England vs Sri Lanka, 2nd Test Day 2 Report: ఇంగ్లండ్ యువ పేస్ బౌలర్ అట్కిన్‌సన్ (115 బంతుల్లో 118;14 ఫోర్లు, 4 సిక్సర్లు) లార్డ్స్ ఆనర్ బోర్డ్‌లో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అట్కిన్‌సన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 ఏళ్ల అట్కిన్‌సన్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇదే తొలి శతకం కావడం విశేషం.
లార్డ్స్ ఆనర్ బోర్డులో అట్కిన్‌సన్ పేరు
గత నెలలో వెస్టిండీస్ సిరీస్ ద్వారా లార్డ్స్‌లోనే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన అట్కిన్‌సన్ ఆడిన మొదటి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మొత్తం 12 వికెట్లు తీసి ఇప్పటికే లార్డ్స్ ఆనర్ బోర్డులో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు బ్యాటింగ్ ప్రతిభతో మరోసారి అందులో చోటు దక్కించుకున్నాడు.
శ్రీలంక 196 పరుగులకే ఆలౌట్
కాగా అట్కిన్‌సన్ దూకుడుతో ఓవర్‌నైట్ స్కోరు 358/7తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 427 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 5, మిలాన్ రత్నాయకే, లహిరు కుమార చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 55.3 ఓవర్లలో 196 పరుగులు చేసి ఆలౌటైంది.
256 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్
కమిందు మెండిస్ (120 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, అట్కిన్‌సన్, ఒలీ స్టోన్, మాథ్యూ పాట్స్ తలా రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 25 పరుగులు చేసింది. డాన్ లారెన్స్ (7) ఔట్ కాగా.. కెప్టెన్ ఓలీ పోప్ (2 బ్యాటింగ్), బెన్ డకెట్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న ఇంగ్లండ్ ఓవరాల్‌గా 256 పరుగుల ఆధిక్యంలో ఉంది.
చదవండి: శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫెయిల్.. 286 పరుగుల తేడాతో ముంబై ఓటమి
Comments
Please login to add a commentAdd a comment