యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు ఓ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ దేశానికి చెందిన జట్టు సాధించని ఓ రికార్డును టీమ్ ఇంగ్లండ్ సాధించింది. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌లో ఆ ఘనత సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లోకెక్కింది.
ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. యాషెస్ నాలుగో టెస్ట్‌కు ముందు టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం ఒకే ఒక్క జట్టులో మాత్రమే కనీసం 10 మంది ఆటగాళ్లు 1000 పరుగులు చేశారు. ఆ జట్టు కూడా ఏ దేశానికి చెందినది కాదు. 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ టెస్ట్‌లో ఐసీసీ వరల్డ్ ఎలెవెన్ జట్టు ఈ ఘనత సాధించింది.
ఆ మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవెన్‌లోని 10 మంది ఆటగాళ్లు కనీసం 1000 పరుగుల మార్కును దాటారు. నాటి జట్టులో స్టీవ్ హార్మిసన్ (743) మినహా అందరూ 1000 పరుగులు దాటిన వారు ఉన్నారు. అందులో ముగ్గురు తమతమ కెరీర్‌లు ముగిసే నాటికి ఏకంగా 11000 పరుగుల మార్కును దాటారు.
ఆ తర్వాత ఇనాళ్లకు (18 ఏళ్ల తర్వాత) తిరిగి మరో జట్టులో కనీసం 10 మంది ఆటగాళ్లు 1000 పరుగుల మార్కును దాటిన వారు ఉన్నారు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ తుది జట్టులోని మార్క్ వుడ్ (681) మినహా మిగతా 10 మంది ఆటగాళ్లు 1000 పరుగుల మార్కును దాటారు. ఇక్కడ మరో విశేషమేమింటంటే.. నాటి ప్రత్యర్ధి, నేటి ప్రత్యర్ధి రెండూ ఆస్ట్రేలియానే.
యాషెస్ నాలుగో టెస్ట్ ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు..
జాక్ క్రాలే (1920), బెన్ డకెట్ (1037), మొయిన్ అలీ (2977), జో రూట్ (11236), హ్యారీ బ్రూక్ (1028), జానీ బెయిర్‌స్టో (5623), క్రిస్ వోక్స్ (1717), మార్క్ వుడ్ (681), స్టువర్ట్ బ్రాడ్ (3641), జేమ్స్ ఆండర్సన్ (1327).
2005లో ఆస్ట్రేలియాతో ఆడిన వరల్డ్ ఎలెవెన్ జట్టు (ఆటగాళ్ల కెరీర్‌లు ముగిసిన నాటి స్కోర్లు)..
గ్రేమ్ స్మిత్ (9265), వీరేంద్ర సెహ్వాగ్ (8586), రాహుల్ ద్రవిడ్ (13288), బ్రియాన్ లారా (11953), జాక్ కలిస్ (13289), ఇంజమామ్ ఉల్ హాక్ (8830), ఆండ్రూ ఫ్లింటాఫ్ (3845), మార్క్ బౌచర్ (5515), డేనియల్ వెటోరీ (4531), స్టీవ్ హార్మిసన్ (743), ముత్తయ్య మురళీథరన్ (1261).
Comments
Please login to add a commentAdd a comment