
నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆటకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఆటగాడు మాట్ రెన్ షా గాయపడ్డాడు. రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు వార్మప్ చేస్తుండగా అతడి మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో రెన్ షా రెండో రోజు ఫీల్డింగ్‌కు రాలేదు.
అతడి స్థానంలో సబ్‌స్ట్యూట్ ఫీల్డర్‌గా ఆగర్ మైదానంలో అడుగుపెట్టాడు. కాగా గాయపడిన రెన్ షాను స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించనట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు మిగితా మూడు టెస్టులకు అందుబాటుపై సందిగ్ధం నెలకొంది.
ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వెంటాడుతున్న సంగతి తెలిసిందే. స్టార్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలో మరో ఆటగాడు గాయం బారిన పడటం ఆసీస్‌కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి.
చదవండి: IND vs AUS: నీ కంటే గిల్ వంద రెట్లు బెటర్.. మరి నీవు మారవా రాహుల్?