మెల్‌బోర్న్: యాషెస్ సిరీస్ అంటే.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ సిరీస్ ను ఎంతగా ఆదరిస్తారో అంతే మాటల యుద్దం జరుగుతుంది. యాషెస్ ఆరంభమైదంటే చాలు ఇరుజట్ల ఆటగాళ్ల ఎక్కడలేని వింత పోకడలను ప్రదర్శిస్తుంటారు. ఈ సిరీస్ లో ఎన్ని వివాదాలు చోటు చేసుకున్నా.. దీనికుండే ఆదరణ మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువే. తాజాగా మహిళల యాషెస్ ను ఆసీస్ లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తొలిసారి ఆస్ట్రేలియాలో మహిళల యాషెస్ సిరీస్‌ను నిర్వహించనున్నట్లు సీఏ మంగళవారం తెలిపింది. మూడు ఫార్మెట్లలో కలిపి యాషెస్ సిరీస్‌ను నిర్వహిస్తున్నట్లు ఆసీస్ క్రికెట్ అకాడమీ చీఫ్ జేమ్స్ సౌతర్లాండ్ తెలిపారు. మూడు విభాగాల్లో పూర్తయిన అనంతరం విజేతకు యాషెస్ ట్రోఫీని అందజేస్తామన్నారు.
జనవరి 10వ తేది నుంచి జరిగే ఒకే ఒక్క యాషెస్ టెస్ట్ మ్యాచ్‌కు పెర్త్ వేదిక కానుంది. దీంతో పాటుగా మూడు వన్డేలు, ఒక ట్వంటీ 20 మ్యాచ్‌లు ఉంటాయని బోర్డు వర్గాలు తెలిపాయి. రెండు వన్డేలు మెల్‌బోర్న్‌లో, మరోక వన్డే హాంబర్ట్‌లో జరుగనుంది.