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి, 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా, స్టీవ్ స్మిత్ తన సహజ సిద్దమైన ఆటకు భిన్నంగా చెలరేగుతుండటం పట్ల క్రికెట్ సర్కిల్స్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతకీ స్మిత్‌కు ఏమైంది.. ఒక్కసారిగా గేర్ మార్చేశాడు.. బ్రేకులు వేసే ప్రయత్నాలు చేసినా ఆగట్లేదు అంటూ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కెరీర్లో ఎన్నడూ లేనంతంగా స్పీడ్‌ను పెంచిన స్మిత్ నుంచి భవిష్యత్తులో మరిన్ని సునామీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చని అతని అభిమానులు చర్చించుకుంటున్నారు. 12 ఏళ్ల బీబీఎల్ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్ కేవలం 5 రోజుల వ్యవధిలో రెండు విధ్వంసకర సెంచరీలు, ఓ మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో ఆసీస్ అభిమానుల ఆనందానికి అవదుల్లేకుండా పోతున్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్.. ఐపీఎల్‌లోనూ సెంచరీ చేయడం విశేషం. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ సీనియర్ క్రికెటర్
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్.. సీనియర్ ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ఆడుతున్న డాన్ క్రిస్టియన్.. తనకిదే చివరి టోర్నీ అని ట్విటర్ వేదికగా ప్రకటించాడు. బీబీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేశాడు. ''ఇన్నాళ్లు ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమని.. అలాగే బీబీఎల్, ఐపీఎల్, కరీబియన్ ప్రీమీయర్ లీగ్, బంగ్లా ప్రీమియర్ లీగ్ లాంటి ప్రైవేటు లీగ్స్‌లోనూ పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందని'' తెలిపాడు. ఇక డాన్ క్రిస్టియన్ ఆస్ట్రేలియా తరపున 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆసీస్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే ఆడిన క్రిస్టియన్ ఓవరాల్‌గా 20 వన్డేలు, 23 టి20 మ్యాచ్‌లు ఆడాడు. లోయర్ ఆర్డర్లో పవర్ఫుల్ హిట్టర్‌గా పేరు పొందిన డాన్ క్రిస్టియన్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. వన్డేల్లో 270 పరుగులతో పాటు 20 వికెట్లు, టి20ల్లో 118 పరుగులతో పాటు 13 వికెట్లు పడగొట్టాడు. 2021 తర్వాత డాన్ క్రిస్టియన్ ఆసీస్ తరపున మరో మ్యాచ్ ఆడలేదు. 2007-08లో ఫస్ట్‌క్లాస్ కెరీర్ ఆరంభించిన డాన్ క్రిస్టియన్ లిస్ట్-ఏ తరపున 124 మ్యాచ్‌లు, 399 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన డాన్ క్రిస్టియన్ బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: సైబర్ క్రైమ్ వలలో ఐసీసీ.. 20 కోట్ల నష్టం Some news 😁 pic.twitter.com/5xxxkYNQGt — Dan Christian (@danchristian54) January 20, 2023 -
Viral Video: ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చెంపలు వాయించిన గర్ల్‌ఫ్రెండ్
Michael Clarke Slapped By Girl Friend: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ (2015) అయిన మైఖేల్ క్లార్క్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనను మోసం చేసి మరో మహిళతో (పిప్ ఎడ్వర్డ్స్) శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. గర్ల్‌ఫ్రెండ్ జేడ్ యాబ్రో బహిరంగంగా క్లార్క్ చెంపులు వాయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. Michael Clarke and Karl Stefanovic have squared off in a wild fracas in a public park, in which Clarke was slapped across the face by his girlfriend and accused of cheating. Michael Clarke Video#YouFuckedHerOnDecember17 pic.twitter.com/pbiLUpLnnc — SuperCoach IQ (@SuperCoachIQ) January 18, 2023 ఈ వీడియోలో క్లార్క్.. జేడ్‌కు సర్ది చెప్పేందుకు విశ్వప్రయాత్నాలు చేసినప్పటికీ, ఆమె ఏమాత్రం కన్విన్స్ కాకపోగా, మరింత రెచ్చిపోయింది. భూతులు తిడుతూ.. పలానా రోజు నువ్వు ఆమెతో గడిపావు, నువ్వో మదమెక్కిన కుక్కవు అంటూ పబ్లిక్‌గా క్లార్క్‌పై దాడికి దిగింది. తానే తప్పు చేయలేదని క్లార్క్ సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. సదరు మహిళతో చేసిన ఫోన్ చాట్‌ను బయటపెట్టాలని జేడ్ గట్టిగా డిమాండ్ చేసింది. ఆ సమయంలో జేడ్ సోదరుడు, అతని భార్య అక్కడే ఉన్నారు. ఆ ముగ్గురు సంఘటన స్థలాన్ని విడిచి వెళ్తుండగా.. క్లార్క్ వారికి అడ్డుతగలడంతో జేడ్ మరింత రెచ్చిపోయింది. దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లి పోయింది. క్లార్క్ కుంటుతూ వారి వెంబడి పడే ప్రయత్నం చేశాడు. ఈ ఉదంతంపై క్లార్క్ స్పందిస్తూ.. బహిరంగంగా ఇలా ప్రవర్తించినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. కాగా, క్లార్క్.. తన భార్య కైలీని వదిలేసి గతకొంతకాలంగా ప్రముఖ మోడల్ అయిన జేడ్‌తో సహజీవనం చేస్తున్నాడు. 41 ఏళ్ల క్లార్క్.. ఆసీస్ తరఫున 115 టెస్ట్‌లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో అతను 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీ సాయంతో 8643 పరగులు చేయగా.. వన్డేల్లో 8 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీల సాయంతో 7981 పరుగులు చేశాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 488 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో క్లార్క్ అత్యధిక స్కోర్ 329 నాటౌట్‌గా ఉంది. -
ఈ ఆసీస్ యువ ఆల్‌రౌండర్ ఐపీఎల్లో కోట్లు కొల్లగొట్టడం ఖాయం..!
Ravichandran Ashwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చెలరేగిన గ్రీన్ కోసం వచ్చే ఐపీఎల్ సీజన్లో ఫ్రాంచైజీలు ఎగబడతాయని జోస్యం చెప్పాడు. ఏదో ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ గ్రీన్ కోసం కోట్లు కుమ్మరించడం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బంతిని బలంగా బాదడంతో పాటు భీకరమైన పేస్‌తో బౌలింగ్ చేయడం గ్రీన్ ప్రధాన ఆయుధాలని వర్ణించాడు. బౌలింగ్ చేసేప్పుడు గ్రీన్‌కు అతని పొడవు అదనపు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపాడు. పవర్ ప్లేలో గ్రీన్ లాంటి ఆటగాడు ఉండాలని ఏ జట్టైనా కోరుకుంటుందని, తనంతట తాను తప్పుకుంటానంటే తప్ప ఏ జట్టు అతన్ని తప్పించే సాహసం చేయలేదంటూ గ్రీన్‌ను ఆకాశానితకెత్తాడు. ఇటీవలే ప్రకటించిన భారత టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న అశ్విన్.. ఓ విదేశీ ఆటగాడిని ఇలా పొగడ్తలతో ముంచెత్తడం ఆసక్తికరంగా మారింది. కాగా, ఆసీస్ యంగ్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాకు లభించిన ఆణిముత్యమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల కిందట న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో గ్రీన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలి మ్యాచ్‌లో అతను ఓటమి అంచుల్లో ఉన్న ఆసీస్‌ను అత్యద్భుతమైన ఇన్నింగ్స్‌తో (89 నాటౌట్) విజయతీరాలకు చేర్చాడు. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. 2020లో భారత్‌పైనే అరంగేట్రం చేసిన గ్రీన్.. ఇప్పటివరకు 14 టెస్ట్‌లు, 12 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. ఇందులో 6 అర్ధశతకాల సాయంతో 995 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో అతను 29 వికెట్లు పడగొట్టాడు. -
క్రికెటర్ చెంపపై ఆటోగ్రాఫ్ నిరాకరించిన క్వీన్ ఎలిజబెత్-2
బ్రిటన్ను 70 ఏళ్లకు పైగా పాలించి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన రాణి ఎలిజబెత్–2 96 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వేసవి విరామం కోసం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో ఉన్న రాణి గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ధ్రువీకరించింది. 1952లో 25 ఏళ్లకే బ్రిటన్ రాణి కిరీటం ధరించిన ఎలిజబెత్ అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. ఇదిలాఉంటే 70 ఏళ్ల పాలనలో ఎన్నో చూసిన క్వీన్ ఎలిజబెత్‌కు క్రీడలతోనూ మంచి అనుబంధం ఉంది. ఆటలకు అతీతంగా ఆమె క్రీడాకారులను ప్రోత్సహించేది. ఇక క్రికెట్‌తోనూ బంధం ముడిపడి ఉన్న క్వీన్ ఎలిజబెత్.. ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన ప్రతీ జట్టును తన నివాసమైన బకింగ్హమ్ ప్యాలెస్‌కు పిలిపించుకునేది. వారితో ఫోటో సెషన్ అనంరతం అతిథి మర్యాదలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అయితే క్వీన్ ఎలిజబెత్-2 గురించి ఒక ఆసక్తికర విషయం తెలుసుకుందాం. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డెన్నిస్ లిల్లీకి.. క్వీన్ ఎలిజబెత్-2తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1977లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో సెంటనరీ టెస్టు మ్యాచ్ నిర్వహించారు. ఆ మ్యాచ్‌కు క్వీన్ ఎలిజబెత్-2 ముఖ్య అతిథిగా విచ్చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లను రాణి ఎలిజబెత్ పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పటి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ తనను తాను పరిచయం చేసుకొని.. ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ అతని చెంపను చూపించాడు. అయితే ప్రోటోకాల్ సమస్య వల్ల క్వీన్ ఎలిజబెత్ ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే తర్వాత తన రాయబారితో సంతకంతో కూడిన ఫోటోగ్రాఫ్‌ను డెన్నిస్ లిల్లీకి పంపించడం అప్పట్లో ఆసక్తి కలిగించింది. తాజాగా క్వీన్ ఎలిజబెత్-2 మరణంపై స్పందించిన డెన్నిస్ లిల్లీ మరోసారి రాణితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకుతెచ్చకున్నాడు. ఇక క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో శుక్రవారం ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆటను రద్దుచేశారు. క్వీన్ ఎలిజబెత్ మరణంపై స్పందించిన ఈసీబీ.. ''రాణి ఎలిజబెత్-2 ఇక లేరన్న దురదృష్టకరమైన వార్త వినాల్సి వచ్చింది. ఆమె మృతికి నివాళి అర్పిస్తూ సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నాం. వీటితో పాటు ఇంగ్లండ్‌లో జరిగే మిగతా టోర్నీలోని మ్యాచ్‌లను కూడా రద్దు చేశాం. దీనికి సంబంధించి ఇప్పటికే సర్కులర్ జారీ చేశాం'' అని తెలిపింది. The England and Wales Cricket Board is deeply saddened at the death of Her Majesty Queen Elizabeth II. The thoughts of everyone involved in the game are with the whole Royal Family. — England and Wales Cricket Board (@ECB_cricket) September 8, 2022 చదవండి: Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఇకలేరు రాజరికంలో క్వీన్ ఎలిజబెత్-2 సరికొత్త రికార్డు.. ఆమె ప్రస్థానంలో కీలక ఘట్టాలివే! -
రీఎంట్రీ ఇవ్వనున్న ఆసీస్ వివాదాస్పద క్రికెటర్
ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్.. వివాదస్పద క్రికెటర్ టిమ్ పెయిన్ మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. 2017లో ఒక మహిళకు అసభ్యకర సందేశాలు పంపిన వివాదం వెలుగులోకి రావడంతో గత ఏడాది నవంబర్‌లో ఆసీస్ టెస్టు కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటు ఆటనుంచి కూడా అతను విరామం తీసుకున్నాడు. ఇప్పుడు తాజాగా తన దేశవాళీ జట్టు టాస్మేనియా ప్రాక్టీస్ సెషన్లో అతను కూడా పాల్గొన్నాడు. అక్టోబర్ 6 నుంచి జరిగే షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో పెయిన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. టిమ్ పైన్ ఆసీస్ తరపున 35 టెస్టుల్లో 1534 పరుగులు, 35 వన్డేల్లో 890 పరుగులు, 12 టి20ల్లో 82 పరుగులు సాధించాడు. -
చనిపోయి నాలుగు నెలలు దాటింది.. ఇంకెన్నాళ్లు ఈ కథలు!
ఆస్ట్రేలియా దిగ్గజం.. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మనల్ని భౌతికంగా విడిచివెళ్లి నాలుగు నెలలు దాటిపోయింది. గత మార్చిలో వార్న్ థాయిలాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించాడు. అతని మరణం యావత్ క్రీడా ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టింది. బతికినంతకాలం క్రికెట్లో రారాజుగా వెలుగొందినప్పటికి బయటి వివాదాల్లోనూ అంతే పేరు సంపాదించాడు. ఇక వార్న్‌కు ప్లేబాయ్ అనే ముద్ర కూడా ఉంది. ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్లు నడిపాడన్న వార్తలు వచ్చాయి. వీటిలో నిజమెంత అనేది తెలియకపోయినప్పటికి.. అతను భౌతికంగా దూరమైన తర్వాత కూడా యువతులతో ఎఫైర్ వార్తలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా బ్యూటీ గినా స్టివార్ట్.. వార్న్ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు నాతో ఎఫైర్ నడపాడంటూ తెలిపింది. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలియని సీక్రెట్ ఎఫైర్ అని పేర్కొంది. ''వార్న్ థాయిలాండ్‌లోని విల్లాలో మరణించడానికి ముందు నాతో రెగ్యులర్ కాంటాక్ట్ ఉండేది. అయితే ఆ ఎఫైర్ స్నేహపూరిత వాతావరణం మాత్రమే. ఒక స్నేహితుడిగా.. గైడ్‌గా నాకు సలహాలిచ్చేవాడు. ఈ క్రమంలోనే మా మధ్య సన్నిహిత్యం పెరిగింది. అలా అతనితో డేటింగ్ చేశాను. ఇక దగ్గరయ్యాడనుకునే లోపే వార్న్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం కొన్ని నెలల పాటు నన్ను మాములు మనిషిని చేయలేకపోయింది.'' అంటూ 51 ఏళ్ల గినా స్టివార్ట్ తెలిపింది. కాగా గినా స్టివార్ట్ ఆస్ట్రేలియాలో ఒక సెలబ్రిటీ. 51 ఏళ్ల వయసులోనూ హాట్ ఫోటోలకు ఫోజిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఇటీవలే గివార్ట్ తనను తాను ''వరల్డ్ హాటెస్ట్ గ్రాండ్ మా'' అని బిరుదు ఇచ్చుకోవడం ఆసక్తి కలిగించింది. ఇక 2018లో గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా వార్న్‌ను తొలిసారి కలిసినట్లు గినా పేర్కొంది. ''ఒకరినొకరు పరిచయం పెంచుకోవడంతో పాటు ఆ రాత్రంతా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అలా మా మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత ఇద్దరం మరింత దగ్గరయ్యాము. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలియకూడదని వార్న్ నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. అందుకే అతను మరణించిన తర్వాతే ఈ విషయాలు వెల్లడిస్తున్నా'' అంటూ తెలిపింది. ఇక క్రికెట్లో స్పిన్ మాంత్రికుడిగా పేరు పొందిన షేన్ వార్న్ తన లెగ్‌స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఈ స్పిన్ దిగ్గజం 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 193 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. OnlyFans star Gina Stewart has made a startling revelation about the late great Shane Warne, five months after his tragic death > https://t.co/qc6mpq2Wty pic.twitter.com/Wzbg06oiw2 — Herald Sun (@theheraldsun) August 16, 2022 చదవండి: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్‌మ్యాన్ Sanju Samson: నేను, నా భార్య ఖాళీగా ఉన్నపుడు చేసే పని అదే! నా ముద్దు పేరు.. -
ఏ జట్టులోనైనా సూర్యకు చోటు ఖాయం.. ఎందుకంటే: ఆసీస్ దిగ్గజం
దుబాయ్: భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. అతని ఆట తనను ఎంతో ఆకట్టుకుందని, విధ్వంసకర శైలి ఏబీ డివిలియర్స్‌ను గుర్తుకు తెస్తోందని పాంటింగ్ అన్నాడు. భారత జట్టు తరఫున అతను నాలుగో స్థానంలో ఆడటమే సరైందని పాంటింగ్ సూచించాడు. ‘సూర్యకుమార్ కూడా డివిలియర్స్ తరహాలోనే మైదానమంతా 360 డిగ్రీ షాట్లు ఆడతాడు. ల్యాప్ షాట్, కట్ షాట్, ర్యాంప్ షాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. లెగ్‌సైడ్ వైపు మరింత అద్భుతంగా ఆడే సూర్య అటు పేస్ బౌలింగ్, ఇటు స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగలడు. ఏ జట్టులోనైనా సూర్యకు చోటు ఖాయం. షాట్లు ఆడే సమయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆడే సూర్యకుమార్ ఆత్మవిశ్వాసం నన్ను ఆకర్షించింది. నాకు తెలిసి అతను మిడిలార్డర్లో ఆడటం సరైంది. మ్యాచ్‌ను సరిగా నడిపించడంతో పాటు చివర్లో క్రీజ్‌లో ఉంటే చెలరేగిపోగలడు’ అని ఆసీస్ మాజీ కెప్టెన్ విశ్లేషించాడు. చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్ధన -
షాకింగ్: కోవిడ్ నిర్ధారణ అయినప్పటికీ ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ క్రికెటర్
22వ కామన్వెల్త్ క్రీడలు ముగిసాక మహిళల క్రికెట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ణారణ అయిన ఓ క్రికెటర్ బరిలోకి దిగడమే కాకుండా అందరితో కలియతిరిగుతూ సంబురాలు చేసుకుంది. భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్‌కు కోవిడ్ పాజిటివ్ అని తెలిసినా ఆసీస్ మేనేజ్మెంట్ అమెను తుది జట్టుకు ఎంపిక చేసి, బరిలోకి దించింది. ఈ మ్యాచ్‌లో మెక్‌గ్రాత్ బ్యాటింగ్‌లో 2 పరుగులు, బౌలింగ్‌లో 2 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఏమంత ఆశాజనకమైన ప్రదర్శన చేయనప్పటికీ.. టీమిండియా స్వయంకృతాపరాధాల కారణంగా ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. అయితే, తమ ప్లేయర్‌కు కోవిడ్ అని తెలిసినా ఆసీస్ యాజమాన్యం ఆమెను తుది జట్టుకు ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్త తెలిసి యావత్ క్రీడాలోకం షాక్‌కు గురైంది. ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆసీస్ యాజమాన్యం వ్యవహరించిన తీరును అందరూ దుయ్యబడుతున్నారు. నిబంధనల ప్రకారం పాజిటివ్ వచ్చిన ప్లేయర్‌ని ఐసోలేషన్‌కి తరలించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కారణంగా టీమిండియా క్రికెటర్లు సబ్బినేని మేఘన, పూజా వస్త్రాకర్ (కోవిడ్ సోకడంతో) ఆసీస్‌తో తొలి మ్యాచ్ ఆడలేదు. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్ మ్యాచ్‌లో మెక్‌గ్రాత్‌ని పక్కనబెట్టే సాహసం చేయడానికి ఇష్టపడలేదు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 51 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 78 పరుగులు, అలాగే బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టి సూపర్ ఫామ్‌లో ఉండటమే ఇందుకు కారణం. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో మెక్‌గ్రాత్ రాణించింది (2 వికెట్లు, 23 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు). ఇదిలా ఉంటే, కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా టెన్నిస్ స్టార్ జకోవిచ్ పట్ల ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు ఉల్లంఘించాడని ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన జకోను ఘోరంగా అవమానించి, కేసులు కూడా పెట్టారు. చదవండి: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు -
పిల్లాడు పుట్టాకా పెళ్లి చేసుకున్న ఆస్ట్రేలియా స్టార్
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తన ప్రియురాలు బెక్కి బోస్టన్‌ను శనివారం జూలై 30న ఘనంగా వివాహం చేసుకున్నాడు. 2013లో తొలిసారి పరిచయం అయిన వీరిద్దరు అప్పటినుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. 2020లో ఎంగేజ్ చేసుకున్న ఈ జంట 2021 అక్టోబర్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. కాగా పిల్లాడు పుట్టి తొమ్మిది నెలలకు కమిన్స్, బెక్కి బోస్టన్లు కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. కమిన్స్ వైట్సూట్, బ్లాక్ ప్యాంట్.. బెక్కి బోస్టన్ తెల్ల గౌనులో అదిరిపోయే లుక్స్‌తో మెరిశారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా కమిన్స్ వివాహ వేడుకకు కమిన్స్ క్లోజ్ ఫ్రెండ్ కమెడియన్ ఆండీ లీతో పాటు క్రికెటర్లు నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్, ఆండ్రూ మెక్‌డొనాల్డ్, జోష్ హాజిల్‌వుడ్ తదితరులు హాజరయ్యారు. కాగా పాట్ కమిన్స్, బెక్కి బోస్టన్ల ముద్దుల తనయుడు అల్బీ వేడుకకు స్పెషల్ అట్రాక్షన్. ప్రేమకు ఎలాంటి సరిహద్దులు ఉండవని ఈ ఇద్దరు నిరూపించారు. ఎందుకంటే కమిన్స్‌ను ఆస్ట్రేలియా అయితే.. బెక్కి బోస్టన్ది ఇంగ్లండ్. క్రికెట్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు చిరకాల ప్రత్యర్థులు. అయితే కమిన్స్, బోస్టన్ల ప్రేమ మాత్రం ఖండాలను దాటి వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక పాట్ కమిన్స్ 2011లో 18 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు కమిన్స్ 43 టెస్టుల్లో 199 వికెట్లు, 73 వన్డేల్లో 119 వికెట్లు, 39 టి20ల్లో 44 వికెట్లు తీశాడు. టిమ్ పైన్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కమిన్స్ ఆసీస్ టెస్టు జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. చదవండి: BAN VS ZIM 1st T20: సికందర్ రాజా ఊచకోత.. బంగ్లాకు షాకిచ్చిన జింబాబ్వే -
లేటు వయసులో ఘాటైన ప్రేమ.. గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ఆసీస్ స్టార్
ఆస్ట్రేలియన్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక ఇంటివాడయ్యాడు. 34 ఏళ్ల లియాన్.. తన చిన్ననాటి గర్ల్‌ఫ్రెండ్ ఎమ్మా మెక్‌కార్తీని పెళ్లాడాడు. ఐదేళ్లుగా ఎమ్మాతో డేటింగ్లో ఉన్న లియాన్ ఘాటైన ప్రేమలో మునిగి తేలుతున్నాడు. తాజాగా ఆదివారం సాయంత్రం బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యింది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాథన్ లియాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. వాస్తవానికి గతేడాది లియాన్.. గర్ల్‌ఫ్రెండ్ ఎమ్మాకు డైమండ్ రింగ్ తొడిగి ఎంగేజ్మెంట్ చేసుకొని రూమర్లకు తెరదించాడు. కాగా నాథన్ లియాన్ ఇది వరకే మెల్ వారింగ్తో వివాహం కాగా.. ఐదేళ్ల క్రితమే విడిపోయారు. లియాన్- మెల్ వారింగ్ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం. ఇక ఆఫ్ స్పిన్నర్ అయిన నాథన్ లియాన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే లంకతో టెస్టు సిరీస్ ద్వారా 438వ వికెట్ సాధించిన లియాన్ అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టాప్-10లోకి ఎంటరయ్యాడు. ఇక లియాన్ ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు(తొలి రెండు స్థానాల్లో షేన్ వార్న్ 708 వికెట్లు, గ్లెన్ మెక్‌గ్రాత్ 563 వికెట్లు). కాగా 2011లో శ్రీలంకతో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నాథన్ లియాన్ ఆసీస్ తరపున 110 టెస్టుల్లో 438 వికెట్లు, 29 వన్డేల్లో 29 వికెట్లు పడగొట్టాడు. ఇక టెస్టుల్లో లియాన్ 20 సార్లు ఐదు వికెట్ల హాల్... మూడుసార్లు 10 వికెట్ల హాల్ అందుకున్నాడు. View this post on Instagram A post shared by Nathan Lyon (@nath.lyon421) చదవండి: మగ బిడ్డకు జన్మనిచ్చిన కృనాల్ పాండ్యా భార్య పంఖురి శర్మ క్రికెట్లో అలజడి.. స్కాట్లాండ్ బోర్డు మూకుమ్మడి రాజీనామా -
చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్.. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ నమోదు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న అంధుల వన్డే క్రికెట్ సిరీస్‌లో ఆసీస్ ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో భాగంగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ బ్యాటర్ స్టెఫన్ నీరో ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. టీ20ల ప్రభావం కారణంగా వన్డేల్లో డబుల్ హండ్రెడ్ చేయడమే గగనమైన ఈ రోజుల్లో ఓ అంధ క్రికెటర్ ట్రిపుల్ సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. కామన్వెల్త్ బ్యాంక్ అంధుల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ బ్యాటర్ స్టెఫన్ నీరో కేవలం 140 బంతుల్లో 49 ఫోర్లు, సిక్సర్ సాయంతో 309 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఆసీస్ నిర్ణీత 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 542 పరుగుల భారీ స్కో్ర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన కివీస్ కేవలం 272 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా 270 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. A TRIPLE century! Steffan Nero finishes 309* (140) in the Australian Blind Cricket Team's first ODI against New Zealand 🇦🇺That's his third consecutive century at the #ICIS22 after scores of 113 (46) and 101* (47) earlier this week 👏 https://t.co/MDTiUnAC1S | #ASportForAll pic.twitter.com/cqv9vBEPW3— Cricket Australia (@CricketAus) June 14, 2022 ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన నీరో.. అంధుల వన్డే క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించడం ద్వారా స్టెఫన్ నీరో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. 1998లో పాక్ బ్యాటర్ మసూద్ జాన్ చేసిన 262 పరుగులే అంధుల వన్డే క్రికెట్లో టాప్ స్కోర్‌గా ఉండింది. తాజాగా నీరో విధ్వంసంతో మసూద్ జాన్ రికార్డు బద్దలైంది. 5 టీ20లు, 3 వన్డేల ఈ సిరీస్‌లో నీరో ఇప్పటికే రెండు సెంచరీలు (113, 101) సాధించడం విశేషం. ఎనిమిదో ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు.. కివీస్‌పై వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేయడంతో నీరో మరో రికార్డును కూడా తర ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా నీరో రికార్డుల్లోకెక్కాడు. గతంలో మాథ్యూ హేడెన్, మైకేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో ట్రిపుల్ సెంచరీలు సాధించారు. చదవండి: ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ గొప్ప అన్న వారు ఈ లెక్కలు చూస్తే ఖంగుతినాల్సిందే..! -
కెరీర్‌కు టర్నింగ్ పాయింట్.. ఆ ఒక్క సెంచరీ వెనుక విషాద కథ
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. టి20 క్రికెట్లో విధ్వంసకర ఆటకు పెట్టింది పేరు. ఇటీవలే ఐపీఎల్ 2022 సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఆడిన స్టోయినిస్ 11 మ్యాచ్‌ల్లో 156 పరుగులు మాత్రమే చేసి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే కొన్ని కీలక ఇన్నింగ్స్‌లతో మాత్రం మెరిశాడు. ఇక ఆస్ట్రేలియా తరపున 48 మ్యాచ్‌ల్లో 1200 పరుగులు సాధించాడు. స్టోయినిస్ ఖాతాలో ఆరు హాఫ్ సెంచరీలు.. ఒక సెంచరీ ఉన్నాయి. ఆరోజు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 286 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో పూర్తిగా తడబడింది. 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అప్పుడు మార్కస్ స్టోయినిస్ క్రీజులోకి వచ్చాడు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైనవేళ లోయర్ ఆర్డర్లో జేమ్స్ ఫాల్కనర్(25), పాట్ కమిన్స్(36)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించి జట్టును విజయం వైపు నడిపించాడు. ఓవరాల్‌గా 117 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 146 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని దాటికి ఆసీస్ విజయానికి చేరువగా వచ్చినప్పటికి ఆరు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఒక రకంగా ఆసీస్ ఓటమి పాలైనప్పటికి స్టోయినిస్‌కు ఆ సెంచరీ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. తాజాగా ఆ సెంచరీ వెనుక ఉన్న ఒక విషాద కథను స్టోయినిస్ తాజాగా రివీల్ చేశాడు. స్టోయినిస్ సెంచరీ చేసే సమయానికి అతని తండ్రి ఆసుపత్రి బెడ్‌పై ఉన్నాడు. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న తండ్రి కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడు. ''నేను వన్డేల్లో తొలి సెంచరీ సాధించిన రోజున నా తండ్రి ఆసుపత్రిలో కీమో థెరపీ చేయించుకుంటున్నాడు. నేను సెంచరీ చేశానన్న విషయం తెలుసుకున్న నా తండ్రి అక్కడున్న అన్ని టీవీలను ఆన్ చేశాడు. కానీ ఏ ఒక్క దాంట్లోనూ నేను ఆడుతున్న మ్యాచ్ కనిపించలేదట. దీంతో అక్కడున్న నర్సును పిలిచి.. నా కొడుకు ఇవాళ సెంచరీ సాధించాడు.. దానిని నా కళ్లతో చూడాలి అని కోరాడు. వెంటనే ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి నా తండ్రి కోసం సదరు చానెల్‌ను పెట్టారు. ఆ క్షణంలో నా సెంచరీని టీవీలో కళ్లారా చూసిన నాన్న కళ్లను చమర్చడం నర్సు ఆ తర్వాత చెప్పుకొచ్చింది. నా జీవితంలో అది ఎంతో సంతోష క్షణం. ఆ తర్వాత కొన్నాళ్లకే నాన్న క్యాన్సర్ మహమ్మారితో కన్నుమూశారు. నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయిన సెంచరీ ఆ తర్వాత ఒక విషాదాన్ని తీసుకువస్తుందని ఊహించలేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Suved Parkar Ranji Debut: రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్ సెంచరీతో కొత్త చరిత్ర -
'భారత్‌లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో తనకు శాపం తగిలిందని.. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఏదో కారణంగా తాను గాయపడుతున్నానని పేర్కొన్నాడు. ప్రస్త్తుతం మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వచ్చింది. ప్రాక్టీస్ ముగించుకున్న మార్ష్ ఒక మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ‘నేను ఇండియాకు రావడానికి కొద్దిరోజుల ముందే (పాకిస్తాన్ లో) గాయపడ్డాను. ఇక్కడికొచ్చి ఒక మ్యాచ్ ఆడాక నాకు కోవిడ్ వచ్చింది.. అప్పుడు నేను నిజంగా షాక్ కు గురయ్యా. ఏదైనా శాపం తగిలిందా..? అని అనిపించింది. కానీ నేను కోవిడ్ నుంచి త్వరగానే కోలుకున్నా. తిరిగి ఢిల్లీ జట్టుతో చేరి మంచి ప్రదర్శనలు చేశా. అక్కడున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇక నేను జట్టులో చేరినప్పుడు అందరూ రికీ పాంటింగ్ గురించి గొప్పగా చెప్పారు. ఆటలో అతడు ఏం సాధించాడో ఒక ఆస్ట్రేలియన్ గా నాకు తెలుసు. అయితే అతడితో కలిసి చేసిన ప్రయాణంలో పాంటింగ్ తన ఆటగాళ్లను ఎంత బాగా చూసుకుంటాడో అర్థమైంది. నేను ఢిల్లీ జట్టుకు ఎంత ముఖ్యమైన ఆటగాడినో పాంటింగ్ నాకు చెప్పేవాడు. ఆ దిశగా నన్ను మోటివేట్ చేసేవాడు. నాలో నమ్మకం సన్నగిల్లినప్పుడల్లా నాతో మాట్లాడి నా ఆత్మ విశ్వాసం పెంచేలా దోహదం చేసేవాడు.’ అని మార్ష్ చెప్పాడు. కాగా 2020, 21 సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన మార్ష్.. అప్పుడు కూడా గాయం కారణంగా అర్థాంతరంగా టోర్నీల నుంచి తప్పుకున్నాడు. ఇక తాజా సీజన్ లో 8 మ్యాచులాడి.. 251 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా లంకతో మూడు టి20ల సిరీస్ జూన్ 7 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 8 పరుగులకే ఆలౌట్..! -
ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్‌రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే..
క్రికెట్ ఫ్యాన్స్‌కి బిగ్ షాక్ తగిలింది. ఆసిస్ లెజెండరీ క్రికెటర్, ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం రాత్రి టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. సైమండ్స్ ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు మాత్రమే కాకుండా అత్యంత నైపుణ్యం కలిగిన ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే సైమండ్స్ తన ఆటతో పాటు పలు కాంట్రవర్శీలతో కూడా వార్తల్లో నిలిచాడు. ఇవి అతని క్రికెట్ కెరీర్‌ని కాస్త మసకబారేలా చేశాయి. అందులో ముఖ్యమైంది మంకీ గేట్ వివాదం. వివాదాలతో వార్తల్లో.. సైమండ్స్ క్రికెట్ చరిత్రలో ‘మంకీగేట్’ వివాదం ఓ కుదుపు కుదిపేసింది. అప్పుడు ఏం జరిగిందంటే.. 2008లో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ తనను ‘మంకీ’ అన్నాడని ఆండ్రూ సైమండ్స్ ఆరోపించాడు. అయితే హర్భజన్ మాత్రం తాను అలా అనలేదని చెప్పాడు. హర్భజన్ సింగ్‌కి అవతలివైపు నాన్స్టైయికింగ్లో బ్యాటింగ్ చేస్తున్న సచిన్ టెండూల్కర్, ఈ విషయంలో హర్భజన్‌కు మద్దతుగా నిలిచాడు. భజ్జీ మంకీ అనలేదని, హిందీలో ఒక అసభ్య పదం ప్రయోగించాడని చెప్పాడు. ఆ పదం తాను స్వయంగా విన్నానని స్పష్టం చేశాడు. ఈ విషయం మీద దాదాపు కొన్ని రోజుల పాటు వివాదం, విచారణ సాగింది. చివరకు భజ్జీపై ఒక టెస్టు మ్యాచ్ నిషేదం, జరిమానా విధించారు. మైఖెల్ క్లార్క్ వైస్-కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2008లో డార్విన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ నుంచి సైమండ్స్ ప్రవర్తన సరిగా లేదని ఇంటికి పంపింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఎందుకంటే సైమండ్స్ యాజమాన్యం నిర్వహించే సమావేశాలు హాజరవడం కంటే చేపల వేటకు వెళ్లేందుకు ఇష్టపడేవాడు. 2005లో కార్డిఫ్‌లో బంగ్లాదేశ్‌తో ట్రై-సిరీస్ మ్యాచ్‌కు ముందు సైమండ్స్ ఆస్ట్రేలియన్ జట్టు నుంచి తొలగించారు. మ్యాచ్‌కు మునుపటి సాయంత్రం మద్యం సేవించడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 2009లో, ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియన్ జట్టులో ఉన్నప్పుడు మూడవసారి క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ట్వంటీ20 ప్రపంచ కప్ నుంచి తొలగించారు. సైమండ్స్ స్వభావం తన క్రికెట్ కెరీర్‌ను దెబ్బ తీసిందనే చెప్పాలి. సైమండ్స్ తన కెరీర్లో అనేక వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ, అతను ప్రపంచ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్ రౌండర్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. చదవండి: Andrew Symonds: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆసిస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి -
సైమండ్స్‌కు ఐసీసీ నివాళి.. పాకిస్తాన్‌పై 143 నాటౌట్ వీడియో ట్వీట్
ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) హఠాన్మరణం యావత్ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శనివారం రాత్రి ఆస్ట్రేలియాలోని టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేర్‌వార్న్ ఆకస్మిక మృతి ఘటనను మరువకముందే సైమండ్స్ మరణవార్త కలచివేస్తోంది. క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈక్రమంలోనే సైమోకు నివాళి అర్పించిన ఐసీసీ 2003 ప్రపంచకప్‌లో ఆయన విధ్వంసక బ్యాటింగ్ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. చదవండి👉🏾 ఆండ్రూ సైమండ్స్ మృతి.. దిగ్గజ క్రికెటర్ల సంతాపం బౌండరీల వరద! 2003 దక్షిణాఫ్రికా వన్డే వరల్డ్‌కప్‌ను పాంటింగ్ సారథ్యంలో ఆస్ట్రేలియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన లీగ్ మ్యాచుల్లో జట్టు విజయంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తమ తొలిమ్యాచ్‌లోనే పాంటింగ్ సేన 82 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. 2 సిక్సర్లు, 18 ఫోర్లతో వీరవిహారం చేసిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సైమండ్స్ 125 బంతుల్లో 143 (నాటౌట్) పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఛేదనలో ఎంతమాత్రం సఫలీకృతం కాలేదు. 44.3 ఓవర్లకే పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. చదవండి👉🏻 IPL 2022: సన్‌రైజర్స్ ఢమాల్ As we mourn the loss of former Australian all-rounder Andrew Symonds, we take a look back to his tremendous 143* against Pakistan at the 2003 World Cup.#RIPRoy pic.twitter.com/oyoH7idzkb — ICC (@ICC) May 15, 2022 -
క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆసిస్ దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి
ఆస్ట్రేలియా క్రికెట్ ప్రేమికులకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ లెజెండరీ క్రికెటర్, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం రాత్రి టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అకాల మృతి చెందగా.. ఇప్పుడు సైమండ్స్ మృతితో యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. తన ఆటతో అనతి కాలంలోనే ఆస్ట్రేలియా టీమ్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా సైమండ్స్ పేరు తెచ్చుకున్నారు. కెరీర్లో 198 వన్డేలు ఆడిన సైమండ్స్.. ఆస్ట్రేలియా 2003, 2007 ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. సైమండ్స్ అకాల మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఆసీస్ దిగ్గజ ఆటగాడు అడమ్ గ్రిల్‌కిస్ట్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, పాక్ బౌలర్ షోయబ్ అక్తర్ సంతాపం తెలుపుతూ టీట్లు చేశారు. సైమండ్స్ కెరీర్.. 1998లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. మొత్తం 198 వన్డేల్లో 5088 పరుగులు చేసిన సైమండ్స్.. అందులో ఆరు సెంచరీలు, 30 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ఆల్‌రౌండర్.. 133 వికెట్లు పడగొట్టాడు. జట్టు విజయంలో చాలా సార్లు కీలక పాత్ర పోషించాడు. 2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సైమండ్స్.. మొత్తం 26 మ్యాచ్‌ల్లో 1463 పరుగులు చేయగా.. వాటిలో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 పరంగా 14 మ్యాచ్‌ల్లో.. రెండు హాఫ్ సెంచరీలతో 337 పరుగులు చేశాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్లో సైమండ్స్‌ను డెక్కన్ ఛార్జర్స్ రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు సైమండ్స్ వీడ్కోలు పలికాడు. This really hurts. #roy #rip — Adam Gilchrist (@gilly381) May 14, 2022 Shocking news to wake up to here in India. Rest in peace my dear friend. Such tragic news 💔🥲 pic.twitter.com/pBWEqVO6IY — VVS Laxman (@VVSLaxman281) May 15, 2022 Vale Andrew Symonds. We are shocked and saddened by the loss of the loveable Queenslander, who has tragically passed away at the age of 46. pic.twitter.com/ZAn8lllskK — Cricket Australia (@CricketAus) May 15, 2022 Devastated to hear about Andrew Symonds passing away in a car crash in Australia. We shared a great relationship on & off the field. Thoughts & prayers with the family. #AndrewSymonds pic.twitter.com/QMZMCwLdZs — Shoaib Akhtar (@shoaib100mph) May 14, 2022 చదవండి: IPL 2022: రివ్యూకు సిగ్నల్ చేయడం మర్చిపోయాడు.. పాపం రింకూ సింగ్..! -
చావు నుంచి త్రుటిలో తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రెవిస్ హెడ్, అతని భార్య జెస్సికా డేవిస్ తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో చావు అంచుల దాకా వెళ్లి వచ్చారు. కాగా ట్రెవిస్ హెడ్ భార్య ఆరు నెలల గర్భవతి. హాలిడే వెకేషన్‌ను ఎంజాయ్ చేయడానికి ట్రెవిస్ హెడ్.. జెస్సీకా డేవిస్‌తో కలిసి మాల్దీవ్స్ వెళ్లాడు. అక్కడ సరదాగా గడిపిన వీరిద్దరు ఆదివారం ఆస్ట్రేలియాకు తిరుగుపయనమయ్యారు. ఇంకో 45 నిమిషాల్లో గమనం చేరుకుంటుదన్న దశలో ఫ్లైట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని భావించాడు. అయితే మొదటి ప్రయత్నంలో ఫ్లైట్‌ను ల్యాండింగ్ చేయడంలో విఫలమయ్యాడు. రెండో ప్రయత్నంలో ల్యాండింగ్ చేసినప్పటికీ స్లిడ్ అయిన ఫ్లైట్ పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది. అయితే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని ట్రెవిస్ హెడ్ భార్య జెస్సీకా డేవిస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ''హాలిడే వెకేషన్‌ను సరదాగా గడిపాం. ఆస్ట్రేలియాకు తిరుగపయనమవ్వడానికి మాల్దీవ్స్‌లో ఫ్లైట్ ఎక్కాం. గంట ప్రయాణంలో 30 నిమిషాలు పూర్తైన తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. దేవుని దయవల్ల మాకు ఏం కాలేదు. నా బిడ్డ ఈ లోకాన్ని చూడకుండానే చనిపోతానేమోనని అనిపించింది. ఆ తర్వాత నాలుగు గంటల పాటు రెస్క్యూ ప్లేన్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మాల్దీవ్స్ రాజధాని మాలీలో మాకు వసతి ఏర్పాటు చేసి మరో ఫ్లైట్‌లో ఆస్ట్రేలియాకు తీసుకొచ్చారు.'' అని చెప్పుకొచ్చింది. ఇక ట్రెవిస్ హెడ్ ఆస్ట్రేలియా తరపున 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆసీస్ తరపున 26 టెస్టులు, 45 వన్డేలు, 17 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: Yuvraj SIngh: కొందరు పగబట్టారు.. అందుకే టీమిండియా కెప్టెన్ కాలేకపోయా! -
శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ లోకాన్ని విడిచి రెండోరోజులు కావొస్తోంది. వార్న్ అకాల మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానుల సంతాపాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కాగా థాయ్ అధికారులు ఆదివారం షేన్‌వార్న్ భౌతికకాయానికి అటాప్సీ (శవ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ మేరకు పోస్టుమార్టం కొరకు భౌతికకాయాన్ని ఉదయం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే వార్న్ చనిపోయే ముందు ఎలాంటి ఆల్కాహాల్.. మత్తు పదార్థాలు తీసుకోలేదని వార్న్ మేనేజర్ చెప్పినట్లు థాయ్ పోలీసులు తమ దర్యాప్తులో స్పష్టం చేశారు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే అటాప్సీ రిపోర్టు ద్వారా బయటపడే అవకాశాలున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు సోమవారం వచ్చే అవకాశం ఉంది. ఇక పోస్టుమార్టం అనంతరం వార్న్ భౌతికకాయాన్ని స్వస్థలమైన ఆస్ట్రేలియాకు తరలించనున్నారు. ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలు జరపనున్నట్లు తెలిపింది. సోమవారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కుమారుడు జాక్సన్‌తో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కాగా థాయ్‌లాండ్‌లోని కోయ్ సమూయ్ ప్రాంతంలోని తన విల్లాలో 52 ఏళ్ల వార్న్ అచేతనంగా పడి ఉండడం.. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసినట్లు తెలిసింది. వార్న్ స్నేహితులు కూడా దాదాపు 20 నిమిషాల పాటు అతన్ని బతికించే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకుండా పోయింది. వార్న్ మృతిపై అతని కుటుంబసభ్యులు ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నారు. తండ్రి మృతిపై అతని పెద్ద కుమారుడు బోరున విలపించాడు. జాక్సన్ మాట్లాడుతూ..'' నాన్న ఇంకా మా కళ్ల ముందు తిరుగుతున్నట్లే ఉంది.. మా ఇంటి డోర్ నుంచి లోపలికి వస్తున్నట్లు అనిపిస్తుంది. నిజంగా ఇది చెడ్డ కల అయితే బాగుండు'' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక వార్న్ 1992-2007 మధ్య 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌కు తన సేవలందించాడు. మొత్తంగా వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. చదవండి: Shane Warne: వార్న్ మృతిపై థాయ్ పోలీసులు ఏమన్నారంటే.. Shane Warne: మద్యం, మాంసం, సిగరెట్లతో స్పిన్ మాంత్రికుడికి నివాళి -
ప్రపంచ క్రికెట్లో విషాదం.. షేన్‌వార్న్ మృతి, సంతాపాల వెల్లువ..
ప్రపంచ క్రికెట్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ శుక్రవారం హఠాన్మరణం చెందారు. థాయ్‌లాండ్‌లోని ఓ విల్లాలో విగతజీవిగా కనిపించారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇక వార్న్ మృతిపట్ల యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. తమ అభిమాన సహచరుడు లేడనే వార్త విని క్రికెట్ ప్రముఖులు విషాదంలో మునిగారు. వార్న్ కుటుంబానికి ఈ కష్ట కాలంలో ధైర్యాన్ని ప్రసాదించాలని దేవున్ని ప్రార్థించారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా పలువురు స్పందించారు. ‘షేన్ వార్న్ మృతి విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. మాటలు రావడం లేదు. క్రికెట్ ప్రపంచంలో లెజెండ్. ఆటలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి. ఇంత త్వరగా కాలం చేయడం విషాదకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అని వీవీఎస్ లక్ష్మణ్ సంతాపం తెలిపారు. This is absolutely unbelievable. Shocked beyond words. A legend and one of the greatest players ever to grace the game.. Gone too soon... Condolences to his family and friends. https://t.co/UBjIayR5cW — VVS Laxman (@VVSLaxman281) March 4, 2022 ‘అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. కూల్ స్పిన్‌కు వార్న్ పెట్టింది పేరు.. సూపర్ స్టార్ షేన్‌వార్న్ ఇకలేరనే విషయం బాధాకరం. మనిషి జీవితంలో ఎప్పుడేమవుతుందో చెప్పలేం. జీవితాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వార్న్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి’ అని వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్లో సంతాపం తెలిపారు. Cannot believe it. One of the greatest spinners, the man who made spin cool, superstar Shane Warne is no more. Life is very fragile, but this is very difficult to fathom. My heartfelt condolences to his family, friends and fans all around the world. pic.twitter.com/f7FUzZBaYX — Virender Sehwag (@virendersehwag) March 4, 2022 ‘క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్ మృతి చెందారనే విధ్వంసకర వార్త విన్నా. నోట మాట రావడం లేదు. షాకింగ్‌గా ఉంది. గొప్ప ఆటగాడు, మంచి మనిషి’ అని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశారు. Just heard the devastating news about legendary Shane Warne passing away. No words to describe how shocked & sad i am. What a legend. What a man. What a cricketer. pic.twitter.com/4C8veEBFWS — Shoaib Akhtar (@shoaib100mph) March 4, 2022 హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేసిన షమీ.. షేన్ వార్న్‌కు నివాళి అర్పించాడు. RIP 💔💔💔💔 pic.twitter.com/MIcsBEjfL6 — Mohammad Shami (@MdShami11) March 4, 2022 ‘షేన్‌వార్న్ ఇక లేరనే వార్త నమ్మలేకపోతున్నా.. ఇది అబద్ధమని చెప్పండి’ అని దినేష్ కార్తీక్ విస్మయం వ్యక్తం చేశాడు. Shane Warne ... Really !!!!! ☹️ Tell me it's not true please — DK (@DineshKarthik) March 4, 2022 ఒకే రోజు ఇద్దరు దిగ్గజాలు కన్నుమూయడం విషాదకరం. మార్ష్, వార్న్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని డేవిడ్ వార్నర్ ట్వీట్ చేశాడు. Two legends of our game have left us too soon. I’m lost for words, and this is extremely sad. My thoughts and prayers go out to the Marsh and Warne family. I just can not believe it. #rip, you will both be missed https://t.co/gduLY9bIwg — David Warner (@davidwarner31) March 4, 2022 -
పాక్ పరువును బజారుకీడ్చిన ఆసీస్ ఆల్‌రౌండర్.. పీఎస్ల్పై సంచలన ఆరోపణలు
James Faulkner Leaves PSL: అంతర్జాతీయ క్రికెట్ వేదికపై పాక్ పరువు మరోసారి మంటగలిసింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వడం లేదంటూ ఆసీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ సంచలన ఆరోపణలు చేస్తూ దాయాది దేశపు పరువును బజారుకీడ్చాడు. పీఎస్ఎల్ 2022 సీజన్లో ఆఖరి రెండు మ్యాచ్‌ల నుంచి తప్పుకుంటున్నట్టు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ గొప్పదని బడాయికి పోయే పాక్‌కు ఫాల్కనర్ చేసిన ఆరోపణలతో నోట మాటరావడం లేదు. ఈ దుస్థితికి పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజానే కారణమంటూ ఆ దేశ క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. 2/2 It hurts to leave as I wanted to help to get international cricket back in Pakistan as there is so much young talent and the fans are amazing. But the treatment I have received has been a disgrace from the @TheRealPCB and @thePSLt20 I’m sure you all understand my position. — James Faulkner (@JamesFaulkner44) February 19, 2022 కాగా, ఐపీఎల్లోలా కాకుండా పీఎస్ఎల్లో ప్రతి ప్లేయర్లకు ఓ నిర్ధిష్టమైన ధర ఉంటుంది. ప్లాటినం, డైమండ్ కేటగిరి అంటూ ఒక్కో విభాగపు ప్లేయర్లకు ఒక్కో ధర డిసైడ్ చేస్తారు నిర్వాహకులు. ప్లాటినం గ్రూప్‌లో ప్లేయర్లు రూ. 2.3 కోట్లు, డైమండ్ గ్రూప్‌లో ఉన్ ప్లేయర్లు సీజన్‌కి రూ. 1.15 కోట్ల చొప్పున దక్కించుకుంటారు. జేమ్స్ ఫాల్కనర్‌ను డైమండ్ కేటగిరి కింద దక్కించుకుంది క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు. ఇదిలా ఉంటే, 2015 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ ఆస్ట్రేలియా టీమ్‌లో సభ్యుడైన ఫాల్కనర్, ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పూణే వారియర్స్ ఇండియా, గుజరాత్ లయన్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఫాల్కనర్.. ఆస్ట్రేలియా తరఫున ఓ టెస్టు, 69 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. బ్యాటింగ్‌లో సెంచరీ, 4 అర్ధసెంచరీల సాయంతో 1200కు పైగా పరుగులు చేసిన ఫాల్కనర్.. బౌలింగ్‌లో 138 వికెట్లు పడగొట్టాడు. చదవండి: లంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే.. విధ్వంసకర ప్లేయర్ రీ ఎంట్రీ -
బాగా ఆడుతున్నాడని మండినట్టుంది.. కోపంతో బంతిని లాగిపెట్టి
James Pattinson Throw Injures Opponent Batter.. ఆస్ట్రేలియా మాజీ పేసర్ జేమ్స్ పాటిన్సన్ చర్యపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయంలోకి వెళితే.. షాఫీల్డ్ షీల్డ్ టోర్నీలో జేమ్స్ పాటిన్సన్ విక్టోరియా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా టోర్నీలో భాగంగా విక్టోరియా, న్యూసౌత్ వేల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలో న్యూ సౌత్‌వేల్స్ కెప్టెన్ డేనియల్ హ్యూజెస్ మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 283 బంతులెదుర్కొన్న అతను 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చదవండి: IND vs NZ 2021: టి20 కెప్టెన్‌గా రోహిత్ .. తొలి టెస్టుకు కోహ్లి రెస్ట్!? అయితే టీ విరామానికి ముందు డేనియల్ ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా డిఫెన్స్ ఆడుతూ చికాకు పెట్టాడు. ఈ నేపథ్యంలో బౌలింగ్‌కు వచ్చిన జేమ్స్ పాటిన్సన్కు హ్యూజెస్ ఆట చిరాకు తెప్పించింది. పాటిన్సన్ వేసిన బంతిని హ్యూజెస్ డిఫెన్స్ ఆడగా..పాటిన్సన్ చిర్రెత్తిపోయాడు. బంతిని అందుకొని హ్యూజెస్ క్రీజులోనే ఉన్నప్పటికీ కావాలనే అతన్ని టార్గెట్ చేస్తూ కోపంతో విసిరాడు. బంతి కాస్త వెళ్లి హ్యూజెస్ పాదానికి బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన అతను కాసేపు క్రీజులో నుంచి పక్కకు వెళ్లాడు. ఆ తర్వాత పాటిన్సన్ క్షమాపణ చెప్పేందుకు వెళ్లగా.. హ్యూజెస్ కోపంగా చూశాడు. టీ విరామ సమయంలో పెవిలియన్ వెళ్తున్న సమయంలో పాటిన్సన్, హ్యూజెస్ మధ్య మాటలయుద్ధమే నడిచింది. కొద్దిసేపు అలాగే ఉండి ఉంటే కొట్టుకోవడానికి సిద్దమయ్యేవారే. మిగతా ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే పాటిన్సన్ చర్యపై సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చదవండి: Daryl Mitchell: ఇది ఫీల్డింగ్ అంటే.. క్యాచ్ పట్టకపోయినా హీరో అయ్యాడు ''ఇలాంటి వ్యక్తిని ఇంకా క్రికెట్ ఆడనిస్తున్నారా.. వెంటనే బ్యాన్ చేయండి.. ప్రత్యర్థి ఆటగాడు బాగా ఆడుతున్నాడని మండినట్టుంది.. అందుకే కోపంతో బంతిని విసిరాడు.. పాటిన్సన్ చర్య దారుణం.. ఒక బ్యాటర్‌పై కోపం వ్యక్తం చేయడం మంచి పద్దతి కాదు.. అందుకే ఆసీస్ టీమ్ అతన్ని పక్కకు పెట్టింది'' అంటూ కామెంట్స్ చేశారు. Ouch! Daniel Hughes 71* (283) continues to defy Victoria despite copping this throw from James Pattinson in the second session #SheffieldShield pic.twitter.com/ChTkupId1n — cricket.com.au (@cricketcomau) November 8, 2021 Absolutely ridiculous and unnecessary attempt by Pattinson to peg the ball back at Hughes’ stumps. I hope the match referee sanctions him for that pathetic act. — Rowan de Groen (@StuffedShoulder) November 8, 2021 Why is he still playing? Should be banned forever. Ridiculous of Pattinson. — Warisha (@Khan__Warisha) November 8, 2021 -
గర్ల్‌ఫ్రెండ్‌తో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ నిశ్చితార్థం
సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. తన ఇష్ట సఖి, చిరకాల ప్రేయసి గ్రెటా మాక్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కాబోయే భార్యతో కలిసి తీసుకున్న సెల్ఫీని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ విషయాన్ని పంచుకున్నాడు. ఓ బీచ్ పక్కన దిగినట్టుగా ఉన్న ఈ ఫొటోలో గ్రెటా తన నిశ్చితార్థం ఉంగారాన్ని చూపిస్తోంది. ఈ ఫొటోను షేర్ చేసిన వెంటనే అభిమానులు శుభాకాంక్షలతో హోరెత్తించారు. కాగా, మార్ష్‌కు ఈ సీజన్ వ్యక్తిగతంగా, క్రికెట్ పరంగా బాగా కలిసొచ్చింది. కొద్ది రోజుల కిందట విండీస్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌లో అతను సూపర్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. మూడు హాఫ్ సెంచరీలు సహా పలు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌ను ఆసీస్ 1-4తో కోల్పోయినటప్పటికీ.. మార్ష ప్రదర్శన ఆసీస్ సెలక్టర్లను ఆకట్టుకుంది. దీంతో అతనికి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. కాగా, యూఏఈ వేదికగా అక్టోబరు 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. చదవండి: 'వాతి కమింగ్' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన శ్రేయస్ అయ్యర్.. -
'68 రోజులు క్రితం పెళ్లి.. 8 రోజులు మాత్రమే నా భార్యతో ఉన్నా'
సిడ్నీ: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా తన భార్యను 68 రోజులుగా మిస్ అవుతున్నా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విషయంలోకి వెళితే.. ఆడమ్ జంపాకు గత జూన్‌లో తన గర్ల్‌ఫ్రెండ్ హాటీ లీ పామర్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికాక ముందు జంపా, హాటీ లీలలు జాలీగా ఎంజాయ్ చేస్తూ గడిపిన ఫోటోలు వారి ఇన్‌స్టాగ్రామ్‌లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అయితే పెళ్లయినప్పటి నుంచి మాత్రం జంపా తన భార్యకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆసీస్ జట్టులో ప్రస్తుతం కీలక స్పిన్నర్‌గా ఉన్న ఆడమ్ జంపా వరుస క్రికెట్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడు. వెస్టిండీస్, బంగ్లాదేశ్ టూర్లలో బిజీగా గడిపిన జంపా తన భార్యను మిస్సవుతున్నట్లు తాజాగా ఇన్‌స్టాలో వెల్లడించాడు.'' 68 రోజుల క్రితం నాకు పెళ్లైంది.. కానీ నా భార్యతో గడిపిన క్షణాలు 8 రోజులు మాత్రమే... తనను చాలా మిస్సవుతున్నా.. అంటూ'' ఏడుస్తున్న ఎమోజీతో ఫోటోను షేర్ చేశాడు. జంపా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. చదవండి: WI Vs PAK: 10 వికెట్లతో దుమ్మురేపిన షాహిన్ ఆఫ్రిది; పాకిస్తాన్ ఘన విజయం ఇక ఆస్ట్రేలియా జట్టుకు వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ముందుగా వెస్టిండీస్ టూర్ చూసుకుంటే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో విండీస్‌కు అప్పగించింది. ఆ తర్వాత జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో గెలుచుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయిన ఆసీస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాగా సెప్టెంబర్ 19 నుంచి మొదలవనున్న ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలకు ఆడమ్ జంపా దూరంగా ఉండనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. ఐపీఎల్లో ఆడమ్ జంపా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆసీస్ తరపున జంపా 64 వన్డేల్లో 97 వికెట్లు, 50 టీ20ల్లో 52 వికెట్లు తీశాడు. చదవండి: Rashid Khan: రషీద్ ఖాన్ హెలికాప్టర్ సిక్స్.. వీడియో వైరల్ -
ఆసీస్ క్రికెటర్‌కు కరోనా.. ఆందోళనలో సహచర క్రికెటర్లు
లండన్: అంతర్జాతీయ క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తొలుత ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు వైరస్ బారిన పడగా, ఆతర్వాత శ్రీలంక ఆటగాడు వీరక్కోడి, తాజాగా ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్‌మన్ పీటర్ హాండ్స్‌కాంబ్ మహమ్మారి బారిన పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న హాండ్స్‌కాంబ్.. మిడిల్సెక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. హాండ్స్‌కాంబ్ తన తదుపరి మ్యాచ్‌లో లీస్టర్‌షైర్‌తో తలపడాల్సి ఉంది. అయితే, రెగ్యులర్‌గా నిర్వహించే పరీక్షల్లో భాగంగా అతడికి కోవిడ్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతని సహచర క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో అతను తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని మిడిల్సెక్స్ యాజమాన్యం ప్రకటించింది. అతని స్థానంలో ఐరిష్ ఆటగాడు టిమ్ ముర్తగ్ సారథిగా ఎంపిక చేసింది. కాగా, 2019 జనవరిలో చివరి సారిగా ఆస్ట్రేలియా టెస్టు జట్టుకి ఆడిన హ్యాండ్స్‌కబ్.. అదే ఏడాది ఫిబ్రవరిలో భారత్‌పై బెంగళూరు వేదికగా చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అదే ఏడాది జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అతనికి ఆఖరి సిరీస్. 2016లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హ్యాండ్స్‌కబ్.. ఆసీస్ తరఫున 16 టెస్టులు, 22 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో మూడు సెంచరీలు నమోదు చేసిన హ్యాండ్స్కాంబ్.. ఐపీఎల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇదిలా ఉంటే, ఇటీవల శ్రీలంకతో సిరీస్ ఆడిన ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు క్రికెటర్లు సహా మొత్తం ఏడుగురు కరోనా బారిన పడ్డారు. ఆతర్వాత వీరితో తలపడిన శ్రీలంక బృందంలో బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా అనలిస్టు జీటీ నిరోషన్, శ్రీలంక రిజర్వ్ బెంచ్ ఆటగాడు వీరక్కోడికి పాజిటివ్ అని తేలింది. -
'ఇప్పటికీ భయపడుతున్నా.. కిడ్నాప్‌తో నాకు సంబంధం లేదు'
సిడ్నీ: ఆసీస్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ కిడ్నాప్ వ్యవహారం క్రికెట్ ఆస్ట్రేలియాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసిన నలుగురు రెండు గంటల పాటు కారులో తిప్పారు. సిడ్నీ నగరానికి దూరంగా గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అతనిపై దాడి చేసి గన్‌తో బెదిరించారు. ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత మెక్‌గిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా బుధవారం మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నలుగురు కిడ్నాపర్లలో ఒక వ్యక్తి మెక్‌గిల్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడు కావడంతో కొత్త మలుపు తీసుకుంది. ఇక క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత స్టువర్ట్ మెక్‌గిల్ న్యూట్రల్ బే ఏరియాలోని అరిస్టాటిల్స్ రెస్టారెంట్లో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ మారియా సొటిరోపౌలోస్‌తో పరిచయం పెరిగి అది ప్రేమకు దారి తీసింది. అప్పటినుంచి వారిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ విషయం మారినో సోదరుడికి తెలియడంతో మెక్‌గిల్ కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా కిడ్నాప్ వ్యవహారంపై మెక్‌గిల్ గర్ల్‌ఫ్రెండ్ మారియా స్పందించింది. స్టువర్ట్ గిల్‌ను బంధించిన ప్రదేశం 'ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను భయపడుతూనే ఉన్నా. కిడ్నాప్ తర్వాత ఆ భయం మరింత పెరిగింది.. ఈ సమయంలో నేను సురక్షితంగా ఉంటానో లేదో తెలియదు. అసలు ఇప్పటికి ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. కిడ్నాప్ వ్యవహారంలో నా సోదరుడు పాత్ర ఉందని తెలుసుకున్నా. అయినా మేమిద్దరం తోడబుట్టినవాళ్లమే అయినా ఎవరి జీవితాలు వారివి. నా సోదరునితో నాకు మంచి రిలేషన్షిప్ లేదు.. అందుకే అతనికి దూరంగా ఉంటున్నా. మెక్‌గిల్ విషయంలో నా సోదరుడు చేసిన పనికి శిక్ష పడాల్సిందే. అంటూ చెప్పుకొచ్చింది. కాగా స్టువర్ట్ మెక్‌గిల్ ఆసీస్ తరపున 1998-2010 మధ్యకాలంలో 44 టెస్టులు ఆడి 208 వికెట్లు తీశాడు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే మెక్‌గిల్ అరంగేట్రం చేశాడు. అతనితో పోటీ పడి వికెట్లు తీసినా వార్న్ నీడలో మెక్‌గిల్ అంతగా పాపులర్ కాలేకపోయాడు. చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ కిడ్నాప్.. నలుగురు అరెస్ట్ -
మ్యాక్స్ అన్ వెల్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా కీలక ఆటగాడు, విధ్వంసక బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆశ్చర్యకర రీతిలో క్రికెట్‌కు నిరవధిక విరామం ప్రకటించాడు. మానసికపరమైన సమస్యలతో తాను బాధపడుతున్నట్లు, కొంత కాలం ఆటకు దూరం కావాలని భావిస్తున్నట్లు అతను తన నిర్ణయాన్ని వెలువరించాడు. క్రికెట్ ఆ స్ట్రేలియా (సీఏ) ఈ విషయాన్ని నిర్ధారిస్తూ అధికారిక ప్రకటన చేసింది. ‘ఆస్ట్రేలియా ఆటగాళ్ల మంచి చెడులు చూసుకోవడం మా బాధ్యత. మ్యాక్స్‌వెల్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది. క్రికెట్ ఆస్ట్రేలియా, అతని దేశవాళీ జట్టు విక్టోరియా కలిసి అతని ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకుంటాయి. మ్యాక్సీ మళ్లీ క్రికెట్లోకి అడుగు పెట్టే విధంగా తగిన వాతావరణం కల్పిస్తాం. ఈ సమయంలో మ్యాక్స్‌వెల్ వ్యక్తిగత జీవితాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టరాదని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. అతనో ప్రత్యేకమైన ఆటగాడు. ఆస్ట్రేలియా క్రికెట్ కుటుంబంలో భాగమైన గ్లెన్ తొందరగా తిరిగొస్తాడని ఆశిస్తున్నాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ బెన్ ఒలీవర్ ప్రకటన జారీ చేశారు. గత కొంత కాలంగా మ్యాక్స్‌వెల్ మానసికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, దీనిని సరైన సమయంలో గుర్తించిన అతనికి విరామం తప్పనిసరి అని టీమ్ సైకాలజిస్ట్ మైకేల్ లాయిడ్ వ్యాఖ్యానించారు. ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి టి20లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ బరిలోకి దిగాడు. 28 బంతుల్లోనే 62 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పాటు మైదానంలో కూడా చాలా చురుగ్గా కనిపించి ఒక అద్భుతమైన రనౌట్ కూడా చేశాడు. అతని ఉత్సాహాన్ని చూస్తే ఎవరికీ అతని మానసిక స్థితిపై కనీస సందేహం కూడా రాదు. కానీ నాలుగు రోజులు తిరిగే సరికి తాను క్రికెట్ ఆడలేనని, విరామం కోరుకుంటున్నట్లు చెప్పాడు. మానసికంగా తాను తీవ్రమైన ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నట్లు 31 ఏళ్ల మ్యాక్స్‌వెల్ వెల్లడించడం అనూహ్యం. ఏడాది కాలంగా... అడిలైడ్‌లో జరిగిన తొలి టి20 మ్యాచ్‌కు ముందే తన విరామం గురించి కోచ్ లాంగర్‌తో మ్యాక్స్‌వెల్ చర్చించాడు. బ్రిస్బేన్‌లో జరిగిన రెండో టి20లో అతను బ్యాటింగ్ చేయలేదు. అయితే మ్యాక్సీ సమస్యల్లో ఉన్నట్లు తాను చాలా కాలం క్రితమే గుర్తించానని టీమ్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. ‘నా పరిస్థితి అంత బాగా ఏమీ లేదు. ఆటను ఆస్వాదించలేకపోతున్నాను’ అని తనతో చెప్పినట్లు లాంగర్ స్పష్టం చేశాడు. శ్రీలంకతో సిరీస్ సమయంలో మ్యాచ్ ప్రసారకర్తలతో మ్యాక్స్‌వెల్ సరదాగా మాట్లాడటం కూడా ఒక ‘ముసుగు’ మాత్రమేనని కోచ్ అభిప్రాయ పడ్డాడు. తమ ఆటతో ప్రజలకు ఎంతో వినోదం పంచినా...ఆటగాళ్ల అంతరంగాన్ని ఎవరూ గుర్తించలేరని లాంగర్ వ్యాఖ్యానించాడు. గత ఏడాది కాలంగా మ్యాక్స్‌వెల్ పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడటంతో పాటు సుదీర్ఘ ప్రయాణాలు చేశాడు. స్వదేశంలో సిరీస్‌ల తర్వాత భారత్, యూఏఈ పర్యటన, ఆ తర్వాత ఇంగ్లండ్‌లో ప్రపంచ కప్, దానికి కొనసాగింపుగా కౌంటీల్లో కూడా అతను ఆడాడు. తాను ఎప్పుడు తిరిగి వస్తాననే విషయంలో మ్యాక్స్‌వెల్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతానికి అతని స్థానంలో ఆస్ట్రేలియా జట్టులో డి ఆర్సీ షార్ట్‌ను ఎంపిక చేశారు. మనసంతా కలతే..! మార్కస్ ట్రెస్కోథెక్, ఫ్లింటాఫ్, టెయిట్, హోగార్డ్, ట్రాట్, హార్మిసన్, మాడిసన్, హేల్స్, సారా టేలర్... ఒకరా, ఇద్దరా ఈ జాబితా చాలా పెద్దదే! ఎక్కడో ఒక చోట మ్యాచ్ లేదా సిరీస్ ఆడుతుంటారు. అకస్మాత్తుగా మనసులో ఏదో తెలియని నైరాశ్యం అలముకుంటుంది. ఆడింది చాలు, ఇక నా వల్ల కాదు అంటూ అకస్మాత్తుగా ఇంటికి వెళ్లిపోయేందుకు లేదా ఆటకు దూరమయ్యేందుకు సిద్ధపడిపోతారు. ఆ సమయంలో వారికి ఆటగాడిగా తమ ఘనతలు, కీర్తి కనకాదులు ఏవీ గుర్తుకు రావు. పైన చెప్పిన క్రికెటర్లంతా ఏదో ఒక దశలో మానసిక సమస్యలతో బాధపడినవారే. వీరిలో కొందరు విరామం తర్వాత మళ్లీ కోలుకొని బరిలోకి దిగితే... మరికొందరు ఆట ముగించారు. ఇదే సమస్యతో దాదాపు నెల రోజుల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన మహిళా క్రికెటర్ సారా టేలర్ వయసు 30 ఏళ్లే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. యాదృచ్ఛికమో, మరే కారణమో గానీ వీరిలో ఎ క్కువ మంది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లే ఉన్నారు. ఆసీస్ కీలక ఆటగాడైన మ్యాక్స్‌వెల్ తాజా నిర్ణయంతో ఈ ‘మానసిక ఆందోళన’ సమస్య మళ్లీ చర్చను రేకెత్తిస్తోంది. డబ్బుకు లోటుండదు, ఎక్కడకు వెళ్లినా దేవుడి స్థాయిలో నీరాజనాలు లభిస్తాయి. అలాంటి క్రికెటర్లకు కూడా మానసిక సమస్యలు, ఒత్తిడి ఉంటాయా అనేది సగటు అభిమానికి సహజంగానే వచ్చే సందేహం. అయితే సాధారణ రోగాలను, గాయాలను ఏదో ఒక పరీక్ష ద్వారా గుర్తించే తరహాలో మానసిక ఆందోళనను కొలిచే పరికరాలు లేవు. ఇది సదరు వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అంతర్జాతీయ క్రికెటర్ కెరీర్ తీవ్ర ఒత్తిడితో కూడుకున్నదనేది వాస్తవం. సుదీర్ఘ కాలం దేశవాళీలో రాణించిన తర్వాత వచ్చే అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తూ విఫలమైతే ఇక ఆట ముగిసిపోతుందనే ఆందోళన కూడా సహజం. ఎంతగా రాణించినా ఇంకా బాగా ఆడాలనే ఒత్తిడి, వారిపై అంచనాలు ఉంటాయి. ఎంత వద్దనుకున్నా కొన్ని సందర్భాల్లో వాణిజ్యపరమైన అంశాలు కూడా ఆటగాళ్లను నడిపిస్తాయి. క్రికెటర్లు జట్టులో స్థిరపడిన తర్వాత కూడా ఇలాంటి మానసిక సమస్యలు ఎదుర్కొన్నారు. మ్యాక్స్‌వెల్ విషయంలో ఇలాంటి ఒత్తిడే పెరిగింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో తన స్థాయికి తగినట్లుగా ఆడలేకపోతున్నానని, ఎంత బాగా ఆడినా టెస్టు జట్టులో స్థానం కోసం తనను పరిగణనలోకి తీసుకోవడం లేదనే నైరాశ్యం అతనిలో ఇటీవల బాగా కనిపించిందని మ్యాక్సీ సన్నిహితులు వెల్లడించారు. టెస్టు జట్టులో స్థానం కోసమే 2019 ఐపీఎల్‌నుంచి తప్పుకొని దేశవాళీ క్రికెట్లో పడిన శ్రమను వారు గుర్తు చేశారు. ప్రస్తుత తరంలో చాలా మంది క్రికెటర్లు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. వీరిలో కొందరు దీనిని సమర్థంగా ఎదుర్కొంటే, మరికొందరు ఒకసారి బయటపడితే తమ కెరీర్‌పై ఆ ముద్ర ప్రభావం చూపిస్తుందని, కెరీర్ ముగుస్తుందని భయపడుతుంటారని వారు అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో బోర్డునుంచి ఈ తరహా అంశాల్లో సహకారం లభిస్తుంది కాబట్టి వారే స్వేచ్ఛగా బయటపడతారనేది ఒక విశ్లేషణ. 110 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్ 32.32 సగటు, 123.37 స్ట్రైక్‌రేట్‌తో 2877 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 61 అంతర్జాతీయ టి20ల్లో 35.02 సగటుతో 1576 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్‌రేట్ ఏకంగా 160 ఉండటం విశేషం. ఈ రెండు ఫార్మాట్లలో కలిపి మ్యాక్స్‌వెల్ 76 వికెట్లు తీశాడు. అతను 7 టెస్టులు కూడా ఆడినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. -
ట్యాంపరింగ్‌కు యత్నించిన ఆసీస్ ప్లేయర్!
కేప్‌టౌన్ : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో మరో వివాదానికి తెరలేచింది. ఇప్పటికే రబడ-స్మిత్, వార్నర్-డికాక్‌ల మధ్య స్లెడ్జింగ్ శృతి మించడంతో ఐసీసీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు బెన్ క్రాప్ట్ మైదానంలో ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. ఆట మధ్యలో ప్యాంట్లో పసుపు రంగు వస్తువును దాచడం కెమెరాల్లో స్పష్టం అయింది. అతను బాల్ ట్యాంపరింగ్ యత్నించాడని ఫీల్డ్ అంపైర్లకు ఫిర్యాదు రావడంతో ఆట మధ్యలోనే అతన్ని పిలిచి వివరణ కోరగా ఏమి లేదని బంతిని తుడిచే నల్లటి వస్త్రం అని చూపించాడు. దీనికి సంతృప్తి చెందిన అంపైర్లు ఆటను కొనసాగించారు. అయితే తొలుత కెమెరాల్లో కనిపించిన వస్తువు.. తీరా అంపైర్ల చూపించినది వేరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం బెన్ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. రివర్స్ స్వింగ్ కోసం ఆసీస్ ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ యత్నించారని, సఫారీ బ్యాట్స్‌మెన్‌పై పైచేయి సాధించాలని ఇలా అడ్డదార్లు తొక్కారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
ట్యాంపరింగ్‌కు యత్నించిన ఆసీస్ ప్లేయర్!
-
క్రికెట్లో అత్యంత అరుదైన పెనాల్టీ!
సాక్షి, స్పోర్ట్స్ : మైదానంలో కీపర్ ఉపయోగించని హెల్మెట్‌కు బంతి తగిలితే, ఫీల్డింగ్ చేస్తూ బంతి చేతులో లేకుండానే బ్యాట్స్‌మెన్‌ను కంగారు పెడితే విధించే పెనాల్టీలు చూశాం.. కానీ ఆస్ట్రేలియా దేశవాళి మ్యాచుల్లో విధించిన ఓ పెనాల్టీని ఇప్పటి వరకు ఎవరూ చూసుండరు.! ఆస్ట్రేలియా క్రికెటర్ రెయిన్ షా సరదాగా చేసిన ఓ పని ఐదు పరుగుల పెనాల్టీకి కారణమైంది. ఆసీస్ దేశవాళి జట్లైన క్విన్స్‌లాండ్స్- వెస్టెర్న్ ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. క్విన్స్‌లాండ్స్ తరఫున రెయిన్ షా ఆడుతుండగా.. మ్యాచ్ మధ్యలో కీపర్ జిమ్మి పీయర్సన్ గ్లోవ్స్ పక్కన పడేసి బంతికోసం పరుగెత్తాడు. అయితే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రెయిన్ షా ఆ బంతిని అందుకోడానికి స్టంప్స్ వైపు వస్తూ కీపర్ గ్లోవ్స్ పెట్టుకోని అందుకున్నాడు. ఇది క్రికెట్ నిబంధనలకు విరుద్దం కావడంతో అంపైర్ వెంటనే ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు. దీంతో క్విన్స్‌లాండ్ ఆటగాళ్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే అంపైర్ ‘క్రికెట్ రూల్ 27.1 ప్రకారం కేవలం వికెట్ కీపర్ మాత్రమే గ్లోవ్స్ ధరించి ఫీల్డింగ్ చేయాలి. ఇతరులకు అనుమతి లేదని వివరించారు.’ దీంతో రెయిన్ షా చేసిన తీట పనికి ప్రత్యర్థి జట్టుకు అనవసరంగా ఐదు పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ క్విన్స్ లాండ్స్ గెలుపొందడంతో రెయిన్ షాకు ఊరట లభించనట్లైంది. ఇక యాషెస్ సిరీస్ అనంతరం ఫామ్ కోల్పోయిన రెయిన్ షా ఆస్ట్రేలియా జట్టులో స్థానంలో కోల్పోయాడు. దీంతో తిరిగి దేశవాళి మ్యాచ్‌లు ఆడుతున్నాడు. భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ జట్టులో ఓపెనర్‌గా రెయిన్ షా రాణించిన విషయం తెలిసిందే. -
సరదాగా చేసిన ఓ పనికి ఐదు పరుగుల పెనాల్టీ
-
రెండున్నర గంటల్లో 4.5 కేజీలు తగ్గిన క్రికెటర్
సాక్షి, హైదరాబాద్: భారీ కాయస్తులు బరువు తగ్గడానికి చేయని ప్రయత్నం ఉండదు. నెలల తరబడి శిక్షణ తీసుకుంటూ ఉంటారు. టీవీల్ల వచ్చే ప్రకటనలను అనుసరిస్తారు. జిమ్‌లకు వెళ్తారు, ఎక్సర్సైజ్లు చేస్తారు. గ్రౌండ్లో పరుగులు తీస్తారు. అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ ఓ క్రికెటర్ మాత్రం ఒక్కరోజులోనే ఏకంగా 4.5 కేజీల బరువు తగ్గాడు. వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ పీటర్ హ్యాండ్స్కంబ్ చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో రెండో రోజు బ్యాటింగ్ చేశాడు. రెండున్నర గంట క్రీజులో ఉన్న పీటర్ 113 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఆరోజు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఆటగాళ్లు గ్రౌండ్లో చెమట చిందించారు. అలాగే ఈ రెండున్నర గంటల్లో ఏకంగా 4.5 కేజీల బరువు తగ్గాడు. దీంతో ఇతర ఆటగాళ్లు పీటర్ మీద జోకులు పేలుస్తున్నారు. -
ఎవరెస్ట్‌పైకి హ్యూస్ బ్యాట్
మెల్బోర్న్: మైదానంలో బంతి తగిలి మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్కు నేపాల్ క్రికెట్ సంఘం (సీఏఎన్) ఘనంగా నివాళి అర్పించనుంది. హ్యూస్ ఆడిన ఏదైనా ఒక బ్యాట్, అతని క్రికెట్ దుస్తులను తమకు ఇస్తే వాటిని ఎవరెస్ట్ శిఖరంపైకి చేరుస్తామని సీఏఎన్... ఆస్ట్రేలియా బోర్డు (సీఏ)కు లేఖ రాసింది. దీనికి సీఏ స్పందించింది. మార్చి-ఏప్రిల్ నెలలో ఎవరెస్ట్ ఎక్కే సీజన్ సమయానికి సీఏ అధికారులు హ్యూస్ బ్యాట్‌ను నేపాల్‌కు పంపుతారు. కామెంటేటర్‌గా ఆకట్టుకున్న క్లార్క్ గాయం కారణంగా క్రికెట్ కెరీర్ సందేహంలో పడినా... ఆస్ట్రేలియా స్టార్ మైకేల్ క్లార్క్ కొత్త కెరీర్లో నిలదొక్కుకోవచ్చు. భారత్, ఆస్ట్రేలియాల మూడో టెస్టు తొలి రోజున కామెంటేటర్ అవతారం ఎత్తిన క్లార్క్ ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు షమీ, ఉమేశ్‌లను క్లార్క్ కామెంటరీలో ప్రశంసించాడు. -
మైదానంలోనే తుది శ్వాస...
గుండెపోటుతో ముంబైలో క్రికెటర్ మృతి ముంబై: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ దుర్మరణం సంఘటన ఇంకా మదిలో మెదులుతుండగానే... మరో యువ క్రికెటర్ మైదానంలో తుది శ్వాస విడిచాడు. ఈ సంఘటన ముంబైలోని ఓవల్ మైదాన్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. టాటా గ్రూప్ ఆధ్వరంలో జరిగిన ఇంటర్ ఆఫీస్ టోర్నీ సందర్భంగా ఈ దుస్సంఘటన చోటు చేసుకుంది. పవర్ ట్రాంబే స్టేషన్ జట్టుకు చెందిన 29 ఏళ్ల రత్నాకర్ మోరె వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా గుండెలో నొప్పి రావడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. నిర్వాహకులు అప్పటికప్పుడు రత్నాకర్‌ను ఆసుపత్రికి తరలించగా... అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రత్నాకర్ మృతితో టోర్నమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు టాటా స్పోర్ట్స్ క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షించే భారత జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ తెలిపారు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) గుర్తింపు పొందిన ఈ టోర్నీని టాటా పవర్ కంపెనీ గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తోంది. -
ఒమర్ ఫిలిప్స్ క్షేమం
బంతి తగిలి స్పృహ కోల్పోయిన విండీస్ క్రికెటర్ కింగ్స్టౌన్: క్రికెట్ బంతులకు ప్రాణాలు వదిలిన ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్, ఇజ్రాయెల్ అంపైర్ ఉదంతాలు మరువకముందే మరోసారి దాదాపు అలాంటి సంఘటనే జరిగింది. వెస్టిండీస్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ సందర్భంగా బార్బడోస్ బ్యాట్స్‌మన్ ఒమర్ ఫిలిప్స్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. శుక్రవారం విండ్‌వార్డ్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా నాన్‌స్ట్రయికర్‌గా ఉన్న ఫిలిప్స్ తమ బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ షాట్‌ను తప్పించుకునే క్రమంలో బంతి తల వెనుక భాగంలో బలంగా తాకింది. వెంటనే స్పృహ కోల్పోయిన ఫిలిప్స్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి సీటీ స్కాన్ తీయించారు. అయితే ఇందులో ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. ఫిలిప్స్ వెస్టిండీస్ తరఫున రెండు టెస్టులు ఆడాడు.