Prabath Jayasuriya
-
NZ Vs SL: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక..
గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో లంక క్లీన్ స్వీప్ చేసింది. 514 పరుగుల భారీ వెనకంజతో ఫాలోఆన్ ఆడిన కివీస్.. రెండో ఇన్నింగ్స్‌లో 360 పరుగులకు ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో శ్రీలంక అరంగేట్ర పేసర్ నిషాన్ పీరిస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. పీరిస్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కివీస్ బ్యాటర్లలో కాన్వే(61), టామ్ బ్లండెల్(60), గ్లెన్ ఫిలిప్స్(78), మిచెల్ శాంట్నర్(67) హాఫ్ సెంచరీలు చేశారు.88 పరుగులకే కివీస్ ఆలౌట్..ఇక రెండో ఇన్నింగ్స్‌లో కాస్త పోరాట పటిమ చూపిన న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం దారుణమైన ప్రదర్శన కనబరిచింది. కేవలం 88 పరుగులకే ఆలౌటై ఘోర ఆ ప్రతిష్టతను మూటకట్టుకుంది. లంక బౌలర్లు దాటికి కివీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కివీస్ బ్యాటర్లలో మిచెల్ శాంట్నర్ (51 బంతుల్లో 29; 4 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా... రచిన్ రవీంద్ర (10), డారిల్ మిషెల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టామ్ లాథమ్ (2), డ్వేన్ కాన్వే (9), కేన్ విలియమ్సన్ (7), ఎజాజ్ పటేల్ (8), టామ్ బ్లండెల్ (1), గ్లెన్ ఫిలిప్స్ (0) విఫలమయ్యారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 6, నిషాన్ మూడు వికెట్లు పడగొట్టారు.లంక భారీ స్కోర్..ఇక తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 602 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కమిందు మెండిస్(182), చండీమాల్(116), కుశాల్ మెండిస్(106) అద్భుతమైన సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్లాక్‌క్యాప్స్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగులకే ఆలౌట్ కావడంతో.. శ్రీలంకకు తొలి ఇన్నింగ్స్‌లో 514 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఫాలోఆన్ ఆడిన కివీస్.. ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.చదవండి: IND vs BAN: టీమిండియా ఓపెనర్‌గా సంజూ శాంసన్..? -
జయసూర్య 'సిక్సర్'.. 88 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఘోర ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. శ్రీలంక బౌలర్ల దాటికి న్యూజిలాండ్ కేవలం 88 పరుగులకే కుప్పకూలింది.లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య స్పిన్ వలలో కివీస్ చిక్కుకుంది. జయసూర్య తన మాయాజాలంతో డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కీలక వికెట్లు పడగొట్టాడు. ఏకంగా తొలి ఇన్నింగ్స్‌లో జయసూర్య 6 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అరంగేట్ర పేసర్ నిషాన్ పీరిస్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. బ్లాక్ క్యాప్స్ ఇన్నింగ్స్‌లో 7 మంది ఆటగాళ్లు కేవలం సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితయమయ్యారు. మిచెల్ శాంట్నర్(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఘోర ప్రదర్శన కరబరిచిన కివీస్ ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతోంది. ఫాలో ఆన్‌లో కూడా కివీస్ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇంకా 385 పరుగులు వెనకబడి ఉంది. ఇప్పటికే తొలి టెస్టులో లంక చేతిలో కివీస్ ఓటమి చవిచూసింది. -
SL vs NZ: ప్రత్యర్థులకు దడ పుట్టించే లంక బౌలర్ ఎంట్రీ!
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందరర్భంగా శ్రీలంక ఓ అన్క్యాప్డ్ ప్లేయర్‌కి జట్టులో చోటిచ్చింది. విశ్వ ఫెర్నాండో గాయపడిన కారణంగా అతడి స్థానంలో ఆఫ్ స్పిన్నర్ నిషాన్ పెరిస్ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రీలంకకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించింది. గాలె వేదికగా సోమవారం ముగిసిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో లంక కివీస్‌ను చిత్తు చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.2018లోనే జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపులెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (4/136; 5/68) స్పిన్ మాయాజాలం కారణంగా శ్రీలంకకు ఈ విజయం సాధ్యమైంది. ఇక ఇరుజట్ల మధ్య సెప్టెంబరు 26 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో నిషాన్ పెరిస్ను జట్టులోకి తీసుకున్నట్లుశ్రీలంక బోర్డు తెలిపింది.33 ఏళ్ల విశ్వ ఫెర్నాండో ప్రాక్టీస్ సమయంలో తొడకండరాలు పట్టేయడంతో నొప్పితో బాధపడ్డాడని.. అతడిస్థానాన్ని నిషాన్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా నిషాన్‌కు 2018లోనే జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అకిల ధనుంజయ గాయపడటంతో మూడో మ్యాచ్‌కు అతడిని ఎంపిక చేశారు.ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దడ పుట్టించిన ఘనతకానీ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. బంగ్లాదేశ్‌తో ఈ ఏడాది ఆరంభంలోనూ జట్టుకు ఎంపికైనా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈసారి కూడా అరంగేట్రం చేసే అవకాశం కనిపించడం లేదు. కాగా నిషాన్ పెరిస్ 41 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఏకంగా 172 వికెట్లు పడగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దడ పుట్టించిన ఘనత సొంతం చేసుకున్నాడు.ఇందులో 12సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. ఇక 61 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి 86 వికెట్లు తీశాడు. ఒకవేళ నిషాన్‌ను గనుక తుదిజట్టులోకి ఎంపిక చేస్తే మరో భయంకర స్పిన్నర్‌ను ఎదుర్కొనేందుకు కివీస్ సిద్ధపడాల్సిందే!న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు శ్రీలంక జట్టుదిముత్ కరుణరత్నే, పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), దినేశ్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కమిందు మెండిస్, రమేష్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో, మిలన్ ప్రియనాథ్ రాత్నాయక్, సదీర సమరవిక్రమ, జెఫ్రీ వాండర్సే, ఓషద ఫెర్నాండో, నిషాన్ పెరిస్.చదవండి: మోర్నీ పనికిరాడన్నట్లు చూశారు.. తామే గొప్ప అనుకుంటారు: పాక్ మాజీ క్రికెటర్ -
ఐదేసిన జయసూర్య.. న్యూజిలాండ్‌ను ఖంగుతినిపించిన శ్రీలంక
గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక 63 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ చివరి రోజు న్యూజిలాండ్ గెలవాలంటే 68 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక గెలుపుకు కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. ఈ దశలో ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఓవర్‌నైట్ స్కోర్‌కు (207/8) మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి, మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. ఆఖరి రోజు తొలి నాలుగు ఓవర్లలో న్యూజిలాండ్ చేతులెత్తేయడం నిరాశ కలిగించింది.ఓవర్‌నైట్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (91) పోరాడతాడని అంతా అనుకున్నారు. అయితే అది జరగలేదు. అతను ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో పరుగు మాత్రమే జోడించి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రభాత జయసూర్య రచిన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. చివరి వికెట్ విలియమ్ ఓరూర్కీను కూడా జయసూర్యనే క్లీన్ బౌల్డ్ చేశాడు. 344 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 211 పరుగుల వద్ద ముగిసింది.ప్రభాత జయసూర్య ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. రమేశ్ మెండిస్ 3, అశిత ఫెర్నాండో, ధనంజయ డిసిల్వ తలో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో రచిన్‌తో పాటు టామ లాథమ్ (28), కేన్ విలియమ్సన్ (30), టామ్ బ్లండెల్ (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.రాణించిన కరుణరత్నే, చండీమల్, మాథ్యూస్అంతకుముందు శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే (83), చండీమల్ (61), ఏంజెలో మాథ్యూస్ (50) అర్ద సెంచరీలతో రాణించారు. అజాజ్ పటేల్ ఆరు వికెట్లు తీసి శ్రీలంక ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టాడు. విలియమ్ ఓరూర్కీ 3, సాంట్నర్ ఓ వికెట్ పడగొట్టారు.లాథమ్, విలియమ్సన్, మిచెల్ ఫిఫ్టీలున్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్ (70), కేన్ విలియమ్సన్ (55), డారిల్ మిచెల్ (57) అర్ద సెంచరీలతో రాణించారు. ఫలితంగా ఆ జట్టు 340 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్), రచిన్ రవీంద్ర (39), టామ్ బ్లండెల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4, రమేశ్ మెండిస్ 3, ధనంజయ డిసిల్వ 2 వికెట్లు పడగొట్టారు.కమిందు సెంచరీఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేసి ఆలౌటైంది. కమిందు మెండిస్ (114) సెంచరీ.. కుసాల్ మెండిస్ (50) అర్ద సెంచరీ చేసి శ్రీలంకకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కివీస్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్, అజాజ్ పటేల్ తలో 2, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు.చదవండి: క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా -
ఇంగ్లండ్ బ్యాటర్ల మతి పోగొట్టిన లంక స్పిన్నర్.. వైరల్ వీడియో
ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ప్రభాత్ ఇద్దరు ఇంగ్లండ్ బ్యాటర్లను మతి పోగొట్టే బంతులతో క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్ ప్రభాత్ మాయాజాలం ధాటికి నోరెళ్లబెట్టారు. ఊహించని విధంగా బంతి స్పిన్ కావడంతో ఆ ఇద్దరు బ్యాటర్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్రభాత్ ఇంగ్లండ్ బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేసిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.Prabhat Jayasuriya with two absolute jaffas. 🤯pic.twitter.com/oeyooLHWPP— Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2024మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 23 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (72), గస్ అట్కిన్సన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ 18, డేనియల్ లారెన్స్ 30, ఓలీ పోప్ 6, జో రూట్ 42, హ్యారీ బ్రూక్ 56, క్రిస్ వోక్స్ 25 పరుగులు చేశారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 3, ప్రభాత్ జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైంది.నిషన్ మధుష్క 4, కరుణరత్నే 2, కుసాల్ మెండిస్ 24, ఏంజెలో మాథ్యూస్ 0, చండీమల్ 17, ధనంజయ డిసిల్వ 74, కమిందు మెండిస్ 12, ప్రభాత్ జయసూర్య 10, మిలన్ రత్నాయకే 72, విశ్వ ఫెర్నాండో 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలో మూడు వికెట్లు, గస్ అట్కిన్సన్ 2, మార్క్ వుడ్ ఓ వికెట్ పడగొట్టారు. -
జయసూర్య మాయాజాలం.. పసికూనపై ప్రతాపం చూపించిన శ్రీలంక
కొలొంబో వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రభాత్ జయసూర్య తన స్పిన్ మాయాజాలంతో (8/174) ఆఫ్ఘన్ల పని పట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన జయసూర్య.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించి ఆఫ్ఘనిస్తాన్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. అషిత ఫెర్నాండో (3/24), విశ్వ ఫెర్నాండో (4/51), ప్రభాత్ జయసూర్య (3/67) ధాటికి 198 పరుగులకు కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (91) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఏంజెలో మాథ్యూస్ (141), చండిమల్ (107) సెంచరీలతో కదంతొక్కారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీద్ జద్రాన్ 4, నిజత్ మసూద్, కైస్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఆతర్వాత సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలుత గట్టిగా ప్రతిఘటించింది. ఇబ్రహీం జద్రాన్ (114), రహ్మత్ షా (54) రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేయడంతో ఆ జట్టు పటిష్ట స్థితికి చేరేలా కనిపించింది. అయితే జయసూర్య ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 213 పరుగులకు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన ఆ జట్టు తమ చివరి తొమ్మిది వికెట్లను 83 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. జయసూర్య (5/107), అషిత ఫెర్నాండో (3/63), రజిత (2/59) రెచ్చిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. 56 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. వికెట్ కూడా నష్టపోకుండా సునాయాసంగా విజయం సాధించింది. కరుణరత్నే 32, మధుష్క 22 పరుగులతో శ్రీలంకను విజయతీరాలకు చేర్చారు. -
లంక బౌలర్ సంచలనం.. బాబర్ ఆజం వీక్నెస్ తెలిసినోడు
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆట వర్షార్పణం అయినప్పటికి మూడోరోజు మాత్రం దాటిగా ఆడుతూ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ సెంచరీతో రాణించగా.. సాద్ షకీల్ అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. 115 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ విషయం పక్కనబెడితే.. ఒక మ్యాచ్‌లో ఎంత బాగా బ్యాటింగ్ చేసినా అతని వీక్నెస్ తెలిసిన బౌలర్ ప్రత్యర్థి జట్టులో కచ్చితంగా ఒకడు ఉంటాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి లంక బౌలర్ ప్రభాత్ జయసూరియాకు చిక్కాడు. టెస్టు క్రికెట్లో బాబర్ ఆజం ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ఔటవ్వడం ఇది ఆరోసారి. 39 పరుగులు చేసిన బాబర్ జయసూరియా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. బాబర్ ఆజంను ఎక్కువసార్లు ఔట్ చేసిన బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్(ఆరుసార్లు, 133 బంతులు)తో కలిసి జయసూరియా(ఆరుసార్లు, 324 బంతులు) సంయుక్తంగా ఉన్నాడు. వీరిద్దరి తర్వాత ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ (ఐదుసార్లు, 443 బంతులు) బాబర్ ఆజం వికెట్ దక్కించుకున్నాడు. Babar Azam Vs Prabath Jayasuriya: Innings - 7. Out - 6. Runs - 172. Average - 28.7. pic.twitter.com/3h7LhnctcN — Mufaddal Vohra (@mufaddal_vohra) July 26, 2023 Prabath Jayasuriya has dismissed Babar Azam the joint-most times in Tests, but check out the number of balls Josh Hazlewood has taken for his six wickets 👇 pic.twitter.com/h47pkisPMK — ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2023 చదవండి: సిక్స్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు.. ఎలాగో చూడండి..! Abdullah Shafique: సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్.. భారీ ఆధిక్యం దిశగా -
చరిత్ర సృష్టించిన జయసూర్య.. 71 ఏళ్ల వరల్డ్ రికార్డు బద్దలు
టెస్టు క్రికెట్లో శ్రీలంక స్పిన్నర్ ప్రబాత్ జయసూర్య అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన స్పిన్నర్‌గా జయసూర్య నిలిచాడు. గాలె వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌తో పాల్ స్టిర్లింగ్‌ను ఔట్ చేసిన ప్రబాత్ జయసూర్య.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డును కేవలం 7 మ్యాచ్‌ల్లోనే జయసూర్య సాధించాడు. ఈ వరల్డ్ రికార్డు ఇప్పటి వరకు వెస్టిండీస్ మాజీ స్పిన్నర్ ఆల్ఫ్ వాలెంటైన్ పేరిట ఉండేది. ఆల్ఫ్ వాలెంటైన్ ఎనిమిది టెస్టు మ్యాచ్‌ల్లో అద్భుతమైన రికార్డును సాధించాడు. వాలెంటైన్ 1951-52 మధ్య కాలంలో నెలకొల్పాడు. తాజా మ్యాచ్‌తో 71 ఏళ్ల ప్రపంచ రికార్డును ప్రబాత్ బ్రేక్ చేశాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక బౌలర్‌గా కూడా జయసూర్య రికార్డులకెక్కాడు. చదవండి: IPL 2023-Teamindia: కిషన్ వద్దు.. అతడికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్! విధ్వంసం సృష్టిస్తాడు.. అదే విధంగా ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్లో ఈ రికార్డు సాధించిన రెండో బౌలర్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన వెర్నాన్ ఫిలాండర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ టామ్ రిచర్డ్‌సన్‌తో జయసూర్య సంయుక్తంగా నిలిచాడు. ఇక ఐరీష్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల హాల్ సాధించిన జయసూర్య.. రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. చదవండి: IPL 2023: బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. రాజస్తాన్‌కు దొరికిన ఆణిముత్యం! -
శ్రీలంకకు చుక్కలు చూపించిన ఐర్లాండ్.. టెస్టుల్లో అత్యధిక స్కోర్!
గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అతిథ్య శ్రీలంకకు పసికూన ఐర్లాండ్ చుక్కలు చూపించింది. ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 492 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టెస్టుల్లో ఐర్లాండ్‌కు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. అంతకుముందు 2018లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో ఐర్లాండ్ 339 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో ఐర్లాండ్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐరీష్ బ్యాటర్లలో పాల్ స్టిర్లింగ్(103), కర్టిస్ కాంఫర్(111) సెంచరీలతో చెలరేగారు. అదే విధంగా ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ(95) పరుగులతో రాణించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో ప్రబాత్ జయసూర్య ఐదు వికెట్ల హాల్ సాధించగా.. విశ్వా ఫెర్నాండో, అసితా ఫెర్నాండో తలా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో రోజు ఆటను వెలుతురు లేమి కారణంగా నిలిపివేశారు. ఆట నిలిచిపోయే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. క్రీజులో నిషాన్ మదుష్కా(41), దిమిత్ కరుణరత్నే(39) ఉన్నారు. చదవండి: Ind Vs Aus WTC 2023: టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంపరాఫర్.. పాపం సూర్యకుమార్! -
ఐర్లాండ్ బ్యాటర్ల ఆధిపత్యం.. తేలిపోయిన లంక బౌలర్లు, మరో 20 పరుగులు చేస్తే రికార్డు
గాలె: శ్రీలంకతో సోమవారం మొదలైన రెండో టెస్టులో ఐర్లాండ్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 319 పరుగులు సాధించింది. కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ (163 బంతుల్లో 95; 14 ఫోర్లు) ఐదు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. పాల్ స్టిర్లింగ్ (133 బంతుల్లో 74 రిటైర్డ్‌హర్ట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), లొర్కాన్ టకర్ (102 బంతుల్లో 78 బ్యాటింగ్; 10 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీలు చేశారు. బాల్బిర్నీ, స్టిర్లింగ్ నాలుగో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. టెస్టుల్లో ఐర్లాండ్ జట్టుకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. మరో 20 పరుగులు సాధిస్తే ఐర్లాండ్ టెస్టుల్లో తమ అత్యధిక స్కోరును నమోదు చేస్తుంది. టకర్‌కు జతగా ప్రస్తుతం కాంఫెర్ (27 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య రెండు వికెట్లు పడగొట్టాడు. -
చరిత్ర సృష్టించిన శ్రీలంక.. అతి భారీ విజయం
స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో శ్రీలంకకు ఇదే అతి భారీ విజయం. 2004లో జింబాబ్వేపై ఇన్నింగ్స్ 254 పరుగుల తేడాతో సాధించిన విజయమే ఈ మ్యాచ్‌కు ముందు వరకు శ్రీలంకకు అతి భారీ విజయంగా ఉండింది. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అతి భారీ విజయం రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 1938లో ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 579 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ విషయానికొస్తే.. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి పసికూనపై చారిత్రక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌ను 591/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (179), కుశాల్ మెండిస్ (140), దినేశ్ చండీమాల్ (102 నాటౌట్), సమరవిక్రమ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం ప్రభాత్ జయసూర్య విజృంభించడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలోఆన్ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన చేసి 168 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో జయసూర్య 3 వికెట్లు పడగొట్టగా.. రమేశ్ మెండిస్ 4, విశ్వ ఫెర్నాండో 2 వికెట్లు దక్కించుకున్నారు. 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో రెండో టెస్ట్ ఏప్రిల్ 24 నుంచి ఇదే వేదికగా జరుగుతుంది. జయసూర్యకు 10.. 6 మ్యాచ్‌ల్లో 5 సార్లు 5 వికెట్లు, 2 సార్లు 10 వికెట్లు తొలి ఇన్నింగ్స్‌లో 7, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన ప్రభాత్ జయసూర్య.. తన 6 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో రెండోసారి 10 వికెట్లు పడగొట్టాడు. 6 మ్యాచ్‌ల్లో మొత్తం 43 వికెట్లు సాధించిన జయసూర్య.. ఐదు సార్లు 5 వికెట్ల ఘనత కూడా సాధించాడు. రమేశ్ మెండిస్ రికార్డు.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన రమేశ్ మెండిస్.. శ్రీలంక తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు (మ్యాచ్‌లు (11), ఇన్నింగ్స్ (21) పరంగా) పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. -
చండీమల్, సమరవిక్రమ సెంచరీలు.. ఐదు వికెట్లతో చెలరేగిన జయసూర్య
Sri Lanka vs Ireland, 1st Test- గాలె: ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుపై శ్రీలంక రెండో రోజే పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 386/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 6 వికెట్లకు 591 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. దినేశ్ చండీమల్ (102 నాటౌట్; 12 ఫోర్లు), సమరవిక్రమ (104 నాటౌట్; 11 ఫోర్లు) అజేయ సెంచరీలు సాధించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 183 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్ ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి కష్టాల్లో పడింది. జేమ్స్ మెకొల్లమ్ (35; 5 ఫోర్లు), హ్యారీ టెక్టర్ (34; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. టకెర్ (21 బ్యాటింగ్), మెక్‌బ్రైన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో ప్రభాత జయసూర్య 5 వికెట్లు, ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టారు. లంక స్కోరుకు ఐర్లాండ్ మరో 474 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: దురదృష్టం అంటే కోహ్లిదే.. అయ్యో విరాట్! బౌలర్‌కు మాత్రం!వీడియో వైరల్ -
6 మ్యాచ్‌ల్లో ఐదు సార్లు 5 వికెట్లు.. దుమ్మురేపుతున్న లంక స్పిన్నర్
గాలే వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఐదు వికెట్ల ఘనత (19-9-42-5)తో చెలరేగాడు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. జయసూర్యకు జతగా విశ్వ ఫెర్నాండో 2 వికెట్లతో రాణించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జేమ్స్ మెక్‌కొల్లమ్ (35), హ్యారీ టెక్టార్ (34), పీటర్ మూర్ (14), లోర్కాన్ టకెర్ (21 నాటౌట్) రెండంకెల స్కోర్లు సాధించగా.. ముర్రే కొమిన్స్ (0), ఆండ్రూ బల్బిర్నీ (4), కర్టిస్ క్యాంఫర్ (0), జార్జ్ డాక్రెల్ (2) విఫలమయ్యారు. అంతకుముందు దిముత్ కరుణరత్నే (179), కుశాల్ మెండిస్ (140), దినేశ్ చండీమాల్ (102 నాటౌట్), సమరవిక్రమ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 591 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 6 మ్యాచ్‌ల్లో ఐదు సార్లు 5 వికెట్లు, ఓసారి 10 వికెట్లు.. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో 5 వికెట్లు పడగొట్టి, ప్రత్యర్ధి పతనాన్ని శాశించిన జయసూర్య దిగ్గజ బౌలర్ల సరసన చేరాడు. జయసూర్య కేవలం 6 మ్యాచ్‌ల్లో ఐదు సార్లు 5 వికెట్లు, ఓ సారి 10 వికెట్లు పడగొట్టి ఓవరాల్‌గా 38 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ మ్యాచ్‌ల్లో 5 సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత ఆస్ట్రేలియా బౌలర్ రాడ్నీ హాగ్ పేరిట నమోదై ఉంది. ఇతను కేవలం 3 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. టీమిండియా సంచలన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సైతం 3 మ్యాచ్‌ల్లోనే 4 సార్లు ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌కు చెందిన టామ్ రిచర్డ్సన్ 4 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. ఆసీస్‌కు చెందిన చార్లీ టర్నర్ 6 మ్యాచ్‌ల్లో ఏకంగా 8 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించి నేటికి చెక్కుచెదరని రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. -
ICC: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేతలు వీరే!
జూలై నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో శ్రీలంక స్పిన్ సంచలనం ప్రబాత్ జయసూర్య, మహిళల క్రికెట్ విభాగంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఎమ్మా లాంబ్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు. కాగా జయసూర్య ఆస్ట్రేలియాతో తన అరంగేట్ర టెస్టులోనే 12 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. అనంతరం స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ జయసూర్య సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో జయసూర్య 17 వికెట్లు సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో జయసూర్య జూలై నెలకు గాను నామినెట్ అయిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెయిర్ స్టో, ఫ్రెంచ్ సంచలనం గుస్తావ్ మెక్కీన్ను వెనుక్కి నెట్టి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఎమ్మా లాంబ్ సంచలనం దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన వన్డే సిరీస్‌లో లాంబ్ అదరగొట్టింది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఆమె.. 234 పరుగులతో పాటు 3వికెట్లు పడగొట్టింది. దీంతో లాంబ్.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్వైవర్, భారత్ పేసర్ రేణుకా సింగ్‌ను అధిగమించి ఈ ప్రతిష్టాత్మక అవార్డును లంబ్ దక్కించుకుంది. చదవండి: ZIM Vs BAN 2nd ODI: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించిన జింబాబ్వే.. వన్డే సిరీస్ సొంతం! -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ ఎవరంటే..?
2022 జులై నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ జాబితాను ఐసీసీ బుధవారం (ఆగస్ట్ 3) ప్రకటించింది. పురుషుల క్రికెట్‌కు సంబంధించి ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్‌స్టో, శ్రీలంక సంచలన స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య, ఫ్రాన్స్ యువ చిచ్చరపిడుగు గుస్తావ్ మెక్కియోన్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మహిళల కేటగిరీలో టీమిండియా యువ బౌలర్ రేణుకా సింగ్, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు ఎమ్మా లాంబ్, నతాలీ సీవర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచారు. జూన్ నెల మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచిన బెయిర్‌స్టో తన కెరీర్ బెస్ట్ ఫామ్‌ను కొనసాగిస్తూ.. జులై నెల నామినీస్ జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. భారత్‌తో జరిగిన రీషెడ్యూల్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు (106, 114*) బాదిన బెయిర్‌స్టో.. ఆ ప్రదర్శన ఆధారంగానే ఈ జాబితాలో చోటు దక్కించకున్నాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 63 పరుగులు చేసిన అతను.. ఆతర్వాత జరిగిన తొలి టీ20లో 53 బంతుల్లో 90 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఇక లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య విషయానికొస్తే.. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ జులై నెలలో తానాడినడిన 3 టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు నేలకూల్చి ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచాడు. ఆసీస్‌పై 6/118, 6/59.. ఆతర్వాత పాక్‌పై తొలి టెస్ట్‌లో 5/82, 4/135, రెండో టెస్ట్‌లో 3/80, 5/117 అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. గుస్తావ్ మెక్కియోన్ విషయానికొస్తే.. ఈ ఫ్రెంచ్ యువ బ్యాటర్ టీ20ల్లో వరుసగా రెండు విధ్వంసకర సెంచరీలతో (109, 101) ప్లేయర్ ఆఫ్ ద మంత్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మహిళల కేటగిరీలో రేణుకా సింగ్ ఐదు మ్యాచ్‌ల్లో 12 వికెట్ల ప్రదర్శనతో.. లాంబ్ 3 మ్యాచ్‌ల్లో 102, 67, 65 అదిరిపోయే ప్రదర్శనతో.. సీవర్ వరుస హాఫ్ సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచారు. చదవండి: భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. హైదరాబాద్‌లో మ్యాచ్ ఎప్పుడంటే..? -
అక్షర్ పటేల్ రికార్డు బద్దలు కొట్టి.. నరేంద్ర హిర్వానికి చేరువై..!
పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు పడగొట్టడం ద్వారా లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ కెరీర్లో తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత మాజీ లెగ్ స్పిన్ బౌలర్ నరేంద్ర హిర్వాని (31 వికెట్లు, తొలి టెస్ట్‌లోనే విండీస్‌పై 16 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ప్రభాత్ (29) ఆస్ట్రేలియా మాజీ బౌలర్ చార్లెస్ టర్నర్ (29)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. Most wickets after three Tests in career:31 - Narendra Hirwani (Ind)29 - PRABATH JAYASURIYA* (SL)29 - Charles Turner (Aus)27- Axar Patel (Ind)27 - Rodney Hogg (Aus)#SLvsPAK pic.twitter.com/tubvpRY9mF— Lalith Kalidas (@lal__kal) July 28, 2022 ఈ క్రమంలో ప్రభాత్.. టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (27) రికార్డును కూడా అధిగమించాడు. పాక్‌తో రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాత్.. మరో రికార్డను కూడా సంయుక్తంగా షేర్ చేసుకున్నాడు. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు 5 వికెట్ల ఘనతలు సాధించిన బౌలర్‌గా అక్షర్ పటేల్‌తో సమంగా నిలిచాడు. 4th 5 wicket haul in 6 innings for Prabath Jayasuriya. Amazing performance so far.Very similar to how Axar Patel started out for India. He too had 4 5-wkt hauls in his first 6 innings.— Gurkirat Singh Gill (@gurkiratsgill) July 28, 2022 అరంగేట్రం టెస్ట్‌లో 12 వికెట్లు (6/118, 6/59) నేలకూల్చి లంక తరఫున డెబ్యూ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పిన ప్రభాత్.. ఆ తర్వాత పాక్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 9 వికెట్లు (5/82, 4/135), తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు (3/80, 5/117) సాధించాడు. ఆడిన 3 మ్యాచ్‌ల్లో తన జట్టును రెండు సార్లు గెలిపించిన ప్రభాత్.. ప్రస్తుత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ బ్యాటర్లందరినీ (రూట్ మినహా) ఔట్ చేశాడు. Sri Lanka's Prabath Jayasuriya has now dismissed:No. 2 ranked Test Batter Marnus Labuschagne, twice.No.3 ranked Test Batter Babar Azam twice, that too in his first 5 bowling inns. No. 4 ranked Test Batter Steve Smith, once. (for a duck) #SLvPAK #GalleTest #BabarAzam pic.twitter.com/z5kQYinLtg— Haseeb Khan 🇵🇰 (@HaseebkhanHk7) July 28, 2022 వరల్డ్ నంబర్ 2 బ్యాటర్ లబూషేన్‌ను రెండుసార్లు, నంబర్ 3 ఆటగాడు బాబర్ ఆజమ్‌ను రెండుసార్లు, స్టీవ్ స్మిత్‌ను ఒక్కసారి (డకౌట్) పెవిలియన్‌కు పంపాడు. 30 ఏళ్ల లేటు వయసులో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.. తన వైవిధ్యమైన స్పిన్ మాయాజాలంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా మారాడు. వికెట్లు సాధించడంతో పాటు జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషిస్తూ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్‌గా మారాడు. Prabath Jayasuriya in Test cricket:6 for 118 vs Australia.6 for 59 vs Australia.5 for 82 vs Pakistan.4 for 135 vs Pakistan.3 for 80 vs Pakistan.5 for 117 vs Pakistan. pic.twitter.com/KcZjHP4lRn— Johns. (@CricCrazyJohns) July 28, 2022 చదవండి: రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్‌ను మట్టికరిపించిన లంకేయులు -
టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు..!
శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్‌గా మారాడు. 30 ఏళ్ల లేటు వయసులో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.. తన వైవిధ్యమైన స్పిన్ మాయాజాలంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా మారాడు. ఇప్పటివరకు ఆడిన 3 టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు నేలకూల్చిన ప్రభాత్.. తన జట్టును రెండు పర్యాయాలు ఒంటిచేత్తో గెలిపించాడు. Prabath Jayasuriya in Test cricket: 6 for 118 vs Australia. 6 for 59 vs Australia. 5 for 82 vs Pakistan. 4 for 135 vs Pakistan. 3 for 80 vs Pakistan. 5 for 117 vs Pakistan. pic.twitter.com/KcZjHP4lRn — Johns. (@CricCrazyJohns) July 28, 2022 తాజాగా పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు (3/80, 5/117) పడగొట్టి.. తన జట్టుకు అపురూప విజయాన్నందించిన (246 పరుగుల భారీ తేడాతో ఘన విజయం) ప్రభాత్.. అంతకుముందు ఆసీస్ సిరీస్‌లో రెండో టెస్ట్‌నూ రెచ్చిపోయి (6/118, 6/59) ఆర్ధిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న తన దేశానికి ఊరట కలిగించే విజయాన్నందించాడు. ఈ ప్రదర్శనతో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన ప్రభాత్.. ఆతర్వాత పాక్‌పై తొలి టెస్ట్‌లోనూ చెలరేగి 9 వికెట్లు (5/82, 4/135) సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (160 నాటౌట్) సూపర్ సెంచరీతో రెచ్చిపోవడంతో పాక్ 342 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ శక్తి వంచన లేకుండా బౌలింగ్ చేసిన ప్రభాత్‌కు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో లంక భారీ టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆసీస్, పాక్ లాంటి జట్లనే వణికించిన ఈ నయా స్పిన్ సెన్సేషన్.. మున్ముందు మరిన్ని రికార్డులను బద్దలుకొడతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్‌ను మట్టికరిపించిన లంకేయులు -
రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్‌ను మట్టికరిపించిన లంకేయులు
స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్య (3/80, 5/117), రమేశ్ మెండిస్ (5/47, 4/101)లు రెచ్చిపోవడంతో పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక ఘన విజయం సాధించింది. 508 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. లంక స్పిన్నర్ల ధాటికి 261 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 246 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 89/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆట మొదలైన కొద్దిసేపటికే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (49) వెనుదిరగగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (81) , వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (37)లు కాసేపు ప్రతిఘటించారు. ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఫవాద్ ఆలం (1), అఘా సల్మాన్ (4), మహ్మద్ నవాజ్ (12), యాసిర్ షా (27), హసన్ అలీ (11), నసీమ్ షా (18)లు లంక స్పిన్నర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్క ఫవాద్ ఆలం (రనౌట్) వికెట్ మినహా మిగిలిన వికెట్లన్నిటినీ లంక స్పిన్నర్ల ఖాతాలోకే వెళ్లాయి. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకే ఆలౌట్ కాగా.. పాక్ 231 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం శ్రీలంక 360/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. భారీ ఛేదనలో పాక్ చేతులెత్తేసింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన ధనంజయ డిసిల్వాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి 17 వికెట్లు నేలకూల్చిన ప్రభాత్ జయసూర్యకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. కాగా, తొలి టెస్ట్‌లో లంక నిర్ధేశించిన 342 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ సునాయాసంగా ఛేదించి రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. స్కోర్ వివరాలు.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 378 ఆలౌట్ (చండీమల్ (80), నసీమ్ షా (3/58)) పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 231 ఆలౌట్ (అఘా సల్మాన్ (62), రమేశ్ మెండిస్ (5/47)) శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 360/8 డిక్లేర్ (ధనంజయ డిసిల్వా (109), నసీమ్ షా (2/44)) పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 231 (బాబర్ ఆజమ్ (81), ప్రభాత్ జయసూర్య (5/117)) చదవండి: డిసిల్వా అద్భుత శతకం.. పాక్ ఓటమి ఖాయం..! -
తిప్పేసిన స్పిన్నర్లు.. రెండో టెస్ట్‌పై పట్టుబిగిస్తున్న లంకేయులు
తొలి టెస్ట్‌లో పాక్ చేతిలో దారుణంగా ఓడి కసితో రగిలిపోతున్న శ్రీలంక.. రెండో టెస్ట్‌పై పట్టుబిగిస్తుంది. లంక స్పిన్నర్లు రెచ్చిపోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో ఉంది. 315 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను (తొలి ఇన్నింగ్స్) ప్రారంభించిన శ్రీలంక.. మరో 63 పరుగులు జోడించి 378 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ డిక్వెల్లా (51) అర్ధసెంచరీతో రాణించగా.. రమేశ్ మెండిస్ (35) పర్వాలేదనిపించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. లంక స్పిన్నర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. తొలి టెస్ట్‌లో అజేయ శతకంతో పాక్‌ను గెలిపించిన అబ్దుల్లా షఫీక్ ఈ ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (32), కెప్టెన్ బాబర్ ఆజమ్ (16), వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (24), ఫవాద్ ఆలం (24) లు విఫలం కాగా.. మిడిలార్డర్ ఆటగాడు అఘా సల్మాన్ (62) లంక స్పిన్నర్లకు కాసేపు ఎదురొడ్డాడు. సల్మాన్‌ను ప్రభాత్ జయసూర్య అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించడంతో రెండో రోజు ఆట ముగిసింది. రమేశ్ మెండిస్ 3, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీసి పాక్‌ను కష్టాల్లోకి నెట్టారు. ప్రస్తుతం పాక్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 187 పరుగులు వెనుకబడి ఉంది. తొలి రోజు లంక ఆటగాళ్లు ఒషాడో ఫెర్నాండో (50), చండీమల్ (80) అర్ధసెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే. చదవండి: సూపర్ ఫామ్‌ను కొనసాగించిన చండీమల్.. తొలి రోజు లంకదే పైచేయి -
ఏమని వర్ణించగలం?.. బాబర్ ఆజంకే దిమ్మ తిరిగింది
యాసిర్ షా ''బాల్ ఆఫ్ ది సెంచరీ''తో కుషాల్ మెండిస్‌ను ఔట్ చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే మరో అద్భుతం చోటుచేసుకుంది. శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య పాకిస్తాన్ కెప్టెన్.. ఇన్ఫాం బ్యాటర్ బాబర్ ఆజంను ఔట్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రీజులో ఉన్న బాబర్ ఆజం తాను ఔటయ్యానా అన్న సందేహం కలిగేలా చేసింది ఆ బంతి. బాబర్ ఆజంకే దిమ్మ తిరిగేలా చేసిన ఆ బంతిని ఏమని వర్ణించగలం. విషయంలోకి వెళితే.. లంకతో తొలి టెస్టులో 342 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్‌ను షఫీక్ అబ్దుల్లా, బాబర్ ఆజం తమ ఇన్నింగ్స్‌తో నిలబెట్టారు. అటు షఫీక్ సెంచరీతో ఆకట్టుకోగా.. బాబర్ ఆజం కూడా అర్థ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరి జోడిని విడదీయడానికి లంక బౌలర్లు తెగ కష్టపడినా లాభం లేకపోయింది. ఇద్దరి భాగస్వామ్యం బలపడుతున్న దశలో బౌలింగ్‌కు వచ్చాడు ప్రభాత్ జయసూర్య. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన ప్రభాత్ రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి మెరిశాడు. అసలే సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన బాబర్ ఆజం క్రీజులో ఉన్నాడు. దీనికి తోడూ తొలి ఇన్నింగ్స్‌లో వీరోచిత సెంచరీతో లంకకు కేవలం నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కేలా చేశాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ప్రభాత్ జయసూర్య ఓవర్ ది వికెట్ మీదుగా బౌలింగ్ చేశాడు. పూర్తిగా లెగ్‌స్టంప్ అవతల పడిన బంతిని బాబర్ అంచనా వేయడంలో పొరబడ్డాడు. లెగ్ స్టంప్ మీదుగా పడిన బంతి ఆఫ్‌స్టంప్ మీదుగా వస్తుందని భ్రమ పడిన బాబర్ ప్యాడ్లను అడ్డుపెట్టాడు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. లెగ్‌స్టంప్ అవతల పడిన బంతి బాబర్ కాళ్ల వెనకాల నుంచి టర్న్ తీసుకొని నేరుగా లెగ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. దీనిని క్రికెట్ భాషలో ''జప్ఫా బంతి'' అని పిలుస్తారు. అంతే లంక బౌలర్ జయసూర్య కళ్లలో ఆనందం కనబడగా.. బాబర్ మాత్రం ఏం జరిగిందో అర్థంగాక చూస్తూ నిల్చుండిపోయాడు. ఆ తర్వాత జయసూర్య బౌలింగ్‌ను మెచ్చుకుంటూ పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ 112, మహ్మద్ రిజ్వాన్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి 120 పరుగులు అవసరం కాగా.. లంకకు ఏడు వికెట్లు అవసరం. మరొక రోజు ఆట మిగిలి ఉండడంతో లంక బౌలర్లు మ్యాజిక్ చేస్తారా.. లేక ప్యాక్ బ్యాటర్లకు దాసోహం అంటారా అనేది వేచి చూడాలి. Babar Azam bowled with a Magical delivery by P Jayasuriya 1st Test Pak vs Sl #testlive #PAKvSL #BabarAzam pic.twitter.com/BBtDvz8wd9 — Vamsi Vemula (@VamsiVemula7) July 19, 2022 Big wicket for Sri Lanka Babar Azam is cleaned up by jayasuriya#BabarAzam #PAKvsSL #SLvPAK #Pakistan #Cricket pic.twitter.com/e6cyRSo5l0 — Khushnood Ali Khan (@KhushnoodAli07) July 19, 2022 చదవండి: యాసిర్ షా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్ గుర్తురాక మానడు -
పాక్‌ను ఆదుకున్న బాబర్ ఆజమ్..
గాలె: కెప్టెన్ బాబర్ ఆజమ్ (119; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించడంతో... శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 90.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. 148 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన పాక్‌ను ఆజమ్ ఆదుకున్నాడు. నసీమ్ షా (5 నాటౌట్)తో కలిసి చివరి వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (5/82) పాక్‌ను దెబ్బతీశాడు. నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 36 పరుగులు సాధించింది. చదవండి: Virat Kohli: మారని ఆటతీరు.. వన్డే కెరీర్లో అత్యంత చెత్త రికార్డు -
జయసూర్య మాయాజాలం.. టెస్ట్ క్రికెట్లో అరుదైన ఫీట్
టెస్ట్ క్రికెట్లో శ్రీలంక సంచలన స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అరుదైన ఫీట్‌ను సాధించాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించడం ద్వారా అతను టెస్ట్ క్రికెట్లో తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. పాక్‌పై తొలి ఇన్నింగ్స్‌లో (రెండో రోజు లంచ్ సమయానికి 5/41) ఇదేసిన జయసూర్య.. అంతకుముందు ఆసీస్‌తో జరిగిన రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆరేసి వికెట్లు (6/118, 6/59) పడగొట్టాడు. ప్రస్తుతానికి జయసూర్య ఖాతాలో 3 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 17 వికెట్లు ఉన్నాయి. A five-for each in his first three Test innings 🤯 Take a bow, Prabath Jayasuriya 🙌 Watch #SLvPAK LIVE on https://t.co/CPDKNxoJ9v with a Test Series Pass (in select regions) 📺#WTC23 | 📝 Scorecard: https://t.co/Zjbsh8Hg2c pic.twitter.com/3U65ou7lyn — ICC (@ICC) July 17, 2022 ఇదిలా ఉంటే, గాలే వేదికగా పాక్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక పట్టు సాధించింది. తొలి రోజు ఆటలో పాక్ బౌలర్ల ధాటికి 222 పరుగులకే కుప్పకూలిన లంకేయులు.. రెండో రోజు బౌలింగ్‌లో చెలరేగిపోయారు. 24/2 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన పాక్‌ను.. జయసూర్య, కసున్ రజిత (1/21), రమేశ్ మెండిస్ (1/11) దారుణంగా దెబ్బతీశారు. వీరి ధాటికి పాక్ లంచ్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 104 పరుగులు మాత్రమే చేసింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (34)కు జతగా యాసిర్ షా (12) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు పాక్ ఇటీవలే లంకలో అడుగుపెట్టింది. జులై 24 నుంచి రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. 10 wicket haul on a debut ✔️ Best figures by a Sri Lankan on a debut ✔️ Dream debut for Prabath Jayasuriya 🤩#SLvAUS pic.twitter.com/BeAg9pMZNv — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 చదవండి: మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్