గ్లోవ్స్‌తో క్యాచ్ అందుకున్న రెయిన్ షా (సర్కిల్‌లో)
సాక్షి, స్పోర్ట్స్ : మైదానంలో కీపర్ ఉపయోగించని హెల్మెట్‌కు బంతి తగిలితే, ఫీల్డింగ్ చేస్తూ బంతి చేతులో లేకుండానే బ్యాట్స్‌మెన్‌ను కంగారు పెడితే విధించే పెనాల్టీలు చూశాం.. కానీ ఆస్ట్రేలియా దేశవాళి మ్యాచుల్లో విధించిన ఓ పెనాల్టీని ఇప్పటి వరకు ఎవరూ చూసుండరు.! ఆస్ట్రేలియా క్రికెటర్ రెయిన్ షా సరదాగా చేసిన ఓ పని ఐదు పరుగుల పెనాల్టీకి కారణమైంది. ఆసీస్ దేశవాళి జట్లైన క్విన్స్‌లాండ్స్- వెస్టెర్న్ ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
క్విన్స్‌లాండ్స్ తరఫున రెయిన్ షా ఆడుతుండగా.. మ్యాచ్ మధ్యలో కీపర్ జిమ్మి పీయర్సన్ గ్లోవ్స్ పక్కన పడేసి బంతికోసం పరుగెత్తాడు. అయితే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రెయిన్ షా ఆ బంతిని అందుకోడానికి స్టంప్స్ వైపు వస్తూ కీపర్ గ్లోవ్స్ పెట్టుకోని అందుకున్నాడు. ఇది క్రికెట్ నిబంధనలకు విరుద్దం కావడంతో అంపైర్ వెంటనే ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు. దీంతో క్విన్స్‌లాండ్ ఆటగాళ్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే అంపైర్ ‘క్రికెట్ రూల్ 27.1 ప్రకారం కేవలం వికెట్ కీపర్ మాత్రమే గ్లోవ్స్ ధరించి ఫీల్డింగ్ చేయాలి. ఇతరులకు అనుమతి లేదని వివరించారు.’ దీంతో రెయిన్ షా చేసిన తీట పనికి ప్రత్యర్థి జట్టుకు అనవసరంగా ఐదు పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ క్విన్స్ లాండ్స్ గెలుపొందడంతో రెయిన్ షాకు ఊరట లభించనట్లైంది.
ఇక యాషెస్ సిరీస్ అనంతరం ఫామ్ కోల్పోయిన రెయిన్ షా ఆస్ట్రేలియా జట్టులో స్థానంలో కోల్పోయాడు. దీంతో తిరిగి దేశవాళి మ్యాచ్‌లు ఆడుతున్నాడు. భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ జట్టులో ఓపెనర్‌గా రెయిన్ షా రాణించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment