యాషెస్ సిరీస్ 2023 కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని (టెస్ట్‌లు) సైతం వెనక్కు తీసుకున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ.. 22 నెలల సుదీర్ఘ విరామం (650 రోజులు) తర్వాత టెస్ట్‌ల్లో తొలి వికెట్ సాధించాడు. యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో మొయిన్.. కీలకమైన ట్రవిస్ హెడ్ (50) వికెట్ పడగొట్టాడు. హెడ్ ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ ఆధిక్యాన్ని తగ్గిస్తున్న క్రమంలో మొయిన్ అతని వికెట్‌ను దక్కించుకుని, మళ్లీ ఆసీస్‌ను కష్టాల్లోకి నెట్టేశాడు. లెగ్ సైడ్ అప్పర్ డ్రైవ్ చేసే క్రమంలో మిడ్‌వికెట్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న జాక్ క్రాలే క్యాచ్ పట్టడంతో హెడ్ పెవిలిన్ బాట పట్టాడు.
Moeen Ali gets his first wicket upon returning to Test cricket. pic.twitter.com/gmSUjQtNT6
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 17, 2023
కాగా, మొయిన్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021 (సెప్టెంబర్) భారత పర్యటనలో ఆడాడు. అనంతరం అతను టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. రీఎంట్రీకి ముందు టెస్ట్‌ల్లో మొయిన్ చివరి వికెట్ రిషబ్ పంత్‌ది. ఆ మ్యాచ్ కూడా పంత్ కూడా హెడ్ లాగే 50 పరుగుల వద్ద ఔటయ్యాడు.
కాగా, హెడ్ వికెట్ కోల్పోయాక కాస్త నెమ్మదించిన ఆసీస్ స్కోర్.. 56 ఓవర్లు ముగిసే సమయానికి 172/4గా ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (78), కెమరూన్ గ్రీన్ (12) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 221 పరుగులు వెనుకపడి ఉంది. 14/0 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి సెషన్‌లోనే వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16) వికెట్లు కోల్పోయింది. స్టువర్ట్ బ్రాడ్‌కు 2, స్టోక్స్ ఓ వికెట్ (స్మిత్) పడగొట్టాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: Ashes 1st Test: తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేసిందా..?
Comments
Please login to add a commentAdd a comment