డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జి వికెట్ తీసిన జయసూర్య.. టెస్ట్‌ల్లో వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. జయసూర్యకు టెస్ట్‌ల్లో 100 వికెట్ల మార్కును తాకేందుకు 17 టెస్ట్‌లు అవసరమయ్యాయి.
జయసూర్యతో పాటు టర్నర్, బార్నెస్, గ్రిమ్మెట్, యాసిర్ షా కూడా 17 టెస్ట్‌ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకారు. టెస్ట్‌ల్లో వేగంగా 100 వికెట్లు తీసిన ఘనత ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్ లోమన్‌కు దక్కుతుంది. లోమన్ కేవలం 16 టెస్ట్‌ల్లో 100 వికెట్ల మార్కును తాకాడు.
ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే కుప్పకూలింది. మార్కో జన్సెన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించగా.. కొయెట్జీ 2, రబాడ ఓ వికెట్ తీశారు. లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ (13), లహీరు కుమార (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఐదుగురు ఆటగాళ్లు డకౌట్లు అయ్యారు.
అంతకుముందు లంక బౌలర్లు సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కట్టడి చేశారు. అశిత ఫెర్నాండో, లహీరు కుమార తలో 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బవుమా (70) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. టోనీ డి జోర్జి (17), మార్క్రమ్ (47), వియాన్ ముల్దర్ (15) ఔట్ కాగా.. ట్రిస్టన్ స్టబ్స్ (17), బవుమా (24) క్రీజ్‌లో ఉన్నారు. జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment