మహిళల యాషెస్ వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మెల్‌బోర్న్ వేదికగా ఇవాళ (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44.3 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. ఎల్లిస్ పెర్రీ (60) అర్ద సెంచరీతో రాణించింది. లిచ్‌ఫీల్డ్ (29), అలైసా హీలీ (29), బెత్ మూనీ (12), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు.
ఆష్లే గార్డ్‌నర్ 2, తహిళ మెక్‌గ్రాత్ 1, కిమ్ గార్త్ 9 పరుగులు చేశారు. మెగాన్ షట్ డకౌట్ కాగా.. డార్సీ బ్రౌన్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలఓ సోఫీ ఎక్లెస్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టగా.. అలైస్ క్యాప్సీ 3, లారెన్ బెల్ 2, లారెన్ ఫైల్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
181 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కూడా తడబడింది. ఆ జట్టు 48.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి 159 పరుగులకే ఆలౌటైంది. ఆమీ జోన్స్ (103 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) టెస్ట్ మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించే ప్రయత్నం చేసింది. నాట్ సీవర్ బ్రంట్ 35, కెప్టెన్ హీథర్ నైట్ 18, మయా బౌచియర్ 17, టామీ బేమౌంట్ 3, డానియెల్ వ్యాట్ హాడ్జ్ 0, అలైస్ క్యాప్సీ 14, చార్లోట్ డీన్ 3, సోఫీ ఎక్లెస్టోన్ 0, లారెన్ ఫైలర్ 7, లారెన్ బెల్ 1 పరుగు చేశారు.
ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్ మూడు, మెగాన్ షట్, ఆష్లే గార్డ్‌నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో తొలి వన్డే కూడా ఆసీస్‌సే గెలిచింది. నామమాత్రపు మూడో వన్డే జనవరి 17న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment