ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో టీమిండియా టెస్ట్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా చెలరేగిపోతున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ ప్రస్తుత సీజన్‌లో ససెక్స్ తరఫున రెండో సెంచరీ సాధించిన పుజారా.. ఓవరాల్‌గా 65వ ఫస్ట్ క్లాస్ సెంచరీ నమోదు చేశాడు. ససెక్స్ తరఫున కౌంటీల్లో పుజారాకు ఇది 10వ శతకం. కౌంటీ ఛాంపియన్‌షిన్ డివిజన్-2లో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా మిడిల్‌సెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా ఈ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పుజారా తనదైన శైలిలో అడ్డుగోడ పాత్ర పోషించి 302 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 129 పరుగులు చేసి ఔటయ్యాడు.
పుజారాతో పాటు కెప్టెన్ జాన్ సింప్సన్ (167) శతక్కొట్టడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 554 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ హెయిన్స్ (40), డానీ లాంబ్ (49) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిడిల్‌సెక్స్ బౌలర్లలో బాంబర్ 3, బ్రూక్స్, హోల్‌మన్ తలో 2, ర్యాన్ హిగ్గిన్స్, నాథన్ ఫెర్నాండెజ్ చెరో వికెట్ పడగొట్టారు.
PUJARA SMASHED HIS 65th FIRST-CLASS HUNDRED 🤯 💥
- An all time legend, Puj. pic.twitter.com/dXSbmUDvJb— Johns. (@CricCrazyJohns) May 25, 2024
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మిడిల్‌సెక్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 62 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సామ్ రాబ్సన్ (40), మ్యాక్స్ హోల్డన్ (18) క్రీజ్‌లో ఉండగా.. మార్క్ స్టోన్‌మన్ (4) ఔటయ్యాడు. ప్రస్తుతం మిడిల్‌సెక్స్ ససెక్స్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 492 పరుగులు వెనకపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment