మెల్‌బోర్న్ : ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆచితూచి ఆడుతుంది. 36/1 క్రితంరోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్ గిల్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న క్రమంలో కమిన్స్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ గిల్ కీపర్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 61 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కాసేపటికే 17 పరుగులు చేసిన చతేశ్వర్ పుజారా కూడా కమిన్స్ బౌలింగ్‌లో పైన్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాల్సి వచ్చింది. (చదవండి : సిరాజ్... ఇప్పుడే వద్దులే!)
కమిన్స్ వేసిన గుడ్‌లెంగ్త్ బంతి పుజారా బ్యాట్‌ను ఎడ్జ్‌లో తాకుతూ కీపర్ వైపు వెళ్లింది. ఫైన్ అద్భుతంగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమిండియా 64 పరుగుల వద్ద ప్రధాన వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విహారితో కలిసి రహానే మరోవికెట్ పడకుండా ఆడుతూ 3 వికెట్ల నష్టానికి 90 పరుగుల వద్ద లంచ్ విరామానికి వెళ్లారు. లంచ్ అనంతరం 21 పరుగులు చేసిన హనుమ విహారి లయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 116 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 57 ఓవర్లలో 166 పరుగులు చేసింది. రహానే 43, పంత్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : అతనికి అరుదైన గౌరవం.. ఇది రహానేకే సాధ్యం)
A pearler of a pluck from Paine! And it's the big wicket of Pujara too!@hcltech | #AUSvIND pic.twitter.com/q4rFhCb7Yj
— cricket.com.au (@cricketcomau) December 27, 2020
Comments
Please login to add a commentAdd a comment