శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆట వర్షార్పణం అయినప్పటికి మూడోరోజు మాత్రం దాటిగా ఆడుతూ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ సెంచరీతో రాణించగా.. సాద్ షకీల్ అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. 115 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఈ విషయం పక్కనబెడితే.. ఒక మ్యాచ్‌లో ఎంత బాగా బ్యాటింగ్ చేసినా అతని వీక్‌నెస్ తెలిసిన బౌలర్ ప్రత్యర్థి జట్టులో కచ్చితంగా ఒకడు ఉంటాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి లంక బౌలర్ ప్రభాత్ జయసూరియాకు చిక్కాడు. టెస్టు క్రికెట్‌లో బాబర్ ఆజం ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ఔటవ్వడం ఇది ఆరోసారి.
39 పరుగులు చేసిన బాబర్ జయసూరియా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. బాబర్ ఆజంను ఎక్కువసార్లు ఔట్ చేసిన బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్(ఆరుసార్లు, 133 బంతులు)తో కలిసి జయసూరియా(ఆరుసార్లు, 324 బంతులు) సంయుక్తంగా ఉన్నాడు. వీరిద్దరి తర్వాత ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ (ఐదుసార్లు, 443 బంతులు) బాబర్ ఆజం వికెట్ దక్కించుకున్నాడు.
Babar Azam Vs Prabath Jayasuriya:
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 26, 2023
Innings - 7.
Out - 6.
Runs - 172.
Average - 28.7. pic.twitter.com/3h7LhnctcN
Prabath Jayasuriya has dismissed Babar Azam the joint-most times in Tests, but check out the number of balls Josh Hazlewood has taken for his six wickets 👇 pic.twitter.com/h47pkisPMK
— ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2023
చదవండి: సిక్స్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు.. ఎలాగో చూడండి..!
Abdullah Shafique: సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్.. భారీ ఆధిక్యం దిశగా
Comments
Please login to add a commentAdd a comment