Sri Lanka vs Pakistan
-
Asia T20 Cup: సెమీస్‌లో పాక్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. ఫైనల్లో ఎంట్రీ
వర్దమాన టీ20 క్రికెట్ జట్ల ఆసియా కప్-2024లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా శ్రీలంక నిలిచింది. తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అల్ అమెరత్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక-‘ఎ’ జట్టు పాకిస్తాన్-‘ఎ’తో తలపడింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ యాసిర్ ఖాన్ రెండు పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్ అర్ధ శతకంతో చెలరేగాడు. మొత్తంగా 46 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 68 పరుగులు చేశాడు.Omair Yousuf sits back and brings out the reverse sweep 6️⃣@TheRealPCB#MensT20EmergingTeamsAsiaCup2024 #SLvPAK #ACC pic.twitter.com/PTyFhDF7OJ— AsianCricketCouncil (@ACCMedia1) October 25, 2024దుషాన్ హేమంత తిప్పేశాడుఅయితే, యూసఫ్నకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. లంక బౌలర్లను ఎదుర్కోలేక వచ్చినవాళ్లు వచ్చినట్లుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. వన్‌డౌన్ బ్యాటర్ కెప్టెన్ మహ్మద్ హ్యారిస్(6) పూర్తిగా విఫలం కాగా.. తర్వాతి స్థానాల్లో వచ్చిన కాసిం అక్రం(0), హైదర్ అలీ(14), అరాఫత్ మిన్హాస్(10), అబ్దుల్ సమద్(0), అబ్బాస్ ఆఫ్రిది(9), మహ్మద్ ఇమ్రాన్(13), సూఫియాన్ ముఖీం(4 నాటౌట్), షానవాజ్ దహానీ(0- నాటౌట్) చేతులెత్తేశారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ దుషాన్ హేమంత అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టగా.. పేసర్లు నిపుణ్ రన్సిక, ఇషాన్ మలింగ రెండేసి వికెట్లు కూల్చారు.అహాన్ విక్రమసింఘే సూపర్ హాఫ్ సెంచరీఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ యశోద లంక (11- అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్) తక్కువ స్కోరుకే వెనుదిరగాల్సి వచ్చినా.. మరో ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ లాహిరు ఉదర 20 బంతుల్లో 43 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ అహాన్ విక్రమసింఘే సూపర్ హాఫ్ సెంచరీతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. 46 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో కెప్టెన్ నువానిడు ఫెర్నాండో(9) విఫలం కాగా.. సహాన్ అరాచ్చిగె(16 బంతుల్లో 17)ఫోర్ బాది లంకను విజయతీరాలకు చేర్చాడు.ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లోఈ క్రమంలో 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక రెండో సెమీ ఫైనల్లో తిలక్ వర్మ సారథ్యంలోని భారత-‘ఎ’ జట్టు అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టుతో శ్రీలంక టైటిల్ కోసం ఆదివారం(అక్టోబరు 27) తలపడుతుంది.చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్‌కోచ్ ఘాటు విమర్శలు -
పాకిస్తాన్‌పై సెంచరీతో చెలరేగాడు.. కాసేపటికే ఆసుపత్రిలో కుశాల్ మెండిస్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్ మెరుపు శతకంతో చెలరేగాడు. 77 బంతులు ఎదుర్కొన్న కుశాల్ మెండిస్ 14 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేశాడు. అయితే తన సెంచరీ మార్క్‌ను మెండిస్ కేవలం 65 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన శ్రీలంక బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పేరు మీద ఉండేది. 2015 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంగక్కర 70 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆసుపత్రికి కుశాల్ మెండిస్.. కాగా శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం కుశాల్ మెండీస్‌ను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అతడు చేతి కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో స్కానింగ్ కోసం అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించింది. "పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 77 బంతుల్లో 122 పరుగులతో అద్భుతంగా రాణించి డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన కుశాల్ మెండిస్ క్రాంప్స్‌తో బాధపడ్డాడు. దీంతో అతడిని మా సిబ్బంది ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెండిస్ తరుపున దుషన్ హేమంత సబ్‌స్ట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలో వచ్చాడు. అదేవిధంగా మెండిస్ స్ధానంలో వికెట్ కీపింగ్ బాధ్యతలను సదీర సమరవిక్రమ స్వీకరించాడని" ఎక్స్(ట్విటర్)లో శ్రీలంక క్రికెట్ పేర్కొంది. చదవండి: ODI WC 2023: వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుకో పో బాబర్.. పాక్ కెప్టెన్‌పై ఫ్యాన్స్ ట్రోల్స్ -
వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుకో పో బాబర్.. పాక్ కెప్టెన్‌పై ఫ్యాన్స్ ట్రోల్స్
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి దారుణ ప్రదర్శన కనబరిచాడు. నెదర్లాండ్స్‌పై కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన బాబర్.. ఇప్పుడు శ్రీలంకపై 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. 345 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. దిల్షాన్ మధుశంక బౌలింగ్‌లో తొలుత ఇమామ్ ఉల్-హక్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అవ్వగా.. బాబర్ వికెట్ కీపర్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చి తన వికెట్‌ను కోల్పోయాడు. పాక్ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన మధుశంక బౌలింగ్‌లో రెండో బంతిని బాబర్ డౌన్ లెగ్ దిశగా ఆడాలని భావించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. దీంతో బాబర్ చేసేదేమి లేక తెల్లముఖం వేసుకుని పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో బాబర్ ఆజంపై నెటిజన్లు ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. "వార్మప్ మ్యాచ్‌ల్లో ఆడటం కాదు బాబర్.. మెయిన్ టోర్నీలో ఆడాలంటూ" పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా ఈ మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌ల్లో బాబర్ చెలరేగి ఆడాడు. కానీ ప్రధాన టోర్నీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. చదవండి: WC 2023- Pak Vs SL: కుశాల్ మెండిస్ సునామీ శతకం.. టీమిండియా రికార్డు బద్దలు Expectations vs Reality 🤡🤣 #BabarAzam𓃵 #ViratKohli𓃵 #PAKvSL pic.twitter.com/aoSuiHK8VQ — ꜱᴘɪᴅᴇʏ (@AnushSpidey1) October 10, 2023 -
WC 2023: మెండిస్ విధ్వంసకర ఇన్నింగ్స్.. టీమిండియా రికార్డు బద్దలు
WC 2023 Pak Vs SL- Hyderabad: వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ దుమ్ములేపారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగి శతకాల మోత మోగించి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఫాస్టెస్ట్ సెంచరీతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పాక్ పేసర్ హసన్ అలీ లంక ఓపెనర్ కుశాల్ పెరీరాను డకౌట్ చేసి ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఈ నేపథ్యంలో ఓపెనర్ పాతుమ్ నిసాంక(51)కు తోడైన కుశాల్ మెండిస్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 122 పరుగులు సాధించాడు. మెండిస్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సమరవిక్రమ సైతం సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. సమరవిక్రమ సైతం.. సెంచరీతో చెలరేగి 89 బంతుల్లో 108 పరుగులు సాధించాడు. సమరవిక్రమ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మిగిలిన వాళ్లలో ధనంజయ డి సిల్వ ఒక్కడే 20 పరుగులు మార్కు(25) దాటాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు స్కోరు చేసింది. టీమిండియా రికార్డు బ్రేక్ కాగా పటిష్ట పేస్‌దళం గల పాకిస్తాన్ మీద వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ క్రమంలో టీమిండియా పేరిట ఉన్న రికార్డును శ్రీలంక బద్దలు కొట్టింది. ప్రపంచకప్ చరిత్రలో పాక్ మీద హయ్యస్ట్ స్కోరు సాధించిన జట్టుగా అవతరించింది. ఇక లంకతో మ్యాచ్‌లో హసన్ అలీ అత్యధికంగా 4 వికెట్లు తీయగా.. హ్యారిస్ రవూఫ్ రెండు, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహిన్ ఆఫ్రిది ఒక్కో వికెట్ పడగొట్టారు. వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో పాకిస్తాన్ మీద అత్యధిక పరుగులు స్కోరు చేసిన జట్లు: ►2023: శ్రీలంక- 344/9- హైదరాబాద్‌లో ►2019: టీమిండియా- 336/5 - మాంచెస్టర్‌లో ►2019: ఇంగ్లండ్- 334/9- నాటింగ్‌హాంలో ►2003: ఆస్ట్రేలియా 310/8- జొహన్నస్‌బర్గ్‌లో.. శ్రీలంక- పాకిస్తాన్లో నమోదైన మరో రికార్డు వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ మీద ఒకే మ్యాచ్‌లో సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలోకి కుశాల్ మెండిస్, సమరవిక్రమ. 2019లో జో రూట్ 107, జోస్ బట్లర్ 103 పరుగులు సాధించారు. చదవండి: చరిత్ర సృష్టించిన మెండిస్.. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ! View this post on Instagram A post shared by ICC (@icc) -
సెంచరీలతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. పాకిస్తాన్ టార్గెట్ 345 పరుగులు
వన్డే ప్రపంచకప్-2203లో భాగంగా ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక అందుకు తగ్గట్టు ప్రదర్శన కనబరిచింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి లంక 344 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 పరుగులు), సదీర సమరవిక్రమ(89 బంతుల్లో 108) అద్బుతమైన సెంచరీతో చెలరేగారు. వీరిద్దరితో పాటు ఓపెనర్ నిస్సాంక(51) హాఫ్ సెంచరీతో రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో హసన్ అలీ 4 వికెట్లు పడగొట్టగా.. హ్యారిస్ రవూఫ్ రెండు, అఫ్రిది, నవాజ్, షాదాబ్ తలా వికెట్ సాధించారు. చదవండి: ODI WC 2023: చరిత్ర సృష్టించిన మెండిస్.. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ! -
CWC 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 10) పాకిస్తాన్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇర్లు జట్లు చెరో మార్పు చేశాయి. కసున్ రజిత స్థానంలో తీక్షణ లంక జట్టులోకి రాగా.. ఫకర్ జమాన్ స్థానంలో షఫీక్ పాక్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేరాడు. శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ -
పాక్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. ఫైనల్లో టీమిండియాతో 'ఢీ'
ఏషియన్ గేమ్స్ 2023 వుమెన్స్ క్రికెట్లో శ్రీలంక ఫైనల్‌కు చేరింది. ఇవాళ (సెప్టెంబర్ 24) జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో లంకేయులు పాక్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో షావాలా జుల్ఫికర్ (16), ఒమైమా సోహైల్ (10), మునీబా అలీ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అమీన్ (3), కెప్టెన్ నిదా దార్ (9), అలియా రియాజ్ (2), నటాలియా పర్వేజ్ (8). ఉమ్ ఎ హనీ (9), డయానా బేగ్ (9), నస్రా సంధు (0) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్లలోప్రబోదని 3 వికెట్లు పడగొట్టగా.. కవిష దిల్హరి 2, ప్రియదర్శిని, అచిని కులసూరియా, రణవీర తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కెప్టెన్ చమారీ ఆటపట్టు 14, అనుష్క సంజీవని 15, హర్షిత సమరవిక్రమ 23, విష్మి గుణరత్నే 0 పరుగులు చేయగా.. నిలక్షి డిసిల్వ 18, హసిని పెరీరా 1 శ్రీలంకు విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో సదియా ఇక్బాల్, డయానా బేగ్, ఉమ్ ఎ హనీ తలో వికెట్ పడగొట్టారు. ఫైనల్లో భారత్‌ను ఢీకొట్టనున్న శ్రీలంక.. రెండో సెమీస్‌లో పాక్‌పై గెలుపుతో శ్రీలంక ఫైనల్‌కు చేరింది. గోల్డ్ మెడల్ కోసం జరిగే తుది సమరంలో లంకేయులు టీమిండియాను ఢీకొట్టనున్నారు. ఫైనల్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 11:30 గంటలకు మొదలవుతుంది. కాగా, ఇవాలే జరిగిన తొలి సెమీస్‌లో భారత్.. బంగ్లాదేశ్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. -
PAK VS SL: ఉత్కంఠ పోరులో పాక్ అవుట్.. ఫైనల్లో భారత్ vs శ్రీలంక
అనుకున్నదే జరిగింది. చరిత్ర పునరావృతమైంది. భారత్ పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్లో తలపడితే చూడాలని ఆశపడ్డ అభిమానులకు మరోసారి భంగపాటు ఎదురయింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్.. శ్రీలంక చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో దసున్ షనక బృందం ఆసియా కప్ 2023 ఫైనల్ కు దూసుకెళ్లింది. సెప్టెంబర్ 17న టీమిండియాతో ట్రోఫీ కోసం తలపడనుంది. కొలంబో వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి బాబర్ ఆజం బృందం 252 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక డి.ఎల్.ఎస్ పద్ధతిలో విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో గెలుపొంది టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది. ఉత్కంఠ పోరులో పాక్‌పై శ్రీలంక విజయం ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా శ్రీలంక-పాకిస్తాన్ జరిగిన మద్య జరిగిన మాచ్లో శ్రీలంక విజయం సాధించింది. చివరి వరకు సాగిన ఉత్కంఠ పోరులో పాక్‌పై శ్రీలంక రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి బంతికి శ్రీలంకను గెలిపించిన అసలంక. దీంతో శ్రీలంక ఫైనల్‌కు చేరింది. ఈ నెల 17న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక, భారత్‌తో తలపడనుంది. స్కోర్లు: పాక్ 252/7, శ్రీలంక 253/8 ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 246/8 వద్ద శ్రీలంక ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రమోద్ మదుశన్ ఔటయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక 243/7 వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. దునిత్ వెల్లలేజ్ ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక 243/6 వద్ద శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. ధనుంజయ సిల్వ ఔటయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 222/5 (37) వద్ద శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. దసున్ శనక (2) పరుగులకు ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక 210/4 (35) వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. కుసాల్ మండీస్ (91) పరుగులకు ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక 177/3 (29) వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. సమర విక్రమ (48) పరుగులకు ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక 77 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. నిస్సంక ఔటయ్యాడు. పాక్ 252/7.. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక 20 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. కుశాల్ పెరీరా (17) రనౌటయ్యాడు. చెలరేగిన రిజ్వాన్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడిన పాక్ చివర్లో చెలరేగి ఆడింది. ముఖ్యంగా మహ్మద్ రిజ్వాన్ (73 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించాడు. అతనికి ఇఫ్తికార్ అహ్మద్ (47) సహకరించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో అబ్దుల్లా షఫీక్ (52) అర్ధ సెంచరీతో రాణించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను తొలుత 45 ఓవర్లకు, మధ్యలో 42 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. నిర్ణీత 42 ఓవర్లలో పాక్ స్కోర్ 252/7గా ఉంది. లంక బౌలర్లలో పతిరణ 3, మధుషన్ 2, తీక్షణ, వెల్లలగే చెరో వికెట్ పడగొట్టారు. 36 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 192/5 36 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 192/5గా ఉంది. మహ్మద్ రిజ్వాన్ (57), ఇఫ్తికార్ అహ్మద్ (23) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం అంతరాయం.. 27.4 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 130/5 వర్షం మరోసారి మ్యాచ్‌కు ఆటంకం కలిగించింది. ఐదో వికెట్ పడ్డవెంటనే మొదలైంది. 27.4 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 130/5గా ఉంది. రిజ్వాన్ (22) క్రీజ్‌లో ఉన్నాడు. 27 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 128/4 27 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ 128/4గా ఉంది. మొహమ్మద్ నవాజ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (22) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ 73 పరుగుల వద్ద పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. యువ స్పిన్నర్ వెల్లలగే బౌలింగ్‌లో బాబర్ ఆజమ్ (29) స్టంపౌటయ్యాడు. నత్త నడకలా సాగుతున్న పాక్ బ్యాటింగ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 6 ఓవర్లలో వికెట్ కోల్పోయి 19 పరుగులు మాత్రమే చేసింది. పాక్ ఇన్నింగ్స్ నత్త నడకలా సాగుతుంది. ప్రమోద్ మధుషన్ ఫఖర్ జమాన్‌ను (4) క్లీన్ బౌల్డ్ చేయగా.. అబ్దుల్లా షఫీక్ (6), బాబర్ ఆజమ్ (9) క్రీజ్‌లో ఉన్నారు. తుది జట్లు.. పాకిస్తాన్: ఫకర్ జమాన్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), మొహమ్మద్ హరీస్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మొహమ్మద్ నవాజ్, జమాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మొహమ్మద్ వసీం జూనియర్ శ్రీలంక: పథుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, దసున్ షనక, దునిత్ వెల్లలగే, మహీష్ తీక్షణ, ప్రమోద్ మధుషన్, మతీష పతిరణ ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా శ్రీలంక-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (సెప్టెంబర్ 14) జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో కనీసం టాస్ కూడా పడలేదు. పరిస్థితులను చూస్తుంటే ఈ మ్యాచ్ రద్దయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంటుంది. పాక్‌తో పోలిస్తే మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా లంక ఈ ఛాన్స్ కొట్టేస్తుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో శ్రీలంక.. టీమిండియాను ఢీకొంటుంది. మరోవైపు పాక్ ఫైనల్‌కు చేరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అది ఇవాల్టి మ్యాచ్ జరిగి, అందులో పాక్ విజయం సాధించాలి. పాక్‌కు గెలుపు కాకుండా ఎలాంటి ఫలితం వచ్చినా ప్రయోజనం లేదు. కాగా, మరో సూపర్-4 మ్యాచ్ జరగాల్సి ఉండగానే భారత్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. సూపర్-4 దశలో టీమిండియా వరుసగా పాకిస్తాన్, శ్రీలంకలను మట్టికరిపించి, తుది పోరుకు అర్హత సాధించింది. ఫైనల్‌కు ముందు భారత్ రేపు (సెప్టెంబర్ 15) బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాల బాటపట్టే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు అవకాశం రాని ఆటగాళ్లకు మేనేజ్మెంట్ అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురు స్టార్ ప్లేయర్లు రెస్ట్ తీసుకోవచ్చు. -
Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే
ఆసియా క్రికెట్ సమరానికి సమయం సమీపించింది. ముల్తాన్ వేదికగా ఆగష్టు 30న ఈ వన్డే టోర్నీ షురూ కానుంది. గతేడాది పొట్టి ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్‌ను శ్రీలంక గెలవగా... పాకిస్తాన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం తగ్గేదేలే అంటూ టీమిండియా గట్టి పోటీనిచ్చేందుకు సమాయత్తమవుతోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఆటగాళ్లకు బీసీసీఐ ప్రత్యేక శిక్షణా శిబిరం ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా ప్లేయర్ల ఫిట్నెస్ అంచనా వేసేందుకు యో- యో టెస్టులు నిర్వహిస్తోంది. వన్డే వరల్డ్‌కప్ వంటి ఐసీసీ ఈవెంట్‌కు ముందు ప్రతిష్టాత్మక టోర్నీలో ఈసారి భారత్ విజేతగా నిలవాలనే సంకల్పంతో కఠిన వైఖరితో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్-2023 పూర్తి షెడ్యూల్, జట్లు, ప్రత్యక్ష ప్రసారాలు, మ్యాచ్ ఆరంభ సమయం తదితర వివరాలు తెలుసుకుందాం! ఆసియా వన్డే కప్-2023 వేదికలు పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా హైబ్రిడ్ విధానంలో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గ్రూప్-ఏ జట్లు ►ఇండియా, పాకిస్తాన్, నేపాల్ గ్రూప్-బి జట్లు ►బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, శ్రీలంక ఆసియా కప్-2023 పూర్తి షెడ్యూల్ ►ఆగష్టు 30: పాకిస్తాన్ వర్సెస్ నేపాల్- ముల్తాన్- పాకిస్తాన్ ►ఆగష్టు 31: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక- క్యాండీ- శ్రీలంక ►సెప్టెంబరు 2: పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- క్యాండీ- శ్రీలంక ►సెప్టెంబరు 3: బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గనిస్తాన్- లాహోర్- పాకిస్తాన్ ►సెప్టెంబరు 4: ఇండియా వర్సెస్ నేపాల్- క్యాండీ- శ్రీలంక ►సెప్టెంబరు 5: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్- లాహోర్- పాకిస్తాన్ సూపర్-4 స్టేజ్ ►సెప్టెంబరు 6: గ్రూప్- ఏ టాపర్ వర్సెన్ గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- లాహోర్- పాకిస్తాన్ ►సెప్టెంబరు 9: గ్రూప్- బి టాపర్ వర్సెస్ గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- కొలంబో- శ్రీలంక ►సెప్టెంబరు 10: గ్రూప్-ఏ టాపర్ వర్సెస్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- కొలంబో- శ్రీలంక ►సెప్టెంబరు 12: గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- గ్రూప్-బి టాపర్- కొలంబో- శ్రీలంక ►సెప్టెంబరు 14: గ్రూప్-ఏ టాపర్ వర్సెస్ గ్రూప్-బి టాపర్- కొలంబో- శ్రీలంక. ►సెప్టెంబరు 15: గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన జట్టు వర్సెస్ గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు- కొలంబో- శ్రీలంక ►సెప్టెంబరు 17: సూపర్ ఫోర్ టాపర్ వర్సెస్ సూపర్ ఫోర్ సెకండ్ టాపర్- కొలంబో- శ్రీలంక. మ్యాచ్‌ల ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం) పాకిస్తాన్లో జరిగే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు, శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లు మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడంటే.. ►టీవీలో: స్టార్ స్పోర్ట్స్- స్టార్ స్పోర్ట్స్-1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్డీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్డీ, స్టార్ స్పోర్ట్స్ సెలక్ట్ 1, స్టార్ స్పోర్ట్స్ సెలక్ట్ 1 హెచ్డీ, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్డీ, స్టార్ స్పోర్ట్స్' తమిళ్. ►డిజిటల్: డిస్నీ+హాట్‌స్టార్(వెబ్సైట్, మొబైల్ యాప్). ఆసియా కప్-2023 జట్లు టీమిండియా: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. స్టాండ్ బై: సంజూ శాంసన్. పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తికర్ అహ్మద్, తయ్యబ్ తాహిర్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీమ్ అష్రఫ్, హ్యారిస్ రవూఫ్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది. నేపాల్: రోహిత్ పౌడెల్ (కెప్టెన్), మహమ్మద్ ఆసిఫ్ షేక్, కుశాల్ భుర్టెల్, లలిత్ రాజ్‌బన్షి, భీమ్ షర్కీ, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లామిచానే, కరణ్ కెసి, గుల్షన్ కుమార్ ఝా, ఆరిఫ్ షేక్, సోంపాల్ కమీ, ప్రతిష్ జిసి, కిషోర్ మహతో , అర్జున్ సౌద్, శ్యామ్ ధాకల్, సుదీప్ జోరా. బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మముద్, మెహదీ హసన్, నసూమ్ అహ్మద్, షమీమ్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, ఇబాదత్ హుసేన్, మహ్మద్ నయీమ్ స్టాండ్ బై ప్లేయర్లు - తైజుల్ ఇస్లాం, సైఫ్ హసన్, తంజీమ్ హసన్ సకీబ్. ►అఫ్గనిస్తాన్, శ్రీలంక ఆసియా కప్ టోర్నీకి తమ జట్లు ప్రకటించాల్సి ఉంది. చదవండి: WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్ -
ఏడు వికెట్లతో చెలరేగిన 36 ఏళ్ల పాక్ బౌలర్.. సిరీస్ క్లీన్‌స్వీప్
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 188 పరుగులకు కుప్పకూలింది. ఏంజెలో మాథ్యూస్ 63 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. దిముత్ కరుణరత్నే 41 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో స్పిన్నర్ నొమన్ అలీ ఏడు వికెట్లతో చెలరేగగా.. చివర్లో నసీమ్ షా మూడు వికెట్లు తీశాడు. సొంతగడ్డపై లంకకు ఇదే అతిపెద్ద పరాజయం కాగా.. పాకిస్తాన్‌కు లంక గడ్డపై అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను పాకిస్తాన్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను 576 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (201 పరుగులు) డబుల్ సెంచరీతో మెరవగా.. అగా సల్మాన్ (132 నాటౌట్) అజేయ సెంచరీతో మెరిశాడు. సాద్ షకీల్ 57, షాన్ మసూద్ 51, మహ్మద్ రిజ్వాన్ 50 పరుగులు చేశారు. అంతకముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌట్ అయింది. 36 ఏళ్ల వయసులో సంచలనం ఇక నొమన్ అలీ 36 ఏళ్ల వయసులో తన స్పిన్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఒక దశలో లంక ఇన్నింగ్స్‌లో తొలి ఏడు వికెట్లు నొమన్ అలీనే పడగొట్టడంతో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల హాల్ నమోదు చేస్తాడనిపించింది. జిమ్ లేకర్(1956), అనిల్ కుంబ్లే(1999), ఎజాజ్ పటేల్(2021)లో టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన బౌలర్లుగా చరిత్ర సృష్టించారు. అయితే ఆఖర్లో టెయిలెండర్ల వికెట్లను నసీమ్ షా రెండు ఓవర్ల వ్యవధిలో తీయడంతో నొమన్ అలీ తృటిలో ఆ ఫీట్‌ను చేజార్చుకున్నాడు. Noman Ali's brilliant spell rips through Sri Lanka's batting lineup.🎯 His Best Bowling Figures in a Test Innings!🔝#NomanAli #Pakistan #SLvPAK pic.twitter.com/OMYnkbp85R — Sportskeeda (@Sportskeeda) July 27, 2023 డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో పాకిస్తాన్ లంకతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్తాన్ డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. లంకతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా 24 పాయింట్లను(100 పర్సంటైల్) పాక్ ఖాతాలో వేసుకుంది. మరోవైపు టీమిండియా విండీస్‌తో సిరీస్‌ను గెలిచినప్పటికి ఒక మ్యాచ్ డ్రా కావడంతో 16 పాయింట్లతో(66.67 పర్సంటైల్) రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా 26 పాయింట్లు(54.17 పర్సంటైల్) ఉండగా.. ఇంగ్లండ్ 14 పాయింట్లు(29.17 పర్సంటైల్)తో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. Pakistan reigns supreme 🔥 With a clean sweep in this series, they sit proudly at the top of the World Test Championship 2023-2025 leaderboard#WTC25 #PAKvSL pic.twitter.com/IDi6PyW37f — Cricket Pakistan (@cricketpakcompk) July 27, 2023 చదవండి: ENG Vs AUS 5th Test: మొదలైన ఐదో టెస్టు.. ఇంగ్లండ్ గెలిచినా యాషెస్ కంగారులదే -
క్రికెట్ చరిత్రలోనే సరికొత్త షాట్.. ఇప్పటి వరకు చూసుండరు! వీడియో వైరల్
కొలంబో వేదికగా శ్రీలంక వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ పట్టుబిగుస్తోంది. పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 576 పరుగుల పరుగుల భారీ స్కోర్ సాధించింది. 563/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్.. అదనంగా 13 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో పాకిస్తాన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (201; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీ చేయగా... ఆఘా సల్మాన్ (132 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. ఇక 410 పరుగులు వెనుకుబడి తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక.. 29 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. క్రికెట్ చరిత్రలోనే సరికొత్త షాట్ ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఓ సరికొత్త షాట్‌ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. పాకిస్తాన్ ఇన్నింగ్‌లో అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో ఓ బంతిని.. బాబర్ వినూత్న షాట్‌తో స్లిప్ దిశగా బౌండరీ పంపాడు. ఫుల్ అండ్ ఔట్ సైడ్ పడిన బంతిని బాబర్ తన బ్యాట్‌ని పైకెత్తి వదిలివేయాలని తొలుత అనుకున్నట్లు కన్పించింది. కానీ వెంటనే బాబర్ తన మైండ్ మార్చుకోని లేట్‌గా షాట్ ఆడాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని మొదటి స్లిప్, గల్లీ మధ్య నుంచి బౌండరీ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బాబర్ ఉద్దేశపూర్వకంగానే ఆడాడని మరి కొందరు అంటున్నారు. ఆజం నెట్స్‌లో ఈ షాట్ ప్రాక్టీస్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో కూడా ఆజం నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: IND vs WI: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. అలా అయితే సచిన్, గంగూలీ! Babar Azam played that shot intentionally and guided it for four. Root and Williamson play it too! Babar has mastered it and can play it whenever he wants to 💚 Commentators don't follow Babar in the nets and it shows, they don't know a thing 👎 #SLvPAK https://t.co/4iyVqnmGgH pic.twitter.com/5JRkMb1W5n — Farid Khan (@_FaridKhan) July 26, 2023 -
లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి ఓపెనర్‌గా..
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ డబుల్ సెంచరీతో మెరిశాడు. 322 బంతులెదుర్కొన్న షఫీక్ 19 ఫోర్లు, 4 సిక్సర్లతో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా టెస్టు క్రికెట్లో అబ్దుల్లా షఫీక్‌కు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. కాగా 23 ఏళ్ల వయసున్న అబ్దుల్లా షఫీక్ పాక్ తరపున డబుల్ సెంచరీ బాదిన మూడో యంగెస్ట్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు జావెద్ మియాందాద్, హనీఫ్ మొహమ్మద్‌లు ఈ ఘనత సాధించారు. ఇక లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి పాక్ ఓపెనర్‌గానూ అబ్దుల్లా షఫీక్ చరిత్రకెక్కాడు. A true champion knock 🔥❤️ 200 hundred from @imabd28 #SLvPAK #SLvsPAK #AbdullahShafique pic.twitter.com/c2m4ldK3m8 — Mir kashi👑 (@oya_kojuu) July 26, 2023 ఇక రెండో టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచిన పాక్ సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 458 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్‌కు(200 నాటౌట్) అగా సల్మాన్(80 బంతుల్లో 70 బ్యాటింగ్) చక్కగా సహకరిస్తున్నాడు. ఆశితో ఫెర్నాండో మూడు వికెట్లు తీయగా.. ప్రభాత్ జయసూరియా ఒక వికెట్ పడగొట్టాడు. ఇప్పటివరకు పాకిస్తాన్ 292 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడం.. వరుణుడు అడ్డుపడకపోతే మాత్రం పాకిస్తాన్ విజయాన్ని ఆపడం లంకకు కష్టసాధ్యమనే చెప్పొచ్చు. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది.ధనుంజయ డిసిల్వా 57, దినేశ్ చండిమల్ 34 మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్ షా మూడు, షాహిన్ అఫ్రిది ఒక వికెట్ తీశాడు. 🌟 First visiting opener to score a double 💯 at SSC, Colombo 🌟 Third-youngest double-centurion for 🇵🇰 after Javed Miandad and Hanif Mohammad@imabd28 scores a magnificent maiden double ton 🙌#SLvPAK pic.twitter.com/3zGaD0pnKl — Pakistan Cricket (@TheRealPCB) July 26, 2023 Maiden Double Hundred - Take a bow, Abdullah Shafique! 🌟 He is now the third youngest Pakistan batter to score a Test double ton after Javed Miandad and Hanif Mohammad 💯👌#CricketTwitter #SLvPAK #WTC25 #PakBall #abdullahshafique pic.twitter.com/QvRxprwC7J — CricWick (@CricWick) July 26, 2023 చదవండి: Saud Shakeel: అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టి.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు! Abdullah Shafique: సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్.. భారీ ఆధిక్యం దిశగా -
అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టి.. రోహిత్, కోహ్లిలతో పాటు!
Pakistan And India stars reach new career highs after latest rankings update: పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకు సాధించాడు. తద్వారా టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో కలిసి టాప్-15లో చోటు దక్కించుకున్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంకతో తమ తొలి సిరీస్ ఆడుతోంది. లంకతో మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ ఈ క్రమంలో.. గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో సౌద్ షకీల్ అద్భుత అజేయ ద్విశతకం(208)తో మెరిశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఒక్కసారిగా పైకి దూసుకువచ్చాడు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ర్యాంకుల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. రోహిత్ పది, కోహ్లి 14 స్థానాల్లో కొనసాగుతుండగా.. యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరంగా ఉన్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఒక స్థానం కోల్పోయి 12వ ర్యాంకుకు పడిపోయాడు. నంబర్ 1గా అతడే.. అశ్విన్ సైతం అగ్రస్థానంలోనే.. ఇక టాప్-10 ర్యాంకుల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. నంబర్ 1గా కేన్ విలియమ్సన్ కొనసాగుతుండగా.. లబుషేన్, జో రూట్, ట్రవిస్ హెడ్, బాబర్ ఆజం వరుసగా ఆ తర్వాతి స్థానాలు ఆక్రమించారు. మరోవైపు.. ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హవా కొనసాగుతోంది. విండీస్ టూర్లో 14 వికెట్లతో అదరగొట్టిన అతడు అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకు సాధించాడు. కాగా విండీస్‌తో రెండో టెస్టు డ్రా అయిన నేపథ్యంలో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోల్పోయింది. పాకిస్తాన్ ప్రస్తుతం టాప్‌లో ఉంది. చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్‌స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా.. -
లంక బౌలర్ సంచలనం.. బాబర్ ఆజం వీక్నెస్ తెలిసినోడు
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆట వర్షార్పణం అయినప్పటికి మూడోరోజు మాత్రం దాటిగా ఆడుతూ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ సెంచరీతో రాణించగా.. సాద్ షకీల్ అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. 115 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ విషయం పక్కనబెడితే.. ఒక మ్యాచ్‌లో ఎంత బాగా బ్యాటింగ్ చేసినా అతని వీక్నెస్ తెలిసిన బౌలర్ ప్రత్యర్థి జట్టులో కచ్చితంగా ఒకడు ఉంటాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి లంక బౌలర్ ప్రభాత్ జయసూరియాకు చిక్కాడు. టెస్టు క్రికెట్లో బాబర్ ఆజం ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ఔటవ్వడం ఇది ఆరోసారి. 39 పరుగులు చేసిన బాబర్ జయసూరియా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. బాబర్ ఆజంను ఎక్కువసార్లు ఔట్ చేసిన బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్(ఆరుసార్లు, 133 బంతులు)తో కలిసి జయసూరియా(ఆరుసార్లు, 324 బంతులు) సంయుక్తంగా ఉన్నాడు. వీరిద్దరి తర్వాత ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ (ఐదుసార్లు, 443 బంతులు) బాబర్ ఆజం వికెట్ దక్కించుకున్నాడు. Babar Azam Vs Prabath Jayasuriya: Innings - 7. Out - 6. Runs - 172. Average - 28.7. pic.twitter.com/3h7LhnctcN — Mufaddal Vohra (@mufaddal_vohra) July 26, 2023 Prabath Jayasuriya has dismissed Babar Azam the joint-most times in Tests, but check out the number of balls Josh Hazlewood has taken for his six wickets 👇 pic.twitter.com/h47pkisPMK — ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2023 చదవండి: సిక్స్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు.. ఎలాగో చూడండి..! Abdullah Shafique: సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్.. భారీ ఆధిక్యం దిశగా -
సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్.. భారీ ఆధిక్యం దిశగా
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ దాటిగా ఆడుతోంది. వర్షం కారణంగా రెండో రోజు ఆటలో కొన్ని ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. దీంతో మూడోరోజు ఆటలో తొలి సెషన్ నుంచే పాక్ బ్యాటర్లు దూకుడు కనబరుస్తున్నారు. ఈ క్రమంలో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ సెంచరీతో మెరిశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 87 పరుగులు నాటౌట్‌గా నిలిచిన షఫీక్ మూడోరోజు ఆటలో సెంచరీ అందుకున్నాడు. 149 బంతుల్లో శతకం అందుకున్న అబ్దుల్లా షఫీక్‌కు ఇది టెస్టుల్లో నాలుగో సెంచరీ.. శ్రీలంకపై రెండోది కావడం విశేషం. 210 బంతుల్లో 131 పరుగులతో ఆడుతున్న షఫీక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 265 పరుగులతో ఆడుతుంది. షఫీక్‌తో పాటు సాద్ షకీల్ 30 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 99 పరుగుల ఆధిక్యంలో ఉన్న పాకిస్తాన్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఇక శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ధనుంజయ డిసిల్వా 57, దినేశ్ చండిమల్ 34 మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్ షా మూడు, షాహిన్ అఫ్రిది ఒక వికెట్ తీశాడు. Abdullah Shafique brings up his 4th century in Tests! Pakistan continue to build their lead.. #SLvPAK pic.twitter.com/KPxCpC3SDv — Cricbuzz (@cricbuzz) July 26, 2023 చదవండి: మెస్సీ అదరగొట్టినా.. తీవ్ర నిరాశలో అభిమానులు! చరిత్ర సృష్టించిన మలేసియా బౌలర్.. టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు, అన్ని క్లీన్‌బౌల్డ్‌లే..! -
ఆసియా కప్-2023 ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్..
ACC Mens Emerging Teams Asia Cup 2023: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023 ఫైనల్లో పాకిస్తాన్ జట్టు అడుగుపెట్టింది. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో అతిథ్య శ్రీలంకను 60 పరుగులు తేడాతో చిత్తు చేసిన పాకిస్తాన్.. తుది పోరుకు అర్హత సాధించింది. 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 262 పరుగులకే ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో ఆర్షద్ ఇక్భాల్ 5 వికెట్లతో చెలరేగగా.. ముబాసిర్ ఖాన్,సుఫియాన్ ముఖీమ్ తలా రెండు వికెట్లు సాధించారు. శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో(97),సహన్ అరాచ్చిగే(97) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో ఒమర్ యూసఫ్(88), మహ్మద్ హారిస్(52), ముబాసిర్ ఖాన్(42) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఆఖరిలో బౌలర్ మహ్మద్ వసీం(24) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో లహిరు సమరకోన్,ప్రమోద్ మదుషన్, కరుణ్ రత్నే తలా రెండు వికెట్లు సాధించగా.. వెల్లలగే, సహన్ అరాచ్చిగే చెరో వికెట్ పడగొట్టాడరు. ఇక జూన్ 23న కొలంబో వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్ లేదా బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ తలడపడనుంది. చదవండి: IND vs WI: అయ్యో రోహిత్.. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదుగా! వీడియో వైరల్ -
WTC Points Table: అగ్రస్థానంలో టీమిండియా.. పాక్ కూడా మనవెంటే!
ICC World Test Championship- 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ తొలి మ్యాచ్‌లోనే టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో డొమినికా వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కరేబియన్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగా.. అరంగేట్ర బ్యాటర్ యశస్వి జైశ్వాల్ 171 పరుగులతో చెలరేగాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాపర్ ఈ నేపథ్యంలో భారత జట్టు ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. జూలై 12న మొదలై మూడు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో ఈ విజయం ద్వారా 12 పాయింట్లు సాధించిన టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానం ఆక్రమించింది. అయితే, దాయాది జట్టు కూడా రోహిత్ సేనను అనుసరించడం విశేషం. పాక్ కూడా మనవెంటే కాగా పాకిస్తాన్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో బాబర్ ఆజం బృందం 4 వికెట్ల తేడాతో గెలిచింది. జూలై 16న మొదలై ఐదురోజుల పాటు సాగిన మ్యాచ్‌లో ఆతిథ్య లంకను చిత్తు చేసింది. కాగా పాక్‌కు కూడా తాజా డబ్ల్యూటీసీ సైకిల్లో ఇదే తొలి మ్యాఛ్ కావడం విశేషం. దీంతో.. 12 పాయింట్లతో టీమిండియాతో సంయుక్తంగా ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లో ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో భాగంగా.. ఇప్పటి వరకు మూడు టెస్టులాడిన చాంపియన్ ఆస్ట్రేలియా.. రెండింట గెలిచి.. ఒక మ్యాచ్‌లో ఓడింది. చాంపియన్ ఎక్కడంటే ఈ క్రమంలో 22 పాయింట్లు(61.11శాతం) సాధించి మూడో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 10 పాయింట్ల(పెనాల్టీ పడటం వల్ల రెండు పాయింట్లు మైనస్)తో నాలుగోస్థానంలో ఉంది. మిగతా జట్లలో శ్రీలంక, వెస్టిండీస్ ఒక్కో ఓటమితో టాప్ 7, 8 స్థానాల్లో ఉన్నాయి. మిగతా వాటిలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా ఇంకా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదిలా ఉంటే.. ట్రినిడాడ్ వేదికగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు గురువారం మొదలుకాగా.. జూలై 24 నుంచి శ్రీలంక- పాక్ రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్! -
SL Vs Pak: లంకపై పాక్ విజయం! ప్రైజ్‌మనీ ఎంతంటే! సారీ చెప్పిన బోర్డు..
Sri Lanka vs Pakistan, 1st Test: శ్రీలంకతో తొలి టెస్టులో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం విదితమే. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బాబర్ ఆజం బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. గాలే వేదికగా జూలై 16న మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య లంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. సౌద్ షకీల్ సంచలన ఇన్నింగ్స్ ధనంజయ డి సిల్వ సెంచరీ(122) నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేయగలిగింది. ఇందుకు దీటుగా బదులిచ్చిన పాకిస్తాన్ 461 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగించి ఆధిక్యం సాధించింది. సౌద్ షకీల్ అజేయ డబుల్ సెంచరీ(208) కారణంగా ఈ మేరకు స్కోరు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో లంక 279 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ఆఖరి రోజు ఆటలో భాగంగా 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసిన పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన సౌద్ షకీల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ప్రైజ్‌మనీ ఎంతో! ఈ నేపథ్యంలో ప్రెజెంటేషన్ సెర్మనీలో భాగంగా మ్యాచ్ విజేత పాకిస్తాన్‌కు ఇచ్చిన చెక్ నెట్టింట వైరల్‌గా మారింది. విజయానంతరం చెక్ అందుకున్న పాక్ సారథి బాబర్ ఆజం ఫొటో చూసిన నెటిజన్లు అందులో ఉన్న తప్పును కనిపెట్టేశారు. అందులో ప్రైజ్‌మనీగా.. అక్షరాల్లో రెండు వేల యూఎస్ డాలర్లు అని రాసి ఉంది. అయితే, అంకెల్లో మాత్రం 5,000 యూఎస్ డాలర్లు అని ఉంది. క్షమించండి ఈ విషయంపై రచ్చ రచ్చ కాగా.. శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది. తప్పిదానికి క్షమాపణలు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ‘‘తొలి టెస్టు విజేతకు అందించిన ప్రెజెంటేషన్ చెక్‌లో దొర్లిన తప్పిదానికి చింతిస్తున్నాం. నిజానికి గ్రౌండ్ రైట్స్ హోల్డర్ దీనిని రూపొందించింది. ఏదేమైనా ఇందుకు శ్రీలంక క్రికెట్ పూర్తి బాధ్యత వహిస్తుంది. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాం’’అని బోర్డు తెలిపింది. కాగా జూలై 24 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: రోజుకు 10 కోట్లు! కోహ్లి ఆర్జన వెనుక రోహిత్ శర్మ బావమరిది! సల్మాన్ ఖాన్‌తోనూ.. pic.twitter.com/YZ3CJozoOK — Out Of Context Cricket (@GemsOfCricket) July 20, 2023 -
ఘన విజయం; లంక గడ్డపై అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా
శ్రీలంక పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టు శుభారంభం చేసింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పాకిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. లంక విధించిన 131 పరుగుల టార్గెట్‌ను పాకిస్తాన్ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇమాముల్ హక్(50 పరుగులు నాటౌట్) చివరి వరకు నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడు వికెట్లకు 48 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.24 పరుగులు చేసిన బాబర్ ఆజం ప్రభాత్ జయసూరియా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే తొలి ఇన్నింగ్స్ హీరో సాద్ షకీల్ 38 బంతుల్లో 30 పరుగులతో నిలకడగా ఆడి పాక్‌ను విజయం దిశగా నడిపించాడు. అయితే స్వల్ప వ్యవధిలో షకీల్‌తో పాటు కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ ఔటయ్యారు. వీర్దిదరు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అగా సల్మాన్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచి పాక్‌కు విజయాన్ని అందించాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూరియా నాలుగు వికెట్లు తీయగా.. రమేశ్ మెండిస్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌట్ అయింది. ధనుంజయ డిసిల్వా సెంచరీతో మెరిశాడు. ఇక పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌట్ అయింది. సాద్ షకీల్ డబుల్ సెంచరీ(208 పరుగులు నాటౌట్)తో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో లంక 279 పరుగులకే చాప చుట్టేసింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూలై 24 నుంచి 28 వరకు కొలంబో వేదికగా జరగనుంది. లంక గడ్డపై టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. ఇప్పటివరకు పాక్ లంకలో 26 టెస్టులాడి 10 విజయాలు అందుకొని తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఇంగ్లండ్ జట్టు(18 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలు), భారత్(24 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో) మూడో స్థానంలో ఉంది. చదవండి: Ashes 2023: 'అనుకున్నంత గొప్ప క్యాచ్ ఏమి కాదులే.. Virat Kohli: '500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్ కొట్టాల్సిందే' Most Test match wins by an away team in Sri Lanka: Pakistan 10 (26 matches) England 9 (18 matches) India 9 (24 matches) 📸: SLC#SLvPAK | #PAKvSL | #CricketTwitter pic.twitter.com/rvkQUuXdJb — Grassroots Cricket (@grassrootscric) July 20, 2023 -
లంక కీపర్‌ను ముప్పుతిప్పలు పెట్టిన పాక్ బౌలర్
పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగిస్తోంది. నాలుగో రోజు లంచ్ సమయానికి శ్రీలంక మూడు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. లంక జట్టు మరో 55 పరుగులు వెనుకబడి ఉంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండడంతో తొలి టెస్టులో ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైతే పాకిస్తాన్‌కు గెలుపు అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం పక్కనబెడితే మూడోరోజు ఆటలో పాక్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఇన్నింగ్స్ 120వ ఓవర్ రమేశ్ మెండిస్ వేశాడు. క్రీజులో పాక్ 11వ నెంబర్ బ్యాటర్ అర్బర్ అహ్మద్ ఉన్నాడు. మెండిస్ వేసిన బంతి అర్బర్ గ్లోవ్స్‌ను తాకి అతని ప్యాడ్లలో ఇరుక్కుంది. అయితే బంతి కింద పడకపోవడంతో అర్బర్ తన కాళ్లను షేక్ చేశాడు. ఈలోగా లంక వికెట్ కీపర్ సదీరా సమరవిక్రమ బంతిని అందుకునేందుకు పరిగెత్తుకువచ్చాడు. కానీ అర్బర్ తనవైపు వస్తున్న సమరవిక్రమను ఆటపట్టించాలని ముందుకు పరిగెత్తుకొచ్చాడు. అర్బర్ను అడ్డుకునే ప్రయత్నంలో తను రనౌట్ అవుతానేమోనని వెంటనే బంతిని కింద పడేసి క్రీజులోకి పరిగెత్తుకొచ్చాడు. అయితే కీపర్ సమరవిక్రమ రనౌట్ చేయకుండా బంతిని తనవద్దే ఉంచుకున్నాడు. ఇదంతా ఫన్నీగా సాగడంతో అక్కడున్న వారందరి మొహాల్లో నవ్వులు విరపూశాయి. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఇదంతా గమనించిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం నవ్వును ఆపుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌట్ అయింది. ధనుంజయ డిసిల్వా (122 పరుగులు) సెంచరీతో రాణించగా.. ఏంజలో మాథ్యూస్ 64 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో అఫ్రిది,నసీమ్ షా, అర్బర్ అహ్మద్‌లు తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో461 పరుగులకు ఆలౌట్ అయింది. సౌద్ షకీల్(208 పరుగులు నాటౌట్) డబుల్ సెంచరీతో మెరవగా.. ఆగా సల్మాన్ 83 పరుగులతో రాణించాడు. లంక బౌలర్లలో రమేశ్ మెండిస్ ఐదు వికెట్లతో రాణించగా.. ప్రభాత్ జయసూరియా మూడు వికెట్లు తీశాడు. Funniest Moment Today With Abrar Ahmad 🤣😂. #PAKvsSL #PAKvSL #SLvPAK #SLvsPAK pic.twitter.com/IjHPsWqGoo — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) July 18, 2023 చదవండి: Ishan Kishan: 'ఇవ్వడానికి ఏం లేదు.. బర్త్‌డే గిఫ్ట్ నువ్వే మాకు ఇవ్వాలి' SL VS PAK 1st Test: డాన్ బ్రాడ్‌మన్ తర్వాత ఈ పాక్ ఆటగాడే.. ఏకంగా 98.50 సగటు -
SL Vs Pak: జస్ట్ 87 పరుగులతో సెంచరీ మిస్! ఆ బాధ వర్ణణాతీతం!
Sri Lanka vs Pakistan, 1st Test- Babar Azam Failed: శ్రీలంకతో మొదటి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 16 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా మీమ్స్, ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడే నిమిత్తం పాకిస్తాన్ శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం (జూలై 16) తొలి మ్యాచ్ ఆరంభమైంది. గాలే వేదికగా జరుగుతున్న టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య లంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డి సిల్వ సూపర్ సెంచరీ అయితే, పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే దిముత్ కరుణరత్నె బృందానికి షాకిచ్చాడు. ఓపెనర్లు మధుష్క(4), కరుణరత్నె(29)లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(12)ను త్వరగా పెవిలియన్‌కు పంపాడు. ఇలా కష్టాల్లో కూరుకుపోయిన జట్టును నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మాథ్యూస్ (64), ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధనుంజయ డి సిల్వా(122) ఆదుకున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ సమరవిక్రమ(36) తన వంతు సహకారం అందించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 312 పరుగులు చేయగలిగింది. ఇక బ్యాటింగ్ మొదలెట్టిన పాకిస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు అబుల్లా షఫీక్(19)ను ప్రభాత్ జయసూర్య, ఇమామ్ ఉల్ హక్(1)ను కసున్ రజిత అవుట్ చేశారు. జస్ట్ 87 పరుగులతో సెంచరీ మిస్ అంటూ సెటైర్లు వన్‌డౌన్‌లో వచ్చి నిలదొక్కుకున్న షాన్ మసూద్(39)ను మెండిస్ పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన బాబర్ ఆజం పూర్తిగా తేలిపోయాడు. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో సమరవిక్రమకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘‘అయ్యో.. జస్ట్ 87 పరుగులతో బాబర్ ఆజం సెంచరీ మిస్ అయ్యాడు. ఈ జింబాబర్ పాక్‌లో ఉండే రోడ్పిచ్లు అనుకుని పొరపాటు పడ్డాడు’’ అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఇక టాపార్డర్ విఫలం కావడంతో సౌద్ షకీల్ (69- నాటౌట్), అఘా సల్మాన్ (61- నాటౌట్) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరి బాధ్యతాయుత ఇన్నింగ్స్ కారణంగా సోమవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ తొలి టెస్టు తుది జట్లు: శ్రీలంక దిముత్ కరుణరత్నే (కెప్టెన్), నిషాన్ మదుష్క, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, దినేష్ చండిమాల్, సదీర సమరవిక్రమ (వికెట్ కీపర్), రమేష్ మెండిస్, ప్రభాత్ జయసూర్య, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత. పాకిస్తాన్ అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్, బాబర్ అజామ్ (కెప్టెన్), సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), ఆఘా సల్మాన్, నౌమాన్ అలీ, అబ్రార్ అహ్మద్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా. చదవండి: కోహ్లి, రాహుల్, హార్దిక్.. వీళ్లెవరూ కాదు! సౌత్ హీరోయిన్ను పెళ్లాడిన క్రికెటర్? టీమిండియా కొత్త కెప్టెన్ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా.. ‘సెహ్వాగ్ నీకు బ్యాటింగే రాదు! పాక్‌లో ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు’ -
Viral Video: కళ్లు చెదిరే క్యాచ్..!
పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య ఇవాళ (జులై 16) మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్ ఒకటి నమోదైంది. పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్ ఈ క్యాచ్ పట్టాడు. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇమామ్.. గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. అఘా సల్మాన్ బౌలింగ్‌లో ఈ ఫీట్ నమోదైంది. ఇమామ్ సూపర్ క్యాచ్ పట్టడంతో సమరవిక్రమ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. Imam ul Haq with a superb catch@ImamUlHaq12#PakistanCricket #PAKvSL #CricketTwitter pic.twitter.com/gXtjHezRF4 — Hamza Siddiqui (@HamzaSiddiqui56) July 16, 2023 ఇమామ్ విన్యాసానికి ఫిదా అయిపోయిన క్రికెట్ అభిమానులు, సోషల్‌మీడియా వేదికగా అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాటే క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇమామ్ క్యాచ్ పట్టిన వెంటనే అంపైర్లు తొలి రోజు ఆటకు ముగించారు. పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు కేవలం 65.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వ (94) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డిసిల్వతో పాటు ఏంజెలో మాథ్యూస్ (64) అర్ధసెంచరీలతో రాణించారు. నిషాన్ మధుష్క (4), కుశాల్ మెండిస్ (12), దినేశ్ చండీమాల్ (1) విఫలం కాగా.. దిముత్ కరుణరత్నే (29), సదీర సమరవిక్రమ (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
SL Vs Pak: పాక్‌తో ఫైనల్! అప్పుడు వాళ్లు అలా.. ఇప్పుడు మేమిలా: దసున్ షనక
ఆసియా కప్-2022 టీ20 టోర్నీ మొదటి మ్యాచ్‌లో పరాభవం.. అఫ్గనిస్తాన్ చేతిలో ఘోర ఓటమి.. కానీ ఆ తర్వాత శ్రీలంక జట్టు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.. బంగ్లాదేశ్‌పై తొలి గెలుపు నమోదు చేసిన దసున్ షనక బృందం విజయాల బాట పట్టి టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచింది. సూపర్-4లో వరుసగా అఫ్గనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్లను ఓడించి ఫైనల్ చేరి.. తుదిపోరులో మరోసారి పాక్‌ను మట్టికరిపించి ఆసియా కప్ 15వ ఎడిషన్ విజేతగా అవతరించింది. దేశ ఆర్థిక పరిస్థితులు, సంక్షోభం దృష్ట్యా.. సొంత ప్రేక్షకుల కేరింతల నడుమ అందుకోవాల్సిన ట్రోఫీని దుబాయ్ గడ్డపై ముద్దాడింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తమ దేశ ప్రజలకు.. ఈ మెగా టోర్నీలో విజయంతో ఉపశమనం కలిగించి.. వాళ్ల ముఖాలు విజయదరహాసంతో వెలిగిపోయేలా చేసింది యువ ఆటగాళ్లతో కూడిన లంక జట్టు. అసాధారణ.. అద్వితీయ గెలుపు కోటి రూపాయలకు పైగా ప్రైజ్‌మనీ సాధించి దేశానికి శుభవార్త అందించింది. క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన ఈ గెలుపు నిజంగా అసాధారణమైనది. వారు పంచిన ఆనంతం అనిర్వచనీయమైనది. ముఖ్యంగా దుబాయ్ పిచ్ మీద టాస్ గెలిస్తేనే విజయం అన్న అభిప్రాయాన్ని తలకిందులు చేస్తూ జయకేతనం ఎగురవేసి.. గెలుపులోని అసలైన మజాను రుచిచూసింది. మాకు సీఎస్కే ఆదర్శం! ఈ నేపథ్యంలో విజయానంతరం శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తన ఆనందాన్ని పంచుకుంటూ.. ఈ మ్యాచ్‌లో.. ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తమకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నాడు. ఈ మేరకు షనక మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ 2021 చెన్నై ఫైనల్లో.. తొలుత బ్యాటింగ్ చేసి.. గెలిచింది. మేము మ్యాచ్ ఆడుతున్నపుడు నా మదిలో ఇదే విషయం మెదిలింది. మా జట్టులోని యువ ఆటగాళ్లు ఇక్కడి పరిస్థితులను చక్కగా అర్థం చేసుకున్నారు. ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ వనిందు నిజంగా తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రభావం చూపాడు. చమిక, ధనుంజయ డి సిల్వా కూడా బాగా బ్యాటింగ్ చేశారు. చివరి బాల్‌ను సిక్స్‌గా మలచడం మాకు టర్నింగ్ పాయింట్. 160 పరుగుల స్కోరు అనేది ఛేదించదగ్గ లక్ష్యంగానే కనిపిస్తుంది. అయితే, 170 మార్కు మానసికంగా ప్రత్యర్థిపై కాస్త ఒత్తిడి పెట్టేందుకు ఉపకరిస్తుంది. ఇక మధుషంక గురించి చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్‌గా తనకు నేను ఎంత వరకు అండగా ఉండాలో అంత వరకు మద్దతుగా నిలిచాను’’ అని షనక చెప్పుకొచ్చాడు. కాగా కరోనా నేపథ్యంలో ఐపీఎల్-2021 రెండో దశ మ్యాచ్‌లో యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు చెన్నై.. ఇప్పుడు శ్రీలంక ఈ క్రమంలో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లలో దాదాపు అన్నింటిలోనూ సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. అయితే, ఫైనల్లో ధోని సేన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసినప్పటికీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. 27 పరుగుల తేడాతో మోర్గాన్ బృందాన్ని మట్టికరిపించి చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే వేదికపై అదే తరహాలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. పాక్‌ను 23 పరుగులతో ఓడించి ఆసియా కప్-2022 చాంపియన్‌గా అవతరించింది. చదవండి: SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! కానీ.. -
ఇండియా నుంచి వచ్చారా? హ్యాపీగా ఉన్నారనుకుంటా: రమీజ్ రాజా దురుసు ప్రవర్తన
Asia Cup 2022 Final SL Vs Pak- Winner Sri Lanka: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రజా అనుచిత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. ఓటమి బాధను జీర్ణించుకోలేక తన అసహనాన్ని ఓ జర్నలిస్టుపై ప్రదర్శించాడు. తన దురుసు ప్రవర్తన కారణంగా విమర్శల పాలయ్యాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్లో శ్రీలంకతో తలపడిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 23 పరుగులతో లంక.. పాక్‌ను చిత్తు చేసి విజేతగా అవతరించింది. ఆరవసారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడి ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ బాధలో మునిగిపోయిన తమ దేశ ప్రజల మోములు నవ్వులతో వికసించేలా చేసింది దసున్ షనక బృందం. ఇదిలా ఉంటే.. తుది మెట్టుపై బోర్లా పడ్డ పాకిస్తాన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వీక్షించిన రమీజ్ రజాను.. పాక్ ఓటమి అనంతరం విలేకరులు పలకరించారు. ఈ సందర్భంగా.. రోహిత్ జుల్గన్ అనే జర్నలిస్టు.. ‘‘ఈ ఓటమి కారణంగా పాకిస్తాన్ అభిమానులు నిరాశచెంది ఉంటారు కదా’’ అని ప్రశ్నించారు. మీరు ఇండియా నుంచి వచ్చారా? ఇందుకు స్పందించిన రమీజ్ రాజా.. ‘‘బహుశా మీరు భారత్‌కు చెందిన వారు అనుకుంటా? మీరు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు కదా?’’ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. అంతటితో ఆగకుండా.. జర్నలిస్టు మీదమీదకు వస్తూ.. ఆయన ఫోన్ లాక్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను రోహిత్ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ‘‘నేను అడిగిన ప్రశ్నలో తప్పేముంది? పాకిస్తాన్ ఫ్యాన్స్ ఈ ఓటమితో బాధకు లోనై ఉంటారు కదా అన్నాను. కానీ మీరిలా నా ఫోన్ తీసుకోవడం సరైంది కాదు మిస్టర్ చైర్మన్’’ అని రమీజ్ రాజాను ట్యాగ్ చేశారు. ఇక దీనిపై స్పందించిన నెటిజన్లు రమీజ్ రాజా తీరును ఏకిపారేస్తున్నారు. ‘‘ఆయన అంత స్పష్టంగా చెబుతున్నా.. మీరు సంతోషంగా ఉన్నారని మీ ముఖమే చెబుతోందంటూ అసహనం ప్రదర్శించడం సరికాదు. బోర్డు చైర్మన్‌వి.. అందునా ఆటగాడివి.. క్రీడాస్ఫూర్తి తెలియదా? ఓటమిని హుందాగా అంగీకరించే మనస్తత్వం లేనపుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇలాంటి దురుసు ప్రవర్తన కారణంగా ఓటమి కంటే ఎక్కువ విమర్శలు మూటగట్టుకుంటారు’’ అంటూ పాక్, భారత నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! కానీ.. SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్! क्या मेरा सवाल ग़लत था - क्या पाकिस्तान के फ़ैन नाखुश नहीं है - ये बहुत ग़लत था एक बोर्ड के चेयरमैन के रूप में - आपको मेरा फ़ोन नहीं छीनना चाहिये था - that’s not right Mr Chairman Taking my phone was not right @TheRealPCB @iramizraja #PAKvSL #SLvsPAK pic.twitter.com/tzio5cJvbG — रोहित जुगलान Rohit Juglan (@rohitjuglan) September 11, 2022 Full enjoy 🥰 pic.twitter.com/ha3IvZY77Y — Salman (@salman_dant) September 11, 2022 -
SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! కానీ..
Asia Cup 2022 Winner Sri Lanka- Inzamam Ul Haq Comments: ఆసియా కప్-2022 టీ20 టోర్నీ ఫైనల్లో శ్రీలంకను విజేతగా నిలపడంలో ఆ జట్టు బ్యాటర్ భనుక రాజపక్సదే కీలక పాత్ర. 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాలో ఉన్న వేళ నేనున్నానంటూ ధైర్యం చెప్పాడు. 45 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించి.. చాంపియన్‌గా నిలడంలో తన వంతు సాయం చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు 30 ఏళ్ల రాజపక్స. తీవ్రమైన ఒత్తిడిలోనూ అద్భుతమైన స్ట్రైక్‌రేటుతో భనుక రాజపక్స రాణించి తీరు ప్రశంసనీయం. పాక్‌తో ఫైనల్లో అతడి స్ట్రైక్‌రేటు 157.78. రాజపక్స అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్.. భనుక రాజపక్స ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఎక్కువ బంతులు తీసుకుని రాజపక్స కనుక ఈ డెబ్బై పరుగులు చేసి ఉంటే.. ఆ ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదని వ్యాఖ్యానించాడు. సరైన సమయంలో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడని ప్రశంసించాడు. హసరంగ భళా రాజపక్స, హసరంగ! ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఇంజమామ్ మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘హసరంగ 31 పరుగులు... రాజపక్స 71 పరుగులు చేశాడు. ఈ రెండు అద్భుతమైన ఇన్నింగ్స్. కఠిన పరిస్థితుల్లో.. ఒత్తిడిని జయించి వారు ఈ స్కోర్లు నమోదు చేశారు. ఒకవేళ ఈ డెబ్బై పరుగులు చేసేందుకు గనుక రాజపక్స ఎక్కువ బంతులు తీసుకుని ఉంటే.. అప్పుడు లంక జట్టు స్కోరు 140 వరకు వచ్చి ఆగిపోయేది. అదే జరిగితే పాకిస్తాన్ సులువుగానే ఆ లక్ష్యాన్ని ఛేదించేది. అప్పుడు రాజపక్స ఇన్నింగ్స్ వృథాగా పోయేది. దానికసలు విలువే ఉండేది కాదు’’ అంటూ టీ20 ఫార్మాట్లో స్ట్రైక్‌రేటుకు ఉన్న ప్రాధాన్యం గురించి చెప్పుకొచ్చాడు. మా వాళ్లు చాలా తప్పులు చేశారు ఇక తమ జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ.. ‘‘శ్రీలంక పేసర్లంతా కొత్తవాళ్లు. వాళ్లలో ఒక్కరికి కూడా తగినంత అనుభవం లేదు. అయినా.. తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగారు. మరోవైపు.. పాకిస్తాన్ ఈ టోర్నీలో బాగానే ఆడింది.. కానీ మరీ అంత గొప్పగా ఏమీ ఆడలేదు. చాలా పొరపాట్లు చేశారు. ఒత్తిడిని అధిగమించలేకపోయారు. ఆదిలో శ్రీలంకను 58-5కు కట్టడి చేయగలిగినా ఆ తర్వాత ధారాళంగా పరుగులు ఇచ్చిన విధానమే ఇందుకు నిదర్శనం’’ అని పాక్ ఆట తీరుపై ఇంజమామ్ ఉల్ హక్ విమర్శలు గుప్పించాడు. కాగా దుబాయ్ వేదికగా పాక్‌తో ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక 23 పరుగులతో గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. మెగా ఈవెంట్లో ఆరోసారి టైటిల్ గెలిచిన జట్టుగా దసున్ షనక బృందం నిలిచింది. చదవండి: SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం
Asia Cup 2022 Winner Sri Lanka- Losing Captain Babar Azam Comments: తమ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయామని.. అందుకే ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో ఓటమి పాలయ్యామని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. భనుక రాజపక్స ఆటతీరు అద్భుతమని.. అతడే మ్యాచ్‌ను శ్రీలంక వైపు తిప్పేశాడని కొనియాడాడు. అత్యద్భుతంగా ఆడి కప్ గెలిచినందుకు శ్రీలంక జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం శ్రీలంక- పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన లంక ఆరంభంలో తడబడ్డా భనుక రాజపక్స 45 బంతుల్లో 71 పరుగులతో చెలరేగడంతో మెరుగైన స్కోరు సాధించింది. రాజపక్స అదరగొట్టడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు పాక్ జట్టులో మహ్మద్ రిజ్వాన్(55), ఇఫ్తికర్ అహ్మద్(32) తప్ప ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. శ్రీలంక బౌలర్ల ధాటికి నిలవలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది. విజేతగా లంక 23 పరుగుల తేడాతో పాక్‌పై జయభేరి మోగించిన దసున్ షనక బృందం ఆసియా కప్ 15వ ఎడిషన్ చాంపియన్‌గా అవతరించింది. ఆల్‌రౌండ్ ప్రతిభతో ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక పాక్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మా ఓటమికి ప్రధాన కారణం అదే! ఈ నేపథ్యంలో ఫైనల్లో లంక చేతిలో ఓటమిపై స్పందించిన బాబర్ ఆజం బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తాము విఫలమయ్యామన్నాడు. ‘‘మొదటి ఎనిమిది ఓవర్లు మా ఆధిపత్యం కొనసాగింది. అయితే, రాజపక్స వచ్చిన తర్వాత సీన్ మారింది. అతడు అద్భుతంగా ఆడాడు. దుబాయ్ వికెట్ ఎంతో బాగుంటుంది. అందుకే ఇక్కడ ఆడటాన్ని ఇష్టపడతాము. కానీ.. ఈరోజు మా స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేదు. ఇక.. శుభారంభం దొరికినా.. ప్రత్యర్థి జట్టుకు 15-20 పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నాం. ఫీల్డింగ్ కూడా బాగా చేయలేకపోయాం. సానుకూల అంశాలు కూడా ఉన్నాయి! అయితే, ఈ టోర్నీలో మాకు కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రిజ్వాన్, నవాజ్, నసీమ్.. అద్భుతంగా రాణించారు. ఆటలో గెలుపోటములు సహజం. నిజానికి ఫైనల్లో మేము చాలా తక్కువ తప్పులే చేశాము. ఇంకా మెరుగ్గా ఆడితే బాగుండేది’’ అని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. ఇక ఫైనల్లో రాజపక్స ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగకు దక్కింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఇదేమి బౌలింగ్రా అయ్యా.. తొలి బంతికే 10 పరుగులు! -
ఎన్నాకెన్నాళ్లకు.. ఆసియా కప్‌తో లంకలో పండుగ (ఫొటోలు)
-
పాకిస్తాన్‌పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్
15వ ఎడిషన్ ఆసియా కప్ విజేతగా శ్రీలంక అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ట్రోఫిని అందుకుంది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహ్మద్ రిజ్వాన్(55 పరుగులు), ఇఫ్తికర్ అహ్మద్(32 పరుగులు) క్రీజులో ఉన్నంత వరకు లక్ష్యం దిశగానే సాగింది. అయితే లంక బౌలర్ ప్రమోద్ మదుషన్ నాలుగు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా.. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా కీలక సమయంలో మూడు వికెట్లతో మెరిశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 71, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. అంతకముందు దనుంజయ డిసిల్వా 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో వనిందు హసరంగాతో కలిసి రాజపక్స ఆరో వికెట్‌కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 36 పరుగులు చేసి హసరంగా వెనుదిరిగిన తర్వాత రాజపక్స పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు చమిక కరుణరత్నే(14 బంతుల్లో 14 పరుగులు) చక్కగా సహకరించడంతో చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు రావడం విశేషం.పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. కాగా శ్రీలంక ఆసియా కప్‌ను సొంతం చేసుకోవడం ఇది ఆరోసారి. తాజాగా దాసున్ షనక కెప్టెన్సీలో లంక టైటిల్ నెగ్గగా.. చివరగా 2014లో ఏంజల్లో మాథ్యూస్ నేతృత్వంలోని లంక జట్టు వన్డే ఫార్మాట్లో జరిగిన అప్పటి ఆసియా కప్‌లోనూ పాక్‌ను ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సొంత అభిమానులచే తిట్ల దండకం అందుకున్న పాకిస్తాన్!
శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ ఫేలవ ఫీల్డింగ్‌పై సొంత అభిమానులే పెదవి విరిచారు. చేతిలోకి వచ్చిన క్యాచ్‌లను జారవిడవడం.. మిస్ ఫీల్డ్.. రనౌట్ చేసే అవకాశాలు వదులుకోవడం కనిపించాయి. ముఖ్యంగా పాక్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ విలువైన రెండు క్యాచ్‌లు వదిలేయడంతో విలన్‌గా మారిపోయాడు. దీంతో సొంత అభిమానులే పాకిస్తాన్ జట్టుపై తిట్ల దండకం అందుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. ఇందులో బానుక రాజపక్సవే 71 పరుగులు ఉన్నాయి. అయితే రాజపక్స ఇచ్చిన క్యాచ్‌లను రెండు సందర్భాల్లోనూ షాదాబ్ ఖాన్ వదిలేసి మూల్యం చెల్లించాడు. తొలి క్యాచ్ తాను వదిలేయగా.. రెండో క్యాచ్‌ను ఆసిఫ్ అలీ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆసిఫ్ అలీతో సమన్వయం లేకుండా మధ్యలో ఎంట్రీ ఇచ్చి షాదాబ్ క్యాచ్‌ను నేలపాలు చెయ్యడమే గాక ఏకంగా ఆరు పరుగులు సమర్పించాడు. ఆ తర్వాత తనను ఎక్కడ తిడతారో అని కాసేపు హై డ్రామా చేశాడు. దీంతో ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ''ఈరోజు పాకిస్తాన్ ఫీల్డింగ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు''.. ''ముఖ్యంగా షాదాబ్ ఖాన్.. కాలం మారినా పాకిస్తాన్ ఫీల్డింగ్‌లో మాత్రం మార్పు రాదు''.. ''పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్ చూసిన తర్వాత ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ పారిపోవడం ఖాయం..'' అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. చదవండి: Asia Cup 2022 Final: బాబర్ ఆజం కూడా ఊహించలేదు.. -
బాబర్ ఆజం కూడా ఊహించలేదు..
ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంకల మధ్య ఫైనల్ పోరు ఆసక్తికరంగా జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక బానుక రాజపక్స మెరుపులతో 170 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు మరోసారి బాబర్ ఆజం రూపంలో షాక్ తగిలింది. 5 పరుగులు చేసిన బాబర్ ఆజం ప్రమోద్ మధుషాన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అయితే బాబర్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాములుగా ఒక బ్యాటర్ ఫైన్‌లెగ్ దిశగా బంతిని బాదితే కచ్చితంగా బౌండరీ లేదా పరుగులు వస్తాయి. కానీ ఇక్కడే లంక కెప్టెన్ దాసున్ షనక తెలివిని ఉపయోగించాడు. బాబర్ ఆజం ఫైన్‌లెగ్ దిశగా ఆడేలా బంతిని వేయమని షనక చెప్పడం.. ప్రమోద్ అదే తరహాలో బంతి వేయడం.. ఫైన్ లెగ్ దిశలో ఉన్న మధుషనక క్యాచ్ తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. బాబర్ ఆజం తాను ఇలా ఔట్ అవుతానని ఊహించలేదనుకుంటా.. కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. ఇక బాబర్ తన ఫేలవ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడిన బాబర్ కేవలం 68 పరుగులు మాత్రమే చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 10, 9, 14, 0, 30, 5 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక గోల్డెన్ డక్ కూడా ఉండడం విశేషం. అలా ఈ పాక్ కెప్టెన్ తన ఫేలవ ఆటతీరుతో ఆసియా కప్‌ను ముగించాల్సి వచ్చింది. చదవండి: Kushal Mendis: అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు Asia Cup 2022 Final: పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన రాజపక్స.. -
లంకదే ఆసియాకప్.. ముందే నిర్ణయించారా!
15వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీ ముగింపుకు మరొక్క రోజు మాత్రమే మిగిలింది. వరల్డ్ కప్ అంత కాకపోయినా.. ఆసియా ఖండంలో చాంపియన్‌గా నిలిచే అవకాశం ఆసియా కప్ ద్వారా ఉపఖండంలో ఉన్న జట్లకు అవకాశం ఉంటుంది. అయితే ఎన్నో అంచనాల మధ్య ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా సూపర్-4 దశలోనే వెనుదిరిగింది. ప్రభావం చూపిస్తుందనుకున్న బంగ్లాదేశ్.. పసికూన హాంకాంగ్ కంటే దారుణంగా ఆడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఇక ఫైనల్ పోరు సెప్టెంబర్ 11న(ఆదివారం) పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరగనుంది. ఇక ఆసియా కప్‌ను అత్యధికంగా భారత్ ఏడుసార్లు గెలవగా.. శ్రీలంక ఐదుసార్లు, పాకిస్తాన్ రెండుసార్లు టైటిల్స్ అందుకున్నాయి. మరి 15వ ఎడిషన్ ఆసియాకప్‌ను శ్రీలంక, పాకిస్తాన్లలో ఎవరు అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి ఆసియా కప్‌ను లంకకు అందివ్వాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ముందుగానే నిర్ణయం తీసుకుందా అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. మొదట ఆసియా కప్‌ను నిర్వహించాల్సింది శ్రీలంకలోనే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ఆసియా కప్‌ను నిర్వహించలేమని చెప్పేసింది. దీంతో ఆఖరి నిమిషంలో ఆసియా కప్ వేదికను శ్రీలంక నుంచి యూఏఈకి మార్చారు. ఇక గత కొన్ని నెలలుగా శ్రీలంక ఎంతో ఆర్థిక సంక్షోభానికి గురయ్యింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స వ్యవహారంపై లంక ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు కొన్ని నెలలపాటు దర్నాలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే లంక టూరిజం బాగా దెబ్బతిని ఆర్థిక సంక్షోభ సమస్య మరింత ముదిరిపోయింది. ముదిరి పాకాన పడడంతో మరో దిక్కులేక దేశం విడిచి పారిపోయిన రాజపక్స తన రాజీనామాను సమర్పించారు. ఆ తర్వాత అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే లంక ఆర్థిక పరిస్థితి గాడినపడ్డట్లు కనిపిస్తోంది. ఇక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక పరిస్థితిని అర్థం చేసుకున్న ఏసీసీ.. లంకను ఆసియాకప్ గెలిచేలా ప్రోత్సహించిందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి శ్రీలంక ఆసియాకప్‌ను కైవసం చేసుకుంటే లంక బోర్డుకు పెద్ద మొత్తంలో అందనున్నట్లు సమాచారం. కాగా లంక క్రికెట్ బోర్డు ఈ మొత్తాన్ని దేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు తమ వంతు సహకారం అందించాలని భావిస్తునట్లు సమాచారం. కాగా ఆసియాకప్‌ను లంక గెలిచినా.. గెలవకపోయినా ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) లంక బోర్డుకు ప్రత్యేక నగదు బహుమతిని అందించాలని ముందే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఆసియా కప్‌ను లంక గెలిచినా.. గెలవకపోయినా.. క్రికెట్ ఫ్యాన్స్ మనసులు మాత్రం గెలుచుకోవడం ఖాయం అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరొక విషయమేంటంటే.. ఎలాగు టీమిండియా సూపర్-4 దశలో వెనుదిరగడంతో.. భారత్ అభిమానుల మద్దతు కూడా శ్రీలంకకే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆట పరంగా ఆసియా కప్‌లో శ్రీలంక ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. లీగ్ దశలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దారుణ ఓటమి చవిచూసిన శ్రీలంక.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించి సూపర్-4లో అడుగుపెట్టింది. ఇక సూపర్-4లో మొదట అఫ్గన్‌పై విజయంతో ప్రతీకారం తీర్చుకున్న లంక.. భారత్‌కు షాక్ ఇచ్చింది. ఇక చివరగా పాకిస్తాన్‌తో జరిగిన పోరులో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి శ్రీలంక మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక తుదిపోరులోనూ పాకిస్తాన్‌ను మట్టి కరిపించి శ్రీలంక ఆరోసారి ఆసియాకప్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా సూపర్-4 ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవడమే గాక మూడోసారి ఆసియాకప్‌ను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. చదవండి: Kane Williamson: గమ్మత్తుగా కేన్ మామ వ్యవహారం.. వీడియో వైరల్ కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తిన చెన్నై సూపర్ కింగ్స్ -
SL Vs Pak: ఫైనల్లో నసీం షా ఇబ్బంది పెడతాడనుకుంటున్నారా? లంక ఆల్‌రౌండర్ రిప్లై ఇదే!
Asia Cup 2022 Final Sri Lanka Vs Pakistan: మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లోనే అఫ్గనిస్తాన్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి.. బంగ్లాదేశ్‌పై గెలుపుతో విజయాల బాట పట్టి సూపర్-4లో అఫ్గనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ జట్లను ఓడించి.. ఫైనల్ వరకు అజేయ జైత్రయాత్ర... ఆసియా కప్- 2022 టీ20 టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక ప్రస్థానం ఇది. దుబాయ్ వేదికగా ఆదివారం(సెప్టెంబరు 11) పాకిస్తాన్‌తో జరిగే ఫైనల్లో టైటిల్ ఫేవరెట్‌గా మారింది దసున్ షనక బృందం. సమిష్టి కృషితో తుదిపోరుకు అర్హత సాధించి.. ఆసియా కప్ ట్రోఫీ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం ఇప్పటికే లంక- పాక్ జట్లు సమాయత్తమవుతున్నాయి. ‘రిహార్సల్ మ్యాచ్’లో పాక్‌ను చిత్తు చేసి! ఇక సూపర్- 4 ఆఖరి మ్యాచ్ కూడా ఈ రెండు జట్ల మధ్యే జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుని పాక్‌ను 121 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగి 17 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కీలక పేసర్ నసీమ్ షా లేకుండానే పాక్ బరిలోకి దిగింది. కాగా షాహిన్ ఆఫ్రిది స్థానంలో జట్టులోకి వచ్చిన 19 ఏళ్ల నసీమ్ పాకిస్తాన్ సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తమకు కీలకమైన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ బౌలర్లు అత్యద్భుతంగా పోరాడిన వేళ.. నసీమ్ ఆఖర్లో రెండు సిక్సర్లు కొట్టి అటు అఫ్గన్.. ఇటు టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో అతడిపై అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే, ఫైనల్‌కు ముందు లంకతో జరిగిన మ్యాచ్‌లో అతడికి రెస్ట్ ఇవ్వడం విశేషం. నసీం షా ఉంటాడు కదా! అయితే! ఈ నేపథ్యంలో పాక్‌పై విజయానంతరం మీడియాతో మాట్లాడిన లంక ఆల్‌రౌండర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వనిందు హసరంగకు నసీమ్ గురించి ప్రశ్న ఎదురైంది. నసీమ్ షా మీకు ఫైనల్లో గట్టి సవాల్ విసురుతాడు అని భావిస్తున్నారా అని హసరంగను ఓ పాకిస్తాన్ విలేకరి ప్రశ్నించారు. ఇందుకు కూల్‌గా స్పందించిన హసరంగ.. కాస్త గ్యాప్ ఇచ్చి.. ‘‘అదేదో ఫైనల్లోనే చూసుకుంటాం’’ అని చిరునవ్వులు చిందించాడు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. హసరంగ చర్యపై ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘‘బిల్డప్ చూసి ఏం చెబుతావో అనుకున్నాం... కానీ.. ఒక్క మాటతో పరోక్షంగా నసీం షా గాలి తీసేశావు’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు.. టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే! -
ఫైనల్‌కు ముందు శ్రీలంకతో పాక్ పోరు.. స్టార్ బౌలర్‌కు విశ్రాంతి!
ఆసియాకప్-2022 సూపర్-4 అఖరి మ్యాచ్‌లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో ఇరు జట్లు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నామమాత్రపు మ్యాచ్‌లో శ్రీలంక, పాకిస్తాన్ రెండేసి మార్పులతో బరిలోకి దిగాయి. శ్రీలంక జట్టులోకి ధనంజయ డి సిల్వా, ప్రమోద్ మదుషన్ ఎంట్రీ ఇవ్వగా.. పాక్ జట్టులోకి హాసన్ అలీ, ఉస్మాన్ ఖాదిర్ వచ్చారు. కాగా ఈ మ్యాచ్‌కు పాక్ స్టార్ ఆటగాళ్లు నసీం షా, షాదాబ్ ఖాన్‌కు విశ్రాంతి ఇచ్చారు. తుది జట్లు: పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, హారీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నైన్ శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక చదవండి: Asia cup 2022 Afg vs Ind: 'టీమిండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు.. ఐపీఎల్ కోసమే' -
Asia Cup 2022: మొదటి విజేత మన జట్టే! అప్పుడు పాక్ మరీ ఘోరంగా!
Asia Cup 2022 India Vs Pakistan:ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభమైంది. అంతకంటే ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ యావత్ క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నేడు(ఆదివారం) జరుగనుంది. టీ20 ప్రపంచకప్-2021లో కనీవినీ ఎరుగని రీతిలో కోహ్లి సేనకు పాకిస్తాన్ చేతిలో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్లో ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ శర్మ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. టీమిండియాతో మ్యాచ్‌లో మరోసారి పైచేయి సాధించాలని బాబర్ ఆజం బృందం ఆశపడుతోంది. మరి ఆసియా కప్ టోర్నమెంట్ చరిత్రలో భారత్- పాకిస్తాన్ ముఖాముఖి రికార్డులు ఎలా ఉన్నాయో గమనిద్దాం. మొదటి విజేత మన జట్టే! అప్పుడు పాక్ మరీ ఘోరంగా.. 1984 నుంచి ఆసియా కప్ నిర్వహణ ఆరంభమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రౌండ్ రాబిన్ పద్ధతిలో వన్డే ఫార్మాట్లో ఈ ఈవెంట్ జరిగింది. భారత్, శ్రీలంక, పాకిస్తాన్ పోటీపడ్డాయి. భారత్- లంక ఫైనల్ చేరాయి. మొత్తంగా రెండు విజయాలతో టీమిండియా విజేతగా నిలిచింది. శ్రీలంక రన్నరప్ కాగా.. పాక్ రెండు మ్యాచ్‌లు ఓడి భంగపాటుకు గురైంది. టీమిండియా చేతిలో 54 పరుగులు, శ్రీలంక చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొత్తంగా ఎన్నిసార్లు తలపడ్డాయంటే.. ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మొత్తం 14 మ్యాచ్‌లలో ముఖాముఖి తలపడ్డాయి. వీటిలో టీమిండియా 8 సార్లు గెలవగా.. పాకిస్తాన్ ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. టీ20 ఫార్మాట్లోనూ మనదే పైచేయి.. ఆసియా కప్ టోర్నీని 2016లో టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. అప్పటి నుంచి ఓ దఫా వన్డే.. మరో దఫా పొట్టి ఫార్మాట్లో.. ఇలా రొటేషన్ పద్ధతిలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా టీమిండియా భారత్- పాకిస్తాన్ మధ్య వన్డే ఫార్మాట్లో 13 మ్యాచ్‌లు జరుగగా.. భారత్ ఏడు గెలిచింది. అయితే 1997 నాటి వన్డే మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ఇక 2016లో జరిగిన ఏకైక టీ20లోనూ విజయం భారత్‌నే వరించింది. ఐదు వికెట్ల తేడాతో ధోని సేన.. ఆఫ్రిది బృందాన్ని మట్టికరిపించింది. ఇక ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు అత్యధికంగా ఏడు సార్లు చాంపియన్‌గా నిలవగా.. శ్రీలంక ఐదుసార్లు టైటిల్ గెలిచింది. పాకిస్తాన్ కేవలం రెండుసార్లు ట్రోఫీ అందుకుంది. వేదిక స్టేడియం ఫార్మాట్ విజేత తేది దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వన్డే తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ విజయం 23 సెప్టెంబరు 2018 దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వన్డే ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ గెలుపు 19 సెప్టెంబరు 2018 మీర్పుర్ షేర్-ఇ- బంగ్లా నేషనల్ స్టేడియం టీ20 ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం 27 ఫిబ్రవరి 2016 మీర్పుర్ షేర్-ఇ- బంగ్లా నేషనల్ స్టేడియం వన్డే ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్ విజయం 2 మార్చి 2014 మీర్పుర్ షేర్-ఇ- బంగ్లా నేషనల్ స్టేడియం వన్డే 6 వికెట్ల తేడాతో భారత్ విజయం 18 మార్చి 2012 డంబుల్లా రంగిరి ఇంటర్నేషనల్ స్టేడియం వన్డే 3 వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం 19 జూన్ 2010 కరాచి కరాచి నేషనల్ స్టేడియం వన్డే ఎనిమిది వికెట్ల తేడాతో పాక్ గెలుపు 2 జూలై 2008 కరాచి కరాచి నేషనల్ స్టేడియం వన్డే 6 వికెట్ల తేడాతో భారత్ విజయం 26 జూన్ 2008 కొలంబో ఆర్. ప్రేమదాస స్టేడియం వన్డే 59 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలుపు 25 జూలై 2004 ఢాకా బంగబంధు నేషనల్ స్టేడియం వన్డే 44 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం 3 జూన్ 2000 కొలంబో ఎస్ఎస్సీజీ వన్డే ఫలితం తేలలేదు 20 జూలై 1997 షార్జా షార్జా క్రికెట్ స్టేడియం వన్డే 97 పరుగుల తేడాతో పాక్ గెలుపు 7 ఏప్రిల్ 1995 ఢాకా బంగబంధు నేషనల్ స్టేడియం వన్డే 4 వికెట్ల తేడాతో భారత్ విజయం 31 అక్టోబరు 1988 షార్జా షార్జా క్రికెట్ స్టేడియం వన్డే 54 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు 13 ఏప్రిల్ 1984 చదవండి: Asia Cup 2022: కళ్లన్నీ కోహ్లి మీదే! తిరుగులేని రన్‌మెషీన్.. టోర్నీలో ఎన్ని సెంచరీలంటే? ASIA CUP 2022: జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టాడు.. ప్రమోషన్ కొట్టేశాడు! -
SL Vs PAK: ఒకటీ అరా గెలిచి.. ఏదో పొడిచేసినట్లు విర్రవీగడం!
Sri Lanka Vs Pakistan Test Series: శ్రీలంక చేతిలో ఘోర ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై ఆ దేశ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ విమర్శలు చేశాడు. మొదటి టెస్టులో గెలుపుతో సంతృప్తి పడ్డారని.. అందుకే రెండో మ్యాచ్‌లో కనీస పోరాటం కూడా చేయలేక చేతులెత్తేశారని మండిపడ్డాడు. ఒకటీ అర విజయాలతో ఏదో పొడిచేశామని విర్రవీగడం అలవాటులా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా శ్రీలంక టూర్‌కు వెళ్లింది పాకిస్తాన్. గాలే వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పర్యాటక పాక్ తొలి టస్టులో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, రెండో మ్యాచ్‌లో ఆతిథ్య లంక ధీటుగా బదులిచ్చింది. ఏకంగా 246 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ పాక్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. వీరి ధాటికి లోయర్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ప్రభాత్ మొత్తంగా ఎనిమిది వికెట్లు తీయగా.. రమేశ్ 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కమ్రాన్ అక్మల్ ఈ నేపథ్యంలో పాక్ ఓటమి పాలైంది. సిరీస్ 1-1తో సమమైంది. అంతేగాక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానం కోల్పోయింది. ఈ నేపథ్యంలో కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ.. ‘‘ఒక్క టెస్టు మ్యాచ్‌లో విజయంతో పాకిస్తాన్ జట్టు సంతృప్తి పడిపోయింది. ఇక ఇప్పుడు వీళ్లు నెదర్లాండ్స్ వంటి జట్టును ఓడిస్తారు. ఆసియా కప్‌లో ఎలాగోలా నెగ్గుకొస్తారు. ఆలోపు అభిమానులు ఈ టెస్టు సిరీస్ గురించి మర్చిపోతారు. ఒకటీ రెండు విజయాలు సాధించి ఏదో సాధించినట్లు ఫీలవుతూ ఉంటారు. మూడు నాలుగేళ్ల పాటు ఈ అరకొర గెలుపు గురించి మాట్లాడుకుంటూ ఉంటారని అనుకుంటారు. శ్రీలంకతో రెండో టెస్టులో భారీ టార్గెట్ ఛేదించలేక ఏదో మొక్కుబడిగా ఆడారు. వాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది’’ అని మండిపడ్డాడు. శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ రెండో టెస్టు స్కోర్లు: టాస్: శ్రీలంక- బ్యాటింగ్ శ్రీలంక ఇన్నింగ్స్: 378 & 360/8 డిక్లేర్డ్ పాక్ ఇన్నింగ్స్: 231 & 261 విజేత: 246 పరుగులతో శ్రీలంక గెలుపు.. సిరీస్ 1-1తో సమం చదవండి: Sanju Samson In T20I Squad: విండీస్‌తో తొలి టి20.. టీమిండియాకు గుడ్‌న్యూస్ A series played in the right spirit 🤗 🇵🇰🇱🇰 post-match interactions 🙌#SLvPAK pic.twitter.com/q8T2E91JFl — Pakistan Cricket (@TheRealPCB) July 28, 2022 -
SL Vs Pak 2nd Test: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన శ్రీలంక.. పడిపోయిన ర్యాంకు!
ICC World Test Championship 2021-23 Updated Table: సొంతగడ్డపై మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది శ్రీలంక జట్టు. స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ చెలరేగడంతో రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఏకంగా 246 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. కాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-23లో భాగంగా రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం పాకిస్తాన్ శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో బాబర్ ఆజం బృందం 4 వికెట్ల తేడాతో గెలుపొంది డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. Captains knock after coming in injured! Keep scoring and inspiring @IamDimuth Highlights👉 https://t.co/KIKZAPGOsW#SLvPAK pic.twitter.com/1DE0XmSlpx — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 28, 2022 ఈ క్రమంలో రెండో టెస్టులో తాజా విజయం నేపథ్యంలో కరుణరత్నె సేన పాకిస్తాన్ స్థానాన్ని ఆక్రమించింది. భారత్, పాకిస్తాన్లను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. దీంతో పాక్ మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోగా.. టీమిండియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అగ్రపీఠం నిలబెట్టుకున్న ప్రొటిస్ జట్టు! ఇక దక్షిణాఫ్రికా అగ్రపీఠాన్ని నిలబెట్టుకోగా.. ఆస్ట్రేలియా రెండో స్థానాన్ని కాపాడుకుంది. కాగా డబ్లూటీసీ 2021-23 సీజన్‌కు గానూ ఇప్పటి వరకు ఐదు గెలిచిన సౌతాఫ్రికాకు 60 పాయింట్లు(71.43శాతం) వచ్చాయి. PC: ICC ఇక పదింటికి ఆరు గెలిచిన కంగారూ జట్టు ఒక మ్యాచ్ ఓడగా.. మూడు డ్రా చేసుకుని 84 పాయింట్ల(70 శాతం)తో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక పాక్‌పై గెలుపొందడంతో శ్రీలంక విజయాల సంఖ్య ఐదుకు చేరుకుంది. లంక ఖాతాలో నాలుగు పరాజయాలు ఉన్నాయి. ఒక మ్యాచ్ డ్రా అయ్యింది కూడా! దీంతో శ్రీలంకకు లభించిన పాయింట్లు 64(53.33 శాతం). A full masterclass from @dds75official He struck 16 boundaries in his 171-ball innings. Watch the highlights👉https://t.co/KIKZAPGOsW pic.twitter.com/smL3x3Z7c8 — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 28, 2022 టీమిండియా తర్వాతి స్థానంలో పాక్! టీమిండియా ఆరు విజయాలు, 4 పరాజయలు, రెండు డ్రా చేసుకుని 75 పాయింట్లు(52.08 శాతం), పాకిస్తాన్ నాలుగు విజయాలు, మూడు పరాజయాలు, రెండు డ్రా చేసుకుని 56 పాయింట్లు(51.85 శాతం) సాధించింది. ఐదో స్థానంలో ఉన్న వెస్టిండీస్ నాలుగు విజయాలు, మూడు పరాజయాలు, రెండు డ్రా చేసుకుని 54 పాయింట్ల(50 శాతం)తో ఆరో స్థానంలో ఉంది. ఇక టాప్-2లో గెలిచిన రెండు జట్లు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. మొదటి డబ్ల్యూటీసీ తుదిపోరుకు అర్హత సాధించిన టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై టైటిల్ చేజార్చుకుంది. తద్వారా డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా విలియమ్సన్ బృందం క్రికెట్ చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. చదవండి: Shubman Gill: అప్పుడేమో ద్విశతకం! 91, 96, 98 నాటౌట్.. పాపం సెంచరీ గండం గట్టెక్కలేడా?! IND Vs WI, 3rd ODI: ఆర్సీబీ అత్యుత్సాహం.. గిల్ విషయంలో తప్పుడు ట్వీట్ -
లంక క్రికెటర్‌తో పవాద్ ఆలం వైరం.. ఇలా కూడా గొడవ పడొచ్చా!
శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లా, పాక్ క్రికెటర్ పవాద్ ఆలం మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. గొడవ సీరియస్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. సరదాగా గొడవ పడిన ఈ ఇద్దరి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరోషన్ డిక్వెల్లా పవాద్ ఆలంను ఉద్దేశించి ఏదో అనగా.. దానికి పవాద్ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన లంక కెప్టెన్ కరుణరత్నే, పాక్ పేసర్ హారిస్ రౌఫ్‌లు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందా అని చూడడానికి వచ్చారు. గొడవ కాదని కేవలం ఫన్నీగా జరుగుతున్న సంభాషణ అని తెలుసుకొని వాళ్లు కూడా ఈ గొడవలో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోనూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ట్విటర్లో షేర్ చేసింది. ఇక పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి ఓవరాల్‌గా 323 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కెప్టెన్ కరుణరత్నే (27), ధనంజయ (30) నిలకడగా ఆడుతున్నారు. తొలి టెస్టులో పాక్ 342 పరుగుల లక్ష్య చేధనను సులువుగా చేధించడంతో ఈసారి మాత్రం అవకాశం ఇవ్వకూడదని లంక భావిస్తోంది. అందుకే పాక్‌కు భారీ టార్గెట్ ఇచ్చే యోచనలో ఉన్నారు. Buddies off the field 🤝#SLvPAK #SpiritofCricket pic.twitter.com/YuwsG50EPf — Pakistan Cricket (@TheRealPCB) July 26, 2022 చదవండి: ICC Men's Cricket Committee: ఐసీసీలో వివిఎస్ లక్ష్మణ్‌కు కీలక పదవి -
SL Vs Pak 1st Test: టీమిండియాను దాటి మూడో స్థానంలోకి దూసుకొచ్చిన పాక్!
SL Vs Pak 1st Test- Updated ICC World Test Championship Points Table: శ్రీలంక పర్యటనలో భాగంగా మొదటి టెస్టులో పాకిస్తాన్ ఆతిథ్య జట్టుపై గెలుపొందింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ సెంచరీతో చెలరేగడంతో(160 పరుగులు- నాటౌట్) 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా బాబర్ ఆజం బృందం వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక(డబ్ల్యూటీసీ)లో మూడో స్థానానికి దూసుకువచ్చింది. కాగా ఐసీసీ వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ 2021-2023లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో గాలే వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ బుధవారం(జూలై 20)న ముగిసింది. ఇందులో పాకిస్తాన్ గెలిచి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. టాప్‌లో దక్షిణాఫ్రికా.. నాలుగో స్థానంలో భారత్ ఇక డబ్లూటీసీ 2021-23 సీజన్‌కు గానూ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు గెలిచిన దక్షిణాఫ్రికా 60 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా పదింటికి ఆరు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడి మూడు డ్రా చేసుకుంది. తద్వారా 84 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. Photo Credit: ICC తాజాగా శ్రీలంకపై విజయంతో పాకిస్తాన్ మూడో స్థానానికి చేరుకుంది. పాక్ ఇప్పటి వరకు మొత్తంగా ఎనిమిది మ్యాచ్‌లలో నాలుగు గెలిచి, 2 ఓడి, 2 డ్రా చేసుకుని 56 పాయింట్లు సాధించింది. ఇక టీమిండియా 12 మ్యాచ్‌లలో ఆరు గెలిచి, నాలుగింట ఓడి.. రెండు డ్రా చేసుకుని 75 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వరుసగా 54, 52,64, 28, 16 పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇటీవల ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ మ్యాచ్‌లో ఓడిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు డబ్ల్యూటీసీ మొదటి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs WI ODI Series: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం: విండీస్ కెప్టెన్ All smiles in the Pakistan camp 😊 The boys celebrate a famous win in Galle ✨#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/zKwXY9vm5e — Pakistan Cricket (@TheRealPCB) July 20, 2022 -
కోహ్లిని తలపిస్తున్న పాక్ కెప్టెన్.. ఖాతాలో మరో మైలురాయి
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. తాజాగా శ్రీలంకతో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం వీరోచిత సెంచరీతో మెరిశాడు. తన ఇన్నింగ్స్‌తో జట్టు తక్కువ స్కోరుకు ఆలౌట్ కాకుండా కాపాడి ప్రత్యర్థికి కేవలం 4 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కేలా చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 55 పరుగుల విలువైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న బాబర్ ఆజం ప్రభాత్ జయసూర్య అద్భుత బంతికి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజం టెస్టుల్లో అరుదైన ఫీట్ సాధించాడు. టెస్టుల్లో 3వేల పరుగులు మార్క్‌ను అధిగమించాడు. 41 టెస్టుల్లో బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు. కెరీర్లోనే పీక్ ఫామ్‌లో ఉన్న బాబర్ ఒక రకంగా టీమిండియా స్టార్ కోహ్లిని తలపిస్తున్నాడు. 2015-16లో కోహ్లి కూడా ఇదే తరహా ఫామ్ కనబరిచాడు. ఇక శ్రీలంకతో తొలి టెస్టులో సెంచరీ మార్క్‌ను అందుకోవడం ద్వారా 9వ సెంచరీ అందుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో పాక్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. అయితే ఇంజమామ్ 131 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు చేస్తే.. బాబర్‌కు మాత్రం 9 సెంచరీలు సాధించడానికి 70 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి. మ్యాచ్ విషయానికి వస్తే నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ 112, మహ్మద్ రిజ్వాన్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి 120 పరుగులు అవసరం కాగా.. లంకకు ఏడు వికెట్లు అవసరం. మరొక రోజు ఆట మిగిలి ఉండడంతో లంక బౌలర్లు మ్యాజిక్ చేస్తారా.. లేక ప్యాక్ బ్యాటర్లకు దాసోహం అంటారా అనేది వేచి చూడాలి. Another milestone for @babarazam258 👏 Well done skipper on completing 3⃣0⃣0⃣0⃣ Test runs 🙌#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/wauEWE5y3W — Pakistan Cricket (@TheRealPCB) July 19, 2022 చదవండి: Pak Vs SL 1st Test: ఏమని వర్ణించగలం?.. బాబర్ ఆజంకే దిమ్మ తిరిగింది యాసిర్ షా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్ గుర్తురాక మానడు -
SL Vs Pak: ఇది టెస్టు మ్యాచ్.. టీ20 కాదు.. వాళ్లిద్దరిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?
SL Vs Pak 1st Test- “It’s a Test match, not a T20 game” - Kamran Akmal: రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో శనివారం(జూలై 16) గాలే వేదికగా మొదటి మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ బౌలర్లు షాహిన్ ఆఫ్రిది మూడు వికెట్లు, హసన్ అలీ రెండు, యాసిర్ షా రెండు వికెట్లతో చెలరేగారు. నసీమ్ షా, మహ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. దీంతో మూడో సెషన్ సమయానికి లంక 9 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. మహీశ్ తీక్షణ, కసున్ రజిత క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ తుదిజట్టులో ఫవాద్ ఆలం, ఫాహీమ్ అష్రఫ్‌లకు చోటు ఇవ్వకపోవడంపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మండిపడ్డాడు. ఇదేమీ టీ20 మ్యాచ్ కాదు.. టెస్టు క్రికెట్ అంటూ మేనేజ్మెంట్ను విమర్శించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా.. ‘‘ఇది టెస్టు మ్యాచ్.. టీ20 గేమ్ కాదు... చాలా మంది ఆల్‌రౌండర్లు ఆడుతున్నట్లున్నారు.. నిజానికి టెస్టు క్రికెట్కంటూ కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు. ఫవాద్ ఆలం, ఫాహీమ్ అష్రఫ్‌లను శ్రీలంకతో మ్యాచ్‌కు ఎందుకు తప్పించడం నన్ను విస్మయానికి గురిచేసింది’’ అని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు. It’s a test match not a T20 game…too many Allrounders playing and what i think is test match game is all about specialists…its pretty shocking why @iamfawadalam25 and @iFaheemAshraf both have been dropped 🤔 #PAKvsSL — Kamran Akmal (@KamiAkmal23) July 16, 2022 కాగా ఆలం ఇప్పటి వరకు 18 టెస్టులాడి 986 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ ఆల్‌రౌండర్ ఫాహీమ్ 14 టెస్టు మ్యాచ్‌లలో 24 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 636 పరుగులు సాధించాడు. ఇలా ఇద్దరూ టెస్టు క్రికెట్లో సత్తా చాటారు. ఈ నేపథ్యంలో కమ్రాన్ అక్మల్ ఈ మేరకు ట్వీట్ చేయడం గమనార్హం. శ్రీలంకతో మొదటి టెస్టు ఆడుతున్న పాక్ జట్టు: అబ్దుల్లా షఫిక్, ఇమామ్ ఉల్ హక్, అజర్ అలీ, బాబర్ ఆజం(కెప్టెన్), ఆఘా సల్మాన్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, యాసిర్ షా, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, నసీమ్ షా. శ్రీలంక తుదిజట్టు: ఒషాడో ఫెర్నాండో, దిముత్ కరుణరత్నె(కెప్టెన్), కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనుంజయ డి సిల్వా, దినేశ్ చండిమాల్, నిరోషన్ డిక్విల్లా(వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, మహీశ్ తీక్షణ, ప్రభాత్ జయసూర్య, కసున్ రజిత. చదవండి: Lalit Modi- Sushmita Sen: తనకంటే తొమ్మిదేళ్లు పెద్దది.. మినాల్‌ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్! చివరికి ఇలా! Sri Lanka won the toss and elected to bat first: 🔴 LIVE | 1st Test - Day 1 | #SLvPAK https://t.co/oru4bTD9it — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 16, 2022 -
SL Vs Pak: పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ రద్దు చేసుకున్న శ్రీలంక.. కారణం?
Pakistan Tour Of Sri Lanka 2022: పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయింది. ఆతిథ్య శ్రీలంక విజ్ఞప్తి మేరకు తాము ఇందుకు అంగీకరించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించింది. కాగా రెండు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కై పాకిస్తాన్ జూలై- ఆగష్టు నెలలో శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. అయితే, దేశంలో ప్రస్తుత పరిస్థితులు, శ్రీలంక ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ మార్పు నేపథ్యంలో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకోవాలని శ్రీలంక భావించింది. ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్ షెడ్యూల్లో భాగం కానుందన ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పీసీబీ దృష్టికి తీసుకువెళ్లగా ఇందుకు సానుకూల స్పందన వచ్చింది. అయితే, ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ మాత్రం యథావిథిగా కొనసాగనుంది. ఈ విషయాల గురించి పీసీబీ మీడియా డైరెక్టర్ సమీ ఉల్ హసన్ బర్నే క్రికెట్ పాకిస్తాన్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆర్థికంగా నిలదొక్కుకునే క్రమంలో లంకన్ ప్రీమియర్ లీగ్‌ను వారం ముందే ఆరంభించాలనుకుంటున్నట్లు శ్రీలంకన్ బోర్డు చెప్పింది. కాబట్టి వన్డే సిరీస్‌ను రద్దు చేయాలని కోరింది. ఇది వరల్డ్‌కప్ సూపర్‌లీగ్‌లో భాగం కాదు కాబట్టి మేము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. టెస్టు సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది’’ అని పేర్కొన్నారు. కాగా శ్రీలంక ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని మహీంద్ర రాజపక్స రాజీనామాతో అక్కడ రాజకీయ సంక్షోభం కూడా నెలకొంది. చదవండి👉🏾Virat Kohli: కోహ్లి గోల్డెన్ డక్.. మరేం పర్లేదు.. కోచ్ అంటే ఇలా ఉండాలి! వైరల్ చదవండి👉🏾ICC POTM- April: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేత ఎవరంటే! -
‘భారత్ కంటే పాకిస్తాన్ ఎంతో నయం’
హైదరాబాద్: స్వదేశంలో దశాబ్దం తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు సిరీస్ విజయవంతం కావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అమితానందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ ఎహ్సాన్ మణి ఆనందం వ్యక్తం చేయడంతో పాటు భారత్‌పై అక్కసు వెల్లగక్కాడు. భద్రతా పరంగా భారత్ కంటే పాకిస్తాన్ ఎంతో సురక్షితమని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌తో పాకిస్తాన్ సురక్షిత దేశమని నిరూపించాం. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే ఇక్కడికి(పాక్) రండి మా భద్రతా ఎలా ఉందో చూపిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో మా పొరుగు దేశమైన భారత్ కంటే పాక్ ఎంతో సురక్షితమైన దేశం. మరి భారత్‌కు వెళ్లి క్రికెట్ ఆడటానికి లేని భయం పాక్ రావడానికి ఎందుకు? ఇక శ్రీలంక టెస్టు సిరీస్‌తో పాక్‌లో క్రికెట్ పునర్వైభవం సంతరించుకుంటదనే నమ్మకం ఉంది. శ్రీలంకను చూసి మిగతా దేశాలు కూడా పాక్ గడ్డపై క్రికెట్ ఆడటానికి రావాలి. ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరిస్ కోసం ఆ దేశ బోర్డుతో చర్చలు జరుపుతున్నాం. కేవలం బంగ్లాదేశ్‌తోనే కాదు అన్ని క్రికెట్ దేశాలు ఒక్కటి చెప్పదల్చుకున్నాం. ఇక నుంచి తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడబోం. ఎవరైనా మాతో సిరీస్ ఆడాలనుకుంటే పాక్ గడ్డపై అడుగుపెట్టాల్సిందే. ఇక శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ సక్సెస్ కావడానికి కృషి చేసిన అధికారులకు, క్రికెటర్లకు, మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు’అంటూ ఎహ్సాన్ మణి పేర్కొన్నాడు. ఇక భారత్‌పై మణి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీ సొంత డప్పు నువ్వు కొట్టుకోక పక్కనోడిపై పడి ఏడుస్తావెందుకు’అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంతేకాకుండా భారత్ అంతరంగిక విషయాల్లో పాక్ వేలు పెట్టాలని చూస్తే తాట తీస్తాం అని మరికొంత మంది ధ్వజమెత్తుతున్నారు. ఇక 2009లో శ్రీలంక క్రికెట్ జట్టుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏ దేశ క్రికెట్ జట్టు కూడా పాక్ గడ్డపై అడుపెట్టని విషయం తెలిసిందే. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ శ్రీలంక జట్టుతోనే పాక్‌లో టెస్టు క్రికెట్ పునఃప్రారంభమైంది. కాగా ఈ సిరీస్‌ను పాక్ 1-0తో కైవసం చేసుకుంది. చదవండి: స్వదేశంలో గెలిచి...మురిసిన పాక్ ‘మేం ఎక్కడికీ రాం.. మీరే ఇక్కడికి రావాలి’ -
‘మేం ఎక్కడికీ రాం.. మీరే ఇక్కడికి రావాలి’
రావల్పిండి: దాదాపు దశాబ్దం అనంతరం పాకిస్తాన్ గడ్డపై అంతర్జాతీయ టెస్టు జరగనుంది. బుధవారం నుంచి శ్రీలంక-పాక్ జట్ల మధ్య చారిత్రాత్మక తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ ఎహ్సాన్ మణి మీడియా సమావేశంలో మాట్లాడాడు. పాకిస్తాన్ అత్యంత సురక్షిత ప్రాంతమని, ఈ గడ్డపై నిరభ్యంతరంగా క్రికెట్ ఆడొచ్చనే సందేశాన్ని ఈ సిరీస్‌తో ప్రపంచానికి చాటి చెబుతామని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇప్పటినుంచి తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడబోమని, ఇక నుంచి తమతో ఆడాలనుకుంటే పాకిస్తాన్‌కే రావాలని స్పష్టం చేశాడు. మరో రెండుమూడేళ్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో స్వదేశంలో సిరీస్‌లు జరుగుతాయని ఎహ్సాన్ మణి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఐర్లాండ్‌కు చెందిన కొంతమంది ప్లేయర్స్ తమ దేశంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారన్నారు. పాక్‌స్తాన్‌లో ఆడకుండా ఉండేందుకు తమకు కారణాలు దొరకడం లేదని క్రికెట్ ఐర్లాండ్ సీఈఓ తమతో అన్నట్లు వివరించాడు. 2021లో ఇంగ్లండ్‌తో, 2022లో ఆసీస్‌తో పాక్‌లో సిరీస్‌లు నిర్వహిస్తామని, అదేవిధంగా వీలైతే 2023-24లో న్యూజిలాండ్‌తో సిరీస్ నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. రావల్పిండి వేదికగా ఆరంభం కానున్న తొలి టెస్టుపై యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నాడు. ఈ మ్యాచ్ టికెట్లలో అధిక శాతం స్థానిక స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపాడు. ఇక రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా లంక-పాక్‌ల మధ్య బుధవారం నుంచి తొలి టెస్ట్ ఆరంభం కానుంది. అనంతరం డిసెంబర్ 19 నుంచి 23 వరకు రెండో టెస్టు జరగనుంది. ఇక చివరగా 2009లో శ్రీలంక పాక్‌లో పర్యటించినప్పుడు వారు ప్రయాణిస్తున్న బస్సుపై టెర్రర్ అటాక్ జరిగిన విషయం తెలిసిందే. ఈ అటాక్‌లో లంక ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతం అనంతరం ఏ దేశం కూడా పాక్‌లో పర్యటించడానికి ధైర్యం చేయలేదు. తిరిగి శ్రీలంకతోనే పాక్‌లో క్రికెట్ పునరుజ్జీవనం పోసుకోవడం విశేషం. -
సిగ్గుందా: పాక్ క్రికెటర్‌పై నెటిజన్ల ఫైర్!
పాకిస్తాన్ క్రికెటర్, హరియాణా అల్లుడు హసన్ అలీపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘ఆటను వదిలావు సరే.. మరి మోడలింగ్ ఎందుకు చేస్తున్నావు. కాస్తైనా సిగ్గుండాలి నీకు... ఇప్పుడు గాయం అడ్డురావడం లేదా. నిన్ను అసలు మళ్లీ పాక్ జట్టులోకి తీసుకోకూడదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాక్ జట్టులో స్థానం కోల్పోయిన హసన్.. ర్యాంప్ వాక్ చేయడమే వారి ఆగ్రహానికి కారణం. శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పాక్ క్రికెట్ జట్టు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బుధవారం(డిసెంబరు 11) నుంచి రావల్పిండి క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. కాగా హసన్ అలీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. టెస్టు మ్యాచ్ కోసం జరిగిన సెలక్షన్స్‌లో పక్కటెముకల నొప్పితో బాధ పడుతున్న కారణంగా అలీని పక్కన పెట్టారు. అదే విధంగా ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌కు సైతం అలీ అందుబాటులో లేడు. అయితే ప్రస్తుతం ఓ కార్యక్రమం సందర్భంగా హసన్ అలీ ర్యాంప్ వాక్ చేస్తూ.. ఉత్సాహంగా గడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో.. ‘ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి.. తిరిగి జట్టులోకి వస్తావనుకుంటే ర్యాంప్ వాక్ చేస్తూ బాగానే ఉన్నావే’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా అలీ పాకిస్తాన్ తరఫున 53 వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లు, తొమ్మిది టెస్టులు ఆడాడు. ఆగస్టులో భారత్‌కు చెందిన యువతిని అతడు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. Fractured ribs and out of cricket, but Hassan Ali's fit for some modelling pic.twitter.com/qTx0BXyed2 — Saj Sadiq (@Saj_PakPassion) December 8, 2019 -
శ్రీలంకతో సిరీస్: కొత్త పెళ్లికొడుకు దూరం
కరాచీ: స్వదేశంలో శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. చీఫ్ సెలక్టర్, హెడ్ కోచ్ మిస్బావుల్ హక్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం సుదీర్ఘ మంతనాలు జరిపిన అనంతరం జట్టులో పలు మార్పులు చేసింది. పాక్ జట్టులోకి ఐదుగురు కొత్త వాళ్లకి అవకాశం కల్పించింది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోని కొత్త పెళ్లికొడుకు, హరియాణా అల్లుడు హసన్ అలీని జట్టులోకి తీసుకోలేదు. హరియాణా యువతితో హసన్ అలీ వివాహం గత నెలలో దుబాయ్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఇక హసన్ గాయం తీవ్రతపై స్పష్టత లేదని, అందుకే అతడికి విశ్రాంతినిచ్చామని మిస్బావుల్ తెలిపాడు. అంతేకాకుండా సీనియర్ ఆటగాడు మహ్మద్ హఫీజ్‌ను పక్కకు పెట్టారు. పేలవ ఫామ్‌తో విఫలమవుతున్న మహ్మద్ అమిర్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. ‘క్రికెట్లో గెలవడానికి సులువైన జట్లు, బలహీన ప్రత్యర్థులు ఉండరు. అనుభవం లేని ఆటగాళ్లు వచ్చినా.. సీనియర్ క్రికెటర్లు వచ్చినా మేము బలమైన జట్టును ఎంపిక చేయాలని భావించాం. (భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక సీనియర్ క్రికెటర్లు పాక్ పర్యటనకు ఆసక్తి చూపకపోవడంతో.. జూనియర్ ఆటగ్లాను పంపించాలనే ఆలోచనలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఉంది. ఈ నేపథ్యంలో మిస్బావుల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.) ఐదుగురు కొత్త వాళ్లను ఎంపిక చేశాం. ఇందులో నలుగురు ఆటగాళ్లు ప్రపంచకప్‌కు ఆడాల్సిన వాళ్లే.. కానీ వారికి అవకాశం దక్కలేదు. అన్ని విభాగాల్లో పాక్ బలంగా ఉంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడితే పాక్‌దే విజయం’అంటూ మిస్బావుల్ పేర్కొన్నాడు. పాక్ జట్టు: సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), బాబర్ అజమ్(వైస్ కెప్టెన్), అబిద్ అలీ, ఆసిఫ్ ఆలీ, పఖర్ జామన్, హారీస్ సోహైల్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీమ్, ఇమాముల్ హక్, అమిర్, మహమ్మద్ హస్నైన్, నవాజ్, రియాజ్, షాదాబా ఖాన్, ఉస్మాన్ షిన్వారీ, వాహబ్ రియాజ్. -
ఎవరొచ్చారనేది కాదు.. గెలిచామా? లేదా?
ఇస్లామాబాద్ : ఆటగాళ్లు ఎవరొచ్చినా సిరీస్ గెలవడంపైనే దృష్టిపెట్టాలని పాకిస్తాన్ క్రికెటర్లకు ఆ దేశ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ సూచించాడు. వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా లసిత్ మలింగతో సహా పది మంది రెగ్యులర్ ఆటగాళ్లు పాక్‌కు వెళ్లి క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే ఆ దేశ క్రీడా మంత్రి ఆటగాళ్లతో స్వయంగా మాట్లాడినప్పటికీ పాక్‌కు వెళ్లేందుకు ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే సిరీస్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలని లంక బోర్డు కోరగా పాక్ సున్నితంగా తిరస్కరించింది. దీంతో ఈ సిరీస్‌పై సందిగ్దత నెలకొంది. అయితే టాప్ ప్లేయర్స్‌ను కాకుండా జూనియర్ ఆటగాళ్లను పాక్‌కు పంపించాలనే ఆలోచనలో లంక బోర్డు ఉంది. దీనిపై మియాందాద్ స్పందించాడు. ‘ఆటగాళ్లు ఎవరొచ్చినా పాక్ ఆటగాళ్లు సిరీస్ గెలవడంపైనే దృష్టి పెట్టండి. ప్రత్యర్థి జట్టు బలంగా, బలహీనంగా ఉన్నా మన ఆట మనం ఆడాలి. గెలవాలి. సిరీస్ ఉందంటే ఆటగాళ్లు వెళ్లాలి ఆడాలి. అంతేగానీ మేం వెళ్లం అనడం సరైనది కాదు. శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా’అంటూ మియాందాద్ వ్యాఖ్యానించాడు. ఐసీసీ కూడా పాక్‌లో ప్రస్తుత క్రికెట్ పరిస్థితుల, భద్రతా చర్యలపైనా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక 2009లో పాక్‌లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టుపై దాడులు జరిగాయి. బస్సులో ప్రయాణిస్తున్న శ్రీలంక క్రికెటర్లపై అగంతుకులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో బస్సులోని శ్రీలంక క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ ఏ క్రికెట్ జట్టు కూడా పాకిస్తాన్లో పర్యటించే సాహసం చేయలేదు. దీంతో తటస్థ వేదికల్లోనే పాక్ క్రికెట్ ఆడుతూ వస్తోంది. శ్రీలంక సిరీస్‌తో పాక్‌లో క్రికెట్ పునర్వైభం తీసుకరావాలని భావిస్తున్న పాక్‌కు నిరాశ తప్పేలా లేదు. -
షోయబ్‌పై ప్రశంసల జల్లు కురిపించిన సానియా
చాంపియన్స్ ట్రోఫీ చివరి సెమీ ఫైనల్ బెర్తు కోసం శ్రీలంక-పాకిస్థాన్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా పాకిస్థాన్ తరఫున 250 వన్డేలు ఆడిన క్రికెటర్‌గా స్టార్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ ఘనత సాధించబోతున్నాడు. ఈ సందర్భంగా షోయబ్ సతీమణి, భారత టెన్నిస్ తార సానియా మీర్జా అతనిపై ప్రశంసల జల్లు కురిపించింది. ఈ మ్యాచ్ తామందరికీ ఎంతో గర్వకారణమని పేర్కొంది. ‘పాకిస్థాన్ పట్ల, క్రికెట్ పట్ల అతనికి ఉన్న కమిట్మెంట్ను ఇది చాటుతోంది. క్రికెట్ పట్ల ప్రేమతో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న తపనతో అతను ఎప్పుడూ ఉంటాడు. అతని తల్లికి, సోదరుడికి, నాకు ఇది ఎంతో గర్వకారణమైన సందర్భం. అతను సాధించిన దానిపట్ల మేం చాలా గర్వంగా ఉన్నాం’ అని సానియా పేర్కొంది. తామిద్దరం క్రీడాకారులు కావడంతో ఒకరితో ఒకరు కలిసి గడిపేందుకు వీలుగా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటామని సానియ వివరించింది. ‘క్రీడాకారులం కావడంతో మేం చాలా సమయం వేరుగా గడుపుతాం. కానీ ఫోన్లు చాలా సాయపడతాయి. ఎంతో సమన్వయంతో ప్లాన్ చేసుకుంటాం. నేను ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడే పాక్ జట్టు ఆస్ట్రేలియాకు వచ్చింది. అలాంటి సమయాల్లో కలుసుకుంటాం. కొన్నిసార్లు మా షెడూళ్లు మ్యాచ్ అవుతాయి. నాకు ఈ వారాంతం కలిసి వచ్చింది. అందుకే దుబాయ్‌కో, ఇండియాకో వెళ్లకుండా ఇక్కడికి (లండన్) వచ్చాను. దీంతో కొన్ని క్రికెట్ మ్యాచులను వీక్షించే అవకాశం దక్కింది’ అని చెప్పింది. ఇన్ని రోజులు ప్యారిస్‌లో ఉండటం వల్ల చాంపియన్స్ ట్రోఫీని క్రమంతప్పకుండా చూడలేకపోయానని, పాక్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌తోపాటు భారత్ మ్యాచ్‌లను కొన్నింటిని మాత్రమే చూడగలిగానని ఆమె చెప్పింది.