melbourne
-
ప్రాంక్ అని చెప్పి నిజమైన పెళ్లి..
రీల్స్, ఇన్‌స్ట్రాగామ్ ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియడం లేదు. ఆ్రస్టేలియాలోని ఓ మహిళకు ఇలాంటి సమస్యే ఎదురైంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి అతను ఏర్పాటు చేసిన ‘ఫేక్ వెడ్డింగ్’నిజమని తేలడంతో ఆమె కోర్టుకెక్కాల్సి వచ్చింది. చివరకు జడ్జి ఆ పెళ్లిని రద్దు చేశారు. వివరాల్లోకి వెళ్తే... మెల్బోర్న్లో ఉంటున్న ఓ మహిళకు 2023 సెప్టెంబర్‌లో ఆన్లైన్ డేటింగ్ వేదికపై ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. అదే ఏడాది డిసెంబర్లో ఆమెకు అతను ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించింది. రెండు రోజుల తర్వాత సిడ్నీలో ఓ వైట్పార్టీ ఉందని, అక్కడికి అందరూ తెలుపు రంగు దుస్తుల్లో వస్తారని చెప్పారు. ఆమె కూడా అలాగే రెడీ అయి వెళ్లింది. తీరా అక్కడికెళ్లి చూస్తే.. ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ స్నేహితుడు తప్ప మరెవరూ లేరు. ఇదేంటని ప్రశ్నిస్తే... తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్స్ పెరగడం కోసం ప్రాంక్ వెడ్డింగ్ నిర్వహిస్తున్నానని, అందుకు సహకరించాలని ఆమెను కోరాడు. అప్పటికే అతనికి 17,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతని వివరణ ఆమెకు సబబుగానే తోచింది. సాయం చేసినట్లవుతుందని ఫేక్ పెళ్లికి అంగీకరించింది. సివిల్ మ్యారేజ్ కోర్టులో జరిగితేనే పెళ్లి చెల్లుబాటవుతుందని నమ్మింది. అదే విషయాన్ని తన స్నేహితురాలితో పంచుకుంది. అదే నిజమైతే వారు ముందుగా వివాహం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్నేహితురాలు కూడా చెప్పడంతో.. ఇది ఉత్తుత్తి పెళ్లే అని నమ్మింది. కట్ చేస్తే.. రెండు నెలల తరువాత, ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం ఆమె చేసిన దరఖాస్తులో తనను డిపెండెంట్‌గా చేర్చాలని అతను కోరాడు. పెళ్లి కానిది ఎలా కుదురుతుందని ఆమె ప్రశ్నించగా.. సిడ్నీలో జరిగిన వివాహ వేడుక నిజమైనదని బాంబు పేల్చాడు. వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా చూపించాడు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి.. వివాహానికి నెలముందే అతను నోటీసులు ఇచ్చాడని అర్థమైంది. అతను మొదటినుంచి అబద్ధం చెప్పాడని, తనను మోసం చేశాడని ఆమె కోర్టుకెక్కింది. పెళ్లి వేడుకలో తాను నటించానే తప్ప.. అది నిజం కాదని కోర్టుకు తెలిపింది. మహిళ వాంగ్మూలాన్ని నమ్మిన మెల్బోర్న్ జడ్జి 2024 అక్టోబర్‌లో వీరి వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పదకొండేళ్ల తర్వాత తొలి హాఫ్ సెంచరీ.. అదీ 40 బంతుల్లో!
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్(Big Bash League- బీబీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఈ టీ20 లీగ్‌లో సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్.. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఎట్టకేలకు అర్ధ శతకం సాధించాడు. దాదాపు పదకొండేళ్ల అనంతరం బీబీఎల్‌లో తొలిసారి యాభై పరుగుల మార్కును అందుకున్నాడు.కెప్టెన్‌గా వార్నర్అయితే, విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన పొట్టి ఫార్మాట్లో(T20 Cricket) సుదీర్ఘ విరామం తర్వాత హాఫ్ సెంచరీ బాదిన వార్నర్ భాయ్.. అందుకోసం ఏకంగా 40 బంతులు తీసుకోవడం గమనార్హం. కాగా డిసెంబరు 15 బీబీఎల్ 2024-25 సీజన్ ఆరంభమైంది. ఈ క్రమంల డిసెంబరు 17న వార్నర్ కెప్టెన్సీలో తమ తొలి మ్యాచ్ ఆడిన సిడ్నీ థండర్ రెండు వికెట్ల తేడాతో అడిలైడ్ స్ట్రైకర్స్‌ను ఓడించింది.ఆరంభ మ్యాచ్‌లలో విఫలంనాటి మ్యాచ్‌లో వార్నర్ కేవలం ఏడు పరుగులే చేశాడు. అనంతరం.. సిడ్నీ సిక్సర్స్‌తో తలపడ్డ సిడ్నీ థండర్(Sydney Thunder) ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ వార్నర్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం పదిహేడు పరుగులే చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాత మెల్బోర్న్తో స్టార్స్‌తో మ్యాచ్‌లో వార్నర్ 19 పరుగులే చేసినా.. సామ్ బిల్లింగ్స్(72 నాటౌట్) కారణంగా.. సిడ్నీ థండర్ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో సోమవారం నాటి మ్యాచ్‌లో మెల్బోర్న్ గ్రెనేడ్స్తో మ్యాచ్‌లో మాత్రం వార్నర్ బ్యాట్ ఝులిపించాడు.ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడుసిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మెల్బోర్న్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్ ఆదిలోనే కామెరాన్ బాన్‌క్రాఫ్ట్(8) వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్ బ్యాటర్ షెర్ఫానే రూథర్‌ఫర్డ్(11), ఒలివర్ డేవిస్(10), సామ్ బిల్లింగ్స్(10) కూడా విఫలమయ్యారు.ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ గాడిన పెట్టే బాధ్యత తీసుకున్న ఓపెనర్ వార్నర్ నెమ్మదిగా ఆడాడు. వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ.. 40 బంతుల్లో యాభై పరుగులు మార్కుకు చేరుకున్నాడు. ఆ తర్వాత మరో పదిహేడు బంతుల్లోనే 36 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.మొత్తంగా 57 బంతులు ఎదుర్కొని పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో వార్నర్ 86 పరుగులు సాధించాడు. అతడి తోడుగా మాథ్యూ గిల్క్స్(23 నాటౌట్) కూడా రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సిడ్నీ థండర్ నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.2013లో చివరగాకాగా డేవిడ్ వార్నర్ బీబీఎల్‌లో చివరగా 2013లో అర్థ శతకం నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్ ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్లో ఆడుతున్నాడు. అయితే, ఐపీఎల్లో గతంలో మంచి రికార్డులే ఉన్నా మెగా వేలం 2025లో మాత్రం వార్నర్‌పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఒకవేళ బీబీఎల్‌లో గనుక పరుగుల వరద పారిస్తే.. అతడు ఐపీఎల్లో తిరిగి పునరాగమనం చేసే అవకాశం ఉంటుంది. కాగా తమ ఆటగాళ్లు ఎవరైనా గాయపడిన సందర్భంలో ఫ్రాంఛైజీలు .. వారి స్థానంలో అన్‌సోల్డ్‌గా ఉన్న క్రికెటర్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓపెనర్‌గా ఘనమైన రికార్డు ఉన్న వార్నర్ సేవలను పంజాబ్ కింగ్స్ లేదంటే లక్నో సూపర్ జెయింట్స్ వాడుకునే అవకాశం ఉంది.చదవండి: థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పే..; బీసీసీఐ ఉపాధ్యక్షుడి స్పందన ఇదేDavid Warner's first BBL half-century since 2013! 👏Things you love to see! #BBL14 pic.twitter.com/Uzjq8jamp3— KFC Big Bash League (@BBL) December 30, 2024 -
మెల్బోర్న్ టెస్టులో 184పరుగుల తేడాతో టీమిండియా ఓటమి (ఫొటోలు)
-
‘కుర్రాళ్ల దృక్పథం మార్చరాదు’
మెల్బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో పైచేయి సాధించాలని కృతనిశ్చయంతో ఉన్న భారత్ అందుకు అన్ని విధాలా సన్నద్ధమైంది. నాలుగో టెస్టు మ్యాచ్‌కు ముందు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆటగాళ్లంతా సుదీర్ఘ సాధనలో పాల్గొన్నారు. ఆ్రస్టేలియాతో సిరీస్ ప్రస్తుతం 1–1తో సమంగా ఉన్న దశలో ఈ మైదానంలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు మంచి అవకాశం ఉంది. 2020–21 పర్యటనలో మెల్బోర్న్లో విజయంతోనే టీమిండియా సిరీస్ గెలుపు దిశగా అడుగు వేసింది. గురువారం ‘బాక్సింగ్ డే’ టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత కెపె్టన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. తమ సన్నాహాలపై రోహిత్ ఇచ్చిన సమాధానాలు అతని మాటల్లోనే... యశస్వి ప్రదర్శనపై... నాకు తెలిసి జైస్వాల్, గిల్, పంత్ దాదాపు ఒకే తరహా ఆటగాళ్లు. కుర్రాళ్లుగా వారి మానసిక దృక్పథం, ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి. తాము ఏం చేయగలమనేది వారికి బాగా తెలుసు. కాబట్టి వాటిని మార్చే ప్రయత్నంతో పరిస్థితులను సంక్లిష్టం చేయదల్చుకోలేదు. జైస్వాల్ ఇక్కడ మొదటిసారి ఆడుతున్నాడు. అతని ప్రతిభ ఎలాంటిదో ఇప్పటికే చూశాం. అతని బ్యాటింగ్ గురించి ఎక్కువగా చర్చించి భారం మోపవద్దు. స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలి. ఆసీస్ బౌలర్లపై కూడా అతనికి మంచి అవగాహన ఉంది. అటాక్‌తో పాటు అవసరమైతే జైస్వాల్ డిఫెండ్ కూడా చేయగలడు. ఒక్కసారి కుదురుకుంటే ప్రమాదకారిగా మారతాడు. గిల్, పంత్ వైఫల్యంపై... శుబ్‌మన్ గిల్ గురించి కూడా నేను ఇదే చెబుతాను. ఆరంభంలో 30–40 పరుగులు రాబడితే చాలు ఆపై భారీ స్కోరు సాధించడం ఎలాగో గిల్‌కు తెలుసు. ఇలాంటివి అతను గతంలో చేసి చూపించాడు. పంత్‌పై కూడా ఎలాంటి ఒత్తిడీ లేదు. తన బాధ్యతలు పంత్‌కు బాగా తెలుసు. మ్యాచ్ పరిస్థితిని బట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పడం తప్ప ఇతర విషయాల గురించి వీరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. బుమ్రా బౌలింగ్‌పై... జస్ప్రీత్ బుమ్రాతో మంచి బౌలింగ్ చేయించుకోవాలంటే ఒక్కటే ఉపాయం. అతనికి అసలు ఏమీ చెప్పకుండా ఉంటే చాలు. ఏం చేయాలో, ఎలా చేయాలనే విషయంలో తన బౌలింగ్‌పై అతనికి చాలా స్పష్టత ఉంది. అతిగా ఆలోచించకుండా తన బౌలింగ్‌నే అతను నమ్ముకుంటాడు. వికెట్లు దక్కినా... దక్కకపోయినా తన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి మ్యాచ్ మధ్యలో కూడా కొత్తగా బుమ్రాకు నేను ఎలాంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని అర్థమైంది. తన గాయం, బ్యాటింగ్ స్థానంపై... నా మోకాలుకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అంతా బాగుంది. జట్టులో నేను ఏ స్థానంలో ఆడతాననే విషయంపై చర్చ అనవసరం. ఏం చేసినా జట్టు మేలు కోరే ప్రణాళికలు ఉంటాయి. గత టెస్టు తర్వాత రెండు బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్లు జరిగాయి. ఈ రెండు రోజుల్లో నా ఆట ఎంతగా మారిందో చూడాలి. జోరుగా ప్రాక్టీస్... భారత ఆటగాళ్లు మంగళవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా కోహ్లి ఈ సిరీస్‌లో తనను ఇబ్బంది పెడుతున్న ‘ఫోర్త్ స్టంప్’ సమస్యను అధిగమించేందుకు ప్రయతి్నంచాడు. ఆఫ్‌స్టంప్ బయట బంతులు వేయమని చెబుతూ హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణలకు సూచిస్తూ కోహ్లి బ్యాటింగ్ కొనసాగించాడు. సిరీస్‌లో ఇదే తరహా బంతులకు అతను వరుసగా అవుటయ్యాడు. త్రో డౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్రతో భిన్నమైన బంతులు వేయించుకొని రోహిత్ సాధన చేశాడు. బుమ్రా సహా ఇతర ప్రధాన బౌలర్లందరినీ ఎదుర్కొంటూ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో మెల్బోర్న్ టెస్టులో ఇద్దరు స్పిన్నర్లతో జట్టు ఆడవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. కోహ్లి ఫామ్‌పై...విరాట్ కోహ్లి ఆధునిక క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు అని అంతా చెబుతుంటారు. అలాంటి ఆటగాళ్లకు ఎవరో చెప్పాల్సిన పని లేదు. వారు తమకంటూ సొంత దారిని సృష్టించుకుంటారు. లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్లడం ఎలాగే వారికి బాగా తెలుసు. -
వాడిగా 'వేడిగా' సాగనున్న బాక్సింగ్ డే టెస్ట్!
భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మెల్బోర్న్ లో జరుగనున్న నాలుగో టెస్ట్ ఆరంభానికి ముందే వేడిని పుట్టిస్తోంది. సిరీస్ పరంగా చూస్తే, భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లు చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి సమఉజ్జీలుగా ఉన్న సంగతి తెలిసిందే. పెర్త్ లో జరిగిన మొదటి టెస్ట్ లో 295 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించగా, అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా పది వికెట్లతో గెలుపొందింది. దీంతో, సిరీస్ ని 1-1తో సమమైంది. గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన నేపథ్యంలో మెల్బోర్న్ లో, అదీ క్రిస్టమస్ పర్వ దినం తర్వాత బాక్సింగ్ డే నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన ఈ టెస్ట్ లో గెలిచేందుకు రెండు జట్లు పకడ్బందీ వ్యూహాలతో సిద్ధమవుతనడంలో సందేహంలేదు. వాతావరణ శాఖ హెచ్చరిక ఆస్ట్రేలియా వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు ఈ మ్యాచ్ కి ముందే వేడెక్కిస్తున్నాయి.మెల్బోర్న్లో ఓవర్ హీట్..ఈ మ్యాచ్ జరిగే తరుణంలో మెల్బోర్న్ లో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖంగా ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలు చేపడుతున్నారు.ఆటగాళ్లకు అవసరమైతే డ్రింక్స్ విరామాన్ని పెంచాలని నిర్ణయించారు. త్వరలో మెల్బోర్న్ లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అయితే ఉష్ణోగ్రత 38డిగ్రీల సెల్సియస్ దాటితే మ్యాచ్‌లను నిలిపివేస్తారు.అయితే క్రికెట్ లో ఇలాంటి నిబంధనలు లేవు. గతంలో 2018 లో జరిగిన యాషెస్ టెస్ట్ సిరీస్ సందర్భంగా సిడ్నీ లో జరిగిన టెస్ట్ సమయం లో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినప్పటికీ మ్యాచ్ ని కొనసాగించారు.చెన్నైలో డీన్ జోన్స్ డబుల్, ఆసుపత్రిపాలు ప్రఖ్యాత ఆస్ట్రేలియా బ్యాటర్ డీన్ జోన్స్ 1986 లో చెన్నై లోని చేపక్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా 41 డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రతలో ఎనిమిది గంటలపాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడి డబుల్ సెంచరీ సాధించి చివరికి ఆసుపత్రి పాలయ్యాడు.తన సుదీర్ఘ క్రీడా జీవితంలో 52 టెస్ట్‌లు, 164 వన్డే మ్యాచ్ లు ఆడి, రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్ గా కూడా ప్రఖ్యాతి వహించిన జోన్స్ 59 ఏళ్ళ ప్రాయంలో ఐపీఎల్ సందర్భంగా ముంబైలోని ఓ హోటల్ లో ఆకస్మిక గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అదే విధంగా 2017 -18 యాషెస్ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రత 40డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఇన్నింగ్స్ మధ్యలో రిటైర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిడ్నీ లో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ అనంతరం రూట్ ఆసుపత్రి పాలయ్యాడు, ఆస్ట్రేలియా ఈ సిరీస్ లో 4-౦ తో విజయం సాధించింది. -
ఫ్యాన్స్‌కు భారీ షాక్ నితీశ్రీ రెడ్డి ఔట్?
-
నిజానికి ఇదో పువ్వు.. కుళ్లిన మాంసం వాసన దీని స్పెషాలిటీ!
చూట్టానికి బాగా ఎదిగిన మొలకలా కనిపిస్తోంది కదా. కానీ నిజానికి ఇదో పువ్వు! భారీ పరిమాణంతో పాటు ముక్కుపుటాలను అదరగొట్టే కుళ్లిన మాంసం తరహా కంపు వాసన దీని స్పెషాలిటీ. అందుకే దీన్ని కార్ప్స్ ఫ్లవర్ అని పిలుస్తారు. పదేళ్లకోసారి మాత్రమే పూయడం దీని మరో ప్రత్యేకత. పూసిన ఒకట్రెండు రోజుల్లో వాడిపోతుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని బొటానికల్ గార్డెన్లో ఇలా కనువిందు చేసింది. దీన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుంటూనే ఆసక్తిగా పదేపదే వాసన చూసి మరీ వెళ్తున్నారు! అంతరిస్తున్న జాబితాలో ఉన్న ఈ పువ్వు శాస్త్రీయ నామం అమర్ఫోఫలస్ టైటానియం. టైటన్ ఆరమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని అడిలైడ్ నుంచి 2021లో మెల్బోర్న్కు తరలించారు. అప్పటినుంచీ ఎప్పుడు వికసిస్తుందా అని ఎదురు చూస్తున్నట్టు సిబ్బంది చెప్పుకొచ్చారు. క్షిపణి ప్రయోగం విజయవంతం మంగళవారం ఒడిశా తీరంలోని చాందీపూర్ ప్రయోగశాల నుంచి విజయవంతంగా దూసుకెళ్తున్న లాంగ్ రేంజ్ లాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం). సైంటిస్టులతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు దీన్ని వీక్షించారు. ప్రయోగ సందర్భంగా క్షిపణిలోని అన్ని వ్యవస్థలూ అద్భుత పనితీరు కనబరిచినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. క్షిపణి పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు వెల్లడించింది. పనితీరును మెరుగుపరిచే అత్యాధునిక వైమానిక, సాఫ్ట్వేర్ వ్యవస్థలు దీని సొంతం. డీఆర్డీఓతో కలిసి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (బెంగళూరు) ఈ క్షిపణిని తయారు చేసింది. బీఈఎల్ తదితర సంస్థలు కూడా ఇందులో భాగం పంచుకున్నాయి. వాహనాల నుంచి కూడా ప్రయోగించగలగడం ఈ క్షిపణి ప్రత్యేకత. ప్రయోగాన్ని విజయవంతం చేసిన సైంటిస్టులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు.చదవండి: విలువ తెలియక డోర్‌స్టాప్‌గా వాడేశారు.. ఆ పాలరాతి శిల్పం ఖరీదు 27 కోట్లు! -
Pesto the penguin: బొద్దు సూపర్‌స్టార్
ఆ్రస్టేలియాలోని మెల్బోర్న్ సీ లైఫ్ ఎక్వేరియంలో డజన్ల కొద్దీ నలుపు, తెలుపు పెంగి్వన్ల మధ్య చాలా పెద్దగా, బొద్దుగా ఉన్న ఏకైక పెంగి్వన్ ఇప్పుడు హాట్‌ఫేవరెట్‌గా మారింది. దాని పేరు పెస్టో. జనవరి 31వ తేదీన పుట్టినపుడు కేవలం 200 గ్రాములున్న ఈ పిల్ల పెంగి్వన్ ఈ 7 నెలల్లో విపరీతంగా పెరిగి ఇప్పుడు ఏకంగా 22 కేజీలు తూగుతూ అటూ ఇటూ తల ఎగరేస్తోంది. తల్లిదండ్రులు టాంగో, హడ్సన్ల మొత్తం బరువుకు దీని బరువు ఇది సమానం. చాక్లెట్ రంగు వెంట్రుకలు, పనస పండులాంటి నిలువెత్తు శరీరంతో ఎక్వేరియం అంతా కలియ తిరుగుతూ ఎంతో బొద్దుగా, ముద్దుగా ఉన్న దీనిని నేరుగా చూసేందుకు ఎక్వేరియం ఎన్‌క్లోజర్‌కు జనం తండోపతండాలుగా వస్తున్నారు. సోషల్ మీడియా రికార్డులను బద్దలుకొడుతూ ఆన్లైన్లో దీని ఫొటోలు, వీడియోలు చూసిన వారి సంఖ్య ఏకంగా 190 కోట్లు దాటిందని ఒక అనధికార అంచనా. సాధారణ జనం దగ్గర్నుంచి కేటీ పెర్రీ వంటి హాలీవుడ్ సెలబ్రిటీల దాకా అందరూ దీని ఫ్యాన్సే. ఇప్పటికే బ్రిటన్, అమెరికా సహా చాలా దేశాల్లో దీనిపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ఇది రోజూ 30 చేపలను గుటకాయ స్వాహా చేస్తోంది. అయితే ఇంతటి బరువుతో దీనికి ఎలాంటి సమస్యలు లేకపోవడం విశేషం. ‘‘మరికొద్ది వారాల్లో ఇది యుక్త వయసులోకి వచ్చి 15 కేజీలకుపైగా బరువు సహజంగా కోల్పోనుంది. అప్పుడు మరింత అందంగా తయారవుతుంది’అని ఎక్వేరియంలో దీని బాగోగులు చూసే జసింటా ఎర్లీ చెప్పారు. – మెల్బోర్న్ -
మెల్బోర్న్లో మైండ్ బ్లోయింగ్ క్రేజ్.. వరల్డ్ కప్ తో రామ్ చరణ్ (ఫొటోలు) (ఫొటోలు)
-
మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్లో రామ్ చరణ్.. భారత జెండా ఎగరేసి (ఫొటోలు)
-
గ్లోబల్ స్టార్‌కు అరుదైన గౌరవం.. ఆ వేడుకల్లో పాల్గొననున్న హీరో!
గోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని 15వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఈవెంట్‌కు రామ్ చరణ్‌కు ఆహ్వానం లభించింది. ఈ వేడుకలో గౌరవ అతిథిగా ఆయన పాల్గొననున్నారు. భారతీయ సినిమాకు చేసిన కృషికి గానూ ఈ వేడుకలో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్‌గా అవార్డ్ అందుకోనున్నారు. విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది ఆగస్టు 15-25 వరకు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఐఐఎఫ్ఎం తన ట్విటర్ ద్వారా వెల్లడించింది.ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్కు కూడా రామ్ చరణ్ గౌరవ అతిథిగా రానున్నారు. మీరు ఉత్సాహంగా ఉన్నారా? ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2024కి వస్తున్నారు. నాటు నాటుకు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో పాటు రామ్ చరణ్ ఫోటో ఉన్న పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్లో భారతీయ సినిమాకి ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ భారతీయ కళ, సంస్కృతికి అంబాసిడర్ అవార్డ్‌ను రామ్ చరణ్‌కు అందజేయనున్నారు. అంతర్జాతీయ వేదికపై జరుపుకునే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో భాగమైనందుకు నేను చాలా గౌరవంగా ఉందంటూ రామ్ చరణ్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది.కాగా.. చివరిసారిగా ఆర్ఆర్ఆర్లో కనిపించిన రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది చివర్లో గేమ్ ఛేంజర్ థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చెర్రీ నటించనున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్.. చెర్రీ సరసన కనిపించనుంది. Are you excited or ARE YOU EXCITED? Because Global Star Ram Charan is coming to the Indian Film Festival Of Melbourne 2024. Are we ready to dance to Naatu Naatu? pic.twitter.com/kFy7Z5zSdA— Indian Film Festival of Melbourne (@IFFMelb) July 19, 2024 -
మెల్బోర్న్లో వైఎస్సార్ జయంతి.. వర్చువల్‌గా హాజరైన కాకాణి, మోదుగుల
మెల్బోర్న్: ప్రజల సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తే.. తండ్రిని మించి పాలనను వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన వైఎస్సార్ 75వ జయంతి వేడుకలకు వర్చువల్‌గా హాజరయ్యారాయన. ‘‘వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. అయితే వైఎస్ జగన్ తండ్రిని మించిన పాలన అందించారు. వ్యవసాయం, విద్యా, వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రజలకు సంక్షేమం అందించడంలో.. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడలేదు’’ అని కాకాణి అన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటాం. వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచిన కుటుంబాలకు కృతజ్ఞతలు. ప్రజాసేవకులుగా ఎవరికి, ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా.. అండగా నిలుస్తాం. ఎప్పటి లాగే ప్రజల్లో ఉంటాం. పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో.. జూమ్ కాల్ ద్వారా పార్టీ నేత మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక.. వైఎస్సార్ జయంతి సందర్భంగా మెల్బోర్న్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ సభ్యులు కృష్ణా రెడ్డి, భరత్, బ్రాహ్మ రెడ్డి, రామంజి, మరియు నాగార్జున పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
నాలుగేళ్ల తరువాత ఇంటికి బయలుదేరిన యువతి: విమానంలోనే కన్నుమూత
విదేశాలకు వెళ్లిన నాలుగేళ్ల తరువాత ఇంటికి వచ్చేందుకు ఉత్సాహంగా బయలుదేరిన యువతి, విమానాశ్రయంలోనే కన్నమూసిన ఘటన విషాదాన్ని నింపింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న మన్‌ప్రీత్ కౌర్ (24) మెల్బోర్న్ నుండి న్యూ ఢిల్లీకి బయలుదేరింది. క్వాంటాస్ విమానాన్ని ఎక్కేందుకు తుల్లామరైన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా అస్వస్థతకు గురైంది. అలాగే విమానం ఎక్కి కూచుంది. సీట్ బెల్ట్ పెట్టు కుంటూ ఉండగానే కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విమాన సిబ్బంది, అత్యవసర సేవలు వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించి నప్పటికీ ఫలితం లేకపోయిందని క్వాంటాస్ ప్రతినిధి తెలిపారు. ఆమె క్షయ వ్యాధితో మరణించి ఉండవచ్చునని భావస్తున్నారు. జూన్ 20న ఈ ఘటన జరిగింది.దీంతో మృతురాలి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆమె స్నేహితుడు, కౌర్ గ్రామానికి చెందిన గుర్దీప్ గ్రేవాల్ ప్రయత్నిస్తున్నాడు. ఆమె అకాల మరణం తమను ఎంతగానో బాధించిందనీ, తను లేని లోటు తీరనిదంటూ గ్రేవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తను చెఫ్ కావాలని కోరుకుందని గుర్తు చేసుకున్నారు. -
Australia : యాత్ర 2 కార్ ర్యాలీ.. YSRCP సిద్ధం
‘‘యాత్ర 2” సినిమా విజయవంతమైన సందర్భంగా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి నేతృత్వంలో “టీమ్ మెల్బోర్న్ - వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా’’ ఆధ్వర్యంలో కార్ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని కీలక ఘటనలను, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి, YSRCP అధ్యక్షడు వైఎస్ జగన్ రాజకీయ ప్రారంభ దశలోని ముఖ్యమైన అంశాలను ఆధారంగా సినిమాని తెరకెక్కించడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. ఈ ర్యాలీని మెల్బోర్న్ టీమ్ సభ్యులు కృష్ణారెడ్డి, భరత్, రామాంజి, నాగార్జున, మణిదీప్, సతీష్‌లు చక్కగా సమన్వయం చేశారు. సిద్ధం పోస్టర్‌ను ఆవిష్కరించడంతో పాటు, వైఎస్సార్సీపీ పోరాటానికి తిరుగులేని మద్దతునిస్తూ “జై జగన్”, “జోహార్ వైఎస్ఆర్”, “ఎన్నికల సమరానికి మేము సిద్ధం” నినాదాలతో.. వేదిక వద్ద వాతావరణం మారుమోగింది. ఉత్సాహభరితమైన ర్యాలీ తరువాత, వైఎస్సార్సీపీ మద్దతుదారులు "యాత్ర 2" చిత్రం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. 2024లో జరగబోయే ఏపీ 175 అసెంబ్లీ ఎన్నికలకు, అలాగే లోక్‌సభ 25 స్థానాల ఎన్నికలకు YSRCP సిద్ధంగా ఉందని, సీఎం జగన్ నినాదం వైనాట్ 175ని నిజం చేసేందుకు ప్రతీ ఒక్క ప్రవాసాంధ్రుడు కృషి చేస్తారని తెలిపారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన ప్రయోజనలు, విద్యా, వైద్య, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రతీ ఒక్క ఎన్నారై స్టార్ క్యాంపెయినర్‌గా మారి ప్రచారం చేస్తారని తెలిపారు. -
వైఎస్సార్సీపీకి మద్దతుగా మెల్బోర్న్లో భారీ కార్ ర్యాలీ
-
ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం జగన్ బర్త్‌డే వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియా కన్వీనర్ చింతల చెరువు సూర్య నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు.వైఎస్ఆర్పీ నాయకులు వెంకట్ మేడపటి,కరణం ధర్మశ్రీ ఈ సందర్భంగా జూమ్ కాల్లో మాట్లాడి బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను మరోసారి గుర్తు చేసుకుంటూ.. జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన పాలన అందిస్తున్నారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌ను మళ్లీ గెలిపించి అబివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. -
పాక్‌తో రెండో టెస్టు.. ఆసీస్ జట్టు ప్రకటన! యువ ఆటగాడు రిలీజ్
పాకిస్తాన్‌తో బాక్సింగ్ డే టెస్టుకు 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పేసర్ లాన్స్ మోరిస్‌ను రెండో టెస్టుకు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. మోరిస్ బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గోనున్నాడు. ఇదొక్కటి మినహా తమ జట్టులో ఆసీస్ ఎటువంటి మార్పు చేయలేదు. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌లో ఇప్పటికే ఆసీస్ 1-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్‌ను ఏకంగా 360 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. 450 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. ఆసీస్ బౌలర్ల దాటికి 89 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ -
ప్లీజ్.. నా భర్త మృతదేహాన్ని భారత్‌కు పంపించండి
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో రోడ్డు ప్రమాదానికి గురై భారతదేశానికి చెందిన ఖుష్దీప్ అనే వ్యక్తి మృతి చెందాడు. తన భర్త మృతదేహాన్ని భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులకు దగ్గరికి చేర్చడానికి అతని భార్య జప్నీత్ కౌర్ హార్థిక ఇబ్బందులు పడుతున్నారు. తన భర్త మృతదేహాన్ని భారత్‌కు తీసుకువెళ్లడానికి సాయం అందించాలని కోరుతోంది. వివరాళ్లోకి వెళ్లితే.. 26 ఏళ్ల ఖుష్దీప్.. మెల్బోర్న్లో ట్రక్ డ్రైవర్. సోమవారం రాత్రి ఖుష్దీప్ ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే తన భార్త మృతదేహాన్ని స్వదేశంలో ఉన్న అతని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్తప్తి చేశారు. అదే విధంగా ఈ విషయం తెలుసుకున్న ఓ భారతీ విద్యార్థి GoFundMe ద్వారా నిధులను సేకరిస్తున్నాడు. ఆమె చదువు నిమిత్తం గత ఏడాది ఆస్ట్రేలియా వచ్చి భర్తతో కలిసి ఉంటున్నారు. -
మెల్బోర్న్లో దిగ్విజయంగా ముగిసిన కేసిఆర్ కప్
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో మెల్బోర్న్లో మూడు వారాల పాటు జరిగిన కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ ఆదివారం(సెప్టెంబర్17)తో దిగ్విజయంగా ముగిసింది. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెల్బోర్న్ లోని అల్కాక్ రిజర్వ్ లోని పెవిలియన్ లో ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఎన్నారైలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలో స్థిరపడిన 29 రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో మూడు వారాల పాటు ఈ టోర్నీ ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు మార్పు గల ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని ఈ టోర్నమెంట్‌ను నిర్వహించామని" ఆయన తెలిపారు. అదే విధంగా తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమం పై విక్టోరియా స్టేట్ కన్వీనర్ ఉప్పు సాయిరాం చేసిన పవర్ ప్రెజెంటేషన్ పలువురిని ఆకట్టుకుంది. మరోవైపు కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీని విజయవంతంగా ముగించిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందాన్ని పలువురు ప్రశంసించారు. ముగింపు వేడుకల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ముఖ్య నాయకులు సాయిరాం ఉప్పు, వినయ్ సన్నీ గౌడ్,సాయికృష్ణ కల్వకుంట్ల, ప్రవీణ్ లేదెళ్ల ,వంగపల్లి సురేందర్ రెడ్డి, విశ్వామిత్ర మంత్రి ప్రగడ , సూర్య రావు , అశోక్ ,రాకేష్ , అమిత్ , వినోద్ కత్తుల ,విజయ్ నడదూర్ , సతీష్ ,శివ హైదరాబాద్ , హరి పల్ల, కరుణాకర్ నందవరం ,వివిధ సంఘాల నాయకులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. చదవండి: IND vs AUS: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా.. షెడ్యూల్, ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే -
మెల్బోర్న్లో కేసీఆర్ క్రికెట్ కప్..
-
ఆస్ట్రేలియాలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీ
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్వర్యంలో జరుగుతున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నేడు మెల్బోర్న్లోని పవిలియన్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయులతో 3 వారాల పాటు ఈ టోర్నమెంట్ సాగనుందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు . సెప్టెంబర్ 16, 17 తేదీల్లో గ్రాండ్ ఫైనల్స్‌ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, భారత దేశానికి చెందిన అన్ని రాష్ట్రాల ఎన్నారైలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు ఇందులో పాల్గొంటారని నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని, అందుకు క్రికెట్ టోర్నీనే సరైన వేదిక అని నాగేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమంపై విక్టోరియా స్టేట్ కన్వీనర్ సాయిరాం ఉప్పు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందరిని ఆకట్టుకుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సాయి రామ్ ఉప్పు, విశ్వామిత్ర మంత్రి ప్రగడ, వినయ్ సన్నీ గౌడ్, బాలరాజు కుమ్మరి, వంగపల్లి సురేందర్ రెడ్డి, హర్ష రెడ్డి, గండ్ర ప్రశాంత్ రావు, విజయ్ నడదూర్, శివ హైదరాబాద్, హరి పల్ల, కరుణాకర్ నందవరం మరియు వివిధ సంఘాల నాయకులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. -
ఇద్దరు మిత్రులు
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా తందానీ భావుకురాలు. ప్రకృతి ప్రేమికురాలు. పద్దెనిమిది సంవత్సరాల రషా మంచి ఫొటోగ్రాఫర్ కూడా. తల్లితో పాటు ప్రపంచంలోని ఎన్నోప్రాంంతాలను చూసి వచ్చింది రషా. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసింది. ‘హూ ఎల్స్ టు ట్రావెల్ ద వరల్డ్ విత్?’ కాప్షన్‌తో తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ‘తల్లీకూతుళ్లు క్లోజ్ఫ్రెండ్స్లా కనిపిస్తున్నారు’ అన్నారు ఒక నెటిజన్. -
తిరుగులేని జొకోవిచ్.. సిట్సిపాస్కిది రెండోసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
గత ఏడాది కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు జొకోవిచ్ మెల్బోర్న్కు వచ్చాడు. కానీ కోవిడ్ టీకా వేసుకోనందుకు... అప్పటి ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్ విషయంలో కఠినంగా వ్యవహరించింది. ఒక్కడి కోసం నిబంధనలు మార్చలేమని స్పష్టం చేసింది. విమానాశ్రయంలోనే అతడిని నిర్భంధించింది. జొకోవిచ్ వీసాను రద్దు చేసింది. మూడేళ్లపాటు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించింది. న్యాయపోరాటం చేసినా ఈ సెర్బియా స్టార్‌కు అనుకూల నిర్ణయం రాలేదు. దాంతో అవమానకర రీతిలో జొకోవిచ్ విమానాశ్రయం నుంచే స్వదేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఏడాది గడిచిపోయింది. కోవిడ్ తీవ్రత తగ్గింది. ఆస్ట్రేలియాలో ప్రభుత్వం కూడా మారిపోయింది. జొకోవిచ్ వీసాను పునరుద్ధరించడం జరిగింది. వెరసి తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ పదోసారి విజయగర్జన చేశాడు. మెల్బోర్న్: ఫ్రెంచ్ ఓపెన్ అంటే రాఫెల్ నాదల్... వింబుల్డన్ అంటే రోజర్ ఫెడరర్ గుర్తుకొస్తారు. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే ఎవరు గుర్తుకు రావాలి అన్న ప్రశ్నకు సమాధానం తానేనని సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నిరూపించాడు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తనకు తిరుగులేదని ఈ సెర్బియా యోధుడు మరోసారి చాటుకున్నాడు. ప్రైజ్‌మనీ ఎంతంటే ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–3, 7–6 (7/4), 7–6 (7/4)తో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 29,75,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 22 లక్షలు)... రన్నరప్ సిట్సిపాస్‌కు 16,25,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 40 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. సిట్సిపాస్కిది రెండోసారి సిట్సిపాస్‌తో 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌కు ఏదశలోనూ ఆందోళన చెందేరీతిలో ప్రతిఘటన ఎదురుకాలేదు. కీలకదశలో ఈ సెర్బియా స్టార్ పైచేయి సాధించి సిట్సిపాస్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్లోని నాలుగో గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి అదే జోరులో తొలి సెట్‌ను 36 నిమిషాల్లో దక్కించుకున్నాడు. రెండో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఫలితంగా సర్వీస్ ఒక్కసారీ బ్రేక్ కాలేదు. స్కోరు 6–6తో సమం కావడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించి 70 నిమిషాల్లో రెండో సెట్‌ను గెల్చుకున్నాడు. మూడో సెట్ తొలి గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సిట్సిపాస్ ఆ వెంటనే తన సర్వీస్‌ను కూడా కోల్పోయాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. మళ్లీ టైబ్రేక్ అనివార్యమైంది. ఈసారీ టైబ్రేక్‌లో జొకోవిచ్ ఆధిపత్యం కనబరిచి 70 నిమిషాల్లో మూడో సెట్‌నూ సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిపోవడం సిట్సిపాస్కిది రెండోసారి. 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోనూ జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. ఫైనల్ గణాంకాలు జొకోవిచ్ వర్సెస్ సిట్సిపాస్ 7 ఏస్‌లు 15 3 డబుల్ ఫాల్ట్‌లు 3 36 విన్నర్స్ 40 22 అనవసర తప్పిదాలు 42 2 బ్రేక్ పాయింట్లు 1 10 నెట్ పాయింట్లు 12 112 మొత్తం పాయింట్లు 94 చదవండి: Shafali Verma: బీసీసీఐ కానుక రూ. 5 కోట్లు! వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా! ఒక చెవితో మాత్రమే వినగలడు.. అయితేనేం.. వాషింగ్టన్ సుందర్ గురించిన ఆసక్తికర విషయాలు 🤯🤯🤯@Infosys • #FindYourNext • #AusOpen • #AO2023 Tsitsipas v Djokovic • Infosys AI Shot of the Day@wwos • @espn • @Eurosport • @wowowtennis pic.twitter.com/HlwybwoeWT — #AusOpen (@AustralianOpen) January 29, 2023 Unstoppable 🏆#luzhoulaojiao • @guojiao_1573 • #AusOpen • #AO2023 @wwos • @espn • @Eurosport • @wowowtennis pic.twitter.com/tjwd8QVSJ0 — #AusOpen (@AustralianOpen) January 29, 2023 -
Sania Mirza: ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. విజయంతో మొదలు
మెల్బోర్న్: హైదరాబాద్ వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో ముందంజ వేసింది. కెరీర్లో ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న ఆమె అనా డానిలినా (కజకిస్తాన్) కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సానియా–డానిలినా జోడీ 6–2, 7–5తో డాల్మా గాల్ఫీ (హంగేరి)–బెర్నార్డా పెర (అమెరికా) జంటపై విజయం సాధించింది. తొలి సెట్‌ను 25 నిమిషాల్లోనే వశం చేసుకున్న భారత్–కజకిస్తాన్ ద్వయానికి రెండో సెట్లో అనూహ్య పోటీ ఎదురైంది. 4–1తో గెలిచే దశలో కనిపించిన సానియా జోడీకి గాల్ఫీ–బెర్నార్డా వరుసగా 4 గేమ్‌లు గెలిచి సవాలు విసిరారు 5–5తో సమం చేశారు. అయితే తర్వాత వారి సర్వీస్‌ను బ్రేక్ చేయడం ద్వారా సానియా–డానిలినా జంట గెలుపొందింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 2009 (మిక్స్డ్), 2016 (డబుల్స్)లలో సానియా విజేతగా నిలిచింది. చదవండి: Kaviya Maran: నన్ను పెళ్లి చేసుకుంటావా?.. సౌతాఫ్రికాలో కావ్య మారన్‌కు ప్రపోజల్.. వీడియో వైరల్ Hockey WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర! బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. పాక్ బ్యాటర్ ఊచకోత