chateswar pujara
-
BGT: ఈసారి టీమిండియా గెలవడం కష్టమే.. అతడు లేడు కాబట్టి..
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే ఇరుజట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకం. ముఖ్యంగా రోహిత్ సేన ఇందులో భాగమైన ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు గెలిస్తేనే టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.మరోవైపు.. ఇటీవల స్వదేశంలో భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా సొంతగడ్డపై ఇలాంటి పరాభవం పొందిన తొలి జట్టుగా రోహిత్ సేన అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో టీమిండియా నెగ్గడం అంత సులువు కాదని.. ఈ దఫా కంగారూ జట్టు పైచేయి సాధించే అవకాశం ఉందని అంచనా వేశాడు. ప్రస్తుతం ఛతేశ్వర్ పుజారా లాంటి ఆటగాడి అవసరం జట్టుకు ఎంతగానో ఉందని.. అతడి లాంటి ఆటగాడు ఉంటేనే టీమిండియా మరోసారి ఆసీస్‌లో సిరీస్ నెగ్గగలదని పేర్కొన్నాడు.ఈసారి టీమిండియా గెలవడం కష్టమేఈ మేరకు వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా గెలవడం కష్టమే. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం అత్యంత కష్టమైన పని. గత రెండు సందర్భాల్లో ఇండియా అద్భుతంగా ఆడి సిరీస్‌లు గెలిచింది.అయితే, అప్పటి కంటే ఇప్పుడు ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి పుజారా జట్టుతో లేడు. అప్పటి పర్యటనలో అతడే ప్రధాన ఆటగాడు అని చెప్పవచ్చు. కొత్త బంతితో తొలుత ఫాస్ట్ బౌలర్లను ట్రై చేసి.. ఆ తర్వాత పిచ్ పరిస్థితికి అనుగుణంగా క్రీజులో పాతుకుపోయి.. పరుగులు రాబట్టడం అతడి స్టయిల్.అలా అయితే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుందిప్రస్తుతం టీమిండియాకు పుజారా లాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే ఈసారి భారత్ గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుంది’’ అని స్పోర్ట్స్‌తక్‌తో పేర్కొన్నాడు.కాగా చివరగా 2018-19 పర్యటనలో పుజారా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 74.42 సగటుతో 521 పరుగులు సాధించాడు. నాటి సిరీస్‌లో టీమిండియా 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా పుజారాకు జట్టులో చోటు కరువైంది. ఇక కివీస్‌తో సిరీస్‌లో ఈ నయా వాల్ లేని లోటు స్పష్టంగా కనిపించగా.. ఆసీస్ టూర్లో ఆ వెలితి మరింత ఎక్కువగా ఉంటుందని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.చదవండి: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. భారీ రికార్డులపై కన్నేసిన సూర్యకుమార్ -
65వ సెంచరీ నమోదు చేసిన పుజారా
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా టెస్ట్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా చెలరేగిపోతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ ప్రస్తుత సీజన్లో ససెక్స్ తరఫున రెండో సెంచరీ సాధించిన పుజారా.. ఓవరాల్‌గా 65వ ఫస్ట్ క్లాస్ సెంచరీ నమోదు చేశాడు. ససెక్స్ తరఫున కౌంటీల్లో పుజారాకు ఇది 10వ శతకం. కౌంటీ ఛాంపియన్షిన్ డివిజన్-2లో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా మిడిల్సెక్స్తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా ఈ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పుజారా తనదైన శైలిలో అడ్డుగోడ పాత్ర పోషించి 302 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 129 పరుగులు చేసి ఔటయ్యాడు.పుజారాతో పాటు కెప్టెన్ జాన్ సింప్సన్ (167) శతక్కొట్టడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 554 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ హెయిన్స్ (40), డానీ లాంబ్ (49) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిడిల్సెక్స్ బౌలర్లలో బాంబర్ 3, బ్రూక్స్, హోల్మన్ తలో 2, ర్యాన్ హిగ్గిన్స్, నాథన్ ఫెర్నాండెజ్ చెరో వికెట్ పడగొట్టారు. PUJARA SMASHED HIS 65th FIRST-CLASS HUNDRED 🤯 💥- An all time legend, Puj. pic.twitter.com/dXSbmUDvJb— Johns. (@CricCrazyJohns) May 25, 2024అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మిడిల్సెక్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 62 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సామ్ రాబ్సన్ (40), మ్యాక్స్ హోల్డన్ (18) క్రీజ్‌లో ఉండగా.. మార్క్ స్టోన్‌మన్ (4) ఔటయ్యాడు. ప్రస్తుతం మిడిల్సెక్స్ ససెక్స్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 492 పరుగులు వెనకపడి ఉంది. -
పరుగుల ప్రవాహం కొనసాగిస్తున్న పుజారా.. మరో శతకం
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో సౌరాష్ట్ర ఆటగాడు, భారత వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటికే ఓ డబుల్ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు (8 ఇన్నింగ్స్‌ల్లో 76.86 సగటున 522 పరుగులు) చేసిన పుజారా తాజాగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో పుజారా 199 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును చేరుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పుజారాకు ఇది 62వ శతకం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (33/2) బరిలోకి దిగిన పుజారా.. షెల్డన్ జాక్సన్‌తో (70 నాటౌట్) కలిసి నాలుగో వికెట్‌కు భారీ భాగస్వామ్యం (150కి పైగా) నమోదు చేశాడు. తొలి రోజు ఆటలో 80 ఓవర్ల తర్వాత సౌరాష్ట్ర స్కోర్ 224/3గా ఉంది. పుజారా, షెల్డన్ జాక్సన్ క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో అనికేత్ చౌదరీ, మానవ్ సుతార్, అజయ్ కుక్నా తలో వికెట్ పడగొట్టారు. కాగా, పుజారా రంజీల్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ టీమిండియా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్ట్‌లకు భారత జట్టును ఇవాళ (ఫిబ్రవరి 9) ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో పుజారా మరో శతక్కొట్టి సెలక్టర్లను ఆకర్శించాడు. ఇప్పటికే కోహ్లి సేవలు దూరం కావడంతో సెలెక్టర్లు పుజారాను తప్పక ఎంపిక చేయవచ్చు. మరోవైపు మరో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయపడ్డాడని తెలుస్తుంది. ఒకవేళ కోహ్లి మిగతా సిరీస్‌కు అందుబాటులోకి వచ్చినా శ్రేయస్ స్థానంలో అయినా పుజారా జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు.. సునీల్ గవాస్కర్- 81 సచిన్ టెండూల్కర్- 81 రాహుల్ ద్రవిడ్- 68 చతేశ్వర్ పుజారా- 62 -
అరుదైన మైలురాయిని చేరుకున్న పుజారా
నయా వాల్‌గా పేరుగాంచిన టీమిండియా ప్లేయర్ చతేశ్వర్ పుజారా అరుదైన ఘనతను సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ టెస్ట్‌లు, దేశవాలీ టోర్నీలు కలిసి మొత్తం 260 మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 61 శతకాలు, 77 అర్ధశతకాల సాయంతో 51.96 సగటున 20013 పరుగలు చేశాడు. పుజారాకు ముందు సునీల్ గవాస్కర్ (25834), సచిన్ టెండూల్కర్ (25396), రాహుల్ ద్రవిడ్ (23794) మాత్రమే భారత్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 20000 పరుగుల మార్కును తాకారు. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జాక్ హాబ్స్ పేరిట ఉంది. హాబ్స్ 1905-34 మధ్యలో 61760 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా (సౌరాష్ట్ర) ఈ అరుదైన మైలురాయిని దాటాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేసిన పుజారా రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసి వ్యక్తిగత మైలురాయిని దాటడంతో పాటు తన జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. మూడో రోజు రెండో సెషన్ సమయానికి విదర్భ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ మ్యాచ్‌లో విదర్భ గెలవాలంటే ఇంకా 298 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ (4/56), హర్ష్ దూబే (2/15), సర్వటే (2/22), ఆధిత్య థాక్రే (1/51), యశ్ ఠాకూర్ (1/57) సౌరాష్ట్రను దెబ్బకొట్టారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (68) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విదర్భను చిరాగ్ జానీ (4/14), ఉనద్కత్ (2/46), ప్రేరక్ మన్కడ్ (2/5), ఆదిత్య జడేజా (1/12) చావుదెబ్బ కొట్టారు. వీరి ధాటికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలింది. ఆతర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. పుజారాతో పాటు కెవిన్ జివ్‌రజనీ (57), విశ్వరాజ్ జడేజా (79) రాణించడంతో 244 పరుగులు చేసి ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్, ఆదిత్య తారే చెరో 3 వికెట్లు, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2 వికెట్లు తీశారు. 373 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి విదర్భ మూడో రోజు రెండో సెషన్ సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 75 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. అథర్వ తైడే (42), హర్ష్ దూబే (0) క్రీజ్‌లో ఉన్నారు. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్ తలో 2 వికెట్లు, ఉనద్కత్ ఓ వికెట్ పడగొట్టారు. -
టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్.. వారి కెరీర్లు ముగిసినట్లేనా..?
3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం భారత క్రికెట్ జట్టు డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు నిన్ననే (నవంబర్ 30) మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సీనియర్లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. టెస్ట్ జట్టులో వారికి తిరిగి స్థానం కల్పించారు. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణలతో కూడిన భారత జట్టు ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ జట్టులో ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్ల పేర్లు కనిపించకపోవడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నయా వాల్ చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే పేర్లు దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో లేకపోవడంతో వీరి కెరీర్లకు ఎండ్ కార్డ్ పడినట్లేనని అంతా అనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వీరిద్దరు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోవడంతో సెలెక్టర్లు వీరిని పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. వీరిద్దరికి వయసు (35) కూడా సమస్యగా మారింది. వీరికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న యువ ఆటగాళ్లు మాంచి ఊపులో ఉండటం కూడా మైనస్ పాయింట్ అయ్యుండవచ్చు. ఇప్పటికిప్పటికీ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పుజారా, రహానేలకు ప్రత్యామ్నాయాలు అని చెప్పలేనప్పటికీ.. భవిష్యత్తు మాత్రం వీరిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుజారా, రహానేలను దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో వారి కెరీర్లు ఖతమైనట్లేనని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో శ్రేయస్, రాహుల్ విఫలమైతే తప్ప పుజారా, రహానేలు తిరిగి టెస్ట్ జట్టులోకి రాలేరన్నది కాదనలేని సత్యం. -
పుజారాపై సస్పెన్షన్ వేటు
భారత టెస్ట్ ఆటగాడు, నయా వాల్ చతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ 2023లో పుజారా సారథ్యం వహిస్తున్న ససెక్స్ జట్టుకు 12 పాయింట్లు పెనాల్టీ పడగా.. దీని ఫలితం జట్టు కెప్టెన్ అయిన పుజారాపై పడింది. పుజారాపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తున్నట్లు కౌంటీ ఛాంపియన్షిప్ అధికారులు వెల్లడించారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం ఓ సీజన్లో ఓ జట్టు నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొంటే, సదరు జట్టు కెప్టెన్‌పై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడుతుంది. ప్రస్తుత సీజన్లో ససెక్స్ నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొంది. టోర్నీ తొలి లెగ్‌లో రెండు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొన్న ససెక్స్.. సెప్టెంబర్ 13న లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో రెండు పెనాల్టీలను పొంది, మొత్తంగా 12 డీమెరిట్ పాయింట్లను పొందింది. పుజారాపై సస్పెన్షన్‌ను ససెక్స్ అధికారులు ఎలాంటి వాదనలు లేకుండా స్వీకరించారు. ఆటగాళ్ల ఆన్ ఫీల్డ్ ప్రవర్తన కారణంగా ససెక్స్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ ఆటగాళ్లు టామ్ హెయిన్స్, జాక్ కార్సన్, అరి కార్వెలాస్‌లు మైదానంలో నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించడంతో కెప్టెన్ పుజారా బాధ్యుడయ్యాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లలో టామ్ హెయిన్స్, జాక్ కార్సన్‌లపై ససెక్స్ అధికారులు తదుపరి మ్యాచ్‌కు వేటు వేశారు. విచారణ అనంతరం కార్వెలాస్‌పై కూడా చర్యలు ఉంటాయని వారు తెలిపారు. కాగా, పాయింట్ల కోత కారణంగా ప్రస్తుత కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ససెక్స్ ఖాతాలో 124 పాయింట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే, కౌంటీ డివిజన్ 2 పోటీల్లో భాగంగా ససెక్స్ సెప్టెంబర్ 19-22 వరకు డెర్బీషైర్‌తో తలపడాల్సి ఉంది. అనంతరం సెప్టెంబర్ 26న గ్లోసెస్టర్‌షైర్‌ను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లతో ప్రస్తుత సీజన్ ముగుస్తుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం డర్హమ్ లీడింగ్‌లో ఉంది. ఆ జట్టు 198 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీసిన జయదేవ్ ఉనద్కత్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా బౌలర్, భారత దేశవాలీ స్టార్ జయదేవ్ ఉనద్కత్ రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో తన రెండో మ్యాచ్‌లోనే 9 వికెట్లతో చెలరేగాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2-2023 సెకెండ్ లెగ్‌లో ససెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఉనద్కత్.. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్ ప్రదర్శన కారణంగా ససెక్స్ 15 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని మట్టికరిపించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 12.4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయి 32.4 ఓవర్లలో 94 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. హడ్సన్ ప్రెంటిస్ (65) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ కోల్స్ (44), టామ్ హెయిన్స్ (39), పుజారా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లీసెస్టర్‌షైర్ బౌలర్లలో శాలిస్బరీ 5 వికెట్టు పడగొట్టగా.. స్కాట్ కర్రీ, టామ్ స్క్రీవెన్ తలో 2 వికెట్లు, రైట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. "He's bowled him! He's bowled him! Unadkat takes the final wicket and Sussex have won!" 😁 The highlights from a thrilling final day against Leicestershire. 🙌 #GOSBTS pic.twitter.com/KSmW7qFySu — Sussex Cricket (@SussexCCC) September 14, 2023 అనంతరం బరిలోకి దిగిన లీసెస్టర్‌షైర్.. ఉనద్కత్ (3/23), కార్వెలాస్ (4/14), హడ్సన్ (2/30), హెయిన్స్ (1/33) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే కుప్పకూలింది. లీసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో రిషి పటేల్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ససెక్స్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టామ్ క్లార్క్ (69), జేమ్స్ కోల్స్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. లీసెస్టర్‌షైర్ బౌలర్లలో స్క్రీవెన్ 4, రెహాన్ అహ్మద్ 2, రైట్, స్కాట్ కర్రీ తలో వికెట్ దక్కించుకున్నారు. 499 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లీసెస్టర్‌షైర్.. ఉనద్కత్ (6/94), కార్వెలాస్ (2/58), జాక్ కార్సన్ (2/98) ధాటికి 483 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ససెక్స్ 15 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఉనద్కత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ జట్టుకు టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
కౌంటీల్లో ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా బౌలర్.. పుజారాతో పాటు..!
విండీస్‌తో తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్‌తో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెరటన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఇంగ్లండ్ కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ససెక్స్ కౌంటీ ఉనద్కత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ కౌంటీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఉనద్కత్.. సెప్టెంబర్‌లో పునఃప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో తమతో జతకట్టనున్నాడని వారు పేర్కొన్నారు. ఈ స్టింక్ట్లో ఉనద్కత్ ససెక్స్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా తర్వాత ససెక్స్‌కు ఆడే అరుదైన అవకాశం ఉనద్కత్ దక్కింది. భారత దేశవాలీ అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన ఉనద్కత్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 101 మ్యాచ్‌లు ఆడి 382 వికెట్లు పడగొట్టాడు. ఈ ట్రాక్ రికార్డు చూసే ససెక్స్ ఉనద్కత్‌ను తమ జట్టులో చేర్చుకుంది. ససెక్స్‌కు ఆడుతున్న ఇద్దరు భారతీయ క్రికెటర్లు సౌరాష్ట్రకు చెందిన వారే కావడం విశేషం. ఇదిలా ఉంటే, ససెక్స్‌కు ప్రస్తుత కౌంటీ సీజన్ చెత్త సీజన్‌గా సాగింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లను డ్రా చేసుకుని కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా ఏప్రిల్‌లో జరిగిన తమ సీజన్ తొలి మ్యాచ్‌లో. మరోవైపు ఇంగ్లండ్‌లో ప్రస్తుతం దేశవాలీ వన్డే కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ససెక్స్ గ్రూప్-బిలో ఆఖరి నుంచి రెండో స్థానంతో చెత్త ప్రదర్శన కొనసాగిస్తుంది. అయితే ఈ టోర్నీలో ససెక్స్ ఆటగాడు పుజారా మాత్రం చెలరేగిపోయాడు. పుజారా తానాడిన 5 మ్యాచ్‌ల్లో 2 శతకాలు బాదాడు. ఇదే టోర్నీలో భారత యువ ఓపెనర్ పృథ్వీ షా కూడా చెలరేగిపోయాడు. ఈ సీజన్‌తోనే కౌంటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన షా.. నార్తంప్టన్‌షైర్ తరఫున ఓ మెరుపు ద్విశతం, ఓ సుడిగాలి శతకం బాదాడు. అయితే షా అనూహ్యంగా గాయం బారిన పడి అర్థాంతరంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. -
సెంచరీతో కదం తొక్కిన పుజారా.. తేలిపోయిన పృథ్వీ షా
2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా టెస్ట్ బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్‌లో సెంచరీతో కదం తొక్కాడు. టోర్నీలో భాగంగా నార్తంప్టన్‌షైర్‌తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో (119 బంతుల్లో 106 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. టీమిండియాలో చోటు కోల్పోయాక కసితో రగిలిపోతున్న పుజారా.. తన తాజా ఇన్నింగ్స్‌తో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. ఈ మ్యాచ్‌లో పుజారా ఇన్నింగ్స్ సాగిన తీరు పై పేర్కొన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పుజారా సెంచరీతో చెలరేగినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ ఓటమిపాలవ్వడం కొసమెరుపు. Great to have you back, @cheteshwar1! 🙌 Century 💯 pic.twitter.com/k7SfSu59si — Sussex Cricket (@SussexCCC) August 6, 2023 వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. పుజారా శతకొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో పుజారా మినహా ఎవరూ రాణించలేదు. కెప్టెన్ టామ్ హెయిన్స్ (13), జేమ్స్ కోల్స్ (29), హడ్సన్ (14), ఒలివర్ కార్టర్ (21), జాక్ కార్సన్ (17), హెన్రీ క్రొకోంబ్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. నార్తంప్టన్‌షైర్ బౌలర్లలో జాక్ వైట్ 3, ప్రాక్టర్, కియోగ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తేలిపోయిన పృధ్వీ షా.. గ్లోసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌తో ఇంగ్లండ్ దేశవాలీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్ పృథ్వీ షా.. ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. గ్లోసెస్టర్తో మ్యాచ్‌లో 35 బంతుల్లో 34 పరుగులు చేసి విచిత్ర రీతిలో ఔటైన (హిట్ వికెట్) షా.. తాజాగా ససెక్స్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లోనూ తక్కువ స్కోర్‌కే (17 బంతుల్లో 26; 4 ఫోర్లు) పరిమితమయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో షాకు మంచి ఆరంభమే లభించినా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. షా భారీ స్కోర్ చేయకపోయినా, మిగతా వారు రాణించడంతో అతని జట్టు విజయం సాధించింది. ససెక్స్‌తో మ్యాచ్‌లో 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్‌షైర్.. మరో 8 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నార్తంప్టన్‌షైర్ ఆటగాళ్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. షాతో పాటు రికార్డో (37), సామ్ వైట్‌మ్యాన్ (30), రాబ్ కియోగ్ (22), లూక్ ప్రాక్టర్ (10), లెవిస్ మెక్మానస్ (36) రెండంకెల స్కోర్లు చేయగా.. టామ్ టేలర్ (42 నాటౌట్), జస్టిన్ బ్రాడ్ (22 నాటౌట్) నార్తంప్టన్షైర్ను విజయతీరాలకు చేర్చారు. ససెక్స్ బౌలర్లలో కర్రీ, కార్సన్ చెరో 2 వికెట్లు, క్రొకోంబ్, హడ్సన్, జేమ్స్ కోల్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
టీమిండియా నుంచి ఉద్వాసన.. కసితో శతక్కొట్టిన పుజారా
దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సెంచరీతో కదంతొక్కాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురయ్యానన్న కసితో ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన పుజారా.. తన అనుభవాన్నంత రంగరించి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన 60వ శతకాన్ని నమోదు చేశాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. 13 బౌండరీల సహకారంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పుజారాకు మరో ఎండ్ నుంచి సహకారం లేనప్పటికీ.. ఒంటిపోరాటం చేసి, తన జట్టుకు 300 పరుగులకు పైగా లీడ్‌ను అందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో నోటెడ్ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్ (6), పృథ్వీ షా (25) విఫలం కాగా.. టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, ఇటీవల వెస్టిండీస్ టూర్ కోసం ప్రకటించిన భారత టెస్ట్ జట్టులో పుజారాకు చోటు దక్కని విషయం తెలిసిందే. -
రాణించిన పుజారా.. సత్తా చాటిన సూర్యకుమార్, నిరాశపరిచిన పృథ్వీ షా
సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి, 241 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చతేశ్వర్ పుజారా (50), సర్ఫరాజ్ ఖాన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. పృథ్వీ షా (25) నిరాశపరిచాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో సౌరభ్ కుమార్ 2, యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
భారత క్రికెట్ అభిమానులకు చేదు వార్త. ఇవాల్టి నుంచి (జూన్ 28) ప్రారంభంకానున్న దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2023 మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు. స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల కోసం బీసీసీఐకి ప్రసార భాగస్వామి లేనందున ఈ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఉండటం లేదు. బీసీసీఐ లోకల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో భారత క్రికెట్ అభిమానులు దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించలేకపోతున్నారు. సూర్యకుమార్ యాదవ్ (వెస్ట్ జోన్), చతేశ్వర్ పుజారా (వెస్ట్ జోన్) లాంటి అంతర్జాతీయ స్టార్లు, రింకూ సింగ్ (సెంట్రల్ జోన్), తిలక్ వర్మ (సౌత్ జోన్), సాయి సుదర్శన్ (సౌత్) లాంటి ఐపీఎల్ స్టార్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ టీమిండియాకు ఎంపిక కాలేకపోతున్న సర్ఫరాజ్ ఖాన్ (వెస్ట్) దులీప్ ట్రోఫీ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలువనున్నాడు. కాగా, దులీప్ ట్రోఫీలో ఇవాళ సెంట్రల్ జోన్-ఈస్ట్ జోన్.. నార్త్ జోన్-నార్త్ ఈస్ట్ జోన్ మధ్య మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ KSCA క్రికెట్ గ్రౌండ్లో, ఆలుర్ (కర్ణాటక), రెండో మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్నాయి. ఈస్ట్ జోన్‌తో మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నార్త్ జోన్‌తో మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. -
ఇద్దరు అంతే వెలగబెట్టారు.. పుజారాపై లేని నమ్మకం కోహ్లిపై ఎందుకో..?
వెస్టిండీస్ పర్యటన కోసం ప్రకటించిన భారత టెస్ట్ జట్టులో నయా వాల్ పుజారా పేరు గల్లంతు కావడంపై అతని అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వారితో కొందరు టీమిండియా మాజీలు, విశ్లేషకులు గొంతు కలుపుతున్నారు. పుజారాపై లేని నమ్మకం కోహ్లిపై మాత్రం ఎందుకోనని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ఒకేలా చెత్త ప్రదర్శనలు చేసినప్పడు కోహ్లిపై సెలెక్టర్లకు ప్రత్యేక ప్రేమ ఎందుకోనని నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని గణాంకాల ఆధారంగా రుజువు చేస్తూ సెలెక్టర్ల తీరుపై ధ్వజమెత్తుతున్నారు. 2020 నుంచి పుజారా 28 టెస్ట్‌లు ఆడి 29.69 సగటున పరుగులు చేస్తే, కోహ్లి సైతం అదే యావరేజ్‌తో (25 మ్యాచ్‌ల్లో) పరుగులు చేశాడని, ఇద్దరూ ఒకేలా వెలగబెట్టినప్పుడు కోహ్లిపై మాత్రమే ప్రత్యేకమైన ఇంటరెస్ట్ చూపడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. పుజారాతో పాటు కోహ్లిని కూడా తప్పిస్తే అతనికీ తెలుసొచ్చేది, అలాగే మిడిలార్డర్లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినట్లూ ఉండేదని అంటున్నారు. పుజారా, కోహ్లిలను పక్కకు పెడితే 2020 నుంచి టెస్ట్‌ల్లో గిల్ (16 మ్యాచ్‌ల్లో 32.89 సగటు), రహానే (20 మ్యాచ్‌ల్లో 26.50)లు కూడా అడపాదడపా ప్రదర్శనలే చేశారని, వీరితో పోలిస్తే రోహిత్ శర్మ (18 మ్యాచ్‌ల్లో 43.2) ఒక్కడే కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడని గణాంకాలతో సహా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. అందరూ ఓపెనర్లే.. మిడిలార్డర్లో ఎవరు..? వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత టెస్ట్ జట్టుపై పలువురు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వన్ డౌన్ ఆటగాడు పుజారాను పక్కకు పెట్టారు సరే.. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని ఎక్కడ తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. టెస్ట్ జట్టుకు కొత్తగా ఎంపికైన యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లు ఓపెనర్ బ్యాటర్లేనని, అలాంటప్పుడు పుజారా స్థానాన్ని ఎలా భర్తీ చేయగలరని నిలదీస్తున్నారు. జట్టులో ఆల్రెడీ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్లు ఓపెనర్లుగా ఉన్నప్పుడు కొత్తగా మిడిలార్డర్ బ్యాటర్‌ను తీసుకుని ఉంటే జట్టు సమతూకంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్‌ను ఎందుకు తీసుకోలేదు..? ఓ మిడిలార్డర్ బ్యాటర్‌పై (పుజారా) వేటు వేసినప్పుడు అతని స్థానాన్ని మరో మిడిలార్డర్ ఆటగాడితోనే భర్తీ చేయాలన్న లాజిక్‌ను సెలెక్టర్లు ఎలా మిస్ అయ్యారని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. జట్టులో అందరూ ఓపెనర్లనే ఎంపిక చేయకపోతే, దేశవాలీ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆటగాడిని తీసుకొని ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. -
WTC Final 2023: కోహ్లి కాదు.. ఓవల్‌లో రోహిత్ శర్మనే కింగ్..!
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జూన్ 7-11 మధ్యలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. జట్ల బలాబలాలు, విజయావకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయన్న విషయాలు పక్కన పెడితే.. ఓవల్ మైదానంలో ఇరు జట్ల ట్రాక్ రికార్డు ఏమంత బాగోలేదు. ఈ వేదికపై ఆసీస్ ఆడిన 38 మ్యాచ్‌ల్లో ఏడింటిలో విజయం సాధించగా.. భారత జట్టు ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే మాత్రమే గెలుపొందింది. కోహ్లి, పుజారా, రహానేల చెత్త రికార్డు.. ఓవల్‌లో హిట్‌మ్యానే కింగ్ ఓవల్‌లో భారత ఆటగాళ్లు కోహ్లి, రహానే, పుజారాలకు చెత్త రికార్డు ఉంది. ఇక్కడ విరాట్ కోహ్లి ఆడిన 3 మ్యాచ్‌ల్లో 28.16 సగటున కేవలం 169 పరుగులు మాత్రమే చేశాడు. పుజారా ఓవల్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 19.50 సగటున 117 పరుగులు చేశాడు. రహానే ఇక్కడ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 9.16 సగటున 55 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాకు అత్యంత కీలకమైన ముగ్గురు ఆటగాళ్లకు ఓవల్‌లో మెరుగైన రికార్డు లేకపోవడం ఫ్యాన్స్‌ను కలవరపెడుతుంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు ఇక్కడ మెరుగైన రికార్డు ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. రోహిత్ శర్మ ఓవల్ మైదానంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడి 127 పరుగులు చేశాడు. 2021 పర్యటనలో హిట్‌మ్యాన్ సెంచరీ చేశాడు. జడేజా ఇక్కడ 2 మ్యాచ్‌ల్లో 42 సగటున 126 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా జట్టును కూడా పరిగణలోకి తీసుకుంటే, ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న ఇరు జట్ల సభ్యుల్లో ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు ఓవల్‌లో మెరుగైన రికార్డు ఉంది. స్టీవ్ స్మిత్ ఇక్కడ రెండు శతకాలు బాదాడు. -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు పుజారా వార్నింగ్.. 3 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు ముందు భారత టెస్ట్ జట్టు సభ్యుడు, నయా వాల్ చతేశ్వర్ పుజారా.. ఆస్ట్రేలియా జట్టుకు వార్నింగ్ మెసేజ్ పంపాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో ససెక్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్న పుజారా.. మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు బాది ఆసీస్ బౌలర్లు తనతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. గ్లోసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగులు ఎదుర్కొని 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. అంతకుముందు డర్హమ్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లోనూ (115) పుజారా సెంచరీతో కదంతొక్కాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2, 2023లో ప్రస్తుతం పుజారా లీడింగ్ రన్ స్కోరర్‌గా (5 ఇన్నింగ్స్‌ల్లో 332) కొనసాగుతున్నాడు. తాజా శతకంతో పుజారా ఓ మైలురాయిని అధిగమించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి (58 సెంచరీలు) ఎగబాకాడు. ఈ క్రమంలో అతను వసీం జాఫర్ (57)ను ఓవర్టేక్ చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ చెరి 81 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. ఆతర్వాత రాహుల్ ద్రవిడ్ 68 సెంచరీలతో రెండో ప్లేస్‌లో.. విజయ్ హజారే మూడో స్థానంలో నిలిచారు. కాగా, లండన్‌లోని ఓవల్ వేదికగా ఈ ఏడాది జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో పుజారా కీలక సభ్యుడు. ఆస్ట్రేలియాపై ఘనమైన రికార్డు (24 మ్యాచ్‌ల్లో 50.82 సగటున 203 పరుగులు) కలిగిన పుజారా.. ఇదివరకే తాను చాలాసార్లు సత్తా చాటిన ఓవల్ మైదానంలో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ససెక్స్ తొలి ఇన్నింగ్స్- 455/5 డిక్లేర్ గ్లోసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్-198/9 (మూడో రోజు ఆట ముగిసే సమయానికి) -
కెప్టెన్‌గా చతేశ్వర్ పుజారా
టీమిండియా టెస్ట్ క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా కెప్టెన్ అయ్యాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్-2023 డివిజన్-2లో అతను ససెక్స్ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్‌కు సారథ్యం వహించడం చాలా ఆనందంగా ఉంది.. లెట్స్ గో అంటూ ట్వీట్‌కు క్యాప్షన్ జోడించాడు. Thrilled to lead @sussexccc in the County Championship! Let's go 💪🏻 pic.twitter.com/iW4Ihstk1p — Cheteshwar Pujara (@cheteshwar1) April 5, 2023 ససెక్స్ రెగ్యులర్ కెప్టెన్ టామ్ హెయిన్స్ గత సీజన్ సందర్భంగా గాయపడటంతో ఆ జట్టు మేనేజ్మెంట్ నాటి నుంచి పుజారాను తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగిస్తుంది. కౌంటీ ఛాంపియన్-2023 డివిజన్-2 సీజన్లో భాగంగా ససెక్స్ ప్రస్థానం ఇవాల్టి (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభమవుతోంది. ససెక్స్.. ఇవాళ డర్హమ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా, ఇంగ్లండ్ ఫస్ట్‌క్లాస్ టోర్నీల్లో పుజారాకు ఇది వరుసగా రెండో సీజన్. 2022లో అతను ససెక్స్ తరఫున 13 ఇన్నింగ్స్‌ల్లో 109.40 సగటున 1094 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. పుజారా గతేడాది రాయల్ లండన్ వన్డే కప్‌లో కూడా ఆడాడు. అందులోనూ నయా వాల్ సత్తా చాటాడు. పుజారా చివరిసారిగా టీమిండియా తరఫున బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడాడు. ఈ సిరీస్‌లో అతను 6 ఇన్నింగ్స్‌ల్లో 28 సగటున కేవలం 140 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇదే సిరీస్‌లోనే పుజారా తన 100 టెస్ట్ మ్యాచ్ ఆడాడు. -
IND VS AUS 4th Test Day 4: సువర్ణావకాశాలను చేజార్చుకున్న భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఆట చివరి రోజైన రేపు (మార్యి 13) భారత బౌలర్లు ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసి, ఆ తర్వాత నిర్ధేశించబడిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించగలిగితే సిరీస్‌తో (3-1) పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు కూడా భారత్ వశమవుతుంది. నాలుగో రోజు చివర్లో టీమిండియా ఫీల్డర్లు చేసిన తప్పిదాల కారణంగా, ఆసీస్‌పై ఇవాల్టి నుంచే పట్టుబిగించే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు తాత్కాలిక ఓపెనర్ మాథ్యూ కుహ్నేమన్ (0) ఇచ్చిన క్యాచ్‌లను తొలుత కేఎస్ భరత్, ఆతర్వాత పుజారా జారవిడిచారు. ఒకవేళ ఈ రెండు అవకాశాల్లో భారత్‌కు ఒక్క వికెట్ లభించినా ఆసీస్‌ను పూర్తిగా ఒత్తిడిలోని నెట్టే అవకాశం ఉండేది. అందులోనే ఆ జట్టు రెగ్యులర్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఈ సమీకరణలన్నీ భారత్‌కు కలిసొచ్చి ఉండేవి. భరత్, పుజారాలు ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించి ఉండినా పరిస్థితి వేరేలా ఉండేది. భారత్‌కు గెలుపుపై ధీమా పెరిగేది. ఇప్పటికైన మించిపోయిందేమీ లేదు. ఆఖరి రోజు తొలి బంతిని నుంచి ప్రత్యర్ధిపై ఒత్తిడి తేగలిగితే, టీమిండియా గెలుపుకు ఢోకా ఉండదు. ఆసీస్‌ను 150 పరుగుల లోపు ఆలౌట్ చేసి, ఆతర్వాత 60, 70 పరుగుల టార్గెట్‌ను ఛేదించడం టీమిండియాకు అంత కష్టం కాకపోవచ్చు. అయితే ఇదంతా సాధ్యపడాలంటే భారత స్పిన్నర్లు రేపు తొలి బంతి నుంచే చెలరేగాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇది అంత ఈజీ కూడా కాకపోవచ్చు. కాగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్ హెడ్ (3), మాథ్యూ కుహ్నేమన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కోహ్లి (186)తో పాటు శుభ్‌మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కుహ్నేమన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
వందో టెస్ట్‌కు ముందు మనసులో మాట బయటపెట్టిన పుజారా
BGT 2023: కెరీర్లో వందో టెస్ట్ ఆడే ముందు టీమిండియా టెస్ట్ క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా తన మనసులో మాటను బయటపెట్టాడు. తన జీవితంలో చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్‌కు ముందు పుజారా చాలా విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నాడు. 13 ఏళ్ల తన కెరీర్లో అనుభవాలను వివరిస్తూ వచ్చిన నయా వాల్.. తన అత్యుత్తమమైన ప్రదర్శనలు, ధీటైన ప్రత్యర్ధి, కఠినమైన బౌలర్, తన చిరకాల కోరిక.. ఇలా చాలా విషయాలను పంచుకున్నాడు. టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడమే తన కల అని మనసులో మాటను బయటపెట్టిన పుజారా.. ధీటైన ముగ్గురు ప్రత్యర్ధుల్లో మొదటిది ఆసీస్, రెండో జట్టు ఇంగ్లండ్, మూడో టీమ్ న్యూజిలాండ్ అని చెప్పుకొచ్చాడు. తన కెరీర్లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో జిమ్మీ ఆండర్సన్ పేరును తొలుత ప్రస్తావించిన పుజారా.. డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్, పాట్ కమిన్స్‌ల పేర్ల చెప్పాడు. తన అత్యుత్తమ ప్రదర్శన గురించి పుజారా మాట్లాడుతూ.. అరంగేట్రంలో ఆసీస్‌పై చేసిన 72 పరుగులకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు. ఆతర్వాత చెన్నైలో ఆసీస్‌పై చేసిన 92 పరుగుల ఇన్నింగ్స్‌కు, ఆతర్వాత జొహన్నెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాపై చేసిన 123 పరుగుల ఇన్నింగ్స్‌కు, అలాగే గత ఆసీస్ పర్యటనలో గబ్బా టెస్ట్‌లో ఆడిన ఇన్నింగ్స్‌లు అత్యుత్తమమైనవిగా చెప్పుకొచ్చాడు. కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ పుజారా కెరీర్లో వందో టెస్ట్ కానున్న విషయం తెలిసిందే. భారత్ తరఫున ఇప్పటివరకు 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఘనత కేవలం 12 మంది క్రికెటర్లకు మాత్రమే దక్కింది. ఆసీస్‌తో రెండో టెస్ట్‌లో పక్కాగా తుది జట్టులో ఉండే పుజారా ఈ అరుదైన క్లబ్లో చేరే 13వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న భారత ఆటగాళ్లలో కేవలం విరాట్ కోహ్లి మాత్రమే 100 టెస్ట్‌ల అరుదైన మైలురాయిని అధిగమించాడు. కోహ్లి తన కెరీర్లో ఇప్పటివరకు 105 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన పుజారా 44.16 సగటున 3 ద్విశతకాలు, 19 శతకాలు, 34 అర్ధశతకాల సాయంతో 7021 పరుగులు చేశాడు. టెస్ట్‌లతో పాటు 5 వన్డేలు ఆడిన పుజారా 10.2 సగటున 51 పరుగులు మాత్రమే చేశాడు. -
అరుదైన క్లబ్లో చేరేందుకు అడుగు దూరంలో ఉన్న పుజారా.. కోహ్లి తర్వాత..!
టీమిండియా టెస్ట్ క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా అరుదైన క్లబ్లో చేరేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ పుజారా కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. భారత్ తరఫున ఇప్పటివరకు 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఘనత కేవలం 12 మంది క్రికెటర్లకు మాత్రమే దక్కింది. ఆసీస్‌తో రెండో టెస్ట్‌లో పక్కాగా తుది జట్టులో ఉండే పుజారా ఈ అరుదైన క్లబ్లో చేరే 13వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న భారత ఆటగాళ్లలో కేవలం విరాట్ కోహ్లి మాత్రమే 100 టెస్ట్‌ల అరుదైన మైలురాయిని అధిగమించాడు. కోహ్లి తన కెరీర్లో ఇప్పటివరకు 105 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన పుజారా 44.16 సగటున 3 ద్విశతకాలు, 19 శతకాలు, 34 అర్ధశతకాల సాయంతో 7021 పరుగులు చేశాడు. టెస్ట్‌లతో పాటు 5 వన్డేలు ఆడిన పుజారా 10.2 సగటున 51 పరుగులు మాత్రమే చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అంత ఆశాజనకంగా సాగని పుజారా కెరీర్.. ఐపీఎల్ లాంటి పావులర్ లీగ్‌ల్లోనూ అంతంతమాత్రంగానే సాగింది. క్యాష్ రిచ్ లీగ్‌లో పుజారా ఇప్పటివరకు కేవలం 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్లో 99.74 స్ట్రయిక్ రేట్ కలిగిన పుజారా.. హాఫ్ సెంచరీ సాయంతో 390 పరుగులు చేశాడు. ఇటీవలకాలంలో టెస్ట్ క్రికెటర్ అన్న ముద్ర తొలగించుకనే ప్రయత్నం చేస్తున్న నయా వాల్.. తాజాగా జరిగిన ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కౌంటీ సీజన్లో అదరగొట్టాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ సీజన్లో గేర్ మార్చిన పుజారా.. తన సహజసిద్ధమైన ఆటకు భిన్నంగా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2010లో ఆస్ట్రేలియాపైనే టెస్ట్ అరంగేట్రం చేసిన పుజారా అదే ఆస్ట్రేలియాపై తన వందో టెస్ట్ కూడా ఆడటం యాదృచ్చికంగా జరుగనుంది. ఆసీస్‌పై ఘనమైన రికార్డు కలిగిన పుజారా తన వందో టెస్ట్‌లో శతకం బాదాలని ఆశిద్దాం. పుజారా ఆసీస్‌పై 21 మ్యాచ్‌ల్లో 52.77 సగటున 5 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1900 పరుగులు చేశాడు. -
విజృంభించిన ఉనద్కత్, జడేజా.. 79 పరుగులకే కుప్పకూలిన హైదరాబాద్
Ranji Trophy 2022-23 SAU VS HYD: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా సౌరాష్ట్ర-హైదరాబాద్ జట్ల మధ్య ఇవాళ (జనవరి 10) మొదలైన మ్యాచ్‌లో సౌరాష్ట్ర బౌలర్లు రెచ్చిపోయారు. జయదేవ్ ఉనద్కత్ (3/28), డి జడేజా (3/8), యువ్‌రాజ్‌సింగ్ దోడియా (2/23), చేతన్ సకారియా (1/8) చిరాగ్ జానీ (1/7) విజృంభించడంతో హైదరాబాద్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో రోహిత్ రాయుడు (23), భగత్ వర్మ (11), అనికేత్ రెడ్డి (10 నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (2), అలంక్రిత్ అగర్వాల్ (7), తొలకంటి గౌడ్ (4), చందన్ సహాని (2) భవేశ్ సేథ్ (3), టి రవితేజ (8), మెహరోత్ర శశాంక్ (5), మహ్మద్ అబ్రార్ నిరాశపరిచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర.. 24 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 106 పరుగులు చేసింది. ఓపెనర్లు చిరాగ్ జానీ (55), హార్విక్ దేశాయ్ (49) క్రీజ్‌లో ఉన్నారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో ఇంకా చతేశ్వర్ పుజారా, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వసవద, ప్రేరక్ మన్కడ్, ధరేంద్రసిన్హ్ జడేజా, చేతన్ సకారియా, సమర్థ్ వ్యాస్, జయదేవ్ ఉనద్కత్, యువ్రాజ్సిన్హ్ దోడియా బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఇన్నింగ్స్ 214 పరుగుల తేడాతొ ఘన విజయం సాధించింది. ఉనద్కత్ (8/39, 70) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. మరోవైపు హైదరాబాద్ గత మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ చేతిలో 154 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. -
బంగ్లాతో రెండో టెస్ట్.. భారీ రికార్డులపై కన్నేసిన పుజారా, అక్షర్
IND VS BAN 2nd Test: మీర్పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ నెగ్గి ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్.. రెండో టెస్ట్‌లోనూ గెలుపొంది ఆతిధ్య జట్టును ఊడ్చేయాలని భావిస్తుంది. బంగ్లాను క్లీన్‌స్వీప్ చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగవ్వనున్న నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోనుంది. గాయాల కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ నవ్‌దీప్ సైనీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండరని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. మరోవైపు బంగ్లాదేశ్‌ను సైతం గాయాల బెడద వేధిస్తుంది. వారి కెప్టెన్ షకీబ్ అల్ హసన్, కీలక బౌలర్ ఎబాదత్ హొస్సేన్ రెండో టెస్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లా తుది జట్లు కూర్పు ఎలా ఉన్నా.. రాహుల్ సేన మాత్రం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే, బంగ్లాతో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా కీలక ఆటగాళ్లను భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. తొలి టెస్ట్‌లో అదరగొట్టిన చతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ భారీ మైల్స్టోన్స్పై కన్నేశారు. రెండో టెస్ట్‌లో నయా వాల్ పుజారా మరో 16 పరుగులు చేస్తే.. టెస్టు క్రికెట్లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏడో భారత బ్యాటర్‌గా, అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన ఆరో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. పుజారా ఇప్పటి వరకు 97 టెస్ట్‌ల్లో 44.43 సగటున 6984 పరుగులు చేశాడు. ఇదే మ్యాచ్‌లో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రెండో టెస్ట్‌లో అక్షర్ మరో 6 వికెట్లు తీస్తే.. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉంది. అశ్విన్.. 9 టెస్ట్‌ల్లో ఈ ఘనత సాధించగా.. అక్షర్‌కు 8వ టెస్ట్‌లోనే అశ్విన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. ప్రస్తుతం అక్షర్ ఖాతాలో 44 వికెట్లు (7 టెస్ట్‌ల్లో 13 సగటున) ఉన్నాయి. పుజారా, అక్షర్‌లతో పాటు ఇదే మ్యాచ్‌లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా ఓ అరుదైన రికార్డు నెలకొల్పే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఒక్క వికెట్ పడగొట్టినా.. బుమ్రా పేరిట ఉన్న ఓ రికార్డును అధిగమిస్తాడు. ఈ ఏడాది బుమ్రా అన్ని ఫార్మాట్లలో కలిపి 39 వికెట్లు పడగొట్టి.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా కొనసాగుతుండగా.. అన్నే వికెట్లు పడగొట్టిన సిరాజ్ బంగ్లాతో రెండో టెస్ట్‌లో మరో వికెట్ పడగొడితే బుమ్రా రికార్డును బద్దలు కొడతాడు. -
బంగ్లాతో తొలి టెస్ట్.. పంత్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ, అతడి స్థానంలో..!
IND VS BAN 1st Test: డిసెంబర్ 14 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా యువ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ భారీ షాకిచ్చింది. తొలుత ప్రకటించిన భారత టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న పంత్‌ను తప్పించిన బీసీసీఐ.. అతడి స్థానంలో చతేశ్వర్ పుజారాకు ఆ బాధ్యతలు అప్పజెప్పింది. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న పంత్‌కు ఇది భారీ షాక్ అనే చెప్పాలి. టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో పంత్‌కు టెస్ట్ జట్టులో కూడా స్థానం లేదన్న సంకేతాలు అందుతున్నాయి. తొలి టెస్ట్‌లో పంత్ స్థానంలో వికెట్‌కీపర్‌గా శ్రీకర్ భరత్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదనపు బౌలర్‌ను తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తే శ్రీకర్ భరత్‌ను కూడా తుది జట్టులో ఆడించే అవకాశం ఉండదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు కూడా మోసే అవకాశం ఉంది. కాగా, న్యూజిలాండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన పంత్‌ను టీమిండియా యాజమాన్యం గాయాం సాకుగా చూపి అఖరి నిమిషంలో వన్డే జట్టు (బంగ్లాతో సిరీస్) నుంచి తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా పంత్‌ను టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పించడంతో అతని భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. పంత్ స్థానంలో జట్టులోకి వచ్చే ఆటగాడు ఇషాన్ కిషన్‌లా రెచ్చిపోతే, టెస్ట్‌ల్లో కూడా పంత్ స్థానం గల్లంతైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, గాయం కారణంగా రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. రోహిత్‌తో పాటు షమీ, జడేజాలు కూడా గాయాల బారిన పడటంతో బంగ్లా టూర్‌కు తొలుత ఎంపిక చేసిన జట్టులో భారీ మార్పులు జరిగాయి. షమీ, జడేజాల స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులో చేరగా.. రోహిత్ శర్మ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ కొత్తగా వచ్చాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు.. శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ -
Royal London One-Day Cup: పుజారా ప్రతాపం
లండన్: చాన్నాళ్లుగా ఇంటా బయటా టెస్టుల్లో విఫలమై జట్టులో చోటు కోల్పోయిన భారత సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్‌లో అది కూడా వన్డేల్లో చెలరేగిపోతుండటం విశేషం! అక్కడి దేశవాళీ టోర్నీ అయిన ‘రాయల్ లండన్ వన్డే కప్’లో ససెక్స్ తరఫున వరుసగా రెండో సెంచరీ సాధించాడు. శుక్రవారం వార్విక్షైర్తో 79 బంతుల్లో 107తో మెరుపు శతకం సాధించిన పుజారా ఆదివారం సర్రేతో ఏకంగా విశ్వరూపమే చూపించాడు. దీంతో ససెక్స్ 216 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా ససెక్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు సాధించింది. ఓపెనర్లు హారిసన్ (5), అలీ అర్ (4) విఫలమవగా... కెప్టెన్ పుజారా (131 బంతుల్లో 174; 20 ఫోర్లు, 5 సిక్సర్లు), టామ్ క్లార్క్ (106 బంతుల్లో 104; 13 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 205 పరుగులు జోడించాడు. క్లార్క్ అవుటయ్యాక అస్లాప్ (22), రాలిన్స్ (15), ఇబ్రహీం (15 నాటౌట్)లతో కలిసి జట్టు స్కోరును 350 పరుగులు దాటించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన సర్రే 31.4 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ రియాన్ పటేల్ (65; 8 ఫోర్లు, 1 సిక్స్), టామ్ లవెస్ (57 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కార్వెలస్ నాలుగు, రాలిన్స్ మూడు వికెట్లు తీశారు. -
పుజారా రీ ఎంట్రీ.. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌కు టీమిండియా ప్రకటన
ముంబై: భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరిదైన ఐదో టెస్టు కోసం టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు. గత ఏడాది ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగిన అనంతరం కరోనా వైరస్ కారణంగా ఐదో టెస్టు అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పుడు అదే టెస్టు మ్యాచ్‌ను జూలై 1 నుంచి 5 వరకు ఎడ్జ్‌బాస్టన్‌లో నిర్వహిస్తారు. సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఈ టెస్టు కోసం మళ్లీ జట్టులోకి రాగా, మయాంక్ అగర్వాల్‌ను తప్పించారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉంటూ కౌంటీ క్రికెట్ ఆడుతున్న పుజారా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ససెక్స్ తరఫున అతను నాలుగు సెంచరీలు సహా 720 పరుగులు చేశాడు. ఇలాంటి ఫామ్‌తో అతను భారత జట్టుకు కీలకం కాగలడని భావించిన సెలక్టర్లు మరో మాట లేకుండా పుజారాను ఎంపిక చేశారు. లంకతో సిరీస్‌లో పుజారాతో పాటు చోటు కోల్పోయిన రహానే ప్రస్తుతం గాయంతో ఆటకు దూరం కావడంతో అతని పేరును పరిశీలించలేదు. 17 మంది సభ్యుల బృందంలో ఎలాంటి అనూహ్య ఎంపికలు లేవు. సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2–1తో ఆధిక్యంలో ఉండగా... ఇరు జట్లు కొత్త కెప్టెన్లతో (రోహిత్ శర్మ, బెన్ స్టోక్స్) ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాయి. భారత టెస్టు జట్టు: రోహిత్ (కెప్టెన్), రాహుల్, గిల్, కోహ్లి, శ్రేయస్, విహారి, పుజారా, పంత్, షమీ, జడేజా, సిరాజ్, శార్దుల్, శ్రీకర్ భరత్, అశ్విన్, బుమ్రా, ఉమేశ్, ప్రసిధ్ కృష్ణ. -
ఐపీఎల్ హంగామా నడుస్తున్నా నేనున్నానని గుర్తు చేస్తున్న పుజారా..!
ఇంగ్లండ్ కౌంటీల్లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాది కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్న టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాపై భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన గొప్ప ఆటగాళ్లెప్పుడూ పుజారాలా బ్యాట్‌తోనే సమాధానం చెబుతారని.. సెంచరీలు, డబుల్ సెంచరీలతోనే వారు సెలెక్టర్లకు సవాలు విసురుతారని అన్నాడు. ఓ పక్క ఐపీఎల్ హంగామా నడుస్తున్నా, పుజారా నేనున్నానని సెలెక్టర్లకు గుర్తు చేశాడని పేర్కొన్నాడు. What do great players do when out of India team? Knock the selectors' doors with 100s and 200s like Pujara. Away from IPL glamour, a simple 'forget me not' message. @cheteshwar1 — Mohammad Kaif (@MohammadKaif) May 8, 2022 కాగా, పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో స్థానం కోల్పోయిన చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ టీమిండియా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2022లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నయా వాల్.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో నాలుగు శతకాలు (డెర్బీషైర్‌పై 201*, వోర్సెస్టర్‌షైర్‌పై 109, డర్హమ్‌పై 203, మిడిల్‌సెక్స్‌పై 170*) బాదాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. Make yourselves comfortable and watch every ball of Shaheen Afridi 🆚 Cheteshwar Pujara 🤩 #LVCountyChamp pic.twitter.com/E6uVJopBQr — LV= Insurance County Championship (@CountyChamp) May 7, 2022 తాజాగా మిడిల్సెక్స్తో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 197 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 170 పరుగులు సాధించిన పుజారా తన జట్టును మాత్రం ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో పుజారా డబుల్ సెంచరీతో పాటు మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ససెక్స్ 335/4 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఫలితం అనుభవించింది. ససెక్స్ నిర్ధేశించిన 370 పరుగుల టార్గెట్‌ను మిడిల్సెక్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. మిడిల్సెక్స్ ఓపెనర్ సామ్ రాబ్సన్ (149) సెంచరీతో కదంతొక్కగా, కెప్టెన్ పీటర్ హ్యాండ్స్కాంబ్ (79), మ్యాక్స్ హోల్డన్ (80 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. అంతకముందు ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగులకు ఆలౌట్ కాగా.. మిడిలెసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో పుజారా.. ప్రత్యర్ధి బౌలర్ (మిడిల్సెక్స్), పాక్ ఆటగాడు షాహీన్ అఫ్రిది మధ్య బ్యాటిల్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. పుజారా.. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది చుక్కలు చూపించాడు. చదవండి: IPL 2022: కోహ్లి గోల్డెన్ డక్.. కోచ్ అంటే ఇలా ఉండాలి! వైరల్