Lahiru Kumara
-
శతక్కొట్టిన ఇంగ్లండ్ పేసర్.. శ్రీలంక 196 పరుగులకే ఆలౌట్
England vs Sri Lanka, 2nd Test Day 2 Report: ఇంగ్లండ్ యువ పేస్ బౌలర్ అట్కిన్సన్ (115 బంతుల్లో 118;14 ఫోర్లు, 4 సిక్సర్లు) లార్డ్స్ ఆనర్ బోర్డ్‌లో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అట్కిన్సన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 ఏళ్ల అట్కిన్సన్కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.లార్డ్స్ ఆనర్ బోర్డులో అట్కిన్సన్ పేరుగత నెలలో వెస్టిండీస్ సిరీస్ ద్వారా లార్డ్స్‌లోనే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన అట్కిన్సన్ ఆడిన మొదటి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మొత్తం 12 వికెట్లు తీసి ఇప్పటికే లార్డ్స్ ఆనర్ బోర్డులో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు బ్యాటింగ్ ప్రతిభతో మరోసారి అందులో చోటు దక్కించుకున్నాడు.శ్రీలంక 196 పరుగులకే ఆలౌట్‌కాగా అట్కిన్సన్ దూకుడుతో ఓవర్‌నైట్ స్కోరు 358/7తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 427 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 5, మిలాన్ రత్నాయకే, లహిరు కుమార చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 55.3 ఓవర్లలో 196 పరుగులు చేసి ఆలౌటైంది.256 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్కమిందు మెండిస్ (120 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఒలీ స్టోన్, మాథ్యూ పాట్స్ తలా రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 25 పరుగులు చేసింది. డాన్ లారెన్స్ (7) ఔట్ కాగా.. కెప్టెన్ ఓలీ పోప్ (2 బ్యాటింగ్), బెన్ డకెట్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న ఇంగ్లండ్ ఓవరాల్‌గా 256 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫెయిల్.. 286 పరుగుల తేడాతో ముంబై ఓటమి -
BAN vs SL: శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ మంగళవారం ప్రకటించింది. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న వెటరన్ పేసర్ లాహిరు కుమార పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ జట్టులో కుమారకు చోటు దక్కింది. అతడితో పాటు బంగ్లాతో టీ20 సిరీస్‌లో అకట్టుకున్న కమిందు మెండిస్‌కు వన్డే జట్టులో కూడా చోటు దక్కింది. అదే విధంగా ఆల్‌రౌండర్ చమికా కరుణరత్నేకు ఛాన్నాళ్ల తర్వాత సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. ఇక వన్డే సిరీస్‌కు సైతం స్టార్ పేసర్ దుష్మంత చమీర గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే బంగ్లాదేశ్‌తో ఆఖరి టీ20లో ఐదు వికెట్లతో చెలరేగిన నువాన్ తుషారాకు వన్డే జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. మార్చి 13 నుంచి ఛటోగ్రామ్ వేదికగా ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కాగా బంగ్లాతో టీ20 సిరీస్‌ను 2-1తో లంక సొంతం చేసుకుంది. శ్రీలంక జట్టు: కుసాల్ మెండిస్ (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, జనిత్ లియానగే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, కమిన్నన్‌ల దస్సన, దిల్షన్ మదుషాన, దిల్షాన్ మదుషాన , సహన్ అరాచ్చిగే, చమిక కరుణరత్నే. -
WC 2023: పొరపాటు చేయలేదు.. మా ఓటమికి కారణాలివే! అయినా..: బట్లర్
ICC WC 2023- Jos Buttler Comments On Loss: ‘‘మాకిది కష్టకాలం. కెప్టెన్‌గా నాతో పాటు మా ఆటగాళ్లంతా పూర్తిగా నిరాశకు లోనయ్యాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోయాం. మా జట్టులో అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. కానీ ఇపుడిలా జరిగిపోయింది. అయినా ఒక్కరోజులో మాది చెత్త టీమ్‌గా మారిపోదు కదా! అయితే, బాధ.. మాపై మాకు కోపం.. విసుగు వస్తున్నాయి. మేమిలా విఫలం చెందడానికి ఇదీ కారణం అని చెప్పడానికి ఏమీ లేదు. సెలక్షన్ విషయంలో మేము ఎలాంటి పొరపాట్లు చేయలేదు. మాకది అసలు సమస్యే కాదు. అయితే, స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాం అనేది మాత్రం వాస్తవం. ఆ విషయంలో గర్వపడుతున్నాం ఈరోజు రూట్ రనౌట్ కావడం వంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. సాధారణంగా మేము ఇలాంటి తప్పులు చేయము. ఈరోజు భాగస్వామ్యాలు నెలకొల్పడంలోనూ పూర్తిగా వైఫల్యం చెందాం. బ్యాట్, బంతి.. రెండింటితోనూ కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాం. ఏదేమైనా పటిష్ట జట్టుగా ఎదిగిన తీరు, మేము నెలకొల్పిన ప్రమాణాల పట్ల గర్వపడుతున్నాం. మిగిలిన మ్యాచ్‌లలో తిరిగి పుంజుకుని రాణిస్తామనే నమ్మకం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం’’అని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ వరుస పరాభవాలు మూటగట్టుకుంటోంది. శ్రీలంక చేతిలో మరోసారి చిత్తుగా తాజాగా బెంగళూరులో గురువారం శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది ఇంగ్లండ్. వరల్డ్‌కప్ చరిత్రలో ఇంగ్లండ్‌పై ఏకపక్ష విజయాలతో దూసుకుపోతున్న శ్రీలంక మరోసారి అదే ఫీట్ రిపీట్ చేయడంతో ఇంగ్లండ్‌కు మరో ఘోర ఓటమి ఎదురైంది. దీంతో హాట్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బట్లర్ బృందం సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్థాయికి తగ్గట్లు ఆడలేక పరాభవాల పాలవుతున్నామని పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్‌లలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపాడు. ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక స్కోర్లు: ►టాస్- ఇంగ్లండ్- బ్యాటింగ్ ►ఇంగ్లంగ్ స్కోరు: 156 (33.2) ►శ్రీలంక స్కోరు: 160/2 (25.4) ►8 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లాహిరు కుమార(మూడు వికెట్లు) ►టాప్ స్కోరర్: పాతుమ్ నిసాంక(77- నాటౌట్) చదవండి: శ్రీలంక చేతిలో ఇంగ్లండ్‌కు మరో ఘోర ఓటమి.. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్లేనా? View this post on Instagram A post shared by ICC (@icc) -
పేరుకు డిఫెండింగ్ చాంపియన్.. నెదర్లాండ్స్ కంటే ఘోరంగా! లంక దెబ్బకు..
WC 2023- Eng Vs SL: వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికాలో బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. తాజాగా శ్రీలంక పేసర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 33.2 ఓవర్లకే ఆలౌట్ అయి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో 30, డేవిడ్ మలన్ 28 పరుగులతో ఫర్వాలేదనిపించారు. View this post on Instagram A post shared by ICC (@icc) స్టోక్స్ 43 పరుగులతో వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్(3) పూర్తిగా విఫలం కాగా.. బెన్ స్టోక్స్ 43 పరుగులతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లలో మొయిన్ అలీ(15), డేవిడ్ విల్లే(14- నాటౌట్) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక పేసర్ల దెబ్బకు తోకముడిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌తో తుది జట్టులోకి వచ్చిన పేసర్లు లాహిరు కుమార, ఏంజెలో మాథ్యూస్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లంతా తోకముడిచారు. వీరిద్దరితో పాటు మరో ఫాస్ట్ బౌలర్ కసున్ రజిత కూడా చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో కుమార.. స్టోక్స్, బట్లర్, లివింగ్‌స్టోన్ రూపలో మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. మాథ్యూస్, రజిత రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లోనూ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 170 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ 229 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓడిన బట్లర్ బృందం.. లంకతో మ్యాచ్‌లోనూ ఓడిపోతే సెమీస్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. పేరుకు డిఫెండింగ్ చాంపియన్.. వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్ అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇది రెండోసారి. గత మ్యాచ్‌లో వాంఖడేలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 170 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. తాజా ఎడిషన్‌లో అఫ్గనిస్తాన్(139, 156)తో పాటు రెండుసార్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. నెదర్లాండ్స్ కంటే ఘోరంగా ఈ రెండు జట్ల కంటే నెదర్లాండ్స్ మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాతో బుధవారం నాటి మ్యాచ్‌లో 90 పరుగులకు డచ్ జట్టు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్, అఫ్గన్లతో పోలిస్తే ఇంతవరకు ఒకే ఒక్కసారి లోయస్ట్ స్కోరు నమోదు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
టెస్టు చరిత్రలో లంక తరపున అత్యంత చెత్త రికార్డు
శ్రీలంక బౌలర్ లాహిరు కుమారా టెస్టు క్రికెట్లో అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. లంక తరపున టెస్టు క్రికెట్లో చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన జాబితాలో లాహిరు కుమారా తొలిస్థానంలో నిలిచాడు. అదే సమయంలో ఎకానమి పరంగా అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో లాహిరు కుమారా 25 ఓవర్లు బౌలింగ్ వేసి 164 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇంతకముందు కాసున్ రజిత ఇదే న్యూజిలాండ్‌పై 34 ఓవర్లలో 144 పరుగలిచ్చి ఒక్క వికెట్ తీయకపోవడం అనేది అత్యంత చెత్త రికార్డుగా ఉంది. తాజాగా లాహిరు కుమారా దానిని సవరించాడు. లాహిరు, కాసున్ రజిత తర్వాత ఆశోక డిసల్వా 56 ఓవర్లలో 141 పరుగులు(1991, న్యూజిలాండ్‌పై వెల్లింగ్టన్ వేదికగా), మురళీధరన్ 46 ఓవర్లలో 137 పరుగులు(1997లో భారత్‌పై నాగ్‌పూర్ వేదికగా) ఉన్నారు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన క్రికెటర్ల జాబితా ఇదే ► ఖాన్ మొహమ్మద్-(54-5-259-0) వర్సెస్ వెస్టిండీస్, 1958 ► నిక్కీ బోజే-(65-5-221-0) వర్సెస్ శ్రీలంక, 2006 ► యాసిర్ షా-(32-1-197-0) వర్సెస్ ఆస్ట్రేలియా, 2019 ► రే ప్రైస్-(42-2-192-0) వర్సెస్ సౌతాఫ్రికా, 2001 ► ప్రసన్న-(59-8-187-0) వర్సెస్ ఇంగ్లండ్ , 1967 ► రే ప్రైస్-(36-5-187-0) వర్సెస్ ఆస్ట్రేలియా , 2003 ఎకానమీ పరంగా టెస్టు క్రికెట్లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు ► జాహిద్ మహ్మద్( 33-1-235-4, ఎకానమీ 7.12) వర్సెస్ ఇంగ్లండ్, 2022 ► లాహిరు కుమారా(25-1-164-0, ఎకానమీ 6.56) వర్సెస్ న్యూజిలాండ్, 2023 ► యాసిర్ షా(32-1-197-0, ఎకానమీ 6.15) వర్సెస్ ఆస్ట్రేలియా, 2019 చదవండి: క్లబ్ మేనేజర్‌తో గొడవ.. పీఎస్జీని వీడనున్నాడా? వయసు పెరిగినా వన్నె తగ్గలేదు.. -
లంక బౌలర్‌కు ఇండియన్ యూ ట్యూబర్‌తో సంబంధమేంటి?
మనుషులు పోలిన మనుషులు ఉండడం సహజం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇదే వర్తిస్తుంది. ఉదాహరణకు భారత్‌కు చెందిన ఫేమస్ వీడియో క్రియేటర్స్ గౌరవ్ అరోరా, యష్ పురోహిత్‌లు ఒక యాంగిల్ నుంచి అచ్చం టీమిండియా మెషిన్‌గన్ విరాట్ కోహ్లిలాగే కనిపిస్తారు. యూట్యూబ్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లు చాలామంది వీరిద్దరిని కోహ్లి లుక్‌తోనే పోలుస్తారు. తాజాగా శ్రీలంక క్రికెటర్ లాహిరు కుమారాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. టీమిండియాతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో లాహిరు కుమారా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ల వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు ఇషాన్ కిషన్ తలకు గాయం కావడానికి కారణం లాహిరు కుమారానే. కాగా టీమిండియా ఫ్యాన్స్ కుమారాను ఇండియన్ ఫేమస్ యూట్యూబర్ గౌరవ్ చౌదరీతో పోలుస్తున్నారు. గౌరవ్ చౌదరీకి టెక్నికల్ గురూజీ అని ముద్దుపేరు ఉంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించాడు. లంక క్రికెటర్ కుమారాకు సంబంధించి గుబురు గడ్డం.. పర్సనాలిటి, ముఖ కవలికలు కూడా అచ్చం గౌరవ్ లాగే ఉండడం విశేషం. ఇంకేముంది కుమారాను గౌరవ్ చౌదరీతో పోలుస్తూ.. ఫ్యాన్స్ ఒక ఆట ఆడుకున్నారు. ''ఇండియాలో ఉన్న టెక్నికల్ గురు లంక క్రికెట్లో ఏం చేస్తున్నాడు... ధర్మశాలలో ప్రత్యక్షమైన టెక్నికల్ గురు.. లాహిరు కుమారా అతనికి ఇంకో రూపం.. టెక్నికల్ గురూజీ శ్రీలంక తరపున ఎందుకు ఆడుతున్నాడు.. టెక్నికల్ గురూజీ.. ప్లీజ్ ఇషాన్ కిషన్‌కు బౌన్సర్లు విసరడం ఆపేయండి'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే Ind Vs Sl 3rd T20: ఇప్పటి వరకు 27 మందిని ఆడించాం.. ఇక: రోహిత్ శర్మ sri lanka got @TechnicalGuruji in dharamshala .... no wonder why they are well prepared 🙌#IndvsSri #Dharamshala #IndianCricketTeam pic.twitter.com/KeU0wjiLCt — ARYAN SHARMA (@aryan_sharma49) February 26, 2022 Technical Guruji stop throwing bouncers at Ishan 🤬🤬 — 0.01 Carlsen (@80kubaka) February 26, 2022 -
ఆ ఇద్దరు ఆటగాళ్లకు భారీ జరిమానా...
Lahiru Kumara Liton Das fined for breaching ICC code of conduct: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 లో భాగంగా ఆదివారం షార్జా వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక పేసర్ లాహిరు కుమార, బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే దీనిపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)...ఐసీసీ నిబంధనావళిని ఉల్లంఘించినందుకు ఇరువురికి జరిమానా విధించింది. ఈ గొడవకు ఆజ్యం పోసిన లాహిరు కుమారకు మ్యాచ్ ఫీజులో 25%తో పాటు ఒక డీమెరిట్ పాయింట్, లిటన్ దాస్‌కు 15% జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించినట్లు ఐసీసీ ప్రకటించింది. కాగా చివర వరకు ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. అసలు ఏమి జరిగిందింటే... బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ బౌలింగ్ చేసిన లహీరు కుమార.. ఐదో బంతికి లిటన్‌దాస్‌ను పెవిలియన్‌కు పంపాడు. అయితే ఈ క్రమంలో లిటన్ దాస్ వైపు చూస్తూ లహీరు కుమార మాటలు తూటాలు పేల్చాడు. ఈ క్రమంలో లిటన్ దాస్ కూడా తానేం తక్కువ తినలేదన్నట్లుగా అతనితో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరు క్రికెటర్ల మధ్య వాగ్వాదం జరగడంతో.. ఫీల్డ్ అంపైర్లు, సహచర ఆటగాళ్లు కలగజేసుకుని సర్దిచెపే ప్రయత్నం చేశారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: T20 World Cup 2021: సెమీస్‌కు చేరే జట్లు ఇవే... -
SL Vs BAN: బ్యాట్స్‌మన్ కంటే వేగంగా పరిగెత్తాడు.. రిస్క్ అని తెలిసినా
Lahiru Kumara Stunning Run Out.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్యాట్స్‌మన్ కన్నా బౌలర్ వేగంగా పరిగెత్తి వికెట్లను గిరాటేయడంతో రనౌట్ కాక తప్పలేదు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 19వ ఓవర్ లాహిరు కుమార వేశాడు. ఓవర్ మూడో బంతిని ఆఫిప్ హొస్సేన్ డిఫెన్స్ ఆడాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ముష్ఫికర్ రహీమ్ సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. సింగిల్ తీయడం రిస్క్ అని తెలిసినా హొస్సేన్ ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాడు. అప్పటికే క్రీజుపైనే ఉన్న లాహిరు కుమార హొస్సేన్ కంటే వేగంగా పరిగెత్తి బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. ఇంకేముంది రిప్లేలో రనౌట్ అని క్లియర్‌గా తేలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: T20 WC 2021 AUS Vs SA: మక్రమ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్ ఇక మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్లు మహ్మద్ నయీమ్(52 బంతుల్లో 62; 6 ఫోర్లు), ముష్ఫికర్ రహీమ్(37 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ సాధించింది. వీరికి తోడు మిగతా బ్యాటర్లు కూడా తలో చేయి వేయడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లంక బౌలర్లలో కరుణరత్నే, బినుర ఫెర్నాండో, లహీరు కుమార తలో వికెట్ పడగొట్టారు. చదవండి: Glenn Maxwell: అక్కడ నెంబర్‌వన్ బౌలర్.. ప్రతీసారి స్విచ్‌హిట్ పనికిరాదు SL Vs BAN: ఆటగాళ్ల మాటల యుద్దం.. కొట్టుకున్నంత పనిచేశారు Kumara with some quick thinking off own bowling https://t.co/MsxeD0R3ta via @t20wc — varun seggari (@SeggariVarun) October 24, 2021