సౌతాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి | SA VS SL 1st Test: Rain Washes Out Day 1, South Africa Tottering At 80 For 4 | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

Published Thu, Nov 28 2024 7:57 AM | Last Updated on Thu, Nov 28 2024 7:57 AM

SA VS SL 1st Test: Rain Washes Out Day 1, South Africa Tottering At 80 For 4

సౌతాఫ్రికా, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. తొలి రోజు ఆటలో కేవలం 20.4 ఓవర్లు మాత్రమే సాధ్యపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్‌ ఓడి శ్రీలంక ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోర్‌ 4 వికెట్ల నష్టానికి 80 పరుగులుగా ఉంది. ఎయిడెన్‌ మార్క్రమ్‌ (9), టోనీ డి జోర్జి (4), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (16), డేవిడ్‌ బెడింగ్హమ్‌ (4) ఔట్‌ కాగా.. టెంబా బవుమా (28), కైల్‌ వెర్రిన్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు. 

లంక బౌలర్లలో లహీరు కుమార రెండు వికెట్లు పడగొట్టగా.. ఆశిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో తలో వికెట​ తీశారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం శ్రీలంక సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. డబ్ల్యూటీసీలో భాగంగా ఇరు జట్లకు ఈ సిరీస్‌ చాలా కీలకం. ఈ సిరీస్‌లో గెలిచిన జట్టుకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగవుతాయి. ఈ సిరీస్‌కు ముందు లంక స్వదేశంలో న్యూజిలాండ్‌ను టెస్ట్, వన్డే సిరీస్‌ల్లో ఓడించింది. సౌతాఫ్రికా.. ఇటీవలే భారత్‌ చేతిలో 1-3 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement