ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ డబుల్ ధమాకా సాధించాడు. ఈ సిరీస్‌కు ముందే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మొయిన్.. టెస్ట్‌ల్లో 3000 పరుగులు, 200 వికెట్లు సాధించిన 16వ క్రికెటర్‌గా, నాలుగో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
కెరీర్‌లో 67వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న మొయిన్.. 3020 పరుగులు 201 టెస్ట్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొయిన్‌కు ముందు ఇయాన్ బోథమ్ (5200 పరుగులు, 383 వికెట్లు), ఆండ్రూ ఫ్లింటాఫ్ (3845, 226), స్టువర్ట్ బ్రాడ్ (3640, 600) ఈ ఘనత సాధించారు.
ఇదిలా ఉంటే, 299/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 18 పరుగులు మాత్రమే జోడించి, మిగతా 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ బజ్‌బాల్ అంటూ ధాటిగా ఆడుతుంది. ఆ జట్టు రెండో సెషన్ సమయానికి 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. డకెట్ (1) ఔట్ కాగా.. జాక్ క్రాలే (60), మొయిన్ అలీ (43) క్రీజ్‌లో ఉన్నారు. డకెట్ వికెట్ స్టార్క్‌కు దక్కింది.
అంతకుముందు, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51), హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41), డేవిడ్ వార్నర్ (32), మిచెల్ స్టార్క్ (36 నాటౌట్). ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. బ్రాడ్ 2, ఆండర్సన్, వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment