విరాట్‌ కోహ్లిని అధిగమించిన బాబర్‌ ఆజమ్‌ | AUS VS PAK 3rd T20: Babar Azam Surpassed Virat Kohli To Become Second Leading Run Scorer In T20Is | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లిని అధిగమించిన బాబర్‌ ఆజమ్‌

Published Mon, Nov 18 2024 5:13 PM | Last Updated on Mon, Nov 18 2024 7:59 PM

AUS VS PAK 3rd T20: Babar Azam Surpassed Virat Kohli To Become Second Leading Run Scorer In T20Is

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్‌ 18) జరిగిన మూడో టీ20లో బాబర్‌ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 41 పరుగులు చేసిన బాబర్‌.. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ కోహ్లిని అధిగమించాడు. ప్రస్తుతం బాబర్‌ కంటే ముందు రోహిత్‌ శర్మ మాత్రమే ఉన్నాడు.

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-4 ఆటగాళ్లు..
1. రోహిత్‌ శర్మ- 4231 పరుగులు
2. బాబర్‌ ఆజమ్‌- 4192
3. విరాట్‌ కోహ్లి- 4188
4. పాల్‌ స్టిర్లింగ్‌- 3655

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో పాక్‌ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 18.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌ (41) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్‌ బౌలర్లు ఆరోన్‌ హార్డీ మూడు.. ఆడమ్‌ జంపా, స్పెన్సర్‌ జాన్సన్‌ తలో రెండు.. జేవియర్‌ బార్ట్‌లెట్, నాథన్‌ ఇల్లిస్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. మార్కస్‌ స్టోయినిస్‌ (27 బంతుల్లో 61 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో కేవలం 11.2 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో జోస్‌ ఇంగ్లిస్‌ 27, జేక్‌ ఫ్రేజర్‌ 18, టిమ్‌ డేవిడ్‌ 7 (నాటౌట్‌), మాథ్యూ షార్ట్‌ 2 పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది, జహన్‌దాద్‌ ఖాన్‌, అబ్బాస్‌ అఫ్రిదిలకు తలో వికెట్‌ పడగొట్టారు.

ఈ గెలుపుతో ఆసీస్‌ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా ఆస్ట్రేలియానే గెలుపొందింది. టీ20 సిరీస్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌ను పాక్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్‌ ఆస్ట్రేలియాలో పర్యటించింది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement