CWC 2023: కోహ్లి-రాహుల్‌, రిజ్వాన్‌-షఫీక్‌.. ఎవరి భాగస్వామ్యం గొప్పది..? | CWC 2023: Which Partnership Is Great, Kohli-Rahul Or Rizwan-Shafique | Sakshi
Sakshi News home page

CWC 2023: కోహ్లి-రాహుల్‌, రిజ్వాన్‌-షఫీక్‌.. ఎవరి భాగస్వామ్యం గొప్పది..?

Published Wed, Oct 11 2023 11:34 AM | Last Updated on Wed, Oct 11 2023 12:59 PM

CWC 2023: Which Partnership Is Great, Is It Virat, Rahul Or Rizwan, Shafique - Sakshi

ప్రస్తుత ప్రపంచకప్‌లో పట్టుమని పది రోజులు కూడా గడవకముందే పలు ఆసక్తికర మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదటిది భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నీలో రెండో ఆసక్తికర మ్యాచ్‌ ఏదంటే.. పాకిస్తాన్‌, శ్రీలంక మధ్య హైదరాబాద్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌ అని చెప్పవచ్చు. 

ఈ మ్యాచ్‌లో పాక్‌ సైతం అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి చారిత్రక విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓ కామన్‌ థింగ్‌ ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌ల్లో విరాట్‌ కోహ్లి-కేఎల్‌ రాహుల్‌.. మొహమ్మద్‌ రిజ్వాన్‌, అబ్దుల్లా షఫీక్‌లు నెలకొల్పిన మ్యాచ్‌ విన్నింగ్‌ భాగస్వామ్యాలపై ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఈ రెండు భాగస్వామ్యాల్లో ఏది గొప్పది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

భారత అభిమానులు సహా యావత్‌ క్రికెట్‌ ప్రపంచం మొత్తం విరాట్‌-రాహుల్‌ పార్ట్‌నర్‌షిప్‌కు ఓటేస్తుంటే, పాక్‌ ఫ్యాన్స్‌ మాత్రం రిజ్వాన్‌-షఫీక్‌ భాగస్వామ్యం గొప్పదని డప్పుకొట్టుకుంటున్నారు. ఇరు భాగస్వామ్యాలపై ఓ లుక్కేస్తే.. ఆసీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ స్వల్ప లక్ష్య ఛేదనలో (200 పరుగులు) 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. విరాట్‌ (85)-రాహుల్‌ (97 నాటౌట్‌) జోడీ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను గెలిపించింది. 

శ్రీలంక-పాకిస్తాన్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. లంక నిర్ధేశించిన 345 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్‌ను రిజ్వాన్‌ (131 నాటౌట్‌)-షఫీక్‌ (113) జోడీ 176 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయతీరాలకు చేర్చింది. ఈ రెండు పార్ట్‌నర్‌షిప్స్‌లో నలుగురు ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో పరుగులు సాధించి, తమతమ జట్లను గెలిపించారు.

రెండు సందర్భాల్లో వారు ఒక్కో పరుగు పేరుస్తూ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు విజయాలకు దోహదపడ్డారు. వాస్తవానికి ఈ రెంటిని ఒకదానితో ఒకటి పోల్చలేని పరిస్థితి. ఇరు భాగస్వామ్యాలు తీవ్రమైన ఒత్తిడిలో నెలకొల్పివనే. దేని ప్రత్యేకత దానికుంది. దీన్ని అంశంగా తీసుకుని డిబేట్లు పెట్టాల్సిన అవసరం లేదు. అయినా ఈ రెంటిలో గొప్ప భాగస్వామ్యం ఏదని చెప్పాల్సి వస్తే మాత్రం మెజార్టీ శాతం అభిప్రాయంతో వెళ్లాల్సి ఉంటుంది.

గత మ్యాచ్‌ల విషయాలను పక్కన పెడితే.. భారత్‌-పాక్‌లు అక్టోబర్‌ 14న అహ్మదా​బాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్న విషయం తెలిసిందే. ఈ హైవోల్టేజీ మ్యాచ్‌ కోసం ​యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రస్తుత టోర్నీలో ఇరు జట్ల ప్రదర్శనను చూసిన తర్వాత ఈ మ్యాచ్‌పై మరింత హైప్‌ పెరిగింది. దీనికి ముందు భారత్‌ ఇవాళ (అక్టోబర్‌ 11) ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. న్యూఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement