
శ్రీలంకపై పాకిస్తాన్ విజయం(PC: ICC)
SL Vs Pak 1st Test- Updated ICC World Test Championship Points Table: శ్రీలంక పర్యటనలో భాగంగా మొదటి టెస్టులో పాకిస్తాన్ ఆతిథ్య జట్టుపై గెలుపొందింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ సెంచరీతో చెలరేగడంతో(160 పరుగులు- నాటౌట్) 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా బాబర్ ఆజం బృందం వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక(డబ్ల్యూటీసీ)లో మూడో స్థానానికి దూసుకువచ్చింది.
కాగా ఐసీసీ వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ 2021-2023లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో గాలే వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ బుధవారం(జూలై 20)న ముగిసింది. ఇందులో పాకిస్తాన్ గెలిచి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
టాప్‌లో దక్షిణాఫ్రికా.. నాలుగో స్థానంలో భారత్
ఇక డబ్లూటీసీ 2021-23 సీజన్‌కు గానూ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు గెలిచిన దక్షిణాఫ్రికా 60 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా పదింటికి ఆరు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడి మూడు డ్రా చేసుకుంది. తద్వారా 84 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
Photo Credit: ICC
తాజాగా శ్రీలంకపై విజయంతో పాకిస్తాన్ మూడో స్థానానికి చేరుకుంది. పాక్ ఇప్పటి వరకు మొత్తంగా ఎనిమిది మ్యాచ్‌లలో నాలుగు గెలిచి, 2 ఓడి, 2 డ్రా చేసుకుని 56 పాయింట్లు సాధించింది. ఇక టీమిండియా 12 మ్యాచ్‌లలో ఆరు గెలిచి, నాలుగింట ఓడి.. రెండు డ్రా చేసుకుని 75 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వరుసగా 54, 52,64, 28, 16 పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇటీవల ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ మ్యాచ్‌లో ఓడిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు డబ్ల్యూటీసీ మొదటి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
చదవండి: Ind Vs WI ODI Series: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం: విండీస్ కెప్టెన్
All smiles in the Pakistan camp 😊
— Pakistan Cricket (@TheRealPCB) July 20, 2022
The boys celebrate a famous win in Galle ✨#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/zKwXY9vm5e
Comments
Please login to add a commentAdd a comment