Womens Ashes
-
Ashes 2023: ఇంగ్లండ్ బ్యాటర్ వరుస శతకాలు.. యాషెస్ నిలబెట్టుకున్న ఆసీస్
మహిళల యాషెస్ సిరీస్‌ను ఆసీస్ నిలబెట్టుకుంది. మల్టీ ఫార్మాట్లో జరిగిన ఈ సిరీస్‌ను ఆసీస్ 8-8 పాయింట్లతో సమం చేసుకుంది. నిన్న జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ నెగ్గినప్పటికీ, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ టైటిల్ నిలబెట్టుకుంది. వన్డే సిరీస్ ఇంగ్లండ్‌దే.. వర్షం అంతరాయాల నడుమ సాగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 69 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. Alyssa Healy reckons there's an opportunity for the @AusWomenCricket team to reset following a drawn #Ashes series pic.twitter.com/gZbbkCgFxp — cricket.com.au (@cricketcomau) July 18, 2023 వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ చేసిన నాట్ సీవర్ బ్రంట్.. నాట్ సీవర్ బ్రంట్ వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ (129) చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కీలకపాత్ర పోషించింది. అనంతరం ఆసీస్ బ్యాటింగ్‌కు దిగే ముందు వర్షం మొదలుకావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 44 ఓవర్లలో 269 పరుగులకు కుదించారు. చేతులెత్తేసిన ఆసీస్.. 269 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి, ఆసీస్‌ను 35.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ చేశారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో (రెండో వన్డేలో ఆసీస్ గెలుపు) కైవసం చేసుకుంది. Series drawn! Is this the best Women's #Ashes we've ever seen? pic.twitter.com/TtwwMhds0f — cricket.com.au (@cricketcomau) July 18, 2023 టీ20 సిరీస్ కూడా ఇంగ్లండ్‌దే.. వన్డే సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ను ఆతిధ్య జట్టు 2-1 తేడాతో (తొలి టీ20లో ఆసీస్ గెలుపు) గెలుచుకుంది. Neither were entirely satisfied, nor downbeat. But both recognised they’d been part of something special #Ashes | @JollyLauz18 https://t.co/5znIBCCxxp — cricket.com.au (@cricketcomau) July 18, 2023 ఆసీస్ యాషెస్‌ను ఎలా నిలుపుకుందంటే..? మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో గెలవడంతో ఆసీస్ ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. ఆతర్వాత జరిగిన టీ20 సిరీస్‌ను ఆ జట్టు 1-2తో కోల్పోయినప్పటికీ, పాయింట్ల పరంగా (ఒక్కో గెలుపుకు 2 పాయింట్లు) అప్పటికీ ఆధిక్యంలోనే (6-4) ఉండింది. వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో చేజిక్కించుకోవడంతో 8-8తో పాయింట్లు సమం అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ యాషెస్‌ను నిలుపుకుంది. -
వీరోచిత శతకం వృధా.. యాషెస్‌ను నిలుపుకున్న ఆసీస్
మహిళల యాషెస్ సిరీస్‌లో నిన్న (జులై 16) జరిగిన ఉత్కంఠ పోరులో ఆతిధ్య ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 1-1కి తగ్గించిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలుండగానే యాషెస్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్ ఉండగానే ఎలా..? మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో గెలవడంతో 4 పాయింట్లు సాధించిన ఆసీస్, ఆతర్వాత జరిగిన టీ20 సిరీస్‌ను 1-2తో కోల్పోయినప్పటికీ, పాయింట్ల పరంగా (ఒక్కో గెలుపుకు 2 పాయింట్లు) అప్పటికీ ఆధిక్యంలోనే ఉండింది. అయితే తొలి వన్డేలో ఇంగ్లండ్ గెలవడంతో 6-6తో పాయింట్లు సమం అయ్యాయి. తాజాగా ఆసీస్ రెండో వన్డే గెలవడం ద్వారా ఇంగ్లండ్‌పై మళ్లీ ఆధిక్యత (8-6) సాధించింది. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో ఒకవేళ ఇంగ్లండ్ గెలిచినా సిరీస్ 8-8తో సమం అవుతుంది. అప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ యాషెస్‌ను నిలుపుకుంటుంది. మ్యాచ్ విషయానికొస్తే.. తీవ్ర ఉత్కంఠ రేపిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌పై ఆసీస్ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. ఆతర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడినప్పటికీ గెలవలేకపోయింది. బ్రంట్ వీరోచిత శతకం వృధా.. 283 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను నాట్ సీవర్ బ్రంట్ (99 బంతుల్లో 111 నాటౌట్; 10 ఫోర్లు) గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. సీవర్‌కు ట్యామీ బేమౌంట్ (60), యామీ జోన్స్ (37), సారా గ్లెన్ (22 నాటౌట్) సహకరించినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లండ్ ఆఖరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి రాగా.. 11 పరుగులే చేయడంతో ఓటమిపాలైంది. టీ20 సిరీస్ డిసైడర్ రేపు (జులై 18) జరుగనుంది. -
Ashes Series: తొలి వన్డే ఇంగ్లండ్‌దే.. 2 వికెట్ల తేడాతో ఆసీస్‌పై విజయం
మల్టీ ఫార్మట్ మహిళల యాషెస్ సిరీస్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ పైచేయి సాధిస్తుంది. ఈ సిరీస్‌లో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన ఇంగ్లండ్.. ఆతర్వాత పుంజుకుని 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 3 వన్డేల సిరీస్‌లో తొలి వన్డే నెగ్గి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. బెత్ మూనీ (81 నాటౌట్), ఎల్లీస్ పెర్రీ (41), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (34), జొనాస్సెన్ (30) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, నాట్ సీవర్ బ్రంట్ చెరో 2 వికెట్లు.. కేట్ క్రాస్, ఎక్లెస్టోన్, సారా గ్లెన్, అలైస్ క్యాప్సీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. హీథర్ నైట్ (75 నాటౌట్), ట్యామీ బేమౌంట్ (47), అలైస్ క్యాప్సీ (40), నాట్ సీవర్ బ్రంట్ (31) రాణించడంతో 48.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 3, జార్జియా వేర్హమ్ 2, ఎల్లైస్ పెర్రీ, మెగాన్ షట్, జెస్ జోనాస్సెన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జులై 16న జరుగనుంది. లక్ష్య ఛేదనలో రికార్డు.. ఈ మ్యాచ్‌లో 264 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఇంగ్లండ్.. లక్ష్య ఛేదనలో తమ రికార్డును మెరుగుపర్చుకుంది. గతంలో ఇంగ్లండ్ అత్యధిక లక్ష్యఛేదన రికార్డు 245/7గా ఉండింది. 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఈ రికార్డు సాధించింది. యాషెస్ తొలి వన్డే ద్వారా ఇంగ్లండ్ వన్డేల్లో తొలిసారి 250 పరుగులకు పైబడిన లక్ష్యాన్ని ఛేదించింది. -
యాషెస్ సిరీస్ విజేతగా ఇంగ్లండ్.. ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి
మహిళల యాషెస్ 2023లో భాగంగా జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మూనీ(32), గార్డెనర్(32), పెర్రీ(34) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో నాట్ స్కివర్ రెండు, డీన్, బెల్, గిబ్సన్, ఎకిలస్టన్ తలా వికెట్ సాధించారు. ఇక ఇన్నింగ్స్ అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్ విజయలక్ష్యాన్ని 14 ఓవర్లకు 119 పరుగులగా కుదించారు. అనంతరం 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ విజయంలో అలీస్ క్యాప్సీ(46) పరుగులతో కీలక పాత్ర పోషించింది. ఆసీస్ బౌలర్లలో మెగాన్ స్కాట్ రెండు వికెట్లు, బ్రౌన్, జానెసన్, జార్జీయా తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు యాషెస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే విధంగా మహిళల యాషెస్ 2023లో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో కూడా ఇరు జట్లు తలపడనున్నాయి. జూలై 12 బ్రిస్టల్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: IND vs AFG: టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్.. ఆ సిరీస్‌కు ముహూర్తం ఖరారు! -
ఇంగ్లండ్‌పై ఆసీస్.. ఐర్లాండ్‌పై విండీస్ విజయాలు
మహిళల క్రికెట్లో నిన్న (జులై 1) జరిగిన వేర్వేరు ఫార్మాట్ల మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు విజయాలు సాధించాయి. మల్టీ ఫార్మాట్ యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందగా, 3 వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో వన్డేలో ఐర్లాండ్‌పై విండీస్ 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. రాణించిన బెత్ మూనీ.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో బెత్ మూనీ (61) అజేయ అర్ధశతకంతో రాణించి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చింది. ఆమెకు తహిళ మెక్‌గ్రాత్ (40), ఆష్లే గార్డ్నర్ (31) సహకరించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగా.. ఆసీస్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో (ఒక టెస్ట్, 3 టీ20లు, 3 వన్డేలు) ఆసీస్ 6-0 ఆధిక్యంలోకి (ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది) దూసుకెళ్లింది. స్టెఫానీ టేలర్, చినెల్ హెన్రీ అజేయ అర్ధశతకాలు.. 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం విండీస్‌లో పర్యటిస్తున్న ఐర్లాండ్.. నిన్న జరిగిన మూడో వన్డేలో ఓటమిపాలైంది. ఫలితంగా ఆ జట్టు 0-2 తేడాతో సిరీస్ కోల్పోయింది (వర్షం కారణంగా రెండో వన్డే రద్దైంది). మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ 41.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో గాబీ లెవిస్ (95 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. స్టెఫానీ టేలర్ (79), చినెల్ హెన్రీ (53) అజేయ అర్ధశతకాలు సాధించి విండీస్‌ను విజయతీరాలకు చేర్చారు. -
ఇంగ్లండ్‌కు పరాభవం.. యాషెస్ టెస్ట్ సిరీస్ ఓటమి
నాటింగ్హమ్: ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మల్టీ ఫార్మాట్ యాషెస్ సిరీస్‌లో ఆ్రస్టేలియా శుభారంభం చేసింది. మూడు ఫార్మాట్ల ఫలితాలతో విజేత ఖరారయ్యే ఈ సిరీస్‌లో ఆసీస్ అమ్మాయిలు ఏకైక టెస్టులో గెలిచి ఆధిక్యంలోకి వచ్చారు. ఇక ఈ యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే తదుపరి జరిగే ఆరు మ్యాచ్‌ల్లో (మూడు టి20లు, మూడు వన్డేలు) ఐదింట గెలవాలి. సోమవారం ముగిసిన టెస్టులో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ ఆష్లే గార్డ్నర్ (8/66) ఇంగ్లండ్‌ను దెబ్బ తీసింది. భారత స్పిన్నర్ నీతూ డేవిడ్ (8/53; 1995లో ఇంగ్లండ్‌పై) తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆష్లే నిలిచింది. 268 పరుగుల లక్ష్యంతో ఆఖరి రోజు 116/5తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి సెషన్లోనే ఆలౌటైంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 49 ఓవర్లలో 178 పరుగుల వద్ద ముగిసింది. నాలుగో రోజు ఆటలోనే 3 కీలక వికెట్లు తీసిన ఆష్లే చివరి రోజు ఉదయం మరో ఐదు వికెట్లను పడగొట్టింది. ఈ టెస్టులో ఆమె మొత్తం 12 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 4) పడగొట్టింది. తద్వారా మహిళల టెస్టు చరిత్రలో రెండో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది. ఈ జాబితాలో పాక్ బౌలర్ షాయిజా ఖాన్ (2004లో విండీస్‌పై 13 వికెట్లు) అగ్రస్థానంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఆసీస్ 473, ఇంగ్లండ్ 463 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో ఆ్రస్టేలియా 257 పరుగులు చేసింది. -
రసవత్తరంగా యాషెస్ టెస్ట్.. ఇంగ్లండ్‌కు పరాభవం తప్పదా..?
మహిళల యాషెస్ ఏకైక టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. నాలుగో రోజు రెండు సెషన్లు పూర్తియ్యాక కూడా డ్రా అయ్యేలా కనిపించిన ఈ మ్యాచ్.. ఒక్కసారిగా మలుపు తిరిగి ఆసీస్‌వైపు మళ్లింది. ఆష్లే గార్డ్నర్ (3/33) తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌ను ఇరుకునపడేసి, ఆసీస్‌వైపు మ్యాచ్‌ను మలుపు తిప్పింది. పురుషుల యాషెస్ తొలి టెస్ట్ తరహాలోని ఈ మ్యాచ్ కూడా సాగుతుండటంతో ఇంగ్లండ్‌కు పరాభవం తప్పదని నెటిజన్లు అనుకుంటున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో రోజు సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్.. సోఫీ ఎక్లెస్టోన్ (5/63) మరోసారి విజృంభించడంతో 257 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో బెత్ మూనీ 85 పరుగులు సాధించగా.. కెప్టెన్ హీలీ సరిగ్గా 50 పరుగులు చేసి ఔటైంది. తొలి ఇన్నింగ్స్ స్వల్ప ఆధిక్యం (10) కలుపుకుని ఆసీస్.. ఇంగ్లండ్‌కు 268 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది. అనంతరం నాలుగో రోజు మూడో సెషన్లో లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆరంభంలో ఆచితూచి ఆడింది. అయితే తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ స్టార్ ట్యామీ బీమౌంట్‌ను (22) ఆష్లే గార్డ్నర్ పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లండ్ ఒక్కసారిగా లయ తప్పి వరుసగా వికెట్లు కోల్పోయింది. గార్డ్నర్ 3, కిమ్ గార్త్, తహిళ మెక్‌గ్రాత్ తలో వికెట్ పడగొట్టారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 152 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ గెలుపుకు కేవలం ఐదు వికెట్లు మాత్రమే అవసరంగా ఉన్నాయి. క్రీజ్‌లో డేనియల్ వ్యాట్ (20), కేట్ క్రాస్ (5) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 473 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 463 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఎల్లైస్ పెర్రీ (99) పరుగు తేడాతో శతకం మిస్ చేసుకోగా.. సదర్లాండ్ (137) అజేయమైన సెంచరీతో సత్తా చాటింది. ఇంగ్లండ్ బౌలర్ ఎక్లెస్టోన్ 5 వికెట్లతో విజృంభించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ట్యామీ బీమౌంట్ (208) డబుల్ సెంచరీతో చెలరేగగా.. హీథర్ నైట్ (57), నాట్ సీవర్ బ్రంట్ (78) అర్ధసెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్ గార్డ్నర్ 4, తహిళ మెక్‌గ్రాత్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ 10 వికెట్లు పడగొట్టగా, బీమౌంట్ డబుల్ సెంచరీతో మెరిసింది. -
Ashes Series 2023: ఇంగ్లండ్ ఓపెనర్ డబుల్ సెంచరీ.. ఆసీస్‌కు ధీటుగా..!
మహిళల యాషెస్ సిరీస్ 2023 ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ట్యామీ బీమౌంట్ డబుల్ సెంచరీ సాధించింది. మహిళల క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా, తొలి ఇంగ్లీష్ మహిళగా ట్యామీ రికార్డుల్లోకెక్కింది. 317 బంతుల్లో 26 బౌండరీ సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న ట్యామీ.. కెరీర్లో తాను సాధించిన తొలి టెస్ట్ శతకాన్నే ద్విశతకంగా మార్చుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు ట్యామీ తన 7 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో కేవలం 2 అర్ధసెంచరీలు మాత్రమే సాధించింది. అయితే ఆమెకు వన్డేల్లో, టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. 103 వన్డేల్లో 9 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీల సాయంతో 3505 పరుగులు (40.8 యావరేజ్‌తో), 99 టీ20ల్లో సెంచరీ, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1721 పరుగులు (108.4 స్ట్రయిక్‌రేట్‌తో) సాధించింది. WOW 🤯 Our first female double centurion in Test match cricket.#EnglandCricket #Ashes pic.twitter.com/Eju1kwmlug — England Cricket (@englandcricket) June 24, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 473 పరుగులకు ఆలౌటైంది. ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన అనాబెల్ సదర్లాండ్ (137) అజేయమైన సెంచరీతో చెలరేగగా.. ఎల్లైస్ పెర్రీ (99) ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకుంది. తహిల మెక్‌గ్రాత్ (61) అర్ధసెంచరీతో రాణించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎక్లెస్టోన్ 5 వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్, లారెన్ ఫైలర్ తలో 2 వికెట్లు, కేట్ క్రాస్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్‌కు ధీటుగా జవాబిస్తుంది. ఆ జట్టు మూడో రోజు మూడో సెషన్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 25 పరుగులు వెనుకబడి ఉంది. ట్యామీ బీమౌంట్ (205), కేట్ క్రాస్ (0) క్రీజ్‌లో ఉన్నారు. హీథర్‌నైట్ (57), నాట్‌సీవర్ బ్రంట్ (78) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 3, తహిల మెక్‌గ్రాత్, డార్సీ బ్రౌన్, నదర్లాండ్, పెర్రీ తలో వికెట్ పడగొట్టారు. -
ఆస్ట్రేలియాలో మహిళల యాషెస్ సిరీస్
మెల్బోర్న్: యాషెస్ సిరీస్ అంటే.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ సిరీస్ ను ఎంతగా ఆదరిస్తారో అంతే మాటల యుద్దం జరుగుతుంది. యాషెస్ ఆరంభమైదంటే చాలు ఇరుజట్ల ఆటగాళ్ల ఎక్కడలేని వింత పోకడలను ప్రదర్శిస్తుంటారు. ఈ సిరీస్ లో ఎన్ని వివాదాలు చోటు చేసుకున్నా.. దీనికుండే ఆదరణ మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువే. తాజాగా మహిళల యాషెస్ ను ఆసీస్ లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలిసారి ఆస్ట్రేలియాలో మహిళల యాషెస్ సిరీస్‌ను నిర్వహించనున్నట్లు సీఏ మంగళవారం తెలిపింది. మూడు ఫార్మెట్లలో కలిపి యాషెస్ సిరీస్‌ను నిర్వహిస్తున్నట్లు ఆసీస్ క్రికెట్ అకాడమీ చీఫ్ జేమ్స్ సౌతర్లాండ్ తెలిపారు. మూడు విభాగాల్లో పూర్తయిన అనంతరం విజేతకు యాషెస్ ట్రోఫీని అందజేస్తామన్నారు. జనవరి 10వ తేది నుంచి జరిగే ఒకే ఒక్క యాషెస్ టెస్ట్ మ్యాచ్‌కు పెర్త్ వేదిక కానుంది. దీంతో పాటుగా మూడు వన్డేలు, ఒక ట్వంటీ 20 మ్యాచ్‌లు ఉంటాయని బోర్డు వర్గాలు తెలిపాయి. రెండు వన్డేలు మెల్బోర్న్లో, మరోక వన్డే హాంబర్ట్లో జరుగనుంది.