మహిళల యాషెస్ సిరీస్‌ను ఆసీస్ నిలబెట్టుకుంది. మల్టీ ఫార్మాట్‌లో జరిగిన ఈ సిరీస్‌ను ఆసీస్ 8-8 పాయింట్లతో సమం చేసుకుంది. నిన్న జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ నెగ్గినప్పటికీ, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ టైటిల్ నిలబెట్టుకుంది.
వన్డే సిరీస్ ఇంగ్లండ్‌దే..
వర్షం అంతరాయాల నడుమ సాగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 69 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.
Alyssa Healy reckons there's an opportunity for the @AusWomenCricket team to reset following a drawn #Ashes series pic.twitter.com/gZbbkCgFxp
— cricket.com.au (@cricketcomau) July 18, 2023
వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ చేసిన నాట్ సీవర్ బ్రంట్..
నాట్ సీవర్ బ్రంట్ వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ (129) చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కీలకపాత్ర పోషించింది. అనంతరం ఆసీస్ బ్యాటింగ్‌కు దిగే ముందు వర్షం మొదలుకావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 44 ఓవర్లలో 269 పరుగులకు కుదించారు.
చేతులెత్తేసిన ఆసీస్..
269 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి, ఆసీస్‌ను 35.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ చేశారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో (రెండో వన్డేలో ఆసీస్ గెలుపు) కైవసం చేసుకుంది.
Series drawn!
— cricket.com.au (@cricketcomau) July 18, 2023
Is this the best Women's #Ashes we've ever seen? pic.twitter.com/TtwwMhds0f
టీ20 సిరీస్ కూడా ఇంగ్లండ్‌దే..
వన్డే సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ను ఆతిధ్య జట్టు 2-1 తేడాతో (తొలి టీ20లో ఆసీస్ గెలుపు) గెలుచుకుంది.
Neither were entirely satisfied, nor downbeat. But both recognised they’d been part of something special #Ashes | @JollyLauz18 https://t.co/5znIBCCxxp
— cricket.com.au (@cricketcomau) July 18, 2023
ఆసీస్ యాషెస్‌ను ఎలా నిలుపుకుందంటే..?
మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో గెలవడంతో ఆసీస్ ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. ఆతర్వాత జరిగిన టీ20 సిరీస్‌ను ఆ జట్టు 1-2తో కోల్పోయినప్పటికీ, పాయింట్ల పరంగా (ఒక్కో గెలుపుకు 2 పాయింట్లు) అప్పటికీ ఆధిక్యంలోనే (6-4) ఉండింది. వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో చేజిక్కించుకోవడంతో 8-8తో పాయింట్లు సమం అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ యాషెస్‌ను నిలుపుకుంది.
Comments
Please login to add a commentAdd a comment