టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లి.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. బాబర్ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడని కొనియాడాడు. బాబర్ మూడు ఫార్మాట్లలో తిరుగులేని ఆటగాడని ఆకాశానికెత్తాడు. స్టార్ స్పోర్ట్స్‌తో చిట్‌చాట్ సందర్భంగా విరాట్.. బాబర్‌తో తొలి మీటింగ్‌ను గుర్తు చేసుకున్నాడు.
2019 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ అనంతరం బాబర్‌తో తొలిసారి భేటీ అయినట్లు తెలిపాడు. నాటి పాక్ జట్టు సభ్యుడు ఇమాద్ వసీం.. బాబర్‌ను పరిచయం చేసినట్లు చెప్పుకొచ్చాడు. తనకు ఇమాద్‌తో అండర్-19 వరల్డ్‌కప్ సమయం నుంచి పరిచయం ఉన్నట్లు తెలిపాడు. 2019 వరల్డ్‌కప్‌లో పాక్‌తో మ్యాచ్ అనంతరం బాబర్ తనతో మాట్లాడాలని అనుకుంంటున్నట్లు ఇమాద్ చెప్పాడని, ఆ సందర్భంలో తాము ఆట గురించి చాలా సేపు డిస్కస్ చేశామని పేర్కొన్నాడు.
తొలి భేటీలో బాబర్ తనతో చాలా మర్యాదగా వ్యవహరించాడని, నాటి నుంచి అతను అదే మెయింటెయిన్ చేస్తూ వస్తున్నాడని అన్నాడు. బాబర్ తొలి పరిచయంలో తనతో మాట్లాడుతూ.. నా ఆటకు పెద్ద అభిమానినని అన్నాడని, వాస్తవానికి నేను కూడా బాబర్ ఆటకు పెద్ద ఫ్యాన్‌నని విరాట్ చెప్పుకొచ్చాడు. ఫార్మాట్లకతీతంగా బాబర్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అని.. అతను అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నాడని, భవిష్యత్తులో అతను తాను సాధించలేని రికార్డులను సైతం సాధిస్తాడని ఆకాశానిత్తాడు.
కాగా, బాబర్ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతను ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. మిగతా రెండు ఫార్మాట్లలోనూ టాప్-5లో కొనసాగుతున్నాడు. ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా అన్ని ఫార్మాట్లలో టాప్-5లో లేరు. బాబర్ ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్‌గా కొనసాగుతుంటే.. విరాట్ కేవలం వన్డేల్లో మాత్రమే టాప్-10లో (తొమ్మిదో ర్యాంక్) ఉన్నాడు.
ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023లో భాగంగా సెప్టెంబర్ 2న భారత్-పాక్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు శ్రీలంకలోని పల్లెకెలె ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదే టోర్నీలో భారత్, పాక్‌లు సూపర్-4 దశలోనూ తలపడే అవకాశం ఉంది. ఫస్ట్ రౌండ్‌లో టీమిండియా ప్రదర్శనపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇదయ్యాక, ఇదే ఏడాది వన్డే ప్రపంచకప్‌లోనూ భారత్, పాక్‌లు మరోసారి తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న ఈ మ్యాచ్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment