Ranji Trophy 2022: Sourashtra Vs Mumbai 1st Match Schedule Confirmed - Sakshi
Sakshi News home page

Ranji Trophy 2022: టీమిండియాలో స్థానం కోసం పోరాటం.. ప్రత్యర్థులుగా రహానే, పుజారా!

Published Wed, Feb 9 2022 7:57 AM | Last Updated on Wed, Feb 9 2022 10:01 AM

Ranji Trophy 2022 Schedule Relased 1st Match Sourashtra Vs Mumbai - Sakshi

Ranji Trophy 2022- న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీ డిఫెండింగ్‌ చాంపియన్‌ సౌరాష్ట్ర తాజా సీజన్‌ తొలి మ్యాచ్‌లో 41 సార్లు విజేతగా నిలిచిన ముంబైతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఫిబ్రవరి 17న మొదలవుతుంది. గత కొంత కాలంగా ఫామ్‌ కోల్పోయి భారత టెస్టు జట్టులో స్థానం కోసం పోరాడుతున్న పుజారా (సౌరాష్ట్ర), రహానే (ముంబై) ఈ పోరులో ప్రత్యర్థులుగా బరిలోకి దిగనుండటం విశేషం.

తొలి మ్యాచ్‌ కు వారం రోజుల ముందు ఆయా జట్లు తమ మ్యాచ్‌ల వేదిక వద్ద చేరుకొని ఐదు రోజులు క్వారంటైన్‌లో గడుపుతాయి. ఒక్కో జట్టులో గరిష్టంగా 20 మంది ఆటగాళ్లు, 10 మంది సహాయక సిబ్బంది ఉండవచ్చు. 38 జట్లు తలపడే రంజీ ట్రోఫీలో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనుండగా... రాజ్‌కోట్, కటక్, అహ్మదాబాద్, చెన్నై, తిరువనంతపురం, ఢిల్లీ, హరియాణా, గువ హటి, కోల్‌కతాలలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 

చదవండి: IND VS WI 2nd ODI: విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్‌, ధోని సరసన..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement