యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ రెండో రోజు ఆట మొదలైంది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తొలి బంతికే వికెట్ తీశాడు. డ్రైవ్ షాట్ ఆడబోయిన కమిన్స్ (1).. కవర్ పాయింట్‌లో ఉన్న స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఆసీస్ ఓవర్‌నైట్ స్కోర్ 299 వద్దనే తొమ్మిదో వికెట్ కోల్పోయింది.
301 పరుగుల వద్ద ఆలౌట్.. అయితే..!
క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ సెకెండ్ స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 301 పరుగుల వద్ద ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే అంపైర్ దాన్ని నో బాల్‌గా ప్రకటించడంతో ఆసీస్ ఇన్నింగ్స్ కొనసాగింది.
ఐదేసిన వోక్స్.. ఆసీస్ 317 ఆలౌట్
హాజిల్‌వుడ్ (4)ను క్రిస్ వోక్స్ ఔట్ చేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 317 పరుగుల వద్ద ముగిసింది. 36 పరుగులతో స్టార్క్ అజేయంగా నిలిచాడు. క్రిస్ వోక్స్‌కు ఇది యాషెస్‌లో తొలి ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41), డేవిడ్ వార్నర్ (32), మిచెల్ స్టార్క్ (36 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ ఐదేయగా, బ్రాడ్ 2, ఆండర్సన్, వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment