Ashes fourth Test
-
Ashes 2023: లెజెండ్ కదా అని మొహమాటానికి పోయి జట్టులో పెట్టుకున్నందుకు...
దిగ్గజ పేసర్, ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. యాషెస్ సిరీస్-2023లో ఇంగ్లండ్ నష్టపోవడానికి ఆండర్సన్ ప్రధాన కారణమని ఆరోపించాడు. లెజెండ్ బౌలర్ కదా అని మొహమాటానికి పోయి జట్టులో పెట్టుకున్నందుకు ఇంగ్లండ్ టీమ్ తగిన మూల్యం చెల్లించుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో ఆండర్సన్ ఏమాత్రం ప్రభావం చూపలేదని, ఒక్కటంటే ఒక్క కీలక వికెట్ కూడా తీసి జట్టుకు ఉపయోగపడింది లేదని ఫైరయ్యాడు. యాషెస్ సిరీస్ 2023లో పేలవ ప్రదర్శనకు గాను ఆండర్సన్‌ను తూర్పారబెట్టిన వాన్.. మరోవైపు నుంచి కవర్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. ఆండర్సన్‌ను దిగ్గజ బౌలర్‌గా పరిగణించడాన్ని ఎవరూ కాదనలేరని, జట్టులో చోటుకు అతను వంద శాతం అర్హుడే అని అంటూనే ఆండర్సన్ సేవల వల్ల ఇంగ్లండ్‌కు ఒరిగిందేమీ లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. వర్షం కారణంగా నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన అనంతరం బీబీసీ యాషెస్ డైలీ పోడ్కాస్ట్తో మాట్లాడుతూ వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఇప్పటివరకు జరిగిన 4 యాషెస్ టెస్ట్‌ల్లో 3 మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్ 114 ఓవర్లు వేసి కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. వాన్ చెప్పినట్లు ఆండర్సన్ పేలవ ప్రదర్శన కారణంగా ఇంగ్లండ్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఆండర్సన్ స్థానంలో మరే బౌలర్‌ను తీసుకున్నా ఫలితాలు ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఉండేవి. నాలుగో టెస్ట్‌లో అయితే ఆండర్సన్ ప్రదర్శన అరంగేట్రం బౌలర్ కంటే దారుణంగా ఉండింది. నాలుగో రోజు ఆండర్సన్ ఏ మాత్రం ప్రభావం చూపించినా ఇంగ్లండ్ మ్యాచ్ గెలిచి, సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకునేది. మొత్తంగా చూస్తే కెరీర్లో సుమారు 1000 వికెట్లు తీసిన దిగ్గజ బౌలర్ ప్రస్తుతం జట్టుకు భారంగా మారాడు. ఐదో టెస్ట్‌లో అయినా ఇంగ్లండ్ మేనేజ్మెంట్ మేల్కొనకపోతే ఇంతకుమించిన భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. దిగ్గజ బౌలర్, కెరీర్ చరమాంకంలో ఉన్నాడు అని ములాజకు పోతే ఐదో టెస్ట్‌లో కూడా ఇంగ్లండ్‌కు భంగపాటు తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆఖరి మ్యాచ్‌లో ఆండర్సన్‌ను పక్కకు పెట్టి ఓలీ రాబిన్సన్, జోస్ టంగ్లలో ఎవరో ఒకరిని ఆడించాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, నిన్న ముగిసిన నాలుగో టెస్ట్ డ్రా కావడంతో ఆసీస్ యాషెస్‌ను నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆ జట్టు యాషెస్‌ను ఈ దఫా కూడా తమ వద్దనే ఉంచుకోనుంది. ఒకవేళ ఇంగ్లండ్ ఆఖరి టెస్ట్ గెలిచినా సిరీస్ 2-2తో డ్రా అవుతుందే తప్ప ఇంగ్లండ్‌కు ఒరిగేదేమీ లేదు. -
Ashes 4th Test: మొయిన్ అలీ డబుల్ ధమాకా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ డబుల్ ధమాకా సాధించాడు. ఈ సిరీస్‌కు ముందే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన మొయిన్.. టెస్ట్‌ల్లో 3000 పరుగులు, 200 వికెట్లు సాధించిన 16వ క్రికెటర్‌గా, నాలుగో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కెరీర్లో 67వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న మొయిన్.. 3020 పరుగులు 201 టెస్ట్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొయిన్‌కు ముందు ఇయాన్ బోథమ్ (5200 పరుగులు, 383 వికెట్లు), ఆండ్రూ ఫ్లింటాఫ్ (3845, 226), స్టువర్ట్ బ్రాడ్ (3640, 600) ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, 299/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 18 పరుగులు మాత్రమే జోడించి, మిగతా 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ బజ్‌బాల్ అంటూ ధాటిగా ఆడుతుంది. ఆ జట్టు రెండో సెషన్ సమయానికి 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. డకెట్ (1) ఔట్ కాగా.. జాక్ క్రాలే (60), మొయిన్ అలీ (43) క్రీజ్‌లో ఉన్నారు. డకెట్ వికెట్ స్టార్క్‌కు దక్కింది. అంతకుముందు, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51), హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41), డేవిడ్ వార్నర్ (32), మిచెల్ స్టార్క్ (36 నాటౌట్). ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. బ్రాడ్ 2, ఆండర్సన్, వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. -
Ashes 4th Test: క్రికెట్ చరిత్రలో కేవలం రెండో జట్టుగా టీమ్ ఇంగ్లండ్
యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు ఓ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ దేశానికి చెందిన జట్టు సాధించని ఓ రికార్డును టీమ్ ఇంగ్లండ్ సాధించింది. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో ఆ ఘనత సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. యాషెస్ నాలుగో టెస్ట్‌కు ముందు టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం ఒకే ఒక్క జట్టులో మాత్రమే కనీసం 10 మంది ఆటగాళ్లు 1000 పరుగులు చేశారు. ఆ జట్టు కూడా ఏ దేశానికి చెందినది కాదు. 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ టెస్ట్‌లో ఐసీసీ వరల్డ్ ఎలెవెన్ జట్టు ఈ ఘనత సాధించింది. ఆ మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవెన్‌లోని 10 మంది ఆటగాళ్లు కనీసం 1000 పరుగుల మార్కును దాటారు. నాటి జట్టులో స్టీవ్ హార్మిసన్ (743) మినహా అందరూ 1000 పరుగులు దాటిన వారు ఉన్నారు. అందులో ముగ్గురు తమతమ కెరీర్లు ముగిసే నాటికి ఏకంగా 11000 పరుగుల మార్కును దాటారు. ఆ తర్వాత ఇనాళ్లకు (18 ఏళ్ల తర్వాత) తిరిగి మరో జట్టులో కనీసం 10 మంది ఆటగాళ్లు 1000 పరుగుల మార్కును దాటిన వారు ఉన్నారు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ తుది జట్టులోని మార్క్ వుడ్ (681) మినహా మిగతా 10 మంది ఆటగాళ్లు 1000 పరుగుల మార్కును దాటారు. ఇక్కడ మరో విశేషమేమింటంటే.. నాటి ప్రత్యర్ధి, నేటి ప్రత్యర్ధి రెండూ ఆస్ట్రేలియానే. యాషెస్ నాలుగో టెస్ట్ ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు.. జాక్ క్రాలే (1920), బెన్ డకెట్ (1037), మొయిన్ అలీ (2977), జో రూట్ (11236), హ్యారీ బ్రూక్ (1028), జానీ బెయిర్‌స్టో (5623), క్రిస్ వోక్స్ (1717), మార్క్ వుడ్ (681), స్టువర్ట్ బ్రాడ్ (3641), జేమ్స్ ఆండర్సన్ (1327). 2005లో ఆస్ట్రేలియాతో ఆడిన వరల్డ్ ఎలెవెన్ జట్టు (ఆటగాళ్ల కెరీర్లు ముగిసిన నాటి స్కోర్లు).. గ్రేమ్ స్మిత్ (9265), వీరేంద్ర సెహ్వాగ్ (8586), రాహుల్ ద్రవిడ్ (13288), బ్రియాన్ లారా (11953), జాక్ కలిస్ (13289), ఇంజమామ్ ఉల్ హాక్ (8830), ఆండ్రూ ఫ్లింటాఫ్ (3845), మార్క్ బౌచర్ (5515), డేనియల్ వెటోరీ (4531), స్టీవ్ హార్మిసన్ (743), ముత్తయ్య మురళీథరన్ (1261). -
తొలి బంతికే వికెట్ తీసిన ఆండర్సన్.. ఐదేసిన వోక్స్.. ఆసీస్ ఆలౌట్
యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ రెండో రోజు ఆట మొదలైంది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తొలి బంతికే వికెట్ తీశాడు. డ్రైవ్ షాట్ ఆడబోయిన కమిన్స్ (1).. కవర్ పాయింట్లో ఉన్న స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఆసీస్ ఓవర్‌నైట్ స్కోర్ 299 వద్దనే తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 301 పరుగుల వద్ద ఆలౌట్.. అయితే..! క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ సెకెండ్ స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 301 పరుగుల వద్ద ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే అంపైర్ దాన్ని నో బాల్‌గా ప్రకటించడంతో ఆసీస్ ఇన్నింగ్స్ కొనసాగింది. ఐదేసిన వోక్స్.. ఆసీస్ 317 ఆలౌట్ హాజిల్‌వుడ్ (4)ను క్రిస్ వోక్స్ ఔట్ చేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 317 పరుగుల వద్ద ముగిసింది. 36 పరుగులతో స్టార్క్ అజేయంగా నిలిచాడు. క్రిస్ వోక్స్‌కు ఇది యాషెస్‌లో తొలి ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41), డేవిడ్ వార్నర్ (32), మిచెల్ స్టార్క్ (36 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ ఐదేయగా, బ్రాడ్ 2, ఆండర్సన్, వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. -
యాషెస్ నాలుగో టెస్ట్‌కు వర్షం ముప్పు.. బజ్‌బాల్ డోస్ పెంచుతామన్న స్టోక్స్
బజ్‌బాల్ అప్రోచ్ విషయంలో, యాషెస్ సిరీస్ నెగ్గే విషయంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఏమాత్రం తగ్గేదేలేదంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో యాషెస్ సిరీస్ గెలుస్తామని ధీమాగా చెబుతున్నాడు. నాలుగో టెస్ట్‌కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టోక్స్ మాట్లాడుతూ.. సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచే నాలుగో టెస్ట్‌లో ఎలాగైనా గెలిచి తీరతామని.. ఆసీస్ ఆధిక్యాన్ని 0-2 నుంచి 1-2కు తగ్గించాం, దీన్ని 2-2కు తీసుకువచ్చి, 3-2గా ముగిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. నాలుగో టెస్ట్ మొత్తానికి వర్షం ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై స్పందిస్తూ.. వాస్తవానికి మేము వాతావరణం గురించి ఆలోచించం. అయితే ప్రస్తుతం మేమున్న పరిస్థితుల్లో ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. వరుణుడు ఇబ్బంది పెడితే తమ సాధారణ ఆటలో శృతి పెంచి, ఫలితం సాధిస్తామని చెప్పాడు. తప్పక గెలవాల్సిన మూడో టెస్ట్‌కు ముందు కూడా వర్షం ఇలానే మమ్మల్ని బయపెట్టిందని, అదే తమలోని అత్యుత్తమ ఆటతీరును వెలికి తీసి విజయం సాధించేలా చేసిందని తెలిపాడు. కాగా, నాలుగో టెస్ట్‌కు వేదిక అయిన ఓల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్‌లో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మ్యాచ్ తొలి రోజు (జులై 19) వర్షం పడే అవకాశాలు కాస్త అటు ఇటుగా ఉన్నా, మిగతా నాలుగు రోజుల్లో మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ జరిగే సమయంలో ఓ మోస్తరుకు మించి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తమ నివేదికలో పేర్కొంది. వర్షం కురువని సమయంలో గాలి వేగం అధికంగా ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉంటే, వర్షం కురువకుండా గాలి వేగం అధికంగా ఉంటే ఫాస్ట్ బౌలర్లు రెచ్చిపోతారు. ముందస్తు వాతావరణ హెచ్చరికల కారణంగానే ఇరు జట్లు స్పిన్నర్లను పక్కకు పెట్టి, కేవలం పేస్ దళంతోనే బరిలోకి దిగుతున్నారు. ఆల్‌రౌండర్లతో కలిపి ఇరు జట్లు ఐదుగురు పేసర్లతో కత్తులు దూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ -
ఆసీస్ పుంజుకునేనా!
♦ నేటి నుంచి యాషెస్ నాలుగో టెస్టు ♦ సిరీస్ విజయంపై ఇంగ్లండ్ గురి ♦ మ. గం. 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం నాటింగ్‌హామ్ : యాషెస్ సిరీస్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు గురువారం నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరగనుంది. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుస్తుంది. మరోవైపు ఒక మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాలి. ఈ సిరీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఫలితం ఏకపక్షంగా వచ్చింది. రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధిస్తే... మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ విజయం సాధించింది. స్వింగ్ బౌలర్లకు సహకరించే ట్రెంట్‌బ్రిడ్జ్ పిచ్‌పై అండర్సన్ సేవలు అందుబాటులో లేకపోవడం ఇంగ్లండ్‌కు దెబ్బ. అతని స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రిటైర్ కాను: క్లార్క్ వరుసగా మూడు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే తనలో క్రికెట్ ఆడాలన్న తపన తగ్గలేదని, ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచన లేదని క్లార్క్ స్పష్టం చేశాడు. -
రోజర్స్ సెంచరీ; ఆసీస్ విక్టరీ
మెల్బోర్న్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళుతోంది. తాజాగా జరిగిన నాలుగు టెస్టులోనూ ఆసీస్ విజయం సాధించి సిరీస్‌లో 4-0 ఆధిక్యం సాధించింది. నాలుగో టెస్టు నాలుగు రోజుల్లోనే ముగియడం విశేషం. ఇంగ్లండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని క్లార్క్ సేన 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 30 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ కేవలం 2 వికెట్లు నష్టపోయి విజయాన్ని అందుకుంది. రోజర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. 155 బంతుల్లో 13 ఫోర్లతో 116 పరుగులు చేశాడు. వాట్సన్ అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. 90 బంతుల్లోనే 11 ఫోర్లతో 83 పరుగులు పిండుకున్నాడు. వార్నర్ 25 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్, పనేసర్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 255, రెండో ఇన్నింగ్స్‌లో 179 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌటయింది. మొత్తం 8 వికెట్లు పడగొట్టిన ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. -
ఆసీస్ లక్ష్యం 231
మెల్బోర్న్: రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తడబడటంతో యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా పయనిస్తోంది. కుక్‌సేన నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు శనివారం మూడో రోజు బరిలోకి దిగిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. రోజర్స్ (18 బ్యాటింగ్), వార్నర్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం క్లార్క్‌సేన గెలుపునకు 201 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు 164/9 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 82.2 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 51 పరుగుల ఆధిక్యం లభించింది. హాడిన్ (65), లియోన్ (18 నాటౌట్)తో కలిసి పదో వికెట్‌కు విలువైన 40 పరుగులు జోడించి అవుటయ్యాడు. అండర్సన్ 4, బ్రాడ్ 3, బ్రెస్నన్ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌ను స్పిన్నర్ లియోన్, జాన్సన్ వణికించారు. కట్టుదిట్టమైన బంతులతో పరుగులు నిరోధించారు. దీంతో కుక్‌సేన రెండో ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. కుక్ (51), పీటర్సన్ (49) రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. ఒక్క పరుగు తేడాతో కార్‌బెరీ (12), రూట్ (15), బెల్ (0) అవుట్ కావడంతో పర్యాటక జట్టు 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే పీటర్సన్... స్టోక్స్ (19)తో కలిసి ఐదో వికెట్‌కు 44; బెయిర్‌స్టో (21)తో కలిసి ఆరో వికెట్‌కు 42 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశాడు. చివర్లో లియోన్, జాన్సన్ మరోసారి విజృంభించడంతో ఇంగ్లండ్ చివరి ఐదు వికెట్లను ఆరు పరుగుల తేడాతో చేజార్చుకుంది. ఐదు వికెట్లు తీసిన లియోన్ కెరీర్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. జాన్సన్‌కు 3, సిడిల్‌కు ఒక్క వికెట్ లభించింది. ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసిన పిన్నవయస్కుడిగా కుక్ రికార్డులకెక్కాడు. -
తడబడిన ఇంగ్లండ్
చెస్టర్ లీ స్ట్రీట్: ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభమైన యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తడబడింది. బ్యాటింగ్ వైఫల్యంతో తొలి రోజు తక్కువ స్కోరుకే పరిమితమైంది. కుక్ (51), ట్రాట్ (49) ఓ మోస్తరుగా రాణించడంతో ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 9 వికెట్లకు 238 పరుగులు చేసింది. బ్రెస్నన్ (12), అండర్సన్ (16) క్రీజులో ఉన్నారు. రివర్సైడ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. రూట్ (16) తొందరగా అవుట్‌కాగా... కుక్, ట్రాట్ నిలకడగా ఆడారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆసీస్ స్పిన్నర్ లియోన్ (4/42) తన మ్యాజిక్‌ను ప్రదర్శించాడు. కుదురుగా ఆడుతున్న ట్రాట్‌తో పాటు మిడిలార్డర్లో పీటర్సన్ (26), బెల్ (6), బెయిర్‌స్టో (14)లను వరుస విరామాల్లో అవుట్ చేసి షాకిచ్చాడు. దీంతో ఇంగ్లండ్155 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లోయర్ ఆర్డర్లో ప్రయర్ (17), బ్రాడ్ (3), స్వాన్ (13) కూడా విఫలం కావడంతో కుక్‌సేన ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. బెయిర్‌స్టో, ప్రయర్లు ఆరో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. చివర్లో అండర్సన్, బ్రెస్నన్‌తో కలిసి పదో వికెట్‌కు అజేయంగా 24 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ ఆలౌట్ కాకుండా రోజును ముగించింది. లియోన్ 4, హారిస్ 2, బర్డ్, వాట్సన్, సిడిల్ తలా ఓ వికెట్ తీశారు.