శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ దాటిగా ఆడుతోంది. వర్షం కారణంగా రెండో రోజు ఆటలో కొన్ని ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. దీంతో మూడోరోజు ఆటలో తొలి సెషన్ నుంచే పాక్ బ్యాటర్లు దూకుడు కనబరుస్తున్నారు. ఈ క్రమంలో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ సెంచరీతో మెరిశాడు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి 87 పరుగులు నాటౌట్‌గా నిలిచిన షఫీక్ మూడోరోజు ఆటలో సెంచరీ అందుకున్నాడు. 149 బంతుల్లో శతకం అందుకున్న అబ్దుల్లా షఫీక్‌కు ఇది టెస్టుల్లో నాలుగో సెంచరీ.. శ్రీలంకపై రెండోది కావడం విశేషం. 210 బంతుల్లో 131 పరుగులతో ఆడుతున్న షఫీక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.
ప్రస్తుతం పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 265 పరుగులతో ఆడుతుంది. షఫీక్‌తో పాటు సాద్ షకీల్ 30 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 99 పరుగుల ఆధిక్యంలో ఉన్న పాకిస్తాన్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది.
ఇక శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ధనుంజయ డిసిల్వా 57, దినేశ్ చండిమల్ 34 మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్ షా మూడు, షాహిన్ అఫ్రిది ఒక వికెట్ తీశాడు.
Abdullah Shafique brings up his 4th century in Tests!
— Cricbuzz (@cricbuzz) July 26, 2023
Pakistan continue to build their lead.. #SLvPAK pic.twitter.com/KPxCpC3SDv
చదవండి: మెస్సీ అదరగొట్టినా.. తీవ్ర నిరాశలో అభిమానులు!
చరిత్ర సృష్టించిన మలేసియా బౌలర్.. టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు, అన్ని క్లీన్‌బౌల్డ్‌లే..!
Comments
Please login to add a commentAdd a comment