శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 188 పరుగులకు కుప్పకూలింది. ఏంజెలో మాథ్యూస్ 63 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. దిముత్ కరుణరత్నే 41 పరుగులు చేశాడు.
పాక్ బౌలర్లలో స్పిన్నర్ నొమన్ అలీ ఏడు వికెట్లతో చెలరేగగా.. చివర్లో నసీమ్ షా మూడు వికెట్లు తీశాడు. సొంతగడ్డపై లంకకు ఇదే అతిపెద్ద పరాజయం కాగా.. పాకిస్తాన్‌కు లంక గడ్డపై అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను పాకిస్తాన్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
ఇక పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను 576 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (201 పరుగులు) డబుల్ సెంచరీతో మెరవగా.. అగా సల్మాన్ (132 నాటౌట్) అజేయ సెంచరీతో మెరిశాడు. సాద్ షకీల్ 57, షాన్ మసూద్ 51, మహ్మద్ రిజ్వాన్ 50 పరుగులు చేశారు. అంతకముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌట్ అయింది.
36 ఏళ్ల వయసులో సంచలనం
ఇక నొమన్ అలీ 36 ఏళ్ల వయసులో తన స్పిన్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఒక దశలో లంక ఇన్నింగ్స్‌లో తొలి ఏడు వికెట్లు నొమన్ అలీనే పడగొట్టడంతో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల హాల్ నమోదు చేస్తాడనిపించింది. జిమ్ లేకర్(1956), అనిల్ కుంబ్లే(1999), ఎజాజ్ పటేల్(2021)లో టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన బౌలర్లుగా చరిత్ర సృష్టించారు. అయితే ఆఖర్లో టెయిలెండర్ల వికెట్లను నసీమ్ షా రెండు ఓవర్ల వ్యవధిలో తీయడంతో నొమన్ అలీ తృటిలో ఆ ఫీట్‌ను చేజార్చుకున్నాడు.
Noman Ali's brilliant spell rips through Sri Lanka's batting lineup.🎯
— Sportskeeda (@Sportskeeda) July 27, 2023
His Best Bowling Figures in a Test Innings!🔝#NomanAli #Pakistan #SLvPAK pic.twitter.com/OMYnkbp85R
డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో పాకిస్తాన్
లంకతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్తాన్ డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. లంకతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా 24 పాయింట్లను(100 పర్సంటైల్) పాక్ ఖాతాలో వేసుకుంది. మరోవైపు టీమిండియా విండీస్‌తో సిరీస్‌ను గెలిచినప్పటికి ఒక మ్యాచ్ డ్రా కావడంతో 16 పాయింట్లతో(66.67 పర్సంటైల్) రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా 26 పాయింట్లు(54.17 పర్సంటైల్) ఉండగా.. ఇంగ్లండ్ 14 పాయింట్లు(29.17 పర్సంటైల్)తో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.
Pakistan reigns supreme 🔥
— Cricket Pakistan (@cricketpakcompk) July 27, 2023
With a clean sweep in this series, they sit proudly at the top of the World Test Championship 2023-2025 leaderboard#WTC25 #PAKvSL pic.twitter.com/IDi6PyW37f
చదవండి: ENG Vs AUS 5th Test: మొదలైన ఐదో టెస్టు.. ఇంగ్లండ్ గెలిచినా యాషెస్ కంగారులదే
Comments
Please login to add a commentAdd a comment