Abdullah Shafique
-
హ్యాట్రిక్ డకౌట్స్.. పాక్ ఓపెనర్ చెత్త రికార్డులు
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ దారుణ ప్రదర్శన కొనసాగుతుంది. షఫీక్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో ఏడు సార్లు డకౌట్లు అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో సింగిల్ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక డకౌట్లు అయిన ఓపెనర్ల జాబితాలో షఫీక్ క్రిస్ గేల్, ఉపుల్ తరంగతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక డకౌట్లు అయిన చెత్త రికార్డు హెర్షల్ గిబ్స్ (2002, 8 సార్లు), తిలకరత్నే దిల్షన్ (2012, 8 సార్లు) పేరిట ఉంది.హ్యాట్రిక్ డకౌట్స్సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో అబుల్లా షఫీక్ గోల్డన్ డకౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో షఫీక్ తానెదుర్కొన్న తొలి బంతికే వికెట్ పారేసుకున్నాడు. వన్డేల్లో షఫీక్ ఇది వరుసగా మూడో డకౌట్. సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో కూడా షఫీక్ డకౌటయ్యాడు.చరిత్రలో మొదటి ఓపెనర్‌గా చెత్త రికార్డుతాజా డకౌట్‌తో షఫీక్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ డకౌట్లను నమోదు చేసిన మొదటి ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు. న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్తిల్ కూడా ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ డకౌట్లు నమోదు చేశాడు. అయితే శ్రీలంకతో జరిగిన ఆ సిరీస్ ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్. టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా వన్డేల్లో హ్యాట్రిక్ డకౌట్లు నమోదు చేశాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో స్కై ఈ అపప్రదను మూటగట్టుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా టాస్ అలస్యమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచకుంది. ఇన్నింగ్స్ రెండో బంతికే షఫీక్ ఔటయ్యాడు. 3.1 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 10/1గా ఉంది. ఈ దశలో వర్షం మళ్లీ మొదలుకావడంతో మ్యాచ్‌కు అంతర్జాయం కలిగింది. వర్షం ముగిసిన మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. 4 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 16/1గా ఉంది. సైమ్ అయూబ్ (6), బాబర్ ఆజమ్ (10) క్రీజ్‌లో ఉన్నారు. షఫీక్ వికెట్ రబాడకు దక్కింది.కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుంది. 3 టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి తొలి టెస్ట్ మొదలవుతుంది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి రెండో టెస్ట్ జరుగుతుంది. -
మరి నీవు మారవా? వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో పో! వీడియో వైరల్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ తమ పేలవ ఫీల్డింగ్ ప్రదర్శనను కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు క్యాచ్‌లు విడిచిపెట్టిన పాక్ స్టార్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ కేవలం 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ క్రమంలో మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ మాత్రం బౌలర్లను మారుస్తూ ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 15 ఓవర్ వేసేందుకు అమీర్ జమీల్ చేతికి బంతిని అందించాడు. ఆ ఓవర్లో తొలి బంతిని మార్ష్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే సెకెండ్ స్లిప్‌లో ఉన్న షఫీక్ ఈజీ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు. అందుకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోంది. 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మార్ష్.. ఏకంగా 96 పరుగులు చేశాడు. దీంతో షఫీక్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఆసీస్ దిగ్గజం మార్క్ వా సైతం ఆంసతృప్తి వ్యక్తం చేశాడు. 'మొసలి దవడలా క్యాచ్ పడుతున్నాడు.. వెంటనే అతడిని అక్కడ నుంచి తీసియేండి' అని అన్నాడు. అదే విధంగా ఓ సోషల్ మీడియా యూజర్ 'మరి నీవు మారవా? వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో పో' అంటూ ఓ పోస్ట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 57 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ప్రస్తుతం 230 పరుగుల అధిక్యంలో ఆసీస్ కొనసాగుతోంది. చదవండి: IND vs SA: 'అతడిని టీమిండియా మిస్సవుతోంది.. సౌతాఫ్రికాకు చుక్కలు చూపించేవాడు' Another drop by Pakistan. Mark Waugh - it's like a crocodile jaw trying to catch a ball.pic.twitter.com/RAjkkanfzp — Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2023 -
మళ్లీ అదే పొరపాటు.. తలపట్టుకున్న ఆఫ్రిది! ఆటకు వర్షం అంతరాయం
Australia vs Pakistan, 2nd Test Day 1: ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక పాక్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ షాన్ మసూద్ నమ్మకాన్ని నిలబెడుతూ పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను 38 పరుగులకే పరిమితం చేశారు. వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్ వదిలేశాడు నిజానికి మూడో ఓవర్ ఆఖరి బంతికే అతడు అవుట్ కావాల్సింది. కానీ అబ్దుల్లా షఫీక్ చేసిన పొరపాటు వల్ల వార్నర్‌కు లైఫ్ లభించింది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫీక్ జారవిడిచాడు. అప్పటికి ఈ ఓపెనింగ్ బ్యాటర్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. అయితే, షషీక్ పొరపాటు వల్ల బతికిపోయిన వార్నర్‌ను పాక్ స్పిన్నర్ ఆఘా సల్మాన్ పెవిలియన్‌కు పంపాడు. 28వ ఓవర్ మొదటి బంతికి సల్మాన్ బౌలింగ్‌లో.. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరిగాడు. David Warner gets a life on two! Shaheen Afridi gets the ball swinging and Abdullah Shafique puts it down at first slip #AUSvPAK pic.twitter.com/EJc4AptxJk — cricket.com.au (@cricketcomau) December 25, 2023 ఖవాజాను అవుట్ చేసిన హసన్ అలీ ఇక మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(101 బంతుల్లో 42 పరుగులు)ను పేసర్ హసన్ అలీ అద్భుత బంతితో అవుట్ చేశాడు. 33.1 ఓవర్ వద్ద అఘా సల్మాన్ అందుకున్న క్యాచ్‌తో ఖవాజా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ప్రస్తుతం మార్నస్ లబుషేన్ 14, స్టీవ్ స్మిత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆటకు వర్షం అంతరాయం కాగా ఆసీస్- పాక్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి ఆస్ట్రేలియా 42.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అప్పుడు ఖవాజా.. ఇప్పుడు వార్నర్ ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ బృందం ఏకంగా 360 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లోనూ ఖవాజా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫీక్ జారవిడిచిన విషయం తెలిసిందే. తాజాగా రెండో టెస్టులోనూ తప్పిదాన్ని పునరావృతం చేశాడు. అయితే, ఈసారి వార్నర్ క్యాచ్‌ను వదిలేశాడు. దీంతో అతడిపై నెట్టింట మరోసారి ట్రోల్స్ మొదలయ్యాయి. చదవండి: IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై? బంగారు బాతు కదా! -
అవకాశాలు సృష్టించుకోవడం ఎలాగో రాదు.. కనీసం! పాక్ చెత్త ఫీల్డింగ్ వల్లే..
ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫీల్డింగ్ తప్పిదాలపై ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. అవకాశాలు సృష్టించుకోవడం ఎలాగో చేతకాదు.. కనీసం బ్యాటర్లు ఇచ్చిన ఛాన్స్‌ను కూడా వినియోగించుకోరా అంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో ఆరంభం నుంచే ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడారు. అయితే, ఐదో ఓవర్లోనే వార్నర్‌ను పెవిలియన్‌కు పంపే అవకాశం వచ్చింది. పాక్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది సంధించిన షార్ట్ బాల్‌ను వార్నర్ మిడాన్ దిశగా గాల్లోకి లేపగా.. ఉసామా మిర్ సింపుల్ క్యాచ్ అందుకోలేకపోయాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అంతేకాదు.. 33వ ఓవర్లో మరోసారి వార్నర్ ఇచ్చిన అవకాశాన్ని కూడా పాక్ ఫీల్డర్లు ఉపయోగించుకోలేకపోయారు. ఉసామా మిర్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ డీప్ దిశగా బాదగా.. అబ్దుల్లా షఫీక్ క్యాచ్ జారవిడిచాడు. ఈ నేపథ్యంలో.. ‘‘అవకాశాలు సృష్టించుకోవడం చేతకానపుడు.. కనీసం బ్యాటర్లు ఇచ్చిన అవకాశాలనైనా సద్వినియోగం చేసుకోవచ్చు కదా! ఇన్ని క్యాచ్‌లు డ్రాప్ చేయడం సరికాదు.. కమాన్ బాయ్స్’’ అంటూ షోయబ్ అక్తర్ పాక్ ఆటగాళ్లను విమర్శించాడు. కాగా పాక్ ఫీల్డర్ల తప్పిదాల కారణంగా రెండుసార్లు లైఫ్ పొందిన వార్నర్ మొత్తంగా 124 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 163 పరుగులు చేసి హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక వార్నర్‌కు తోడుగా మరో ఓపెనర్ మిచెల్ మార్ష్(121) సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీ స్కోరు సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) As it is, you're not able to create opportunities. Atleast grab the ones which batters are giving. Come on guys, you cant drop so many catches!!!!!! — Shoaib Akhtar (@shoaib100mph) October 20, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: కోహ్లి-రాహుల్, రిజ్వాన్-షఫీక్.. ఎవరి భాగస్వామ్యం గొప్పది..?
ప్రస్తుత ప్రపంచకప్‌లో పట్టుమని పది రోజులు కూడా గడవకముందే పలు ఆసక్తికర మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదటిది భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నీలో రెండో ఆసక్తికర మ్యాచ్ ఏదంటే.. పాకిస్తాన్, శ్రీలంక మధ్య హైదరాబాద్‌లో నిన్న జరిగిన మ్యాచ్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో పాక్ సైతం అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి చారిత్రక విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓ కామన్ థింగ్ ప్రస్తుతం క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లి-కేఎల్ రాహుల్.. మొహమ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్‌లు నెలకొల్పిన మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలపై ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఈ రెండు భాగస్వామ్యాల్లో ఏది గొప్పది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. భారత అభిమానులు సహా యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం విరాట్-రాహుల్ పార్ట్‌నర్‌షిప్‌కు ఓటేస్తుంటే, పాక్ ఫ్యాన్స్ మాత్రం రిజ్వాన్-షఫీక్ భాగస్వామ్యం గొప్పదని డప్పుకొట్టుకుంటున్నారు. ఇరు భాగస్వామ్యాలపై ఓ లుక్కేస్తే.. ఆసీస్‌తో మ్యాచ్‌లో భారత్ స్వల్ప లక్ష్య ఛేదనలో (200 పరుగులు) 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. విరాట్ (85)-రాహుల్ (97 నాటౌట్) జోడీ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను గెలిపించింది. శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. లంక నిర్ధేశించిన 345 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్‌ను రిజ్వాన్ (131 నాటౌట్)-షఫీక్ (113) జోడీ 176 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయతీరాలకు చేర్చింది. ఈ రెండు పార్ట్‌నర్‌షిప్స్‌లో నలుగురు ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో పరుగులు సాధించి, తమతమ జట్లను గెలిపించారు. రెండు సందర్భాల్లో వారు ఒక్కో పరుగు పేరుస్తూ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు విజయాలకు దోహదపడ్డారు. వాస్తవానికి ఈ రెంటిని ఒకదానితో ఒకటి పోల్చలేని పరిస్థితి. ఇరు భాగస్వామ్యాలు తీవ్రమైన ఒత్తిడిలో నెలకొల్పివనే. దేని ప్రత్యేకత దానికుంది. దీన్ని అంశంగా తీసుకుని డిబేట్లు పెట్టాల్సిన అవసరం లేదు. అయినా ఈ రెంటిలో గొప్ప భాగస్వామ్యం ఏదని చెప్పాల్సి వస్తే మాత్రం మెజార్టీ శాతం అభిప్రాయంతో వెళ్లాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌ల విషయాలను పక్కన పెడితే.. భారత్-పాక్‌లు అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్న విషయం తెలిసిందే. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రస్తుత టోర్నీలో ఇరు జట్ల ప్రదర్శనను చూసిన తర్వాత ఈ మ్యాచ్‌పై మరింత హైప్ పెరిగింది. దీనికి ముందు భారత్ ఇవాళ (అక్టోబర్ 11) ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. న్యూఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
ఏడు వికెట్లతో చెలరేగిన 36 ఏళ్ల పాక్ బౌలర్.. సిరీస్ క్లీన్‌స్వీప్
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 188 పరుగులకు కుప్పకూలింది. ఏంజెలో మాథ్యూస్ 63 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. దిముత్ కరుణరత్నే 41 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో స్పిన్నర్ నొమన్ అలీ ఏడు వికెట్లతో చెలరేగగా.. చివర్లో నసీమ్ షా మూడు వికెట్లు తీశాడు. సొంతగడ్డపై లంకకు ఇదే అతిపెద్ద పరాజయం కాగా.. పాకిస్తాన్‌కు లంక గడ్డపై అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను పాకిస్తాన్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను 576 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (201 పరుగులు) డబుల్ సెంచరీతో మెరవగా.. అగా సల్మాన్ (132 నాటౌట్) అజేయ సెంచరీతో మెరిశాడు. సాద్ షకీల్ 57, షాన్ మసూద్ 51, మహ్మద్ రిజ్వాన్ 50 పరుగులు చేశారు. అంతకముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌట్ అయింది. 36 ఏళ్ల వయసులో సంచలనం ఇక నొమన్ అలీ 36 ఏళ్ల వయసులో తన స్పిన్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఒక దశలో లంక ఇన్నింగ్స్‌లో తొలి ఏడు వికెట్లు నొమన్ అలీనే పడగొట్టడంతో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల హాల్ నమోదు చేస్తాడనిపించింది. జిమ్ లేకర్(1956), అనిల్ కుంబ్లే(1999), ఎజాజ్ పటేల్(2021)లో టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన బౌలర్లుగా చరిత్ర సృష్టించారు. అయితే ఆఖర్లో టెయిలెండర్ల వికెట్లను నసీమ్ షా రెండు ఓవర్ల వ్యవధిలో తీయడంతో నొమన్ అలీ తృటిలో ఆ ఫీట్‌ను చేజార్చుకున్నాడు. Noman Ali's brilliant spell rips through Sri Lanka's batting lineup.🎯 His Best Bowling Figures in a Test Innings!🔝#NomanAli #Pakistan #SLvPAK pic.twitter.com/OMYnkbp85R — Sportskeeda (@Sportskeeda) July 27, 2023 డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో పాకిస్తాన్ లంకతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్తాన్ డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. లంకతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా 24 పాయింట్లను(100 పర్సంటైల్) పాక్ ఖాతాలో వేసుకుంది. మరోవైపు టీమిండియా విండీస్‌తో సిరీస్‌ను గెలిచినప్పటికి ఒక మ్యాచ్ డ్రా కావడంతో 16 పాయింట్లతో(66.67 పర్సంటైల్) రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా 26 పాయింట్లు(54.17 పర్సంటైల్) ఉండగా.. ఇంగ్లండ్ 14 పాయింట్లు(29.17 పర్సంటైల్)తో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. Pakistan reigns supreme 🔥 With a clean sweep in this series, they sit proudly at the top of the World Test Championship 2023-2025 leaderboard#WTC25 #PAKvSL pic.twitter.com/IDi6PyW37f — Cricket Pakistan (@cricketpakcompk) July 27, 2023 చదవండి: ENG Vs AUS 5th Test: మొదలైన ఐదో టెస్టు.. ఇంగ్లండ్ గెలిచినా యాషెస్ కంగారులదే -
చెలరేగిన పాక్ బ్యాటర్లు.. డబుల్ సెంచరీ, సెంచరీతో పాటు రెండు ఫిఫ్టీలు
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 132 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 563 పరుగులు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 178/2తో ఆట కొనసాగించిన పాకిస్తాన్ మూడు వికెట్లు చేజార్చుకొని 385 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (201; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీ చేయగా... ఆఘా సల్మాన్ (132 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో షఫీక్,సల్మాన్‌తో పాటు షాన్ మసూద్ (51), సౌద్ షకీల్ (57) కూడా రాణించారు. ప్రస్తుతం పాక్ 397 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. రికార్డు డబుల్ సెంచరీ బాదిన అబ్దుల్లా షఫీక్.. లంకతో రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్.. ఈ ఘనత సాధించిన మూడో పాక్ యంగెస్ట్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు జావెద్ మియాందాద్, హనీఫ్ మొహమ్మద్‌లు అతి పిన్న వయసులో డబుల్ సాధించారు. అలాగే షఫీక్.. లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి పాక్ ఓపెనర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. -
లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి ఓపెనర్‌గా..
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ డబుల్ సెంచరీతో మెరిశాడు. 322 బంతులెదుర్కొన్న షఫీక్ 19 ఫోర్లు, 4 సిక్సర్లతో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా టెస్టు క్రికెట్లో అబ్దుల్లా షఫీక్‌కు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. కాగా 23 ఏళ్ల వయసున్న అబ్దుల్లా షఫీక్ పాక్ తరపున డబుల్ సెంచరీ బాదిన మూడో యంగెస్ట్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు జావెద్ మియాందాద్, హనీఫ్ మొహమ్మద్‌లు ఈ ఘనత సాధించారు. ఇక లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి పాక్ ఓపెనర్‌గానూ అబ్దుల్లా షఫీక్ చరిత్రకెక్కాడు. A true champion knock 🔥❤️ 200 hundred from @imabd28 #SLvPAK #SLvsPAK #AbdullahShafique pic.twitter.com/c2m4ldK3m8 — Mir kashi👑 (@oya_kojuu) July 26, 2023 ఇక రెండో టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచిన పాక్ సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 458 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్‌కు(200 నాటౌట్) అగా సల్మాన్(80 బంతుల్లో 70 బ్యాటింగ్) చక్కగా సహకరిస్తున్నాడు. ఆశితో ఫెర్నాండో మూడు వికెట్లు తీయగా.. ప్రభాత్ జయసూరియా ఒక వికెట్ పడగొట్టాడు. ఇప్పటివరకు పాకిస్తాన్ 292 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడం.. వరుణుడు అడ్డుపడకపోతే మాత్రం పాకిస్తాన్ విజయాన్ని ఆపడం లంకకు కష్టసాధ్యమనే చెప్పొచ్చు. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది.ధనుంజయ డిసిల్వా 57, దినేశ్ చండిమల్ 34 మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్ షా మూడు, షాహిన్ అఫ్రిది ఒక వికెట్ తీశాడు. 🌟 First visiting opener to score a double 💯 at SSC, Colombo 🌟 Third-youngest double-centurion for 🇵🇰 after Javed Miandad and Hanif Mohammad@imabd28 scores a magnificent maiden double ton 🙌#SLvPAK pic.twitter.com/3zGaD0pnKl — Pakistan Cricket (@TheRealPCB) July 26, 2023 Maiden Double Hundred - Take a bow, Abdullah Shafique! 🌟 He is now the third youngest Pakistan batter to score a Test double ton after Javed Miandad and Hanif Mohammad 💯👌#CricketTwitter #SLvPAK #WTC25 #PakBall #abdullahshafique pic.twitter.com/QvRxprwC7J — CricWick (@CricWick) July 26, 2023 చదవండి: Saud Shakeel: అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టి.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు! Abdullah Shafique: సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్.. భారీ ఆధిక్యం దిశగా -
సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్.. భారీ ఆధిక్యం దిశగా
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ దాటిగా ఆడుతోంది. వర్షం కారణంగా రెండో రోజు ఆటలో కొన్ని ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. దీంతో మూడోరోజు ఆటలో తొలి సెషన్ నుంచే పాక్ బ్యాటర్లు దూకుడు కనబరుస్తున్నారు. ఈ క్రమంలో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ సెంచరీతో మెరిశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 87 పరుగులు నాటౌట్‌గా నిలిచిన షఫీక్ మూడోరోజు ఆటలో సెంచరీ అందుకున్నాడు. 149 బంతుల్లో శతకం అందుకున్న అబ్దుల్లా షఫీక్‌కు ఇది టెస్టుల్లో నాలుగో సెంచరీ.. శ్రీలంకపై రెండోది కావడం విశేషం. 210 బంతుల్లో 131 పరుగులతో ఆడుతున్న షఫీక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 265 పరుగులతో ఆడుతుంది. షఫీక్‌తో పాటు సాద్ షకీల్ 30 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 99 పరుగుల ఆధిక్యంలో ఉన్న పాకిస్తాన్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఇక శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ధనుంజయ డిసిల్వా 57, దినేశ్ చండిమల్ 34 మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్ షా మూడు, షాహిన్ అఫ్రిది ఒక వికెట్ తీశాడు. Abdullah Shafique brings up his 4th century in Tests! Pakistan continue to build their lead.. #SLvPAK pic.twitter.com/KPxCpC3SDv — Cricbuzz (@cricbuzz) July 26, 2023 చదవండి: మెస్సీ అదరగొట్టినా.. తీవ్ర నిరాశలో అభిమానులు! చరిత్ర సృష్టించిన మలేసియా బౌలర్.. టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు, అన్ని క్లీన్‌బౌల్డ్‌లే..! -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా
అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్లా షఫీక్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో డకౌటైన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో గోల్డన్ డకౌటైన షఫీక్ ఈ ప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. అంతకుముందు ఆఫ్గాన్‌తో తొలి టీ20లోనూ డకౌట్‌గా వెనుదిరగాడు. అదే విధంగా ఆఫ్గాన్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టీ20ల్లోనూ షఫీక్ డకౌటయ్యాడు. దీంతో ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కాగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు ఐదు టీ20లు ఆడిన షఫీక్.. అందులో నాలుగు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి షఫీక్ కేవలం 7 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. అదే విధంగా పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం. చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు -
హ్యాట్రిక్ డకౌట్స్.. ఈ పాక్ బ్యాటర్ సూర్యకుమార్ కంటే మరీ అధ్వానంగా ఉన్నాడు..!
షార్జా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీ20ల్లో పాక్‌పై ఆఫ్ఘనిస్తాన్ గెలవడం ఇదే తొలిసారి. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఫజల్ హక్ ఫారూఖీ (4-0-13-2), ముజీబ్ (4-0-9-2), నబీ (3-0-12-2), అజ్మతుల్లా (3-0-20-1), నవీన్ ఉల్ హక్ (2-0-19-1), రషీద్ ఖాన్ (4-0-15-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్ 17.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా రషీద్ ఖాన్ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహ్మద్ నబీ (38 నాటౌట్), నజీబుల్లా జద్రాన్ (17 నాటౌట్) ఆఫ్ఘనిస్తాన్‌ను విజయతీరాలకు చేర్చగా.. పాక్ బౌలర్లలో ఇహసానుల్లా 2, నసీం షా, ఇమాద్ వసీం తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. పాక్ వన్ డౌన్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ వరుసగా 3 టీ20ల్లో డకౌటయ్యాడు. అదీ 3 మ్యాచ్‌ల్లో రెండో బంతికే ఔటయ్యాడు. షఫీక్.. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 తర్వాత షఫీక్ గణాంకాలు వైరల్ కావడంతో భారత అభిమానులు సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ గోల్డన్ డకౌట్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. స్కై కంటే ఈ షఫీక్ మరీ అధ్వానంగా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. సూర్యకుమార్ కనీసం బంతులు వేస్ట్ చేయకుండా ఔటయ్యాడు.. షఫీక్ ఏమో ఓ బంతి వేస్ట్ చేసి మరీ వికెట్ సమర్పించుకున్నాడంటూ చర్చించుకుంటున్నారు. సూర్యకుమార్ టీ20ల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడాక, వన్డేల్లో డకౌట్ల పరంపర మొదలుపెట్టాడు.. షఫీక్ ఆడింది 4 టీ20లే అయితే అందులో హ్యాట్రిక్ డకౌట్లు నమోదు చేశాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాగా, ఇటీవల ఆసీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డేలో సిరీస్‌లో సూర్యకుమార్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తొలి బంతికే ఔటైన విషయం తెలిసిందే. -
తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్ ఎగిరిపడింది
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో బ్యాట్‌కు బంతికి మధ్య భీకర పోరు నడుస్తోంది. లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో ఈ పోరు పతాక స్థాయికి చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్.. ప్రత్యర్ధి బౌలర్లను ఓ రేంజ్లో ఆడుకోగా.. అనంతరం బరిలోకి దిగిన పెషావర్ జల్మీపై ఖలందర్స్ బౌలర్లు షాహీన్ అఫ్రిది (4-0-40-5), హరీస్ రౌఫ్ (4-0-38-1), జమాన్ ఖాన్ (3-0-28-2) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. బౌలర్లకు, బ్యాటర్లకు మధ్య జరిగిన ఈ భీకర పోరులో ఓ ఆసక్తికర విషయం అందరినీ ఆకట్టుకుంది. ఖలందర్స్ నిర్ధేశించిన 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పెషావర్‌కు తొలి బంతికే షాహీన్ అఫ్రిది షాక్ ఇచ్చాడు. మెరుపు వేగంతో షాహీన్ సంధించిన బంతిని డ్రైవ్ చేసే క్రమంలో మహ్మద్ హరీస్ బ్యాట్ రెండు ముక్కలైంది. అనంతరం మరో బ్యాట్‌తో బ్యాటింగ్ కొనసాగించిన హరీస్‌ను షాహీన్ రెండో బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు. షాహీన్ సంధించిన వేగం ధాటికి ఆఫ్్ స్టంప్ గాల్లోకి పల్టీలు కొడుతూ నాట్యం చేసింది. చూడముచ్చటైన ఈ తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. First ball: Bat broken ⚡ Second ball: Stumps rattled 🎯 PACE IS PACE, YAAR 🔥🔥#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvPZ pic.twitter.com/VetxGXVZqY — PakistanSuperLeague (@thePSLt20) February 26, 2023 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్.. ఫకర్ జమాన్ (45 బంతుల్లో 96; 3 ఫోర్లు, 10 సిక్సర్లు), షఫీక్ (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్ (23 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంకర ఇన్నింగ్స్‌ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పెషావర్ జల్మీ కూడా ఏమాత్రం తగ్గకుండా విజృంభించి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదినప్పటికీ టార్గెట్ కొండంతలా ఉండటంతో 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పెషావర్ బ్యాటర్లు సైమ్ అయూబ్ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), భానుక రాజపక్ష (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), జేమ్స్ నీషమ్ (8 బంతుల్లో 12; సిక్స్), సాద్ మసూద్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది. -
ఇదెక్కడి బాదుడు రా బాబు.. 34 బౌండరీలు, 28 సిక్సర్లు..!
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో బ్యాటర్లు.. బౌలర్లను చీల్చిచండాతూ భారీ స్కోర్లు చేస్తున్నారు. లీగ్‌లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 26) లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు మరోసారి శివాలెత్తడంతో పరుగుల వరద పారింది. ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్‌కు వేదిక అయిన గడాఫీ స్టేడియంను హోరెత్తించారు. బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్‌లో ఏకంగా 34 బౌండరీలు, 28 సిక్సర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్.. ఫకర్ జమాన్ (45 బంతుల్లో 96; 3 ఫోర్లు, 10 సిక్సర్లు), షఫీక్ (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్ (23 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంకర ఇన్నింగ్స్‌ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పెషావర్ జల్మీ కూడా ఏమాత్రం తగ్గకుండా విజృంభించి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదినప్పటికీ టార్గెట్ కొండంతలా ఉండటంతో 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పెషావర్ బ్యాటర్లు సైమ్ అయూబ్ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), భానుక రాజపక్ష (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), జేమ్స్ నీషమ్ (8 బంతుల్లో 12; సిక్స్), సాద్ మసూద్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది. షాహీన్ అఫ్రిది (5/40) పెషావర్ పతనాన్ని శాసించగా.. జమాన్ ఖాన్ 2, హరీస్ రౌఫ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 27) లాహోర్ ఖలందర్స్-ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడనున్నాయి. -
పాకిస్తాన్ ఓపెనర్ ప్రపంచ రికార్డు.. 93 ఏళ్ల తర్వాత తొలి సారిగా..!
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ జట్టు యువ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 160 పరుగులతో ఆజేయంగా నిలిచి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో షఫీక్ ఏకంగా 408 బంతులను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో అబ్దుల్లా షఫీక్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో చేజింగ్ సమయంలో అత్యధిక సేపు క్రీజులో నిలిచిన తొలి బ్యాటర్‌గా షఫీక్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 524 నిమిషాలు పాటు షఫీక్ క్రీజులో ఉన్నాడు. అంతకు ముందు ఈ రికార్డు.. 1998లో జింబాబ్వేపై ఛేజింగ్‌లో 460 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆటగాడు అరవింద డి సిల్వా పేరిట ఉండేది. అదే విధంగా ఛేజింగ్‌లో 400 బంతులు ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చిన రెండో బ్యాటర్‌గా షఫీక్ నిలిచాడు. అంతకు ముందు 1928-29లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ హెర్బర్ట్ సట్‌క్లిఫ్ 462 బంతుల్లో 135 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు. దాదాపు 93 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రికార్డును షఫీక్ సాధించడం విశేషం. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో 400 పైగా బంతులను ఎదుర్కొన్న ఐదో బ్యాటర్‌గా షఫీక్ నిలిచాడు. షఫీక్ కంటే ముందు హెర్బర్ట్ సట్‌క్లిఫ్, సునీల్ గవాస్కర్, మైక్ అథర్టన్, బాబర్ ఆజాం ఈ ఘనత సాధించారు. అదే విధంగా టెస్టులో నాల్గవ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన మూడో పాక్ ఆటగాడిగా షఫీక్ నిలిచాడు. చదవండి: NZ vs IRE: తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా..! Pakistan's second-highest successful run-chase in Tests ✅ A remarkable win to take a 1️⃣-0️⃣ lead in the series 👏#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/n5B4iFJmZf — Pakistan Cricket (@TheRealPCB) July 20, 2022 Who is Abdullah Shafique, Pakistan's new batting star? Read more: https://t.co/qZbdgM5r4B#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/RjM1hKxlbQ — Pakistan Cricket (@TheRealPCB) July 20, 2022 🗣️ The star 🇵🇰 duo of @babarazam258 and @imabd28 reflect on the special Galle triumph 🌟🌟#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/oGjOXG2LJw — Pakistan Cricket (@TheRealPCB) July 20, 2022