Sri Lanka vs Pakistan, 1st Test: శ్రీలంకతో తొలి టెస్టులో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం విదితమే. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బాబర్ ఆజం బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. గాలే వేదికగా జూలై 16న మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య లంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
సౌద్ షకీల్ సంచలన ఇన్నింగ్స్
ధనంజయ డి సిల్వ సెంచరీ(122) నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేయగలిగింది. ఇందుకు దీటుగా బదులిచ్చిన పాకిస్తాన్ 461 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగించి ఆధిక్యం సాధించింది. సౌద్ షకీల్ అజేయ డబుల్ సెంచరీ(208) కారణంగా ఈ మేరకు స్కోరు చేసింది.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో లంక 279 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ఆఖరి రోజు ఆటలో భాగంగా 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసిన పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన సౌద్ షకీల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ప్రైజ్‌మనీ ఎంతో!
ఈ నేపథ్యంలో ప్రెజెంటేషన్ సెర్మనీలో భాగంగా మ్యాచ్ విజేత పాకిస్తాన్‌కు ఇచ్చిన చెక్ నెట్టింట వైరల్‌గా మారింది. విజయానంతరం చెక్ అందుకున్న పాక్ సారథి బాబర్ ఆజం ఫొటో చూసిన నెటిజన్లు అందులో ఉన్న తప్పును కనిపెట్టేశారు. అందులో ప్రైజ్‌మనీగా.. అక్షరాల్లో రెండు వేల యూఎస్ డాలర్లు అని రాసి ఉంది. అయితే, అంకెల్లో మాత్రం 5,000 యూఎస్ డాలర్లు అని ఉంది.
క్షమించండి
ఈ విషయంపై రచ్చ రచ్చ కాగా.. శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది. తప్పిదానికి క్షమాపణలు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ‘‘తొలి టెస్టు విజేతకు అందించిన ప్రెజెంటేషన్ చెక్‌లో దొర్లిన తప్పిదానికి చింతిస్తున్నాం.
నిజానికి గ్రౌండ్ రైట్స్ హోల్డర్ దీనిని రూపొందించింది. ఏదేమైనా ఇందుకు శ్రీలంక క్రికెట్ పూర్తి బాధ్యత వహిస్తుంది. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాం’’అని బోర్డు తెలిపింది. కాగా జూలై 24 నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: రోజుకు 10 కోట్లు! కోహ్లి ఆర్జన వెనుక రోహిత్ శర్మ బావమరిది! సల్మాన్ ఖాన్‌తోనూ..
— Out Of Context Cricket (@GemsOfCricket) July 20, 2023
Comments
Please login to add a commentAdd a comment