Chris woakes
-
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
హ్యామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో రేపటి నుంచి (డిసెంబర్ 14) ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఓ మార్పు చేసింది. గత రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రిస్ వోక్స్ స్థానంలో మాథ్యూ పాట్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహా రెండో టెస్ట్ ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించనుంది ఇంగ్లండ్ మేనేజ్మెంట్.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందింది. మరో టెస్ట్ మిగిలుండగానే ఇంగ్లండ్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2008 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్‌కు ఇది తొలి టెస్ట్ సిరీస్ విజయం.తొలి టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో విజయంక్రైస్ట్చర్చ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (171), బ్రైడన్ కార్స్ (10 వికెట్లు) అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు.323 పరుగుల తేడాతో విజయంవెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 323 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (123, 55), జో రూట్ (106) సెంచరీలతో కదం తొక్కారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది.మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఒల్లీ పోప్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే, మాథ్యూ పాట్స్, షోయబ్ బషీర్ -
Pak vs Eng Tests: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ
పాకిస్తాన్ పర్యటనకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. యువ బౌలర్ జోష్ హల్(Josh Hull).. పాక్‌తో టెస్టు సిరీస్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్దారించింది. తొడ కండరాల నొప్పి కారణంగా.. పాకిస్తాన్ టూర్‌కు జోష్ దూరమయ్యాడని తెలిపింది. అతడు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించింది.అరంగేట్రంలో రాణించికాగా లీసస్టర్ఫైర్కు చెందిన లెఫ్టార్మ్ పేసర్ జోష్ హల్ ఇటీవలే ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. సొంతగడ్డపై శ్రీలంకతో ఓవల్ టెస్టు(సెప్టెంబరు 6, 2024) సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసి 53 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.గాయం కారణంగాఅయితే, ఈ మ్యాచ్ తర్వాత జోష్ తొడ కండరాల నొప్పి కారణంగా ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ నాటికి అతడు ఫిట్నెస్ సాధిస్తాడని భావించిన సెలక్టర్లు జట్టుకు ఎంపిక చేశారు. కానీ.. జోష్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ 16 మంది సభ్యుల జట్టుతోనే పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఆరు ఫీట్ల ఏడు అంగుళాల ఎత్తు ఉండే జోష్ హల్కు ఇంగ్లండ్ బోర్డు ప్రత్యామ్నాయ బౌలర్‌ను ప్రకటించకపోవడం ఇందుకు కారణం.వుడ్ కూడా లేడుకాగా దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ పేస్ దళంలో క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. అయితే, మార్క్ వుడ్ శ్రీలంకతో సిరీస్ తర్వాత ఈ ఏడాది తదుపరి సిరీస్లన్నింటికి దూరం కాగా.. ఇప్పుడు జోష్ కూడా అందుబాటులో లేకపోవడం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక అక్టోబరు 7 నుంచి 28 వరకు పాకిస్తాన్- ఇంగ్లండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్న విషయం తెలిసిందే. ముల్తాన్, రావల్పిండి ఇందుకు వేదికలు.పాకిస్తాన్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జాక్ లీచ్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.చదవండి: టీ10 క్రికెట్లో సంచలనం.. స్కాట్లాండ్ క్రికెటర్ సుడిగాలి శతకం -
శతక్కొట్టిన ఇంగ్లండ్ పేసర్.. శ్రీలంక 196 పరుగులకే ఆలౌట్
England vs Sri Lanka, 2nd Test Day 2 Report: ఇంగ్లండ్ యువ పేస్ బౌలర్ అట్కిన్సన్ (115 బంతుల్లో 118;14 ఫోర్లు, 4 సిక్సర్లు) లార్డ్స్ ఆనర్ బోర్డ్‌లో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అట్కిన్సన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 ఏళ్ల అట్కిన్సన్కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.లార్డ్స్ ఆనర్ బోర్డులో అట్కిన్సన్ పేరుగత నెలలో వెస్టిండీస్ సిరీస్ ద్వారా లార్డ్స్‌లోనే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన అట్కిన్సన్ ఆడిన మొదటి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మొత్తం 12 వికెట్లు తీసి ఇప్పటికే లార్డ్స్ ఆనర్ బోర్డులో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు బ్యాటింగ్ ప్రతిభతో మరోసారి అందులో చోటు దక్కించుకున్నాడు.శ్రీలంక 196 పరుగులకే ఆలౌట్‌కాగా అట్కిన్సన్ దూకుడుతో ఓవర్‌నైట్ స్కోరు 358/7తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 427 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 5, మిలాన్ రత్నాయకే, లహిరు కుమార చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 55.3 ఓవర్లలో 196 పరుగులు చేసి ఆలౌటైంది.256 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్కమిందు మెండిస్ (120 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఒలీ స్టోన్, మాథ్యూ పాట్స్ తలా రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 25 పరుగులు చేసింది. డాన్ లారెన్స్ (7) ఔట్ కాగా.. కెప్టెన్ ఓలీ పోప్ (2 బ్యాటింగ్), బెన్ డకెట్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న ఇంగ్లండ్ ఓవరాల్‌గా 256 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫెయిల్.. 286 పరుగుల తేడాతో ముంబై ఓటమి -
ఇంగ్లండ్ బ్యాటర్ల మతి పోగొట్టిన లంక స్పిన్నర్.. వైరల్ వీడియో
ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ప్రభాత్ ఇద్దరు ఇంగ్లండ్ బ్యాటర్లను మతి పోగొట్టే బంతులతో క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్ ప్రభాత్ మాయాజాలం ధాటికి నోరెళ్లబెట్టారు. ఊహించని విధంగా బంతి స్పిన్ కావడంతో ఆ ఇద్దరు బ్యాటర్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్రభాత్ ఇంగ్లండ్ బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేసిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.Prabhat Jayasuriya with two absolute jaffas. 🤯pic.twitter.com/oeyooLHWPP— Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2024మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 23 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (72), గస్ అట్కిన్సన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ 18, డేనియల్ లారెన్స్ 30, ఓలీ పోప్ 6, జో రూట్ 42, హ్యారీ బ్రూక్ 56, క్రిస్ వోక్స్ 25 పరుగులు చేశారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 3, ప్రభాత్ జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైంది.నిషన్ మధుష్క 4, కరుణరత్నే 2, కుసాల్ మెండిస్ 24, ఏంజెలో మాథ్యూస్ 0, చండీమల్ 17, ధనంజయ డిసిల్వ 74, కమిందు మెండిస్ 12, ప్రభాత్ జయసూర్య 10, మిలన్ రత్నాయకే 72, విశ్వ ఫెర్నాండో 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలో మూడు వికెట్లు, గస్ అట్కిన్సన్ 2, మార్క్ వుడ్ ఓ వికెట్ పడగొట్టారు. -
రాణించిన రూట్, స్టోక్స్.. తృటిలో సెంచరీ చేజార్చుకున్న స్మిత్
బర్మింగ్హమ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టెయిలెండర్లు సత్తా చాటారు. ఫలితంగా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (87) కెరీర్లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ జేమీ స్మిత్ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 3, మార్క్ వుడ్ 0, ఓలీ పోప్ 10, హ్యారీ బ్రూక్ 2 నిరాశపర్చగా.. పదో నంబర్ ఆటగాడు గస్ అట్కిన్సన్ 21 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఆలౌటైన అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 61 పరుగులు వెనుకపడి ఉంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (0), కిర్క్ మెక్కెంజీ (8) ఔట్ కాగా.. మికైల్ లూయిస్ (18), అలిక్ అథనాజ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (61), జేసన్ హోల్డర్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 4, క్రిస్ వోక్స్ 3, మార్క్ వుడ్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించి, సిరీస్‌ను ఇదివరకే కైవసం చేసుకుంది. -
WC 2023: వరల్డ్‌కప్‌లో స్టోక్స్ తొలి సెంచరీ.. ఇంగ్లండ్ భారీ స్కోరు
ICC WC 2023- Eng Vs Ned: వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా వరల్డ్‌కప్ టోర్నీలో తన తొలి శతకం నమోదు చేశాడు. పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(15) విఫలం కాగా.. మరో ఓపెనర్ డేవిడ్ మలన్ 87 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్ చెత్త షాట్ సెలక్షన్‌తో 28 పరుగులకే వెనుదిరగగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టోక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా 84 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో వరల్డ్‌కప్‌లో తన పేరిటా ఓ సెంచరీని లిఖించుకున్నాడు. మిగతా వాళ్లలో క్రిస్ వోక్స్ అర్ద శతకం(51) బాదాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు సాధించింది. డచ్ బౌలర్లలో బాస్ డి లిడే మూడు, ఆర్యన్ దత్, లోగన్ వాన్ బీక్ చెరో రెండు, పాల్ వాన్ మెకెరన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్ వేదికగా ప్రపంచకప్ బరిలో దిగిన ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నెదర్లాండ్స్‌కు కూడా సెమీ ఫైనల్ అవకాశాలు లేవు. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో 9, 10 స్థానాల కోసం అన్నట్లుగా ఈ నామమాత్రపు మ్యాచ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. గాయం కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన స్టోక్స్ పునరాగమనంలోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే, ఈ నామమాత్రపు మ్యాచ్‌లో మాత్రం సెంచరీ చేయడం విశేసం. కాగా 2019లో ఇంగ్లండ్ ట్రోఫీ గెలవడంలో స్టోక్స్‌దే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) -
క్రిస్ వోక్స్ సూపర్ డెలివరీ.. గిల్‌కు ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ ఓ అద్బుతమైన బంతితో గిల్‌ను బోల్తా కొట్టించాడు. వోక్స్ వేసిన లెంగ్త్ బాల్‌ను గిల్ స్ట్రైట్ డ్రైవ్ కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో ఒక్కసారిగా గిల్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. బ్యాటింగ్‌కు మొదల పెట్టిన టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. గిల్ 9 పరుగులు చేసి ఔట్ కాగా.. కోహ్లి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. చదవండి: ప్రపంచ క్రికెట్లో నా ఫేవరేట్ ప్లేయర్స్ వారే: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
అతడొక యార్కర్ల కింగ్.. ప్రపంచంలోనే నెం1 బౌలర్: క్రిస్ వోక్స్
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని వోక్స్ కొనియాడాడు. కాగా గాయం కారణంగా దాదాపు ఏడాది తర్వాత జట్టులో ఎంట్రీ ఇచ్చిన బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆసియాకప్‌ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రా తన వంతు పాత్ర పోషించాడు. "వరల్డ్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో జస్ప్రీత్ బుమ్రా మొదటి స్ధానంలో ఉంటాడు. అతడి బౌలింగ్ స్టైల్ అద్బుతం. చాలా భిన్నంగా ఉంటుంది. బుమ్రా బౌలింగ్‌ను బ్యాటర్లు అర్దం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అతడు ఎక్కువ పేస్‌తో బౌలింగ్ చేయగలడు. అదే విధంగా స్లోయర్ బాల్స్ కూడా అద్బుతంగా వేయగలడు. యార్కర్లకు కూడా సంధించగలడు. ఒక వైట్ బాల్ బౌలర్‌కు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ బుమ్రాకు ఉన్నాయి అంటూ విజ్డెన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్ వోక్స్ పేర్కొన్నాడు. బుమ్రా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో బీజీగా ఉన్నాడు. చదవండి: World Cup 2023: వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. ఎవరూ ఊహించని ఆటగాళ్లు ఎంట్రీ -
Eng Vs NZ: స్టోక్స్ విధ్వంసం.. చిత్తుగా ఓడిన న్యూజిలాండ్.. ఏకంగా..
England vs New Zealand, 3rd ODI- లండన్: న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (124 బంతుల్లో 182; 15 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన స్టోక్స్ ఓపెనర్ డేవిడ్ మలాన్ (96; 12 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 199 పరుగులు జోడించాడు. 368 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ డబుల్ సెంచరీ దిశగా సాగుతున్న దశలో స్టోక్స్ 45వ ఓవర్లో ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. స్టోక్స్ అవుటయ్యాక ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 368 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 187 పరుగులకే కుప్పకూలింది. ఫిలిప్స్ 72 పరుగులతో రాణించినా దీంతో.. ఆతిథ్య జట్టు విధించిన టార్గెట్‌ను ఛేదించే క్రమంలో గ్లెన్ ఫిలిప్స్(72) ఒంటరి పోరాటం వృథాగా పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్.. లియామ్ లివింగ్‌స్టోన్ మూడేసి వికెట్లు తీయగా.. రీస్ టోప్లే రెండు వికెట్లతో రాణించాడు. అదే విధంగా సామ్ కరన్, మొయిన్ అలీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మేరకు ఓవల్ మైదానంలో 181 పరుగుల తేడాతో భారీ గెలుపు అందుకున్న ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. వన్డేల్లో ఇంగ్లండ్ ముందంజ కాగా నాలుగు టీ20, నాలుగు వన్డేలు ఆడే నిమిత్తం న్యూజిలాండ్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఇరు జట్లు చెరో రెండు విజయాలు నమోదు చేయగా టీ20 సిరీస్ డ్రాగా ముగిసింది. ఇక తొలి వన్డేలో పర్యాటక కివీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందగా.. ఇంగ్లండ్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఇదిలా ఉంటే... గత ఏడాది జూలైలో వన్డేలకు వీడ్కోలు పలికిన స్టోక్స్ ప్రపంచకప్ కోసం తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. చదవండి: ‘టీమిండియా మ్యాచ్ ఫిక్స్ చేశారు’.. మండిపడ్డ అక్తర్! మనోళ్లకు చేతకాదు.. One of the greatest of this generation. PERIOD. 🐐 📹 | @BenStokes38 sent New Zealand bowlers to the cleaners, scoring 182 in just 124 balls 🥵#SonySportsNetwork #ENGvsNZ #BenStokes pic.twitter.com/OytoOEqNOb — Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2023 -
చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్‌కు ఐసీసీ అవార్డు
చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్.. 2023 జులై నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్ గెలుచుకుంది. ఆష్లే ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును వరుసగా రెండు నెలలు (జూన్, జులై) గెలుచుకుని, ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఆష్లేకు ఇది నాలుగో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కావడం విశేషం. జులై నెలలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో 232 పరుగులతో పాటు 15 వికెట్లు తీసిన ఆష్లే వరుసగా రెండో నెల కూడా ఐసీసీ అవార్డును గెలుచుకుంది. జులై నెలకు గాను పురుషుల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ గెలుచుకున్నాడు. జులై నెలలో కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శనకు గాను వోక్స్‌కు ఈ అవార్డు దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం నెదర్లాండ్స్ స్టార్ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్, ఇంగ్లండ్‌కే చెందిన జాక్ క్రాలే పోటీపడినప్పటికీ వోక్స్నే ఈ అవార్డు వరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్స్, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు మరియు మీడియా ప్రతినిధులతో కూడిన ప్రత్యేక ప్యానెల్ నుండి సేకరించిన ఓట్ల ఆధారంగా వోక్స్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. జులై నెలలో జరిగిన 3,4,5 యాషెస్ టెస్ట్‌ల్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సైతం దక్కించుకున్న వోక్స్.. ఈ నెలలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 18.15 సగటున 19 వికెట్లు పడగొట్టాడు. వోక్స్‌కు పోటీదారులైన జాక్ క్రాలే, బాస్ డి లీడ్ కూడా జులై నెలలో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ వారికి నిరశే ఎదురైంది. క్రాలే జులైలో జరిగిన 2, 3, 4, 5 యాషెస్ టెస్ట్‌ల్లో 58.85 సగటున 412 పరుగులు చేశాడు. ఇందులో మాంచెస్టర్ టెస్ట్‌లో అతను చేసిన 189 పరుగుల ఇన్నింగ్స్, నిర్ణయాత్మక ఐదో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో చేసిన 73 పరుగుల ఇన్నింగ్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. బాస్ డి లీడ్ విషయానికొస్తే.. ఈ నెదర్లాండ్స్ యువ ఆల్‌రౌండర్ జులైలో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో అద్భుతంగా రాణించాడు. టోర్నీలో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో అతను అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనను (5/52, 123 (92 బంతుల్లో)) కనబర్చి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో మొత్తం యాషెస్ స్టార్లే.. ఒక్కరు మాత్రం..!
2023 జులై నెలకు గాను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 7) ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ను ప్రకటించింది. ఈ జాబితాలో ఒక్కరు మినహా మొత్తం యాషెస్ 2023 స్టార్లే ఉండటం విశేషం. పురుషుల విభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జాక్ క్రాలే, క్రిస్ వోక్స్‌లతో పాటు నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్ నామినేట్ కాగా.. మహిళల విభాగంలో ఆసీస్ ప్లేయర్స్ ఆష్లే గార్డ్నర్, ఎల్లిస్ పెర్రీతో పాటు ఇంగ్లండ్ నాట్ సీవర్ బ్రంట్ నామినేట్ అయ్యింది. పై పేర్కొన్న జాబితాలో నెదర్లాండ్స్ బాస్ డి లీడ్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ అదరగొట్టగా.. మిగతా ఐదుగురు పురుషులు, మహిళల యాషెస్‌లో ఇరగదీసారు. శ్రీలంకలో జరిగిన వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో కనబర్చిన అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు (5/52, 123 (92)) గాను లీడ్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్).. యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు మిస్ అయ్యి, మూడో టెస్ట్ నుంచి బరిలోకి దిగిన వోక్స్.. జులై నెలలో జరిగిన 3,4,5 యాషెస్ టెస్ట్‌ల్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సైతం దక్కించుకున్నాడు. వోక్స్ జులైలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 18.15 సగటున 19 వికెట్లు పడగొట్టాడు. జాక్ క్రాలే (ఇంగ్లండ్).. జులైలో జరిగిన 2, 3, 4, 5 యాషెస్ టెస్ట్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన క్రాలే.. ఈ నాలుగు టెస్ట్‌ల్లో 58.85 సగటున 412 పరుగులు చేశాడు. ఇందులో మాంచెస్టర్ టెస్ట్‌లో అతను చేసిన 189 పరుగుల ఇన్నింగ్స్, నిర్ణయాత్మక ఐదో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో చేసిన 73 పరుగుల ఇన్నింగ్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఆష్లే గార్డ్నర్ (ఆసీస్).. జూన్ నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు విన్నర్ అయిన ఆష్లే గార్డ్నర్ జులైలో జరిగిన మ్యాచ్‌ల్లో 232 పరుగులతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు వరుసగా రెండో నెల కూడా నామినేట్ అయ్యింది. ఎల్లిస్ పెర్రీ (ఆసీస్).. పెర్రీ.. జులై నెలలో ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో అద్భుతంగా రాణించి (4 మ్యాచ్‌ల్లో 276 పరుగులు) తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. నాట్ సీవర్ బ్రంట్ (ఇంగ్లండ్).. మహిళల యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన 3 వన్డేల సిరీస్‌లో బ్రంట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఈ సిరీస్‌లో భాగంగా జులై నెలలో జరిగిన ఆఖరి 2 మ్యాచ్‌ల్లో ఈమె రెండు సెంచరీలు (111 నాటౌట్, 129) సాధించింది. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. -
తొలి బంతికే వికెట్ తీసిన ఆండర్సన్.. ఐదేసిన వోక్స్.. ఆసీస్ ఆలౌట్
యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ రెండో రోజు ఆట మొదలైంది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తొలి బంతికే వికెట్ తీశాడు. డ్రైవ్ షాట్ ఆడబోయిన కమిన్స్ (1).. కవర్ పాయింట్లో ఉన్న స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఆసీస్ ఓవర్‌నైట్ స్కోర్ 299 వద్దనే తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 301 పరుగుల వద్ద ఆలౌట్.. అయితే..! క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ సెకెండ్ స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 301 పరుగుల వద్ద ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే అంపైర్ దాన్ని నో బాల్‌గా ప్రకటించడంతో ఆసీస్ ఇన్నింగ్స్ కొనసాగింది. ఐదేసిన వోక్స్.. ఆసీస్ 317 ఆలౌట్ హాజిల్‌వుడ్ (4)ను క్రిస్ వోక్స్ ఔట్ చేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 317 పరుగుల వద్ద ముగిసింది. 36 పరుగులతో స్టార్క్ అజేయంగా నిలిచాడు. క్రిస్ వోక్స్‌కు ఇది యాషెస్‌లో తొలి ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41), డేవిడ్ వార్నర్ (32), మిచెల్ స్టార్క్ (36 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ ఐదేయగా, బ్రాడ్ 2, ఆండర్సన్, వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. -
ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ఇదే! స్టార్ క్రికెటర్ వచ్చేశాడు
లార్డ్స్ వేదికగా జూన్1నుంచి ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ టెస్టుకు ఆ జట్టు స్టార్ పేసర్లు క్రిస్‌వోక్స్,, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్ ఫిట్నెస్ కారణంగా దూరమయారు. ఈ క్రమంలో పేసర్ జోష్ టంగ్ ఇంగ్లండ్ తరపున టెస్టు అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. కాగా ఈ టెస్టుకు తొలుత 15 మంది సభ్యులతో కూడిన ప్రకటించిన జట్టులో జోష్ టంగ్ చోటుదక్కలేదు. కానీ ఈ నలుగురు పేసర్లు ఈ టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో.. ఆఖరి నిమిషంలో జోష్ టంగ్‌కు చోటుదక్కింది. కౌంటీల్లో వోర్సెస్టర్షైర్ తరపున అద్భుతంగా రాణించడంతో టంగ్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 82 ఇన్నింగ్స్‌లలో 162 వికెట్లు పడగొట్టాడు ఈ వోర్సెస్టర్షైర్ పేసర్. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టెస్టుతో వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో పనరాగమనం చేయనున్నాడు. కాలి గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి బెయిర్‌స్టో జట్టుకు దూరంగా ఉన్నసంగతి తెలిసిందే. ఐర్లాండ్‌తో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్, జాక్ లీచ్ చదవండి: WTC final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్! -
అంచనాలు తలకిందులైన వేళ..
క్రికెట్లో విశ్లేషణ ఈరోజుల్లో కామన్‌గా మారిపోయింది. మ్యాచ్‌కు ముందు ఎవరు జట్టులో ఉంటే బాగుంటుంది.. బౌలింగ్, బ్యాటింగ్ కాంబినేషన్ ఏంటి.. జట్టు కూర్పు ఎలా ఉండాలి.. తొలుత బ్యాటింగ్ చేస్తే మంచిదా లేక బౌలింగ్ చేయాలాఅనే దానిపై క్రీడా పండితులు ఎవరికి తోచినట్లుగా వారు విశ్లేషిస్తారు. మ్యాచ్ పూర్తైన తర్వాత కూడా వీరి విశ్లేషణలు ఉంటాయి. కొన్నిసార్లు వాళ్లు చెప్పిన విషయాలు నిజమవ్వొచ్చు.. మరికొన్నిసార్లు విఫలం కావొచ్చు. ఇక మ్యాచ్ సమయంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌కు ప్రత్యర్థి జట్టులో ఉన్న బౌలర్లలో ఎవరు బౌలింగ్ బాగా వేయగలరు అనేది అనలిస్టులు ఊహించడం చూస్తుంటాం. తాజాగా టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ఒక అనలిస్ట్ చేసిన విశ్లేషణ పూర్తిగా రివర్స్ అయింది. అదేంటంటే.. కివీస్ బ్యాటర్లలో డెవన్ కాన్వే మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. అతనికి బౌలింగ్‌లో ఎవరు గుడ్ ఆప్షన్ .. బ్యాడ్ ఆప్షన్ అనే విషయంపై ఒక క్రీడా అనలిస్టు స్పందించాడు. గుడ్ ఆప్షన్ కింద మొయిన్ అలీ, మార్క్ వుడ్‌లను ఎంచుకున్న సదరు అనలిస్ట్ బ్యాడ్ ఆప్షన్ కింద క్రిస్ వోక్స్‌ను ఎంచుకున్నాడు. ఇక్కడే అంచనాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. ఏ బౌలర్ అయితే కాన్వేకు బ్యాడ్ ఆప్షన్ అన్నాడో అతనో వికెట్ తీయడం విశేషం. వోక్స్ తాను వేసిన తొలి ఓవర్లోనే చివరి బంతికి కాన్వేను ఔట్ చేశాడు. వోక్స్ వేసిన బంతి బ్యాట్‌ను తాకి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకోగా కీపర్ బట్లర్ సూపర్‌గా డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో మూడు పరుగుల వద్ద కాన్వేను వెనక్కి పంపిన వోక్స్ ఇంగ్లండ్‌కు బ్రేక్ అందించాడు. ఇది చూసిన అభిమానులు.. అంచనాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. మనం అనుకున్నవన్నీ రివర్స్ అవడం అంటే ఇదే. బ్యాడ్ ఆప్షన్ అని ఎంచుకున్న వోక్స్ ఇవాళ కాన్వే వికెట్ తీశాడు. మీ అంచనాలు తప్పాయి అంటూ కామెంట్స్ చేశారు. A #statswank story in 2 parts…. #T20WorldCup #engvnz pic.twitter.com/wzc9jWeyzl — Innocent Bystander (@InnoBystander) November 1, 2022 చదవండి: కేన్ మామ ఇలా చేస్తావని ఊహించలేదు.. ఇంగ్లండ్ తరపున తొలి బ్యాటర్‌గా జాస్ బట్లర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్‌కు భారీ షాక్!
ఇంగ్లండ్ స్వదేశాన న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జూన్ 2 నుంచి ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో వెస్టిండీస్ పర్యటనలో గాయపడిన క్రిస్ వోక్స్ ఇంకా కోలుకోలేనట్టు తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్‌తో టెస్టులకు ఇంగ్లండ్ త్వరలోనే జట్టును ప్రకటించనుంది. ఇక ఇంగ్లండ్ నూతన టెస్టు కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఎంపికైన సంగతి తెలిసిందే. యాషెస్ సిరీస్‌లో ఓటమి, విండీస్ పర్యటనలో ఘోర పరాభావం ఎదురుకావడంతో జో రూట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. చదవండి: Graham Thorpe Health: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్ -
Ashes: చివరి రోజు 69.5 ఓవర్ల పాటు బ్యాటింగ్... 50.4 ఓవర్లు ఎదుర్కొంది ఆ ఇద్దరే!
Ashes Series Adelaide Test: డే అండ్ నైట్ టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టు తమ అజేయ రికార్డును కొనసాగిస్తోంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో డే అండ్ నైట్‌గా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 275 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తొమ్మిది డే అండ్ నైట్ టెస్టులు ఆడగా అన్నింటా విజయం సాధించడం విశేషం. 468 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 113.1 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 82/4తో ఆట చివరి రోజైన సోమవారం బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లండ్‌ను ఆసీస్ పేసర్ జే రిచర్డ్సన్ (5/42) బెంబేలెత్తించాడు. మిచెల్ స్టార్క్, నాథన్ లయన్ చెరో రెండు వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్ (44; 7 ఫోర్లు) ఇంగ్లండ్ టీమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం చేసిన ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. బాక్సింగ్ డే టెస్టు మెల్బోర్న్ వేదికగా ఈ నెల 26న ఆరంభం కానుంది. బట్లర్ మారథాన్ ఇన్నింగ్స్ .. 50.4 ఓవర్లను ఎదుర్కొంది వారిద్దరే! ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో ఉన్న జోస్ బట్లర్ (26; 2 ఫోర్లు) ‘డ్రా’ కోసం వీరోచితంగా పోరాడాడు. ఏకంగా అతడు 207 బంతులను ఎదుర్కొన్నాడు. వోక్స్ (97 బంతుల్లో 44; 7 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఒక దశలో వీరిద్దరు కలిసి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించేలా కనిపించారు. అయితే బౌలింగ్‌కు వచ్చిన రిచర్డ్సన్... వోక్స్, బట్లర్‌లను అవుట్ చేశాడు. వోక్స్ బౌల్డ్ కాగా... బట్లర్‌ను దురదృష్టం వెంటాడింది. రిచర్డ్సన్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడే క్రమంలో బట్లర్ కుడి కాలు వికెట్లకు తాకింది. దాంతో అతడు హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. చివరి రోజు ఇంగ్లండ్ 69.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయగా... అందులో 50.4 ఓవర్లను బట్లర్–వోక్స్ ద్వయమే ఎదుర్కొంది. చదవండి: SA Vs Ind: ఓవైపు భారత్‌తో సిరీస్.. మరోవైపు హెడ్‌కోచ్‌పై విచారణ Unbelievable but true, the Adelaide Test was NOT the first time Jhye Richardson had Jos Buttler out hit-wicket in Australia! 🤯#Ashes | @alintaenergy pic.twitter.com/wvr9k4S4xK — cricket.com.au (@cricketcomau) December 21, 2021 -
వారెవ్వా వోక్స్.. సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్
Chris Woakes Stunning Catch.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్‌లో క్రిస్ వోక్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతిని స్టీవ్ స్మిత్ మిడాన్ దిశగా షాట్ ఆడాడు. అయితే మిడాన్‌లో ఉన్న వోక్స్ వెనక్కి పరిగెత్తుతూ అమాంతం గాల్లోకి లేచి సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ తీసుకున్నాడు. అయితే వోక్స్ కాస్త పట్టు తప్పినా పరిస్థితి వేరేలా ఉండేది. వోక్స్ స్టన్నింగ్ క్యాచ్‌కు షాకైన స్మిత్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. వోక్స్ అందుకున్న క్యాచ్ ఈ ప్రపంచకప్‌లో బెస్ట్ క్యాచెస్ ఆఫ్ టోర్నమెంట్లో చోటు దక్కించుకోవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: SA Vs SL: టీ20 ప్రపంచకప్‌లో మరో హ్యాట్రిక్.. లంక స్పిన్నర్ ఖాతాలో పలు అరుదైన రికార్డులు Woakes with a worldie of a catch via @t20worldcup https://t.co/cPcthNTkJG — Bhavana.Gunda (@GundaBhavana) October 30, 2021 -
Chris Woakes: వాటి కోసమే ఐపీఎల్ వద్దనుకున్నా
లండన్: ఐపీఎల్‌తో పోలిస్తే మరో రెండు ప్రధాన టోర్నీలకే (టి20 వరల్డ్‌కప్, యాషెస్) తన తొలి ప్రాధాన్యత కావడంతో లీగ్ రెండో దశలో పోటీల్లో పాల్గొనడం లేదని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ వోక్స్ వెల్లడించాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న అతను ఈసారికి ఆడలేనంటూ తప్పుకున్నాడు. ‘టి20 వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్టులో చోటు లభించడంతో అంతా మారిపోయింది. అందుకే జాతీయ జట్టుకే ప్రాధాన్యతనిస్తూ ఐపీఎల్‌కు దూరమయ్యాను’ అని వోక్స్ తెలిపాడు. -
ఆ మూడు ఐపీఎల్ జట్లకు భారీ షాక్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం
దుబాయ్: సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచ్‌లు కళ తప్పనున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఇంగ్లీష్ మీడియా కథనాలు. వివరాల్లోకి వెళితే.. వివిధ ఫ్రాంచైజీలకు చెందిన ముగ్గురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్‌కు దూరం కానున్నట్లు బ్రిటీష్ మీడియా వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. సన్‌రైజర్స్ కీలక ఆటగాడు జానీ బెయిర్‌స్టో, పంజాబ్ కింగ్స్ ఆటగాడు డేవిడ్ మలాన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు క్రిస్ వోక్స్.. మలిదశ ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సదరు ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఆటగాళ్ల గైర్హాజరీపై ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలు స్పందిచాల్సి ఉంది. కాగా, ఇదివరకే పలువురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు వివిధ కారణాల చేత లీగ్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ ఐపీఎల్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించారు. మొత్తంగా మలిదశ ఐపీఎల్లో ఇంగ్లండ్ ఆటగాళ్ల మెరుపులు లేకపోవడంతో లీగ్ కళ తప్పనుందని అభిమానులు నిరాశ చెందుతున్నారు. చదవండి: ఈసారి టైటిల్ నెగ్గేది మేమే: డీసీ స్టార్ ప్లేయర్ -
ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు.. ఆ ఇద్దరికి మొండిచెయ్యి
లండన్: అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. జట్టులో స్థానం ఆశించిన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సహా టెస్ట్ కెప్టెన్ జో రూట్లకు సెలెక్షన్ కమిటీ మొండిచెయ్యి చూపింది. ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న రూట్ ఎలాగైనా పొట్టి ఫార్మాట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని భావించాడు. ఇక మానసిక సమస్యలతో బాధపడుతున్న స్టోక్స్.. క్రికెట్ నుంచి నిరవధిక విరామం తీసుకుని ఇటీవలే జట్టుకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. అయితే ఇంగ్లండ్ సెలెక్షన్ కమిటీ వీరిద్దరిని పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో టైమల్ మిల్స్, ఆల్‌రౌండర్ కోటాలో క్రిస్ వోక్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. చదవండి: టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై వివాదం.. -
వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన ఇంగ్లండ్ ప్లేయర్..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్.. కెరీర్ అత్యుత్తమ వన్డే ర్యాంకింగ్ సాధించాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో 6 వికెట్లు పడగొట్టిన వోక్స్(711 పాయింట్లు).. ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(737 పాయింట్లు) నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా, బంగ్లా బౌలర్ మెహదీ హసన్ (713) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (690 పాయింట్లు) ఒక స్థానాన్ని కోల్పోయి ఆరో ప్లేస్‌కు దిగజారాడు. 📈 @ChrisWoakes makes a charge in the latest @MRFWorldwide ICC Men’s ODI Bowling Rankings, with the @EnglandCricket quick jumping to No.3. Full rankings ➡️ https://t.co/tHR5rK3ru7 pic.twitter.com/LazEtSmQHB — ICC (@ICC) July 7, 2021 ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. శ్రీలంకతో సిరీస్‌లో 147 పరుగులతో అదరగొట్టిన ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్.. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానంలో, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఒక స్థానం ఎగబాకి 25వ ప్లేస్‌లో నిలిచారు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకోగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20 ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఒక స్థానం మెరుగుపర్చుకుని 9వ ప్లేస్‌కు చేరుకోగా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్, ఎయిడెన్ మర్క్రమ్లు.. 13, 19వ స్థానాలకు ఎగబాకారు. విండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో ఈ ఇద్దరు ఓపెనర్లు అదరగొట్టారు. దీంతో ప్రొటీస్.. ఆతిధ్య జట్టుపై 3-2తో గెలుపొందింది. ఈ జాబితాలో టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ సైతం ఒక స్థానం మెరుగుపరుచుకని 6వ ప్లేస్‌కు చేరుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 5వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలాన్, ఆసీస్ ఆరోన్ ఫించ్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు వరుసగా 1, 2, 3 స్థానాలను నిలబెట్టుకున్నారు. 🔺 After entering the top 10 last week, @windiescricket opener Evin Lewis moves up a spot on the @MRFWorldwide ICC Men's T20I Batting Rankings. pic.twitter.com/TugCjFugmb — ICC (@ICC) July 7, 2021 -
Sri Lanka Vs England: ఇంగ్లండ్‌దే తొలి వన్డే
చెస్టర్–లీ–స్ట్రీట్: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట శ్రీలంక 42.3 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. కుశాల్ పెరీరా (73; 7 ఫోర్లు), హసరంగ (54; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ వోక్స్ 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మరో బౌలర్ విల్లే 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి గెలిచింది. జో రూట్ (79 నాటౌట్; 4 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించగా, ఓపెనర్ బెయిర్‌స్టో (43; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. దుశ్మంత చమీరకు 3 వికెట్లు దక్కాయి. చదవండి: సిగరెట్ల కోసం వెళ్లారు.. సస్పెండయ్యారు -
సామ్ కర్రన్ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు
పూణే: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో సంచలన ప్రదర్శనతో అందరి మనసులను దోచుకున్న ఇంగ్లండ్ నవయువ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ (83 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అరుదైన ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. వన్డేల్లో 8 లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సామ్ కర్రన్ అగ్రస్థానంలో నిలిచాడు. 2016లో ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి శ్రీలంకపై అజేయమైన 95 పరుగులు చేసినప్పటికీ... సామ్ కర్రన్ తక్కువ బంతుల్లో అదే స్కోర్ చేయడంతో ఈ రికార్డ్ అతని ఖాతాలో చేరింది. విండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ 2011లో భారత్‌పై అజేయమైన 92 పరుగులు(9వ స్థానంలో) చేయగా, వెస్టిండీస్‌పై ఆసీస్ ఆటగాడు నాథన్ కౌల్టర్ నైల్ 92 పరుగులు(8వ స్థానంలో) చేశాడు. కాగా, తాజాగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్ కర్రన్ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అజేయమైన 95 పరుగులు సాధించాడు. సామ్ కర్రన్ అద్భుత పోరాటం వృధా కావడంతో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ధవన్ (67), పంత్ (62 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకాలతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో మార్క్ వుడ్ (3/34), రషీద్ (2/81) రాణించారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. సామ్ కర్రన్, డేవిడ్ మలాన్ (50) అర్ధశతకాలు సాధించారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ (4/67), భువనేశ్వర్ (3/42) సత్తాచాటారు. చదవండి: వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన టీమిండియా -
పాపం: ఒక్క మ్యాచ్ ఆడకుండానే స్వదేశానికి వోక్స్
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రొటేషన్ పాలసీలో భాగంగా భారత పర్యటన నుంచి మరో ఇంగ్లండ్ ప్లేయర్ స్వదేశానికి వెళ్లిపోయాడు. దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్‌తో సిరీస్‌లకు 31 ఏళ్ల ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ ఎంపికయ్యాడు. అయితే ఈ మూడు సిరీస్‌లలో వోక్స్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. గతేడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో చివరిసారి వన్డే మ్యాచ్‌లో వోక్స్ బరిలోకి దిగాడు. రొటేషన్ పాలసీలో భాగంగా ఇప్పటికే ఇంగ్లండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్, మొయిన్ అలీ స్వదేశానికి వెళ్లిపోయారు. (చదవండి: ‘పిచ్ ఎలా ఉండాలో ఎవరు చెప్పాలి’) -
వోక్స్ స్థానంలో నోర్జే
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ స్థానాన్ని దక్షిణాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్జే భర్తీ చేయనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ మంగళవారం ప్రకటించింది. 26 ఏళ్ల నోర్జేకు ఇదే తొలి ఐపీఎల్ కాగా... దక్షిణాఫ్రికా తరఫున 6 టెస్టులు, 7 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల్లో అతను ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 20 లక్షల మొత్తానికి నోర్జేను దక్కించుకున్నప్పటికీ భుజం గాయం కారణంగా అతను లీగ్ ఆడలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగం అయ్యేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు నోర్జే ఇన్‌స్టగ్రామ్ ద్వారా తెలిపాడు. అనారోగ్య కారణాలతో తప్పుకున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌ను గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఢిల్లీ రూ. 1.5 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది.