కౌంటీల్లో ఆడనున్న చహల్‌ | Northamptonshire Has Signed Yuzvendra Chahal For The Remainder Of 2024 County Championship And One Day Cup | Sakshi
Sakshi News home page

కౌంటీల్లో ఆడనున్న చహల్‌

Published Wed, Aug 14 2024 3:54 PM | Last Updated on Wed, Aug 14 2024 4:01 PM

Northamptonshire Has Signed Yuzvendra Chahal For The Remainder Of 2024 County Championship And One Day Cup

టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడనున్నాడు. నార్తంప్టన్‌షైర్‌ కౌంటీ యుజీతో ఓ వన్డే కప్‌ మ్యాచ్‌, ఐదు కౌంటీ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ల కోసం ఒప్పందం చేసుకుంది. త్వరలో యుజీ జట్టుతో చేరతాడని నార్తంప్టన్‌ హెడ్‌ కోచ్‌ జాన్‌ సాడ్లర్‌ తెలిపాడు. చహల్‌ గత సీజన్‌లో కూడా కౌంటీల్లో ఆడాడు. 

2023 సీజన్‌లో అతను కెంట్‌కు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో చహల్‌ కౌంటీల్లో ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. చహల్‌ తదుపరి భారత్‌ ఆడబోయే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడు. ఈ గ్యాప్‌లో మాత్రమే అతను కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే, చహల్‌కు గత కొంతకాలంగా ఏ ఫార్మాట్‌లోనూ అవకాశాలు రాని విషయం తెలిసిందే. కుల్దీప్‌, అక్షర్‌, రవి భిష్ణోయ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు. వీరందరికీ బ్యాట్‌తోనూ సత్తా చాటే సామర్థ్యం ఉండటంతో సెలెక్టర్లు వీరివైపు మొగ్గు చూపుతున్నారు. చహల్‌ ప్రస్తుతం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. 

34 ఏళ్ల చహల్‌ ఐపీఎల్‌లో 160 మ్యాచ్‌ల్లో 205 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. చహల్‌ ఈ ఏడాడంతా ఒక్క వన్డే కానీ టీ20 కానీ ఆడలేదు. చహల్‌ ఇప్పటివరకు 72 వన్డేలు, 80 టీ20లు ఆడి 217 వికెట్లు పడగొట్టాడు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కూడా చహల్‌కు అవకాశం దక్కడం అనుమానమే. దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటితే తప్ప సెలెక్టర్లు ఇతనివైపు చూసే అవకాశం లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement