Matt Renshaw
-
విండీస్‌తో సిరీస్ కోసం ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే జట్ల ప్రకటన
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్ట్‌లు, మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. వార్నర్ టెస్ట్‌ల నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో మ్యాట్ రెన్షాను ఎంపిక చేశారు ఆసీస్ సెలెక్టర్లు. వార్నర్ రిటైర్మెంట్ అనంతరం టెస్ట్‌ల్లో ఓపెనింగ్ అవకాశాలపై గంపెడాశలు పెట్టుకున్న కెమరూన్ బాన్‌క్రాఫ్ట్, మార్కస్ హ్యారిస్లకు నిరాశ తప్పలేదు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ తిరిగి జట్టులో చోటు సంపాదించగలిగాడు. మిచెల్ మార్ష్ ఆగమనంతో సరైన అవకాశాలు దక్కని గ్రీన్‌పై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. విండీస్‌తో తొలి టెస్ట్‌కు మ్యాట్ రెన్షా, స్కాట్ బోలాండ్ తుది జట్టులో ఉంటారని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ సూచనప్రాయంగా చెప్పాడు. టెస్ట్ సిరీస్ అనంతరం ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా జట్టును ఎంపిక చేశారు ఆసీస్ సెలెక్టర్లు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించారు. వన్డే సిరీస్‌కు కమిన్స్‌తో పాటు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లకు విశ్రాంతినిచ్చారు. విండీస్ ఈ పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్‌లతో పాటు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. ఇందు కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించాల్సి ఉంది. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, మాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జై రిచర్డ్సన్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్.. తొలి టెస్ట్: జనవరి 17-21 (అడిలైడ్) రెండో టెస్ట్: జనవరి 25-29 (బ్రిస్బేన్) తొలి వన్డే: ఫిబ్రవరి 2 (మెల్బోర్న్) రెండో వన్డే: ఫిబ్రవరి 4 (సిడ్నీ) మూడో వన్డే: ఫిబ్రవరి 6 (కాన్బెర్రా) తొలి టీ20: ఫిబ్రవరి 9 (హోబర్ట్) రెండో టీ20: ఫిబ్రవరి 11 (అడిలైడ్) మూడో టీ20: ఫిబ్రవరి 13 (పెర్త్) -
AUS vs PAK: సిక్స్ కొట్టకుండా ఒకే బంతికి 7 పరుగులు.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టు.. కాన్బెర్రా వేదికగా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడతోంది. అయితే ఈ వార్మప్ మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్స్ తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట సందర్బంగా విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. కేవలం ఒక్క బంతికే చెత్త ఫీల్డింగ్ కారణంగా పాకిస్తాన్ జట్టు ప్రత్యర్ధికి ఏడు పరుగులు సమర్పించుకుంది. ఏమి జరిగిదంటే? ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన ఆఫ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో చివరి బంతికి రెన్షా కవర్స్ దిశగా షాట్ ఆడాడు. అయితే పాక్ ఫీల్డర్ మీర్ హమ్జా పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ బంతిని అద్బుతంగా ఆపాడు. ఈ క్రమంలో ప్రైమ్ మినిస్టర్స్ బ్యాటర్లు మూడు పరుగులను పూర్తి చేశారు. అయితే నాన్‌స్ట్రైక్‌లో ఎండ్‌లో బంతి అందుకున్న బాబర్ ఆజం.. అవసరం లేకుండా కీపర్ వైపు బలంగా త్రో చేశాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్‌తో పాటు ఫస్ట్‌స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ కూడా బంతిని ఆపలేకపోయారు. దీంతో బంతి బౌండరీకీ వెళ్లడంతో రెన్షా ఖతాలో ఏడు పరుగులు చేరాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పాకిస్తాన్‌తో అట్లుటంది మరి అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాక్ తలపడనుంది. డిసెంబర్ 14న పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. చదవండి: LLC 2023: గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు You don't see this every day! Matthew Renshaw brings up his half-century ... with a seven! #PMXIvPAK pic.twitter.com/0Fx1Va00ZE — cricket.com.au (@cricketcomau) December 8, 2023 -
WTC Final: ఆసీస్ జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్.. మరి టీమిండియాలో?!
WTC Final 2021-2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ ఫైనల్ జట్టును ప్రకటించింది. తొలుత 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన బోర్డు.. తాజాగా ఐసీసీకి సమర్పించిన వివరాల్లో 15 మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. కాగా తొలుత ప్రకటించిన జట్టులో ఉన్న మిచెల్ మార్ష్, మ్యాట్ రెన్షా మాత్రం తాజాగా టీమ్‌లో చోటు కోల్పోయారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనలకు అనుగుణంగా బోర్డు ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. ఇక ఐపీఎల్-2023లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన పేసర్ జోష్ హాజిల్‌వుడ్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ జట్టులో కొనసాగనున్నారు. వారిద్దరు అవుట్.. వార్నర్‌కు కోచ్ మద్దతు మార్ష్, రెన్షాలకు మాత్రం నిరాశ తప్పలేదు. వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అండగా నిలవడంతో ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఆడేందుకు అతడికి మార్గం సుగమమైంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు, యాషెస్ సిరీస్‌లోనూ వార్నర్ కీలక పాత్ర పోషించగలడంటూ మెక్‌డొనాల్డ్ అతడికి మద్దతుగా నిలవడం గమనార్హం. కాగా జూన్ 7-11 వరకు ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. జూన్ 12 రిజర్వ్ డేగా నిర్ణయించారు. ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే కొంతమంది టీమిండియా ఆటగాళ్లు లండన్‌కు చేరుకున్నారు. ప్రాక్టీసు కూడా మొదలుపెట్టేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్-2023 ఆస్ట్రేలియా తాజా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్. కాగా భారత ప్రధాన జట్టులో మాత్రం ఎటువంటి మార్పులు లేనట్లు తెలుస్తోంది. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్. చదవండి: WTC Final 2023: రోహిత్ శర్మతో కలిసి లండన్‌కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్ Get your friends, form a circle and replicate this fun drill! 😉😀😀🏏#TeamIndia pic.twitter.com/X6iOuXPrhY — BCCI (@BCCI) May 26, 2023 -
ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్.. కీలక ఆటగాడికి గాయం! ఆసుపత్రికి తరలింపు
నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆటకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఆటగాడు మాట్ రెన్ షా గాయపడ్డాడు. రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు వార్మప్ చేస్తుండగా అతడి మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో రెన్ షా రెండో రోజు ఫీల్డింగ్‌కు రాలేదు. అతడి స్థానంలో సబ్‌స్ట్యూట్ ఫీల్డర్‌గా ఆగర్ మైదానంలో అడుగుపెట్టాడు. కాగా గాయపడిన రెన్ షాను స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించనట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు మిగితా మూడు టెస్టులకు అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వెంటాడుతున్న సంగతి తెలిసిందే. స్టార్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలో మరో ఆటగాడు గాయం బారిన పడటం ఆసీస్‌కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. చదవండి: IND vs AUS: నీ కంటే గిల్ వంద రెట్లు బెటర్.. మరి నీవు మారవా రాహుల్? -
నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి ఫోర్ కొట్టి గెలిపించాడు
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఇవాళ (జనవరి 16) ఓ రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ ఆఖరి బంతికి విజయం సాధించింది. బ్రిస్బేన్ బ్యాటర్ మ్యాట్ రెన్షా (56 బంతుల్లో 90 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ, ఆఖరి బంతిని బౌండరీగా తరలించి తన జట్టును గెలిపించాడు. బ్రిస్బేన్ గెలవాలంటే చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా, రెన్షా అద్భుతమైన స్కూప్ షాట్ ఆడి తన జట్టుకు అపురూపమైన విజయాన్ని అందించాడు. Matt Renshaw scoops for four to win the game off the last ball 😮 Talk about holding your nerve!#BBL12 pic.twitter.com/l4GamZxqK4 — Wisden (@WisdenCricket) January 16, 2023 ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బ్రిస్బేన్.. మైఖేల్ నెసర్ (4/25), స్పెన్సర్ జాన్సన్ (1/41), బాజ్లీ (1/35), రెన్షా (1/5) రాణించడంతో మెల్బోర్న్ హీట్‌ను 159 పరుగులకు (7 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో నిక్ లార్కిన్ (58) అర్ధసెంచరీతో రాణించగా.. థామస్ రోజర్స్ (26), వెబ్‌స్టర్ (36) పర్వాలేదనిపించారు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రిస్బేన్‌ను రెన్షా ఒంటి చేత్తో గెలిపించాడు. బిస్బేన్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఉస్మాన్ ఖ్వాజా (14), జిమ్మీ పియర్సన్ (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేసినప్పటికీ.. రెన్షా ఆఖరి బంతి వరకు పట్టువదలకుండా క్రీజ్‌లో ఉండి తన జట్టును గెలిపించాడు. మెల్బోర్న్ బౌలర్లలో లియామ్ హ్యాచర్, ఆడమ్ జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. నాథన్ కౌల్టర్ నైల్, క్లింట్ హింక్లిఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ!
ఆస్ట్రేలియా ఆటగాడు మాట్ రెన్ షా రాయల్ లండన్ వన్డే కప్‌లో సోమర్ సెట్ తరపున ప్రాతినిద్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం సర్రేతో జరిగిన మ్యాచ్‌లో రెన్ షా సంచలన క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. సర్రే ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన ఆల్డ్రిడ్జ్ బౌలింగ్‌లో.. బ్యాటర్ ర్యాన్ పటేల్ ఢిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో సెకెండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రెన్ షా డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో బ్యాటర్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురియ్యారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సర్రే 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన సర్రే నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. సర్రే బ్యాటర్లు నికో రైఫర్(70),షెరిడాన్ గంబ్స్(66) పరుగులతో రాణించారు. అనంతరం 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్సెట్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ నిలిపోయే సమయానికి సోమర్సెట్12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. అయితే ఎప్పటికీ వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సర్రేను విజేతగా నిర్ణయించారు. One of the greatest catches you will see in a long time... LIVE STREAM ➡️ https://t.co/dF6GhNA901 #SURvSOM#WeAreSomerset https://t.co/hEzrqhCsx8 pic.twitter.com/cIGNGmLhhX — Somerset Cricket 🏏 (@SomersetCCC) August 17, 2022 చదవండి: IND vs ZIM ODI Series: సిరాజ్ గొప్ప బౌలర్.. అతడి బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు సాధిస్తే: జింబాబ్వే బ్యాటర్ -
‘నాకు చిర్రెత్తుకొచ్చి.. ఆసీస్‌ను సవాల్ చేశా’
న్యూఢిల్లీ: దాదాపు మూడేళ్ల క్రితం జరిగిన ఘటనను టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. భారత్ పర్యటనకు ఆస్ట్రేలియా వచ్చిన క్రమంలో ఆ దేశ ఆటగాడు మ్యాట్ రెన్షాతో జరిగిన స్లెడ్జింగ్‌ను నెమరువేసుకున్నాడు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో రెన్ షా తనను రెచ్చగొట్టాడని, దానికి ప్రతిగా సమాధానం చెప్పి తన పంతం నెగ్గించుకున్నానని అశ్విన్ తెలిపాడు. ‘ ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆ మ్యాచ్ తొలి అంచె అంతా ఆసీస్‌దే పైచేయి అయ్యింది. కానీ తర్వాత మేము పుంజుకుని ఆసీస్‌ను కంగుతినిపించాం. ఈ క్రమంలోనే రెన్ షాతో తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదంలో రెన్ షాకు సవాల్ విసిరాను. అందుకు కారణం ఉంది. రెన్ షా నన్ను రెచ్చగొట్టాడు. మేమే టాప్‌లో ఉన్నామంటూ నోటికి పని చెప్పే యత్నం చేశాడు. దాంతో నాకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. (అతనొక మూర్చ రోగి: పీసీబీ మాజీ చైర్మన్) అప్పటికి నేను వికెట్లు సాధించకపోవడంతో కోపం డబుల్ అయ్యింది. రెన్ షాకు సమాధానం ఇస్తూ.. ఇక పరుగులు చేయడం ఆపేస్తే మంచిది అన్నాను. మీరు పైచేయిగా ఉన్నప్పుడు పరుగులు చేయాల్సిన అవసరం ఏమిటి అని అడిగా. రెండో ఇన్నింగ్స్‌లో మీకు చుక్కలు చూపిస్తా అన్నా. తొలి ఇన్నింగ్స్‌లో మీరు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయకపోతే.. రెండో ఇన్నింగ్స్‌లో వంద పరుగులు కూడా చేయనివ్వం అని చాలెంజ్ చేశా. ఒకవైపు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయాన్ చెలరేగుతుంటే, నాకు వికెట్లు దక్కలేదు. దాంతో నాలో అసహనం ఎక్కువైంది. ఆ సమయంలో ప్రధాన కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే నాకు కొన్ని సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అనిల్ భాయ్‌తో ఒక విషయం చెప్పా. ఓపిక పడదాం.. ఏమీ కాదు.. బంతి స్పిన్ కావడానికి సమయం పట్టొచ్చు అన్నాను. కుంబ్లే కూడా నాతో ఏకీభవించాడు. నేను ఎటువంటి ఒత్తిడి తీసుకురావడం లేదని చెప్పారు. దాంతో నాపై ఎటువంటి ఒత్తిడి పడకపోవడంతో స్వేచ్ఛగా బంతులు వేసి ఆసీస్‌ను సత్తాచూపెట్టా. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించి ఆసీస్ నడ్డివిరిచా’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. (గేల్.. ఇక నీ కామెంట్స్ చాలు..!) ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచి రేసులో నిలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌటైతే, ఆసీస్ 276 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 274 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆసీస్‌కు 188 పరుగుల టార్గెట్‌ను మాత్రమే మనోళ్లు నిర్దేశించారు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్‌ను 112 పరుగులకు కుప్పకూలింది. దాంతో టీమిండియా 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు. ఆ నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది. తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించగా, రెండో టెస్టులో భారత్ గెలిచాయి. మూడో టెస్టు డ్రా కాగా, నాల్గో టెస్టులో భారత్‌నే విజయం వరించింది. (రాస్ టేలర్‌కు ‘టాప్’ అవార్డు) -
క్రికెట్లో అత్యంత అరుదైన పెనాల్టీ!
సాక్షి, స్పోర్ట్స్ : మైదానంలో కీపర్ ఉపయోగించని హెల్మెట్‌కు బంతి తగిలితే, ఫీల్డింగ్ చేస్తూ బంతి చేతులో లేకుండానే బ్యాట్స్‌మెన్‌ను కంగారు పెడితే విధించే పెనాల్టీలు చూశాం.. కానీ ఆస్ట్రేలియా దేశవాళి మ్యాచుల్లో విధించిన ఓ పెనాల్టీని ఇప్పటి వరకు ఎవరూ చూసుండరు.! ఆస్ట్రేలియా క్రికెటర్ రెయిన్ షా సరదాగా చేసిన ఓ పని ఐదు పరుగుల పెనాల్టీకి కారణమైంది. ఆసీస్ దేశవాళి జట్లైన క్విన్స్‌లాండ్స్- వెస్టెర్న్ ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. క్విన్స్‌లాండ్స్ తరఫున రెయిన్ షా ఆడుతుండగా.. మ్యాచ్ మధ్యలో కీపర్ జిమ్మి పీయర్సన్ గ్లోవ్స్ పక్కన పడేసి బంతికోసం పరుగెత్తాడు. అయితే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రెయిన్ షా ఆ బంతిని అందుకోడానికి స్టంప్స్ వైపు వస్తూ కీపర్ గ్లోవ్స్ పెట్టుకోని అందుకున్నాడు. ఇది క్రికెట్ నిబంధనలకు విరుద్దం కావడంతో అంపైర్ వెంటనే ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు. దీంతో క్విన్స్‌లాండ్ ఆటగాళ్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే అంపైర్ ‘క్రికెట్ రూల్ 27.1 ప్రకారం కేవలం వికెట్ కీపర్ మాత్రమే గ్లోవ్స్ ధరించి ఫీల్డింగ్ చేయాలి. ఇతరులకు అనుమతి లేదని వివరించారు.’ దీంతో రెయిన్ షా చేసిన తీట పనికి ప్రత్యర్థి జట్టుకు అనవసరంగా ఐదు పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ క్విన్స్ లాండ్స్ గెలుపొందడంతో రెయిన్ షాకు ఊరట లభించనట్లైంది. ఇక యాషెస్ సిరీస్ అనంతరం ఫామ్ కోల్పోయిన రెయిన్ షా ఆస్ట్రేలియా జట్టులో స్థానంలో కోల్పోయాడు. దీంతో తిరిగి దేశవాళి మ్యాచ్‌లు ఆడుతున్నాడు. భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ జట్టులో ఓపెనర్‌గా రెయిన్ షా రాణించిన విషయం తెలిసిందే. -
సరదాగా చేసిన ఓ పనికి ఐదు పరుగుల పెనాల్టీ
-
వార్నర్ వీర విజృంభణ
తొలి సెషన్లోనే 78 బంతుల్లో సెంచరీ రెన్షా తొలి శతకం ఆస్ట్రేలియా 365/3 సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన మెరుపు బ్యాటింగ్ (95 బంతుల్లో 113; 17 ఫోర్లు)తో పాకిస్తాన్‌పై దాడి చేశాడు. పాక్ బౌలర్లను చితక్కొడుతూ మూడో టెస్టులో సూపర్ సెంచరీ సాధించిన అతను... టెస్టు మ్యాచ్ తొలి రోజు లంచ్ విరామానికి ముందే శతకం పూర్తి చేసుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. గతంలో ట్రంపర్, మకార్ట్నీ, బ్రాడ్‌మన్, మజీద్ ఖాన్ మాత్రమే మొదటి సెషన్లో సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత వార్నర్ దానిని చేసి చూపించాడు. కొత్త సంవత్సరంలో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లో 78 బంతుల్లోనే అతని సెంచరీ పూర్తయింది. వార్నర్ కెరీర్లో ఇది 18వ సెంచరీ కావడం విశేషం. మెల్బోర్న్ టెస్టులోనూ సెంచరీ చేసిన వార్నర్‌కు సిరీస్‌లో ఇది రెండో శతకం. వార్నర్ దూకుడుకు తోడుగా మరో ఎండ్‌లో మాట్ రెన్షా (275 బంతుల్లో 167 బ్యాటింగ్; 18 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్‌తో కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా మొదటి రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. ఖాజా (13), స్మిత్ (24) విఫలం కాగా, రెన్షాతో పాటు ప్రస్తుతం హ్యండ్స్‌కోంబ్ (82 బంతుల్లో 40 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 121 పరుగులు జోడించారు. వహాబ్‌కు 2 వికెట్లు దక్కాయి. (ఇక్కడ చదవండి: 40 ఏళ్లలో తొలిసారిగా ఓ క్రికెటర్..!) తిరుగులేని బ్యాటింగ్... తొలి ఓవర్ మూడో బంతికి బౌండరీతో మొదలైన వార్నర్ విధ్వంసం 32.3 ఓవర్ల పాటు సాగింది. ఇమ్రాన్, ఆమిర్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన అతను, ఆ తర్వాత ఇమ్రాన్ మరో ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. 42 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా అతను ఎక్కడా తగ్గలేదు. వహాబ్ వేసిన 27వ ఓవర్ రెండో బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడి మూడు పరుగులు తీయడంతో వార్నర్ సెంచరీ పూర్తయింది. గాల్లోకి ఎగిరి తనదైన శైలిలో అతను సంబరాలు చేసుకున్నాడు. ఈ సమయంలో మరో ఎండ్‌లో ఉన్న రెన్షా స్కోరు 21 పరుగులే అంటే వార్నర్ బీభత్సం ఎలా సాగిందో అర్థమవుతుంది. లంచ్ తర్వాత కొద్దిసేపటికి వహాబ్ బౌలింగ్‌లోనే కీపర్ సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ నిష్క్రమించాడు. తొలి వికెట్‌కు వార్నర్, రెన్షా 151 పరుగులు జత చేశారు. ఆమిర్ బౌలింగ్‌లో తల బంతికి తగలడంతో మైదానంలోనే కొద్దిసేపు చికిత్స చేయించుకున్న రెన్షా, ఆ తర్వాత 201 బంతుల్లో కెరీర్లో తొలి శతకం అందుకున్నాడు. సిడ్నీ మైదానంలో ఇద్దరు ఆస్ట్రేలియా ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేయడం 2002 తర్వాత ఇదే తొలిసారి. 2006లో గ్రాస్ ఐలెట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో భారత ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ లంచ్ సమయానికి (25 ఓవర్లు) 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.