AUS vs PAK: సిక్స్‌ కొట్టకుండా ఒకే బంతికి 7 పరుగులు.. వీడియో వైరల్‌ | Matthew Renshaw Brings Up Fifty With 7 Runs In Single Ball After Shoddy Fielding By Pakistan, Video Goes Viral - Sakshi
Sakshi News home page

AUS vs PAK: సిక్స్‌ కొట్టకుండా ఒకే బంతికి 7 పరుగులు.. వీడియో వైరల్‌

Published Fri, Dec 8 2023 5:56 PM | Last Updated on Fri, Dec 8 2023 6:40 PM

Matthew Renshaw brings up fifty with 7 runs in single ball after shoddy fielding by Pakistan - Sakshi

PC: Twitter

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్‌ జట్టు.. కాన్‌బెర్రా వేదికగా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తలపడతోంది. అయితే ఈ వార్మప్‌ మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్స్ తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట సందర్బంగా విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. కేవలం ఒక్క బంతికే చెత్త ఫీల్డింగ్‌ కారణంగా పాకిస్తాన్‌ జట్టు ప్రత్యర్ధికి ఏడు పరుగులు సమర్పించుకుంది.

ఏమి జరిగిదంటే?
ఇన్నింగ్స్‌ 24 ఓవర్ వేసిన ఆఫ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ బౌలింగ్‌లో చివరి బంతికి రెన్షా కవర్స్ దిశగా షాట్‌ ఆడాడు. అయితే పాక్‌ ఫీల్డర్‌ మీర్ హమ్జా పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్‌ చేస్తూ బంతిని అద్బుతంగా ఆపాడు. ఈ క్రమంలో ప్రైమ్ మినిస్టర్స్ బ్యాటర్లు మూడు పరుగులను పూర్తి చేశారు. అయితే నాన్‌స్ట్రైక్‌లో ఎండ్‌లో బంతి అందుకున్న బాబర్‌ ఆజం.. అవసరం లేకుండా కీపర్‌ వైపు బలంగా త్రో చేశాడు.

ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌తో పాటు ఫస్ట్‌స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌ కూడా బంతిని ఆపలేకపోయారు. దీంతో బంతి బౌండరీకీ వెళ్లడంతో రెన్షా ఖతాలో ఏడు పరుగులు చేరాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు పాకిస్తాన్‌తో అట్లుటంది మరి అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాక్‌ తలపడనుంది. డిసెంబర్‌ 14న పెర్త్‌ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
చదవండి: LLC 2023: గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement