సౌతాఫ్రికా స్వదేశంలో శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కమాండింగ్ పొజిషన్‌లో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టెంబా బవుమా (70) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, లహీరు కుమార తలో 3 వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే కుప్పకూలింది. జన్సెన్ (7/13) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో లంక పతనాన్ని శాశించాడు. లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ (13), లహీరు కుమార (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.
కీలక ఆల్‌రౌండర్‌కు గాయం
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా సౌతాఫ్రికా కీలక ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్ గాయపడ్డాడు. లహీరు కుమార బౌలింగ్ ముల్దర్ బ్యాటింగ్ చేస్తుండగా అతని కుడి చేతి మధ్య వేలు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో అతను తొలి టెస్ట్ మిగతా సెషన్స్‌తో పాటు రెండో టెస్ట్‌కు కూడా దూరమయ్యాడు. రెండో టెస్ట్‌లో ముల్దర్ స్థానాన్ని మాథ్యూ బ్రీట్జ్కీ భర్తీ చేస్తాడని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. ముల్దర్ గాయమైనప్పటికీ తొలి ఇన్నింగ్స్‌తో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్ చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment