Yuzuvendra Chahal
-
యజమానులు ఎవరైనా.. జట్టు మాత్రం నాదే: రిక్కీ పాంటింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025లో సరికొత్త పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను చూస్తారని హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్(Ricky Ponting) అన్నాడు. వేలం విషయంలో ఫ్రాంఛైజీ యజమాన్యం తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని.. అందుకే తన వ్యూహాలను పక్కాగా అమలు చేయగలిగినట్లు తెలిపాడు. కోరుకున్న ఆటగాళ్లను దక్కించుకోవడంలో తాము సఫలమయ్యామన్నాడు.ఇక మైదానంలో మెరుగైన ఫలితాలు సాధించడంపైనే ప్రస్తుతం తన దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉన్నట్లు రిక్కీ పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా ఈ ఆస్ట్రేలియా దిగ్గజానికి ఐపీఎల్‌తో గత పదేళ్లుగా అనుబంధం ఉంది.ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏడేళ్లుఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ప్రాంఛైజీకి అత్యధికంగా ఏడేళ్లు అతడు హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. 2018- 2024 వరకు అతడి మార్గదర్శనంలో ఢిల్లీ జట్టు మిశ్రమ ఫలితాలు అందుకుంది. అయితే, అత్యుత్తమంగా 2020లో ఫైనల్‌కు చేరింది. కానీ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఇక అంతకు ముందు 2019లో.. ఆ తర్వాత 2021లో ప్లే ఆఫ్స్ వరకు చేరగలిగింది.కానీ 2022-2024 వరకు ఒక్కసారి కూడా టాప్-4లోనూ అడుగుపెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ యాజమాన్యం రిక్కీ పాంటింగ్‌తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుంది. అనంతరం.. పంజాబ్ కింగ్స్ పాంటింగ్‌ను తమ కుటుంబంలోకి ఆహ్వానించి ప్రధాన కోచ్‌గా నియమించింది.చెత్త రికార్డుతో పంజాబ్ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు ఉన్న చెత్త రికార్డు గురించి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ ఎడిషన్(2008) నుంచి ఇప్పటిదాకా కేవలం రెండుసార్లే ప్లే ఆఫ్స్ చేరింది. ఆఖరి నిమిషంలో చేతులెత్తేసి మ్యాచ్‌లు చేజార్చుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే, ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో పాంటింగ్‌ను రంగంలోకి దింపింది.ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం గురించి రిక్కీ పాంటింగ్ హెవీ గేమ్స్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వేలానికి ముందు మేము అన్ని రకాలుగా చర్చించుకున్నాం. అంతా అనుకున్నట్లే జరిగినందుకు నాకు సంతోషంగా ఉంది.యజమానులు వాళ్లే అయినా.. జట్టు పూర్తిగా నాదేఇక ఇప్పటి నుంచి ఫ్రాంఛైజీ యజమానులు ఎవరైనా సరే.. జట్టు మాత్రం పూర్తిగా నా చేతుల్లో ఉంటుంది. జట్టు గత చరిత్ర గురించి నేను చాలా విషయాలు విన్నాను. ఇకపై అందుకు భిన్నంగా ఉండాలంటే నాకు స్వేచ్ఛ కావాలని అడిగాను. అందుకు ఓనర్లు కూడా అంగీకరించారు. ఫ్రాంఛైజీ యజమానులతో పాటు అడ్మినిస్ట్రేటర్లు, బోర్డు డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరికి నా కార్యచరణ గురించి వివరించాను. నా శైలిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాను. ముఖ్యంగా భారత క్రికెటర్లపై మేము ఎక్కువగా దృష్టి పెట్టాము. వారి రాక మాకు శుభారంభం లాంటిదే’’ అని రిక్కీ పాంటింగ్ పేర్కొన్నాడు.రికార్డు ధరకు అయ్యర్‌ను కొనికాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో .. టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చుపెట్టింది. గత సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించిన ఈ విన్నింగ్ కెప్టెన్‌ను తమ సారథిగా నియమించింది. అంతేకాదు.. వేలానికి ముందు ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్‌లను మాత్రమే రిటైన్ చేసుకున్న పంజాబ్.. వేలంలో మరో టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక పంజాబ్ జట్టుకు నెస్ వాడియా, ప్రీతి జింటా సహ యజమానులు అన్న విషయం తెలిసిందే.చదవండి: అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ.. టీమిండియా గెలిస్తే చరిత్రే: సురేశ్ రైనా -
విడాకులకు సిద్ధమైన టీమిండియా క్రికెటర్!
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్(Yuzvendra Chahal ) విడాకులకు సిద్ధమయ్యాడా?.. భార్య ధనశ్రీ వర్మతో అతడు విడిపోనున్నాడా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. చహల్ సోషల్ మీడియా అకౌంటర్లను గమనిస్తే అతడు త్వరలోనే ఈ చేదు వార్తను అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది.హర్యానాకు చెందిన 34 ఏళ్ల చహల్ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్. 2016లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన చహల్.. వన్డే, టీ20లలో ప్రధాన స్పిన్ బౌలర్‌గా ఎదిగాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటి వరకు 72 వన్డేలు, 80లు ఆడిన చహల్ ఆయా ఫార్మాట్లలో 121, 96 వికెట్లు తీశాడు.ఐపీఎల్ వికెట్ల వీరుడుఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోనూ చహల్‌కు గొప్ప రికార్డు ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ టీ20 లీగ్‌లో 160 మ్యాచ్‌లు ఆడిన అతడు.. ఏకంగా 205 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇక చహల్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. కోవిడ్ లాక్డౌన్ సమయంలో యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో అతడు ప్రేమలో పడ్డాడు.కొరియోగ్రాఫర్‌తో వివాహంఈ క్రమంలో ఇరు కుటుంబాలను ఒప్పించిన చహల్- ధనశ్రీ డిసెంబరు 20, 2020లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, ధనశ్రీ పేరు మరో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు కలిసి వినిపించడం.. గ్లామర్లోనూ ఆమె హీరోయిన్లకు ధీటుగా ఫొటోలు షేర్ చేయడం.. తదితర పరిణామాల నేపథ్యంలో విడాకుల అంశం తెరమీదకు వచ్చింది. విడాకులు తీసుకోవడమే తరువాయి అన్నట్లు వార్తలు రాగా.. చహల్- ధనశ్రీ అప్పట్లో సంయుక్తంగా విడాకుల విషయాన్ని ఖండించారు.అనంతరం ఇద్దరూ కలిసి ట్రిప్పులకు వెళ్లిన ఫొటోలు, ప్రత్యేకమైన సందర్భాలను కలిసి జరుపుకొన్న వీడియోలు షేర్ చేస్తూ.. తమ మధ్య విభేదాలు లేవని చెప్పకనే చెప్పారు. అయితే, తాజాగా మరోసారి వీరు విడిపోతున్నారనే ప్రచారం(Divorce Rumours) ఊపందుకుంది. ఇందుకు కారణం సోషల్ మీడియాలో చహల్- ధనశ్రీ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.పెళ్లి ఫొటోలు కూడా డిలీట్ చేసిన చహల్ఇటీవల తమ వివాహ వార్షికోత్సవం(డిసెంబరు 22)న కూడా ఇద్దరూ ఎటువంటి పోస్ట్ పెట్టలేదు. అంతేకాదు.. చహల్ ధనశ్రీతో తన పెళ్లి ఫొటోలతో పాటు వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు. మరోవైపు.. ధనశ్రీ ఖాతాలో చహల్‌తో కలిసి ఉన్న కొన్ని ఫొటోలు ప్రస్తుతానికి అలాగే ఉన్నా అవి ప్రమోషన్లలో భాగంగా తీసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వీరి బంధం బీటలు వారిందనే సంకేతాలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే.. చహల్ చివరగా టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఈ మెగా ఈవెంట్ల ఒక్క మ్యాచ్‌లోనూ చహల్ ఆడకపోయినప్పటికీ చాంపియన్‌గా నిలిచిన జట్టులో ఉన్న కారణంగా ట్రోఫీని ముద్దాడాడు. ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో చహల్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ. 18 కోట్ల మొత్తానికి అతడిని సొంతం చేసుకుంది.చదవండి: పిచ్చి పనులు మానుకోండి: రోహిత్ శర్మ ఆగ్రహం -
గ్లామర్‌తో మతిపోగొడుతున్న చహల్ సతీమణి.. ధనశ్రీ లేటెస్ట్ ఫొటోలు
-
భువనేశ్వర్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. ఒకే ఒక్కడు!
అంతర్జాతీయ టీ20లలో టీమిండియా తరఫున 2022లో అరంగేట్రం చేశాడు అర్ష్‌దీప్ సింగ్. రెండేళ్లకాలంలోనే పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా అవతరించాడు. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలోనూ సత్తా చాటుతున్నాడు ఈ యువ పేసర్.నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లలో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై కూడా అర్ష్‌దీప్ ఫర్వాలేదనిపించాడు. ఆ రెండు మ్యాచ్‌లలో ఒక్కో వికెట్ తీసిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. మూడో టీ20లో మాత్రం తన సత్తా చూపించాడు. కీలక సమయంలో మూడు కీలక వికెట్లు కూల్చి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు.కీలక సమయంలో కీలక వికెట్లు తీసిపవర్ ప్లేలో సౌతాఫ్రికా ఓపెనర్ రియాన్ రెకెల్టన్(15 బంతుల్లో 20)ను పెవిలియన్‌కు పంపిన అర్ష్‌దీప్.. విధ్వంసకర బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్(22 బంతుల్లో 41)ను అవుట్ చేసి తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఇక ప్రొటిస్ జట్టు లక్ష్యానికి చేరువగా వస్తుందనుకున్న సమయంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వీరుడు మార్కో జాన్సెన్(17 బంతుల్లో 54)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని గట్టిషాకిచ్చాడు.అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్బౌలర్గామొత్తంగా మూడో టీ20లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన అర్ష్‌దీప్ 37 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో 92 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్‌కుమార్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్‌బౌలర్‌గా అవతరించాడు.అంతేకాదు.. టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గానూ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, తొంభై వికెట్ల క్లబ్లో చేరేందుకు చహల్‌కు 80 మ్యాచ్‌లు అవసరమైతే.. 25 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్ కేవలం 59 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించడం విశేషం.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు1. యజువేంద్ర చహల్- 80 మ్యాచ్‌లలో 96 వికెట్లు2. అర్ష్‌దీప్ సింగ్- 59 మ్యాచ్‌లలో 92 వికెట్లు3. భువనేశ్వర్ కుమార్- 87 మ్యాచ్‌లలో 90 వికెట్లు4. జస్ప్రీత్ బుమ్రా- 70 మ్యాచ్‌లలో 89 వికెట్లు.తిలక్, అభిషేక్ ధనాధన్ఇదిలా ఉంటే.. సెంచూరియన్ వేదికగా బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ(107 నాటౌట్), అభిషేక్ శర్మ(50) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 219 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు సౌతాఫ్రికా పోరాడినా.. భారత బౌలర్ల విజృంభణతో వారికి ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద నిలిచిన ప్రొటిస్ జట్టు.. టీమిండియా చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సేన ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక నాలుగో టీ20 జొహన్నస్‌బర్గ్‌లో ఆదివారం జరుగనుంది.చదవండి: అతడి కోసం నా ప్లేస్‌ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య -
IPL 2025: ఈ నలుగురిని కొంటే ఆర్సీబీ రాత మారుతుంది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలం నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రిటెన్షన్ జాబితా బాగానే ఉందని.. అయితే వేలంపాటలో అనుసరించే వ్యూహాలపైనే అంతా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లి జట్టుతోనే ఉండటం సంతోషకరమన్న ఏబీడీ.. చహల్‌ను కూడా తిరిగి తీసుకువస్తే జట్టు మరింత బలోపేతమవుతుందన్నాడు.కాగా నవంబరు 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో మెగా వేలం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఇక ఆర్సీబీ తమ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(రూ. 21 కోట్లు)తో పాటు రజత్ పాటిదార్(రూ. 11 కోట్లు), యశ్ దయాళ్(రూ. 5 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో రిటెన్షన్ పోగా.. ఆర్సీబీ పర్సులో ఇంకా రూ. 83 కోట్లు మిగిలి ఉన్నాయి.ఈ నలుగురిని కొంటే ఆర్సీబీ రాత మారుతుందిఈ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ వేలంలో ఆర్సీబీ అనుసరించాల్సిన వ్యూహాలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘నేనైతే ఈ నలుగురు ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తాను. యజువేంద్ర చహల్, కగిసో రబడ, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్... ఈ నలుగురిని కొనుగోలు చేసిన తర్వాత పర్సులో ఎంత మిగిలిందన్న అంశం ఆధారంగా మిగతా ప్లేయర్లను ప్లాన్ చేసుకోవాలి.ఒకవేళ మీకు రబడను కొనేంత సొమ్ము లేకపోతే.. మహ్మద్ షమీని దక్కించుకోండి’’ అని డివిలియర్స్ ఆర్సీబీ యాజమాన్యానికి సూచించాడు. కాగా సుదీర్ఘకాలం పాటు తమతో కొనసాగిన భారత మణికట్టు స్పిన్నర్ చహల్‌ను 2022లో ఆర్సీబీ వదిలేసిన విషయం తెలిసిందే.లీడింగ్ వికెట్ టేకర్అయితే, అదే ఏడాది రాజస్తాన్ రాయల్స్ చహల్‌ను కొనుక్కోగా.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 160 మ్యాచ్‌లు ఆడి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్లు(295) తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు చహల్.ఈ నేపథ్యంలో చహల్‌ను ఆర్సీబీ మళ్లీ తిరిగి జట్టులో చేర్చుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయని ఆ టీమ్ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరినా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
IPL 2025: ఇషాన్ కాదు.. వాళ్లిద్దరికోసం ముంబై పోటీ.. వాషీ కూడా రేసులోనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా స్టార్లపైనే ఉన్నాయి.రేసులో భారత స్టార్లురిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ సహా రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితర సీనియర్ ప్లేయర్లు కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ భారత స్పిన్నర్లను దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంఛైజీలతో కచ్చితంగా పోటీపడుతుందని అభిప్రాయపడ్డాడు.పాలసీ పరిపూర్ణంగా ఉపయోగించుకునికాగా ఈసారి రిటెన్షన్ విధానాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్న జట్టు ముంబై ఇండియన్స్ అని చెప్పవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంది. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను కొనసాగించాలని నిర్ణయించుకుంది.ఇక వీళ్లందరికి ఖర్చు పెట్టింది పోనూ.. ముంబై పర్సులో ఇంకా రూ. 45 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ముంబై బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే, వాళ్ల రిటెన్షన్ లిస్టులో బుమ్రా రూపంలో ఒకే ఒక స్పెషలిస్టు బౌలర్ ఉన్నాడు.కాబట్టి వారికి ఇప్పుడు బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి ముంబై 225- 250 పరుగులు స్కోరు చేయగల సామర్థ్యం కలిగిన జట్టు. అయితే, అదే స్థాయిలో పరుగులు కూడా సమర్పించుకున్న సందర్భాలు ఉన్నాయి.బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఏదేమైనా వాళ్లు బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఆధారపడతారన్నది వాస్తవం. కానీ ప్రతిసారీ ఇదే టెక్నిక్ పనికిరాదు. వాళ్ల జట్టులో ఉంటే ఇండియన్ బ్యాటింగ్ లైనప్.. విదేశీ బౌలింగ్ లైనప్ ఉంటుంది. ఇప్పుడు వారికి ఇద్దరు స్పిన్నర్ల అవసరం కూడా ఉంది. అందుకే కచ్చితంగా వాళ్లు యుజీ చహల్ వెనుకపడటం ఖాయం.ఇషాన్ కాదుఒకవేళ అతడిని దక్కించుకోలేకపోతే.. ముంబై ఇండియన్స్ వాషింగ్టన్ సుందర్నైనా సొంతం చేసుకుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ పేరును కూడా ప్రస్తావించిన ఆకాశ్ చోప్రా.. అతడిని ముంబై కొనుగోలు చేసే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్‌ను పరిగణించినా.. క్వింటన్ డికాక్ లేదంటే జితేశ్ శర్మ వైపు మొగ్గు చూపుతుందని అంచనా వేశాడు. చదవండి: Aus vs Pak: ఆసీస్‌కు కొత్త కెప్టెన్ -
గ్లామర్‌లో హీరోయిన్లకు పోటీ.. టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ఇంగ్లండ్ గడ్డపై దుమ్ములేపిన చహల్.. బంగ్లాతో సిరీస్‌కు సై!
ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్ (డివిజన్ 2)లో భారత లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చహల్ సత్తా చాటాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో నార్తాంప్టన్ జట్టుకు ఆడుతున్న అతడు.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అతను 9 వికెట్లతో చెలరేగడం విశేషం. చహల్ అద్భుత ప్రదర్శన కారణంగా మూడు రోజుల మ్యాచ్‌లో నార్తాంప్టన్ 9 వికెట్ల తేడాతో లీసెస్టర్షైర్ను చిత్తు చేసింది.చహల్ @9కాగా రెండో ఇన్నింగ్స్‌లో లీసెస్టర్ 316 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో చహల్ 5 వికెట్ల పడగొట్టి ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. అంతకు ముందు... తొలి ఇన్నింగ్స్‌లో అతడు 4 వికెట్లతో మెరిశాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం సాధించిన నార్తాంప్టన్ ముందు.. లీసెస్టర్‌షైర్ 137 పరుగుల లక్ష్యం విధించింది. ఈ క్రమంలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి నార్తాంప్టన్ ఈ స్కోరును ఛేదించింది. ఇదిలా ఉంటే.. గత మ్యాచ్‌లో విఫలమైన మరో భారత ఆటగాడు పృథ్వీ షాకు ఈ మ్యాచ్‌లో నార్తాంప్టన్ తుది జట్టులో చోటు దక్కలేదు. ఇంగ్లండ్ గడ్డపై చహల్ జోరుఅంతకు ముందు డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చహల్ తొమ్మిది వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన చహల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా... ఇంగ్లండ్ వన్డే కప్‌లోనూ చహల్ తనదైన ముద్ర వేశాడు. నార్తంప్టన్‌షైర్ తరఫున ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.జట్టును వీడిన చహల్నార్తాంప్టన్ తరఫున నాలుగు కౌంటీ మ్యాచ్‌లు ఆడిన చహల్ మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 18 వికెట్లు ఆఖరి రెండు మ్యాచ్‌లలో తీయడం విశేషం. తదుపరి అతడు బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగబోయే టీ20 సిరీస్‌లో పాల్గొనే అవకాశం ఉంది.చదవండి: IND VS BAN 1st Test: తప్పు చేసిన విరాట్ కోహ్లి100 | Five for Yuzi Chahal! 5️⃣Scott Currie's magnificent innings ends on 120 as he feathers behind to McManus.Leicestershire 303/9, leading by 123.Watch live 👉 https://t.co/CU8uwteMyd pic.twitter.com/OM8MMYY0O3— Northamptonshire CCC (@NorthantsCCC) September 19, 2024 -
కౌంటీల్లో ఆడనున్న చహల్
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. నార్తంప్టన్‌షైర్ కౌంటీ యుజీతో ఓ వన్డే కప్ మ్యాచ్, ఐదు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌ల కోసం ఒప్పందం చేసుకుంది. త్వరలో యుజీ జట్టుతో చేరతాడని నార్తంప్టన్ హెడ్ కోచ్ జాన్ సాడ్లర్ తెలిపాడు. చహల్ గత సీజన్లో కూడా కౌంటీల్లో ఆడాడు. 2023 సీజన్లో అతను కెంట్కు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో చహల్ కౌంటీల్లో ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. చహల్ తదుపరి భారత్ ఆడబోయే బంగ్లాదేశ్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడు. ఈ గ్యాప్‌లో మాత్రమే అతను కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు.Northamptonshire has signed Indian leg-spinner Yuzvendra Chahal for the remainder of the 2024 County Championship and One Day Cup season. pic.twitter.com/XQUcyv02sN— CricTracker (@Cricketracker) August 14, 2024ఇదిలా ఉంటే, చహల్‌కు గత కొంతకాలంగా ఏ ఫార్మాట్లోనూ అవకాశాలు రాని విషయం తెలిసిందే. కుల్దీప్, అక్షర్, రవి భిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు. వీరందరికీ బ్యాట్‌తోనూ సత్తా చాటే సామర్థ్యం ఉండటంతో సెలెక్టర్లు వీరివైపు మొగ్గు చూపుతున్నారు. చహల్ ప్రస్తుతం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. 34 ఏళ్ల చహల్ ఐపీఎల్లో 160 మ్యాచ్‌ల్లో 205 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. చహల్ ఈ ఏడాడంతా ఒక్క వన్డే కానీ టీ20 కానీ ఆడలేదు. చహల్ ఇప్పటివరకు 72 వన్డేలు, 80 టీ20లు ఆడి 217 వికెట్లు పడగొట్టాడు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కూడా చహల్‌కు అవకాశం దక్కడం అనుమానమే. దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటితే తప్ప సెలెక్టర్లు ఇతనివైపు చూసే అవకాశం లేదు. -
ప్రపంచ రికార్డు ముంగిట యజువేంద్ర చహల్
ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. చంఢీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్- రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరుగనుంది. ఇక వరుసగా నాలుగు విజయాల తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి రుచి చూసిన రాజస్తాన్.. తిరిగి విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉండగా.. వరుస పరాజయాలతో చతికిలపడ్డ పంజాబ్ సొంత మైదానంలో సత్తా చాటాలని ఉవ్విళూర్లుతోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇక పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గనుక అతడు మూడు వికెట్లు తీస్తే ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. చహల్ ఇప్పటి వరకు 157 ఐపీఎల్ మ్యాచ్‌లలో కలిపి 197 వికెట్లు పడగొట్టాడు. కాగా ముంబై ఇండియన్స్ ద్వారా 2011లో ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ మణికట్టు స్పిన్నర్.. 2014 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సుదీర్ఘకాలం పాటు ఆడాడు. అయితే, 2022 మెగా వేలానికి ముందు ఆర్సీబీ చహల్‌ను విడుదల చేయగా.. రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్-2024లో రాజస్తాన్ తరఫున ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన చహల్ 10 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్‌పై యజువేంద్ర చహల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఆ జట్టుతో 19 మ్యాచ్‌లు ఆడిన చహల్ 29 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్-2024 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవాలని చహల్ పట్టుదలగా ఉన్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పంజాబ్ కింగ్స్ ఐదింట కేవలం రెండు మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది. చదవండి: గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్లో CSK కెప్టెన్ అతడే! Saturday Night Goosebumps: Delivered 🔥 pic.twitter.com/cdPMksvqId — Rajasthan Royals (@rajasthanroyals) April 13, 2024 -
IPL 2024: కోహ్లి, గిల్ కాదు!.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడిదే!
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-2024 సందడి మొదలుకానుంది. చెన్నై వేదికగా మార్చి 22న ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. తాజా ఎడిషన్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీల ఆటగాళ్లందరూ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. జాతీయ జట్టు షెడ్యూల్‌తో బిజీగా ఉన్న వాళ్లు మినహా మిగతా వాళ్లంతా ఐపీఎల్ జట్ల శిక్షణా శిబిరంలో చేరి.. ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఇక ఎప్పటిలాగే.. ఈ సీజన్ ఆరంభానికి ముందు కూడా.. ఈసారి ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? పర్పుల్ క్యాప్ గెలిచేది ఎవరు? చాంపియన్‌గా నిలిచేది ఏ జట్టు? అంటూ అభిమానులు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు ఇలాంటి ప్రశ్నలు ఎదురుకాగా.. ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చహల్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి ఆరెంజ్ క్యాప్‌ను యశస్వి జైస్వాల్ లేదంటే జోస్ బట్లర్ గెలుస్తాడు. ఇక పర్పుల్ క్యాప్ విషయానికొస్తే.. ఈసారి అత్యధిక వికెట్లు తీసేది నేనే.. నా తర్వాతి స్థానంలో రషీద్ ఖాన్ ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు అత్యధిక పరుగుల వీరుడిగా టీమిండియా స్టార్ ఓపెనర్, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరును చెప్పాడు చహల్. యజువేంద్ర చహల్- బట్లర్, జైస్వాల్(PC: RR/IPL) అదే విధంగా.. రాయల్స్‌లో మరో సహచర ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు కూడా ఆరెంజ్ క్యాప్ గెలిచే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే, అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ మాత్రం తానే గెలుస్తానని చహల్ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. కాగా ఐపీఎల్లో విజయవంతమైన బౌలర్‌గా యజువేంద్ర చహల్ పేరొందాడు. చాలా ఏళ్లపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చహల్.. రెండేళ్ల క్రితం రాజస్తాన్ రాయల్స్‌కు మారాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లలో కలిపి 21 వికెట్లు తీశాడీ మణికట్టు స్పిన్నర్. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్లు(187) తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే, టీమిండియాలో మాత్రం చహల్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడతడు! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ స్టార్ శుబ్‌మన్ గిల్ 890 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఆర్సీబీ స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ 730, సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే 672, ఆర్సీబీ ముఖచిత్రం విరాట్ కోహ్లి 639 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. చదవండి: #DhanashreeVerma: పదే పదే ఇలా ఎందుకు? చహల్ భార్య ధనశ్రీ వర్మ ఫొటోపై రచ్చ -
అయ్యర్ భారీ సిక్సర్! ఆమె రావడం మంచిదైంది.. కానీ! ప్రతిభను గుర్తించరా?
ICC WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభం నుంచి స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయాడు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో డకౌట్ అయిన ఈ ముంబై ఆటగాడు.. అఫ్గనిస్తాన్‌పై 25(నాటౌట్) పరుగులు చేయగలిగాడు. ఆ తర్వాత పాకిస్తాన్‌తో అజేయ అర్ధ శతకం(53)తో ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మరోసారి విఫలమై(19) పాత కథ పునరావృతం చేశాడు. అనంతరం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 33 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరి మళ్లీ నిరాశ పరిచాడు. తప్పించాలంటూ డిమాండ్లు దీంతో నిలకడలేని ఫామ్‌తో సతమవుతున్న అయ్యర్‌పై వేటు వెయ్యాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో.. సొంతమైదానం వాంఖడేలో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఒక్క ఇన్నింగ్స్‌తో దిమ్మతిరిగేలా సమాధానం పూర్తి ఆత్మవిశ్వాసం కనబరుస్తూ 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. సెంచరీ దిశగా పయనిస్తున్నాననే జాగ్రత్త పడకుండా నిస్వార్థ ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. శుబ్‌మన్ గిల్ (92), విరాట్ కోహ్లి (88)లు అవుటైన తర్వాత వేగవంతమైన ఆట తీరుతో టీమిండియా 357 పరుగుల భారీ లక్ష్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. భారీ సిక్సర్‌తో రికార్డు ఈ క్రమంలో విమర్శించిన వారే అయ్యర్‌ను ప్రశంసిస్తూ అద్భుత ఇన్నింగ్స్ అంటూ కొనియాడుతుండటం విశేషం. ఇదిలా ఉంటే.. లంకతో మ్యాచ్ సందర్భంగా ఈ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అతి భారీ సిక్సర్‌ను నమోదు చేశాడు. కసున్ రజిత బౌలింగ్‌లో 106 మీటర్ల సిక్స్‌ను బాది చరిత్ర సృష్టించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక.. ఓవైపు అయ్యర్ షాట్ ఆడిన తీరుపై ప్రశంసలు కురుస్తుండగా.. మరోవైపు కొంతమంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చహల్- ధనశ్రీలపైకి బంతి విషయమేమిటంటే.. వన్డే వరల్డ్‌కప్-2023లో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్.. తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి గురువారం వాంఖడే మైదానానికి వచ్చాడు. అయితే, అయ్యర్ బాదిన భారీ సిక్సర్ ఈ దంపతులు కూర్చున్న స్టాండ్స్‌లో ల్యాండ్ అవడం విశేషం. శ్రుతిమించిన ట్రోల్స్ దీంతో.. ‘‘పాపం చహల్‌పై అంత కోపమెందుకు అయ్యర్.. ఏదేమైనా ధనశ్రీ రావడంతో అయ్యర్‌కు లక్ కలిసివచ్చినట్లుంది’’ అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కాగా ధనశ్రీతో కలిసి అయ్యర్ డ్యాన్స్ చేసిన వీడియోలు, వీరిద్దరు కలిసి పార్టీలకు హాజరైన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధనశ్రీ తన ఇన్‌స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును తీసేసినపుడు.. అయ్యర్ పేరుతో ఆమె పేరును జతచేసి దారుణంగా ట్రోల్ చేశారు. అంతటితో ఆగక చహల్‌తో ధనశ్రీ విడిపోబోతుందంటూ వదంతులు వ్యాప్తి చేయగా.. చహల్ స్వయంగా వీటిని ఖండించాడు. చదవండి: డేగ కళ్లు’! ఒకటి నిజమని తేలింది.. ఇంకోటి వేస్ట్.. ఇకపై వాళ్లే బాధ్యులు: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిగో మళ్లీ ఇప్పుడిలా ఈ సిక్సర్ కారణంగా వాళ్లిద్దరిని ట్రోల్ చేస్తూ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. అయితే, అయ్యర్ ఫ్యాన్స్ మాత్రం వీటిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిభను గుర్తించకుండా అనవసరపు విషయాల్లోకి లాగి అయ్యర్ ఆటను తక్కువ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. -
అయినా.. చహల్‌ను ఎందుకు సెలక్ట్ చేస్తారు? నా ఛాయిస్ అతడే: స్పిన్ దిగ్గజం
Muttiah Muralitharan's Blunt Take: కేవలం వైవిధ్యం కోసమని అదనపు స్పిన్నర్‌ను ఎంపిక చేయడం సరికాదని శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. వరల్డ్‌కప్-2023 జట్టులో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే సరిపోయేదంటూ బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టాడు. అయితే, అదే సమయంలో.. యజువేంద్ర చహల్‌ను పక్కన పెట్టి మంచి పని చేశారని సమర్థించాడు. కాగా సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లతో పాటు.. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కింది. అయితే, మరో మణికట్టు స్పిన్నర్ చహల్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపికపై స్పందించిన మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బయోపిక్ ‘800’ ప్రమోషన్లలో భాగంగా.. జడేజా ఉన్నాడు కదా ‘‘ఒకవేళ జడేజా, కుల్దీప్లను తీసుకుని ఉంటే సరిపోయేది. వైవిధ్యం పేరిట ముగ్గురు స్పిన్నర్లను ఎంపిక చేయడం మాత్రం సరికాదు. జడ్డూ ఎలాగో ఆల్‌రౌండర్ కాబట్టి కుల్దీప్ను స్పెషలిస్టు బౌలర్‌గా వాడుకునేవాళ్లు. ఇక రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్‌ల ప్రస్తుత ఫామ్ ఎలా ఉందో నాకు తెలియదు. అయినా, టీ20 ఫార్మాట్లో ప్రదర్శన ఆధారంగా వన్డేలకు సెలక్ట్ చేయలేరు కదా! 50 ఓవర్ల ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. ఒకవేళ చహల్ కంటే కుల్దీప్ ప్రదర్శన మెరుగ్గా ఉంటే అతడిని ఎంపిక చేయడంలో తప్పులేదు. ఒక్కోసారి అనుభవం కంటే ఫామ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. చహల్‌ను ఎలా ఎంపిక చేస్తారు? వన్డేల్లో అతడి ప్రదర్శన చెప్పుకోదగ్గదిగా లేనపుడు అతడిని ఎవరైనా ఎలా సెలక్ట్ చేయగలరు? కాబట్టే అతడిని విస్మరించి ఉంటారు. ఇంతకీ చహల్ దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నాడా? తిరిగి ఫామ్ పొందాలంటే అంతకంటే ఉత్తమమైన మార్గం మరొకటి ఉండదు కదా!’’ అని టెస్టుల్లో 800 వికెట్లు పడగొట్టిన ముత్తయ్య మురళీధరన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అశ్విన్ ఉంటే ఒకవేళ తనకు ముగ్గురు స్పిన్నర్లను ఎంచుకునే అవకాశం ఉంటే మాత్రం.. జడేజా, అశ్విన్, కుల్దీప్లవైపే మొగ్గు చూపుతానని మురళీధరన్ ఈ సందర్భంగా తెలిపాడు. అయితే, దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో కాకుండా.. ఐపీఎల్లో బాగా ఆడినంత మాత్రాన ఎవరికీ అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశాడు. చదవండి: వరల్డ్‌కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌గా అతడే? -
బ్యాటింగ్ ఆధారంగా బౌలర్లను సెలక్ట్ చేస్తారా.. నిజమా?: మాజీ బ్యాటర్
India World Cup 2023 squad: ‘‘అక్షర్ పటేల్- యుజీ చహల్.. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న విషయంలో కచ్చితంగా చర్చ జరిగి ఉంటుంది. టీమిండియాకు ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేయగల ఆటగాడు కావాలి. సరే.. అలాగే అనుకుందాం.. ఈ ఆప్షన్ ఉంది కాబట్టి ఇలా చేశారు. కానీ.. నిజంగానే బ్యాటింగ్ చేయగల సమర్థత ఆధారంగానే బౌలర్లను సెలక్ట్ చేస్తారా?’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను కాదని.. ఆల్‌రౌండర్ అన్న కారణంగా అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవడం ఎందుకో సబబుగా అనిపించడం లేదని పేర్కొన్నాడు. చహల్‌కు నో ఛాన్స్ కాగా భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఆసియా వన్డే కప్-2023 టీమ్‌లో ఉన్న ప్రధాన ఆటగాళ్లందరికీ ఇందులో చోటు దక్కింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత రికార్డు ఉన్న మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు మాత్రం ఈసారి కూడా సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. కేవలం బ్యాటింగ్ చేస్తారన్న కారణంగా బౌలర్లను జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నాడు. ఇద్దరూ తుదిజట్టులో ఉండరు కదా! అదే విధంగా.. ‘‘బ్యాటింగ్‌లో డెప్త్ కోసం నంబర్ 8లో ఆల్‌రౌండర్‌ను తీసుకుంటామని అంటున్నారు. నిజానికి.. జట్టులోని టాప్-6 బ్యాటర్లలో కొందరు విఫలమైనా జడేజా రూపంలో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాడు అందుబాటులో ఉన్నాడు. టాప్ బ్యాటర్లంతా బాధ్యతాయుతంగా ఆడితే ఎనిమిదో నంబర్ ఆటగాడి గురించి ఆందోళనే ఉండదు కదా! ఒకేరకమైన నైపుణ్యాలు కలిగిన జడేజా, అక్షర్ తుదిజట్టులో కలిసి ఆడతారా? అంటే అదీ లేదు. లెఫ్టాండర్ బ్యాటర్ ఉన్నపుడు లెఫ్టార్మ్ ఫింగర్ స్పిన్నర్ చేతికి కెప్టెన్ బంతిని ఇవ్వడు. కాబట్టి లెఫ్టార్మ్ స్పిన్నర్లతో మిడిల్ ఓవర్లలో 20 ఓవర్లు ఎలా వేయిస్తారు? ఇలా జరగడం సాధ్యమేనా? దీనిని బట్టి అక్షర్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తారనడం స్పష్టంగా అర్థమవుతోంది కదా!’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అగార్కర్ రీజన్ ఇదీ కాగా చహల్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం.. జడేజా, అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటర్లకు సమర్థవంతంగా బౌలింగ్ చేయగలరు.. అదే విధంగా.. వీరిద్దరి బ్యాటింగ్ కూడా అవసరం కాబట్టే ఇద్దరినీ ఎంపిక చేశామని స్పష్టం చేశాడు. చదవండి: ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా.. WC: అంతా బాగానే ఉంది.. కానీ అదొక్కటే లోటు! ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్.. -
అతడు ఉండగా అక్షర్ ఎందుకు? మ్యాచ్ విన్నర్‌కు చోటు లేకపోవడమేమిటి?: మాజీ క్రికెటర్
India's ODI World Cup 2023 Squad: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టుపై హర్భజన్ సింగ్ స్పందించాడు. మ్యాచ్ విన్నర్‌కు చోటు లేకపోవడం ఏమిటంటూ ‘ఎక్స్’ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మంగళవారం ప్రపంచకప్ జట్టును ప్రకటించాడు. ఈసారి కూడా మొండిచేయి! ఇందులో.. ఏడుగురు బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, నలుగురు ఆల్రౌండర్లకు చోటు దక్కింది. అయితే, ఆసియా కప్ జట్టులో స్థానం లేనప్పటికీ అనుభవం దృష్ట్యానైనా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు ఈసారి అవకాశం ఇస్తారని అంతా భావించారు. చహల్ కానీ.. ఆసియా కప్ జట్టు ప్రకటన సందర్భంగా.. ఇకపై రిస్ట్ స్పిన్నర్లు కుల్-చా ద్వయాన్ని ఒకే జట్టులో చూడలేమన్న మాటలను నిజం చేస్తూ అగార్కర్.. చహల్‌పై వేటు పడటానికి కారణాన్ని చెప్పకనే చెప్పాడు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ జట్టులో చైనామన్ స్పిన్నర్‌కు చోటు దక్కగా.. చహల్‌కు భంగపాటు తప్పలేదు. ఆశ్చర్యం వేసింది ఈ విషయంపై స్పందించిన మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ‘‘ప్రపంచకప్ జట్టులో యజువేంద్ర చహల్‌కు చోటు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ప్యూర్ మ్యాచ్ విన్నర్ తను’’ అని ట్వీట్ చేశాడు.ఘీ క్రమంలో నెటిజన్లు సైతం యుజీకి మద్దతు తెలుపుతూ భజ్జీని సమర్థిస్తున్నారు. చహల్‌తో పాటు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా అన్యాయం జరిగిందని మరికొంత మంది వాపోతున్నారు. అక్షర్ వద్దు.. ఎందుకంటే! తన వరల్డ్‌కప్ జట్టులో యజువేంద్ర చహల్‌కు చోటిచ్చిన హర్భజన్ సింగ్.. అక్షర్ పటేల్‌ను విస్మరించిన విషయం తెలిసిందే. ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘రవీంద్ర జడేజా.. అక్షర్ పటేల్ ఇద్దరూ ఒకేలాంటి ప్లేయర్లు. చహల్ బౌలింగ్ శైలి వేరు. అతడు మ్యాచ్ విన్నర్. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి గణాంకాలు గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. వన్డే, టీ20లలో చహల్ లాంటి ప్రభావంతమైన స్పిన్నర్ లేడనే చెప్పాలి. జడ్డూ ఎలాగో జట్టులో ఉంటాడు కాబట్టి.. అక్షర్‌ను పక్కనపెట్టి యుజీని తీసుకుంటే బాగుంటుంది అని వరల్డ్‌కప్ జట్టు ప్రకటనకు ముందు భజ్జీ తన అంచనా తెలియజేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023కి హర్భజన్ ఎంచుకున్న జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్. చదవండి: తిలక్‌తో పాటు అతడికి నో ఛాన్స్! ఇదే ఫైనల్.. మార్పుల్లేవు: అజిత్ అగార్కర్ Surprise not to see @yuzi_chahal in the World Cup squad for Team India. pure Match winner — Harbhajan Turbanator (@harbhajan_singh) September 5, 2023 -
WC 2023: మొన్న అలా.. ఇప్పుడిలా! మాట మార్చిన దాదా.. పాపం
World Cup 2023- Sourav Ganguly Picks His Squad: వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన జట్టును ప్రకటించాడు. ఈ ఐసీసీ ఈవెంట్‌కు తన అభిప్రాయాలకు అనుగుణంగా 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఆసియా వన్డే టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో రెండు మార్పులతో దాదా ముందుకు వచ్చాడు. ఇద్దరు యువ ఆటగాళ్లను మినహాయించి మిగతా అంతా సేమ్ టూ సేమ్ అనేలా తన టీమ్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా తను బలంగా వినిపిస్తున్న పేరును మాత్రం గంగూలీ విస్మరించడం గమనార్హం. అందుకే చహల్‌పై వేటు! టీమిండియా పరిమిత ఓవర్ల మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవే తమ మొదటి ప్రాధాన్యం అని, ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లకు చోటు లేనందునే యుజీని పక్కనపెట్టామని జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. దీంతో అనుభవజ్ఞుడైన చహల్‌ను పక్కనపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. గతంలో గంగూలీ మాట్లాడుతూ చహల్‌తో పాటు యువ సంచలనం యశస్వి జైశ్వాల్‌లను తప్పక ఐసీసీ ఈవెంట్లో ఆడించాలని అభిప్రాయపడ్డాడు. తిలక్ వర్మకు నో ఛాన్స్ కానీ, తాజాగా తను ప్రకటించిన ప్రపంచకప్ జట్టులో మాత్రం ఈ ఇద్దరికీ చోటు ఇవ్వలేదు. ముఖ్యంగా చహల్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ అతడికి స్థానమివ్వాలన్న దాదా ఇప్పుడిలా తనను పక్కనపెట్టాడు. ఇక ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్న సంచలన ఆటగాడు, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మతో పాటు కర్ణాటక యువ పేసర్ ప్రసిద్ కృష్ణను కూడా దాదా తప్పించాడు. అయితే, మిడిలార్డర్ బ్యాటర్ గాయపడితే తిలక్ వర్మ, పేసర్ ఎవరైనా గాయం కారణంగా దూరమైతే ప్రసిద్, స్పిన్నర్ గాయపడితే చహల్‌లను తీసుకోవాలని.. వాళ్లను ఇంజూరీ రిజర్వ్‌లుగా పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 ఆరంభం కానుంది. వన్డే వరల్డ్‌కప్-2023కి సౌరవ్ గంగూలీ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. చదవండి: WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్ Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే -
చహల్‌కు జట్టులో స్థానం పొందే అర్హతే లేదు: పాక్ మాజీ క్రికెటర్
Asia Cup 2023: ‘‘ప్రస్తుతం యుజువేంద్ర చహల్‌కు టీమిండియాలో స్థానం దక్కించుకునే అర్హత లేదు. గత కొంతకాలంగా అతడు నిలకడలేమి ప్రదర్శన కనబరుస్తున్నాడు. మరోవైపు.. కుల్దీప్ యాదవ్.. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా వికెట్లు తీస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొడుతూ జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తున్నాడు. చహల్‌ను కాదని సెలక్టర్లు కుల్దీప్ను ఎంపిక చేసి సరైన నిర్ణయం తీసుకున్నారు’’ పాకిస్తాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా అన్నాడు. ఆసియా కప్-2023కి ఎంపిక చేసిన భారత జట్టులో మణికట్టు స్పిన్నర్ చహల్‌కు స్థానం ఇవ్వకపోవడమే మంచిదైందని ఈ లెగ్ బ్రేక్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసియా వన్డే టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో యుజీ చహల్‌కు మొండిచేయి ఎదురైన విషయం తెలిసిందే. అందుకే చహల్‌పై వేటు అతడిని కాదని మరో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపింది. ఈ విషయం గురించి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లకు జట్టులో చోటు లేదని.. ఇకపై కుల్-చా ద్వయాన్ని ఒకేసారి చూడలేమని స్పష్టం చేశాడు. అదే విధంగా.. ఆసియా కప్ జట్టు జాబితా నుంచే వన్డే వరల్డ్‌కప్‌నకు ఆటగాళ్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో.. కుల్దీప్ మెరుగ్గా రాణిస్తే ఐసీసీ ఈవెంట్‌పై కూడా చహల్ ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టమవుతోంది. అంతటి మొనగాడు లేడు..అయినా ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సహా సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు చహల్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై మేనేజ్మెంట్ తీరును విమర్శిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా స్పిన్నర్లలో చహల్‌ను మించి మొనగాడు లేడని.. అలాంటిది తనకు జట్టులో చోటు లేకపోవడం ఏమిటని భజ్జీ ఫైర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాత్రం బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ ఆరంభం కానుండగా.. సెప్టెంబరు 2న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. చదవండి: అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా.. ఆరోజు నేను భయపడ్డాను: గంభీర్ -
అందుకే అతడికి జట్టులో చోటివ్వలేదు.. స్పందించిన చహల్! అప్పుడు రోహిత్..
India Asia Cup 2023 squad: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అయితే.. అదే సమయంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్న అతడి ఆటిట్యూడ్‌తో అభిమానుల మనసు గెలవడం విశేషం. ఆసియా కప్-2023లో పాల్గొనే జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌లోనూ? వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్‌కు ప్రొవిజినల్ టీమ్‌గా భావిస్తున్న ఈ జట్టులో స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్‌కు చోటు దక్కలేదు. మరో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌వైపే మొగ్గు చూపింది మేనేజ్మెంట్. ఈ చైనామన్ స్పిన్నర్‌తో పాటు స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు చోటిచ్చింది. క్రిప్టిక్ ట్వీట్‌తో చహల్ ఈ నేపథ్యంలో నిరాశకు గురైన యుజీ చహల్ క్రిప్టిక్ ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. మబ్బుల్లో దాగిన సూర్యుడు... మళ్లీ ప్రకాశిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీలతో క్యాప్షన్ ఏమీ లేకుండానే పోస్ట్ చేశాడు. సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు అన్న అర్థంలో నర్మగర్భ ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు. ‘‘అవును.. నువ్వు చెప్పిందే నిజమే భాయ్. మళ్లీ నీకు మంచి రోజులు వస్తాయి’’ అని బదులిస్తున్నారు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ చహల్‌ను జట్టు నుంచి తప్పించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై నో కుల్-చా! చోటు లేదు గనుకే అతడిని ఎంపిక చేయలేదని, అయితే.. వన్డే వరల్డ్‌కప్‌లో చహల్ దారులు మూసుకుపోలేదని హిట్‌మ్యాన్ చెప్పగా.. అగార్కర్ మాత్రం ఇకపై కుల్-చా ద్వయాన్ని ఒకేసారి జట్టులో చూసే అవకాశం లేదని పేర్కొన్నాడు. ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లకు జట్టులో చోటివ్వలేమని.. చహల్ కంటే కుల్దీప్ మెరుగ్గా ఉన్న నేపథ్యంలో చైనామన్ బౌలర్‌కే ఓటు వేశామని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో చహల్ ఈ మేరకు ట్వీట్ చేయడం గమనార్హం. అప్పుడు రోహిత్ సైతం.. ఇక గతంలో జట్టులో చోటు దక్కని నేపథ్యంలో ప్రస్తుత టీమిండియా సారథి రోహిత్ శర్మ సైతం.. ‘‘సూర్యుడు రేపు మళ్లీ ఉదయిస్తాడు’’ అని ట్విటర్లో రాసుకొచ్చాడు. 2018లో టెస్టుల్లో అతడికి స్థానం లేకపోవడంతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అదే రీతిలో చహల్ సైతం తన బాధను వ్యక్తపరుస్తూనే.. మళ్లీ తిరిగివస్తాననే ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. చదవండి: WC 2023: ధావన్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్? అంతేనన్న అగార్కర్! వీడియో వైరల్ ⛅️——> 🌞 — Yuzvendra Chahal (@yuzi_chahal) August 21, 2023 Sun will rise again tomorrow 😊 — Rohit Sharma (@ImRo45) July 18, 2018 -
అందుకే చహల్‌పై వేటు.. ఇకపై: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు
India Asia Cup 2023 squad: ‘‘టీమిండియా తరఫున అత్యద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. టెర్రిఫిక్ పర్ఫార్మర్. కానీ.. కొన్నిసార్లు సమతూకమైన జట్టును ఎంపిక చేసే క్రమంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న వాళ్లలో అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తను బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇక కుల్దీప్ యాదవ్ ప్రదర్శన కూడా చాలా బాగుంది. నిజానికి ఇద్దరు మణికట్టు స్పిన్నర్లను జట్టులోకి తీసుకోవడం కష్టం. 15 మందితో కూడిన జట్టు అయితే, ఇప్పుడున్న వాళ్లలో ఒకరిద్దరిని తప్పించాల్సి వచ్చేది. దురదృష్టవశాత్తూ చహల్ డ్రాప్! లక్కీగా 17 మందికి చోటు ఉంది కాబట్టి.. సరిపోయింది. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ అతడిని వదులుకోవాల్సి వచ్చింది. నిజానికి ప్రస్తుతం.. తన కంటే కుల్దీప్ ఓ అడుగు ముందే ఉన్నాడు. వైవిధ్యమైన బౌలింగ్‌తో మాకు మెరుగైన ఆప్షన్ అనిపించాడు. అందుకే చహల్ మిస్ అయ్యాడు’’ అని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఆసియా కప్-2023 వన్డే టోర్నీ నేపథ్యంలో.. బీసీసీఐ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో రిస్ట్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు చోటు దక్కలేదు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై మాత్రం మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. అందుకే చహల్‌పై వేటు! జట్టు ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో చహల్ గురించి ప్రశ్న ఎదురుకాగా అజిత్ అగార్కర్ పైవిధంగా స్పందించాడు. ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లను జట్టులోకి తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్లే చహల్‌ను తప్పించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కుల్దీప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఆసియాకప్ ముగిసిన తర్వాత టీమిండియా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఆడనున్న విషయం తెలిసిందే. అక్టోబరు 5 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. అంతకంటే ముందు అంటే.. సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనుంది. మరి వరల్డ్‌కప్‌లో..? ఈ క్రమంలో ప్రపంచకప్‌నకు ఆసియా కప్ జట్టును ప్రొవిజినల్ టీమ్‌గా పరిగణిస్తున్న తరుణంలో చహల్‌పై వేటు పడటం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అజిత్ అగార్కర్ కుల్దీప్‌నకు మద్దతుగా నిలవగా.. రోహిత్ శర్మ మాత్రం చోటు లేదు కాబట్టే అతడిని జట్టులోకి తీసుకోలేదన్నాడు. వరల్డ్‌కప్‌లో చహల్‌కు దారులు మూసుకుపోలేదని స్పష్టం చేయడం గమనార్హం. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో యుజీ చహల్ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 72 వన్డేల్లో 121, 80 టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ గత రెండు సీజన్లుగా రాజస్తాన్ రాయల్స్ తరఫున అదరగొడుతున్నాడు. చదవండి: Asia Cup: వరల్డ్‌కప్‌లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్‌న్యూస్.. Asia Cup: అయ్యర్, రాహుల్ వచ్చేశారు.. తిలక్ వర్మ ఇన్.. పాపం సంజూ! -
Asia Cup: వరల్డ్‌కప్‌లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్‌న్యూస్..
Asia Cup Squad- Chahal Dropped- Rohit Sharma Reveals BIG reason: ఆసియా కప్-2023 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 17 మంది సభ్యులతో కూడిన జట్టు శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలిపింది. ఈ మెగా ఈవెంట్‌తో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇస్తుండగా.. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మకు కూడా చోటు దక్కింది. వరల్డ్‌కప్ ప్రొవిజినల్ టీమ్! ఇక ఆసియా వన్డే కప్ నేపథ్యంలో ప్రకటించిన జట్టునే వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ప్రొవిజినల్ టీమ్‌గా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్‌ల గురించి క్రీడా వర్గాల్లో చర్చ మొదలైంది. ఆసియా కప్ జట్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కగా.. అశ్విన్, చహల్, సుందర్‌లకు మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి ప్రపంచకప్ అవకాశాలు కూడా గల్లంతయినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ముగ్గురికి గుడ్‌న్యూస్! అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఈ ముగ్గురికి ఓ శుభవార్త చెప్పాడు. జట్టు ప్రకటన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ... ‘‘17 మందికి మాత్రమే జట్టులో చోటు ఉంది. అందుకే చహల్‌ను తీసుకోలేకపోయాం. రవి అశ్విన్, చహల్, సుందర్‌లతో పాటు వరల్డ్‌కప్ ఆడే క్రమంలో ఎవరికీ దారులు మూసుకుపోలేదు’’ అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. చైనామన్ స్పిన్నర్‌కు ప్రాధాన్యం కాగా ఇటీవలి కాలంలో ఆల్రౌండర్లుగా జడ్డూ, అక్షర్ దూసుకుపోతుండగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. విండీస్‌తో మూడు వన్డేల్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో ఆసియా కప్ జట్టులో అతడికి చోటు దక్కడం గమనార్హం. అయితే, చహల్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ‘కుల్చా’ ద్వయాన్ని చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే.. అక్షర్ పటేల్ ఇప్పటి వరకు ఆరు వన్డేల్లో మూడు వికెట్లు తీశాడు. అయితే, చహల్ అనుభవజ్ఞుడైనప్పటికీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల అక్షర్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపింది. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చదవండి: Asia Cup: అయ్యర్, రాహుల్ వచ్చేశారు.. తిలక్ వర్మకు ఛాన్స్.. పాపం సంజూ! -
Ind Vs WI: భారీ రికార్డుపై కన్నేసిన చహల్.. అదే జరిగితే
West Indies vs India, 4th T20I: వెస్టిండీస్‌తో నాలుగో టీ20 నేపథ్యంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ భారీ రికార్డుపై కన్నేశాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యంత అరుదైన ఫీట్ ముంగిట నిలిచాడు. కాగా 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్.. అదే ఏడాది జింబాబ్వేతో మ్యాచ్‌తో టీ20లలో అడుగుపెట్టాడు. హరారే స్పోర్ట్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ పడగొట్టాడు. తొలి మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన చహల్.. అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియా కీలక స్పిన్నర్లలో ఒకడిగా మారాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన ముద్ర వేయగలిగాడు. ఊరిస్తున్న భారీ రికార్డు టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ అదరగొడుతున్న ఈ హర్యానా బౌలర్.. పొట్టి ఫార్మాట్లో సత్తా చాటుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో 14 మ్యాచ్‌లలో 21 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్న యజువేంద్ర చహల్‌ను భారీ రికార్డు ఊరిస్తోంది. సెంచరీ వికెట్ల క్లబ్లో చేరేందుకు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో చహల్ ఇప్పటి వరకు 95 వికెట్లు పడగొట్టాడు. మరో ఐదు వికెట్లు సాధిస్తే.. సెంచరీ వికెట్ల క్లబ్లో అతడు చేరతాడు. అదే జరిగితే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి టీమిండియా బౌలర్‌గా చరిత్రకెక్కుతాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఈ ఫీట్ నమోదు చేసిన ఎనిమిదో బౌలర్‌గా నిలుస్తాడు. పిచ్ సంగతి అలా.. మరి చహల్ ఎలా? కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ ఇప్పటికే 2-1తో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా శనివారం నాటి నాలుగో మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. అయితే, బ్యాటర్లకు స్వర్గధామమైన, పేసర్లకు కాస్త అనుకూలమైన ఫ్లోరిడా పిచ్‌పై చహల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి! ఇక విండీస్‌తో మూడు మ్యాచ్‌లలో కలిపి చహల్ ఇప్పటి వరకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. భారత్, విండీస్ మధ్య ఈ మైదానంలో 6 టి20లు జరగ్గా, భారత్ నాలుగింటిలో గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. గత రెండు మ్యాచ్‌లలో భారత్ 191, 188 స్కోర్లు చేసింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20లలో 100కు పైగా వికెట్లు సాధించిన బౌలర్లు వీరే షకీబల్ హసన్- బంగ్లాదేశ్-140 టిమ్ సౌథీ- న్యూజిలాండ్- 134 రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 130 ఇష్ సోధి- న్యూజిలాండ్-118 లసిత్ మలింగ- శ్రీలంక- 107 షాదాబ్ ఖాన్- పాకిస్తాన్- 104 ముస్తాఫిజుర్ రహమాన్- బంగ్లాదేశ్- 103. చదవండి: తిలక్, యశస్వి బౌలింగ్ చేస్తారు.. ఇకపై: టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు -
చాహల్‌ను కొట్టిన రోహిత్ శర్మ.. పక్కనే ఉన్న కోహ్లి ఏం చేశాడంటే?
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమైంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా డగౌట్ ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ డగౌట్లో కూర్చున్న యుజ్వేంద్ర చాహల్‌ను సరదగా కొట్టాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లి, జయదేవ్ ఉనద్కత్ కూడా చాహల్ పక్కనే కూర్చున్నారు. ఇది చూసిన కోహ్లి నవ్వును ఆపుకోలేకపోయాడు. కాగా చాహల్, రోహిత్ మంచి స్నేహితులుగా చాలా కాలం నుంచి ఉన్నారు. చాహల్ తన ఐపీఎల్ అరంగేట్రం కూడా ముంబై ఇండియన్స్ తరపునే చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా దూరమయ్యాడు. కొత్త ఆటగాళ్లను పరీక్షించేందుకు వీరిద్దరికి విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా చాహల్‌కు తొలి రెండు వన్డేల్లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. రెండో వన్డేలో సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌కు అవకాశం లభించింది. కానీ వారిద్దరూ తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోలేకపోయారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే ట్రినాడాడ్ వేదికగా మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. చదవండి: #Nicholas Pooran: పూరన్ ధనాధన్ ఇన్నింగ్స్! 10 ఫోర్లు, 13 సిక్సర్లతో చెలరేగినా.. లాభం లేదు! IND vs WI: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! Rohit yaar😭😭 pic.twitter.com/t6rlt6KeLe — nidhi (@dumbnids) July 30, 2023 -
టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు..
Team India Cricketers: భారత్‌లో క్రికెట్ మతం లాంటిది. ఇక క్రికెటర్లరంటే పడిచచ్చిపోయే అభిమానులకు కొదవే లేదు. ఇతర క్రీడాకారులెవరికీ లేని విధంగా సూపర్ క్రేజ్ మన క్రికెటర్ల సొంతం. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్ నుంచి సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి దాకా ఎంతోమంది సంచలన రికార్డులు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుల రూపంలో చెల్లిస్తున్న మొత్తం కూడా కళ్లు చెదిరే రీతిలోనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. మరి క్రికెట్ రంగానికి చేసిన, చేస్తున్న సేవలకు గానూ ప్రతిఫలంగా సముచిత గౌరవం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన క్రికెటర్లు ఎవరో తెలుసా?! సముచిత గౌరవం సచిన్ టెండుల్కర్ టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కెరీర్లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించి ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. మేటి బ్యాటర్‌గా ఎదిగి టీమిండియా ముఖచిత్రంగా వెలుగొందాడు. అతడి సేవలను గుర్తించి ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ఇదిలా ఉంటే.. భారత వాయుదళంలో గ్రూప్ కెప్టెన్ హోదా కూడా అందుకున్నాడు సచిన్ టెండుల్కర్. కపిల్ దేవ్ టీమిండియాకు మొట్టమొదటి ప్రపంచకప్ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో కపిల్ డెవిల్స్ వెస్టిండీస్‌ను ఓడించి టైటిల్ సాధించింది. ఇక లెజెండ్ కపిల్ దేవ్‌ను భారత ఆర్మీ 2008లో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించి సముచిత గౌరవం ఇచ్చింది. మహేంద్ర సింగ్ ధోని టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు ధోని. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 సాధించి లెజెండరీ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో మిస్టర్ కూల్‌కు భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకుతో గౌరవించింది. ప్రభుత్వ ఉద్యోగంలో.. హర్భజన్ సింగ్ భారత మేటి స్పిన్నర్లలో భజ్జీ కూడా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏడు వందలకు పైగా వికెట్లు పడగొట్టిన ఈ ఆఫ్ స్పిన్నర్ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో పంజాబ్ పోలీస్.. భజ్జీని డిప్యూటి సూపరిండింటెండ్గా నియమించింది. జోగీందర్ శర్మ టీ20 ప్రపంచకప్-2007 చూసిన వారికి జోగీందర్ శర్మ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాకిస్తాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో జోగీందర్ తీసిన వికెట్‌తో భారత్ రెండోసారి(వన్డే ఫార్మాట్‌తో కలిపి) విశ్వవిజేతగా అవతరించింది. ఈ క్రమంలో జోగీందర్ శర్మకు హర్యానాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా అవకాశం వచ్చింది. ఉమేశ్ యాదవ్ మహారాష్ట్ర పేసర్ ఉమేశ్ యాదవ్ చిన్ననాటి నుంచే భారత త్రివిధదళాల్లో ఏదో ఒక విభాగంలో పనిచేయాలని కల కన్నాడు. కానీ క్రికెటర్ అయ్యాడు. టీమిండియాకు ఆడే అవకాశం దక్కించుకున్న అతడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. నాగ్‌పూర్ శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా అవకాశం కల్పించింది. యజువేంద్ర చహల్ టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పి టీమిండియాకు విజయాలు అందించిన సందర్భాలెన్న! ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పొట్టి ఫార్మాట్లో.. అత్యధికంగా 91 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన ఏకైన టీమిండియా బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇలా భారత క్రికెట్‌కు తన వంతు సేవ చేస్తున్న చహల్‌కు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్.. టాక్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఇక వీరితో పాటు టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సైతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఉంది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం! -
అప్పుడు పీయూశ్ చావ్లా ఆకట్టుకున్నాడు! ఈసారి టీమిండియా: గంగూలీ
ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 ఆరంభానికి దాదాపు మూడు నెలలకు పైగానే సమయం ఉంది. భారత్ వేదికగా పుష్కర కాలం తర్వాత మరోసారి ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనుండటం అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించి ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 5న ప్రపంచకప్ సమరానికి తెరలేవనున్నట్లు గత మంగళవారం ప్రకటించింది. ఆతిథ్య టీమిండియా సహా పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా నేరుగా పోటీకి అర్హత సాధించాయి. మరోవైపు.. మాజీ చాంపియన్ వెస్టిండీస్ క్వాలిఫయర్స్‌లోనే నిష్క్రమించగా.. శ్రీలంక, జింబాబ్వే టాప్-10లో అడుగుపెట్టే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఆ ముగ్గురు ఉంటారు.. అయితే ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ఈవెంట్‌కు సంబంధించి జట్ల కూర్పులపై మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ రిస్ట్ స్పిన్నర్‌ను ఆడించాల్సిన ఆవశ్యకత గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్‌కప్ కోసం ఈసారి టీమిండియా ప్రత్యేకంగా మణికట్టు స్పిన్నర్‌ను ముందుగానే సన్నద్ధం చేసుకోవాలి. నాకు తెలిసి జడేజా, రవిచంద్రన్ అశ్విన్(ఫింగర్ స్పిన్నర్లు), అక్షర్ పటేల్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా అక్షర్.. ఎందుకంటే తను పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్. చహల్‌పై కూడా కన్నేసి ఉంచాలి అయితే.. రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్ వంటి రిస్ట్ స్పిన్నర్లపై కూడా దృష్టి సారించాలి. నిజానికి యజువేంద్ర చహల్ టీ20, వన్డే ఫార్మాట్లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. కానీ చాలా వరకు ప్రధాన టోర్నీల్లో అతడికి అవకాశం రావడం లేదు. కాబట్టి బిష్ణోయి, కుల్దీప్లతో పాటు చహల్‌పై కూడా ఓ కన్నేసి ఉంచాలి’’ అని గంగూలీ పేర్కొన్నాడు. అప్పుడు పీయూశ్ చావ్లా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి జట్లపై రిస్ట్ స్పిన్నర్లు కచ్చితంగా ప్రభావం చూపగలరని అభిప్రాయపడ్డాడు. 2011 వరల్డ్‌కప్‌లో తనకున్న పరిమితిలో పీయూశ్ చావ్లా(మూడు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు) అద్భుతంగా బౌలింగ్ చేశాడంటూ గుర్తు చేశాడు. అదే విధంగా 2007లో సౌతాఫ్రికాలో ఫాస్ట్‌బౌలర్లతో పాటు మణికట్టు మాంత్రికులు కూడా రాణించారని దాదా చెప్పుకొచ్చాడు. ఈసారి ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుంది కాబట్టి రిస్ట్ స్పిన్నర్లకు మరింత అనుకూలంగా ఉంటుందని గంగూలీ పేర్కొన్నాడు. చదవండి: WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్ అద్భుతాలు చేయగలదు! -
వెస్టిండీస్ టూర్‌కు ముందు చాహల్ కీలక నిర్ణయం.. మరో లీగ్‌లో ఆడేందుకు!
ఐపీఎల్-2023 తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వెస్టిండీస్ సిరీస్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టన్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో చాహల్ చోటు దక్కింది. అయితే విండీస్ పర్యటనకు వెళ్లే ముందు చాహల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. చాహల్ గ్లోబల్ చెస్ లీగ్‌లో పాల్గొనేందుకు సిద్దమయ్యాడు. ఈ లీగ్‌లో ఆల్పైన్ వారియర్స్ జట్టుతో చాహల్ జట్టుకట్టాడు. కాగా క్రికెట్, చెస్ రెండింటిలోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు చాహల్ అన్న సంగతి తెలిసిందే. చాహల్ ఓ వైపు క్రికెట్లో బీజీబీజీగా ఉన్నప్పటికీ.. ఖాళీ సమాయాల్లో మాత్రం చెస్మాస్టర్గా మారుతుంటాడు. ఇప్పుడు మరోసారి తన మాస్టర్‌మైండ్‌ను చూపించేందుకు చాహల్ సిద్దమయ్యాడు. కాగా గ్లోబల్ చెస్ లీగ్ ప్రపంచ చెస్ ఫ్రాంచైజీ లీగ్‌లో అత పెద్దది. ఇక ఈ విషయాన్ని చాహల్ కూడా దృవీకరించాడు. స్టీల్ ఆర్మీ(ఆల్పైన్ వారియర్స్) జట్టులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆల్పైన్ వారియర్స్ ఛాంపియన్స్ నిలవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ స్టీల్ ఆర్మీ అంటూ ట్విటర్లో చాహల్ పేర్కొన్నాడు. విండీస్‌తో వన్డేలకు భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్. చదవండి: -
రాజస్తాన్ కెప్టెన్ చాహల్.. మరి శాంసన్ ఎవరు భయ్యా? వీడియో వైరల్
ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ ఆశలను రాజస్తాన్ రాయల్స్ సజీవంగా నిలుపుకుంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన రాజస్తాన్.. ముంబైను వెనుక్కి నెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. రాజస్తాన్ ప్లే ఆఫ్స్ భవితవ్యం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌పై ఆధారపడి ఉంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. రాజస్తాన్, పంజాబ్ మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ భారీ తప్పిదం చేసింది. టాస్ సమయంలో సంజూ శాంసన్ మాట్లాడుతున్నప్పుడు.. రాజస్తాన్ కెప్టెన్‌గా శాంసన్ పేరుగా బదులుగా యుజ్వేంద్ర చాహల్ పేరును కెప్టెన్‌గా ప్రదర్శించారు. 'యుజ్వేంద్ర చాహల్, రాజస్తాన్ కెప్టెన్' అని బోర్డులో కనిపించింది. కాగా టాస్ ముగిసిన కొద్దిసేపటికే ఈ తప్పిదంపై రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంజైజీ ఫన్నీగా స్పందించింది. చాహల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "రాజస్తాన్ కొత్త కెప్టెన్ యుజ్వేంద్ర చాహల్ అంటూ" క్యాప్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్టార్‌స్పోర్ట్స్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. రాజస్తాన్ కెప్టెన్ చాహల్ అయితే, మరి శాంసన్ ఎవరు? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో సంజూ, చాహల్ ఇద్దరూ నిరాశపరిచారు. శాంసన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా.. చాహల్ తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా 40 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా విషయాలు నేర్చుకున్నాం! అందుకే అలా చేశా: ధావన్ 🚨 Toss Update 🚨@rajasthanroyals win the toss and elect to field first against @PunjabKingsIPL. Follow the match ▶️ https://t.co/3cqivbD81R #TATAIPL | #PBKSvRR pic.twitter.com/7j2KjpH0yr — IndianPremierLeague (@IPL) May 19, 2023 -
RR Vs PBKS: చహల్ ఉండగా భయమేల! కానీ అసోంలో మాత్రం..
Rajasthan Royals vs Punjab Kings Predicted Playing XI: ఐపీఎల్-2023 సీజన్‌ను భారీ విజయంతో ఆరంభించిన రాజస్తాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్‌తో పోటీకి సిద్ధమైంది. గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. ఇక తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై స్వల్ప తేడాతో గెలుపొందిన పంజాబ్ సైతం రాజస్తాన్‌తో ఢీ అంటే ఢీ అంటోంది. కాగా తమకు హోం గ్రౌండ్‌గా ఉన్న ఈ స్టేడియంలో రాజస్తాన్ రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత సొంతమైదానం జైపూర్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. మరి అసోంలో వాతావరణం, బర్సపరా స్టేడియంలో పిచ్ పరిస్థితి, తుది జట్లు ఎలా ఉండబోతున్నాయన్న వివరాలు గమనిద్దాం. పిచ్ పరిస్థితి? గతంలో పలు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన అసోం స్టేడియంలో వికెట్ కాస్త బౌన్సీగా ఉంటుంది. పేసర్లకు అనుకూలం. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు సహకరిస్తుంది. గతేడాది అక్టోబరులో ఇక్కడ టీమిండియా- సౌతాఫ్రికా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఒక్కో జట్టు 200 పరుగుల కంటే ఎక్కువ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 16 పరుగుల తేడాతో గెలిచింది. కాబట్టి ఈసారి కూడా హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం లేకపోలేదు. వాతావరణం అసోంలో వర్ష సూచన లేదు. కాబట్టి రాజస్తాన్- పంజాబ్ మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం ఉండకపోవచ్చు. యుజీ ఉండగా భయమేల? వాళ్ల తర్వాత చహల్ మాత్రమే పంజాబ్ కింగ్స్‌పై రాజస్తాన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో యుజీ ఇప్పటి వరకు 28 వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్(34), సునిల్ నరైన్ (33) తర్వాత పంజాబ్‌పై ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ చహల్. ఇక సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి విశ్వరూపం చూపించిన చహల్.. పంజాబ్‌పై కూడా చెలరేగితే రాజస్తాన్‌కు తిరుగు ఉండదు. ఇక పేస్ విభాగంలో బౌల్ట్, హోల్డర్, ఆసిఫ్, సైనీ(తొలి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్) ఉండనే ఉన్నారు. ఇక రాజస్తాన్ టాపార్డర్‌లో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్.. వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. వెరసి ‘హోం గ్రౌండ్’లో రాజస్తాన్‌దే పైచేయి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, టాపార్డర్‌ను దెబ్బకొట్టడం సహా ఫినిషర్ హెట్‌మెయిర్‌ను కట్టడి చేస్తే పంజాబ్ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. ఇక మ్యాచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్లు ఎలాంటి పాత్ర పోషించనున్నారో వేచిచూడాలి. తుది జట్ల అంచనా: రాజస్తాన్ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్‌కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎమ్ ఆసిఫ్, యజ్వేంద్ర చాహల్. పంజాబ్ శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సికందర్ రజా, షారుక్ ఖాన్, సామ్ కరన్, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: అందుకే అక్షర్‌తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు! -
తనకు అన్నీ తెలుసు.. ఎక్కడ బాల్ వేస్తానో కూడా అంచనా వేయగలదు!
IPL 2023- Yuzvendra Chahal- Dhanashree Verma: ‘‘తను నాతో ఉంటే నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మరింత కాన్ఫిడెంట్‌గా ఉంటాను. తనే నా బలం. తన ఉనికి నాలో సానుకూల దృక్పథాన్ని నింపుతుంది. నేను మ్యాచ్ ఆడే సమయంలో తను స్టాండ్స్‌లో ఉండటం నాకిష్టం. తను నన్ను చూసి చిరునవ్వులు చిందిస్తూనే నా ఆట తీరును నిశితంగా పరిశీలిస్తుంది. నేనెలా బౌలింగ్ చేస్తున్నానో గమనిస్తుంది. కొన్నిసార్లు నేను బాల్ ఎక్కడ వేస్తానో కూడా ముందే అంచనా వేస్తుంది. గత కొన్ని వారాల క్రితం నాకు ఈ విషయం తెలిసింది. తను నా పక్కన ఉంటే చాలు. అంతకంటే ఇంకేమీ అవసరం లేదు’’ అంటూ టీమిండియా స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్ ఉద్వేగానికి లోనయ్యాడు. తన భార్య ధన శ్రీ వర్మ ఎల్లవేళలా తనకు మద్దతుగా ఉంటుందంటూ ఆమెపై ఇలా ప్రేమను చాటుకున్నాడు. కాగా యూట్యూబర్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీని చహల్ ప్రేమించి పెళ్లాడాడు. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట.. విడిపోతోందంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ధనశ్రీ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి చహల్ ఇంటిపేరు తొలగించడం, శ్రేయస్ అయ్యర్‌తో దిగిన ఫొటోలు వైరల్ కావడం ఇందుకు కారణం. అయితే, వాటన్నిటికీ చెక్ పెడుతూ తాము కలిసే ఉన్నామని, కలిసే ఉంటామని ప్రకటించి చహల్- ధనశ్రీ దంపతులు అభిమానుల సందేహాలను పటాపంచలు చేశారు. ఇక చహల్ ఎప్పుడు మ్యాచ్ ఆడినా ధనశ్రీ అతడి వెంటే ఉంటుంది. భర్తను చీర్ చేస్తూ అతడి ఘనతలు చూసి పొంగిపోతుంది. ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా కూడా ధనశ్రీ ఉప్పల్ స్టేడియానికి విచ్చేసింది. అతడి అద్భుత ప్రదర్శన నేపథ్యంలో చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపింది. ఈ క్రమంలో భార్య సపోర్టు గురించి చహల్ మాట్లాడిన వీడియోను రాజస్తాన్ తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారని పేర్కొంది. Goals! 💗💗💗 pic.twitter.com/EKT7nDBHsd — Rajasthan Royals (@rajasthanroyals) April 4, 2023 💗💗💗 pic.twitter.com/zdHh2WAzAW — Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023 -
SRH Vs RR: చేతులు కాలాక.. తాపత్రయపడితే ఏం లాభం! 13 కోట్లు.. ఒక్క సిక్సర్ కూడా లేదు!
IPL 2023- Sunrisers Hyderabad vs Rajasthan Royals: ఒక్క మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన లేదు. గెలిపించే భాగస్వామ్యమే రాలేదు. టాప్–5లో ఒక్కరూ కనీసం ఒక్క సిక్స్ అయినా కొట్టలేదు. ఇలాంటి ఆటతో ఐపీఎల్ మ్యాచ్ గెలవాలని ఏ జట్టయినా కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఆదివారం ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట ఇలాగే ఉంది. ముందుగా నియంత్రణ లేని బౌలింగ్‌తో రెండొందలకు పైగా పరుగులు ఇచ్చిన జట్టు ఆ తర్వాత బ్యాటింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత ఇక కోలుకునే అవకాశమే లేకపోయింది. ఫలితమే సొంతగడ్డపై భారీ ఓటమి. అన్ని రంగాల్లో రాణించిన రాజస్తాన్ రాయల్స్ ఘనవిజయంతో తమ సీజన్ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. సాక్షి, హైదరాబాద్: కొత్త ఐపీఎల్ సీజన్(2023)ను సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్తగా ప్రారంభించింది. నాలుగేళ్ల తర్వాత సొంతగడ్డపై జరిగిన తొలి పోరులో పేలవ ప్రదర్శనతో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 72 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జట్టులో టాప్–3 ఆటగాళ్లు అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోస్ బట్లర్ (22 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ సంజూ సామ్సన్ (32 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 54; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు చేసి ఓడిపోయింది. అబ్దుల్ సమద్ (32 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ చహల్ (4/17) ఆకట్టుకున్నాడు. ఓపెనర్ల జోరు... పవర్‌ప్లేలో ఇద్దరు రాజస్తాన్ ఓపెనర్లు యశస్వి, బట్లర్ విధ్వంసం సృష్టించారు. సన్‌రైజర్స్ తాత్కాలిక కెప్టెన్ భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో 6 పరుగులే వచ్చినా... ఆ తర్వాతి ఐదు ఓవర్లలో రాయల్స్ వరుసగా 14, 17, 19, 17, 12 పరుగులు రాబట్టింది. భువీ ఓవర్లో యశస్వి రెండు ఫోర్లు, బట్లర్ సిక్స్ కొట్టగా... వాషింగ్టన్ సుందర్ ఓవర్లో వరుస బంతుల్లో బట్లర్ రెండు సిక్స్‌లు బాదాడు. ఆపై నటరాజన్ ఓవర్లో బట్లర్ 4 ఫోర్లుతో చెలరేగాడు. ఫజల్ ఓవర్లో కూడా 3 ఫోర్లు కొట్టి 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్ అదే ఓవర్లో వెనుదిరిగాడు. దాంతో 85 పరుగుల (35 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. 7.4 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 100 పరుగులకు చేరింది. ఈ దశలో రాయల్స్ ఇన్నింగ్స్ బాధ్యతను కెప్టెన్ సామ్సన్ తీసుకున్నాడు. సామ్సన్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించగా, మరోవైపు 34 బంతుల్లో యశస్వి హాఫ్ సెంచరీ పూర్తయింది. ఉమ్రాన్ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన సామ్సన్, అతని తర్వాతి మరో ఫోర్, సిక్స్ బాదాడు. తక్కువ వ్యవధిలో రాజస్తాన్ జట్టు యశస్వి, దేవదత్ పడిక్కల్ (2), రియాన్ పరాగ్ (7) వికెట్లను కోల్పోగా, 28 బంతుల్లో సామ్సన్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చేతులు కాలాక హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయడంతో 7–15 మధ్య తొమ్మిది ఓవర్లలో రాజస్తాన్ 75 పరుగులు చేసింది. ఆపై డెత్ ఓవర్లలో కూడా స్కోరును పెంచుకోవడంలో రాయల్స్ విఫలమైంది. మరోసారి హైదరాబాద్ బౌలర్లు చక్కటి బంతులతో ప్రత్యర్థిని నిరోధించగలిగారు. ఆఖరి ఐదు ఓవర్లలో సామ్సన్ వికెట్ కోల్పోయి రాజస్తాన్ 43 పరుగులే సాధించగలిగింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం కారణంగానే ఆ జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. సమష్టి వైఫల్యం... భారీ లక్ష్య ఛేదనలో రైజర్స్‌కు ఆరంభంలోనే దెబ్బ పడింది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ (0), రాహుల్ త్రిపాఠి (0) వెనుదిరిగారు. పేలవ ప్రదర్శన కారణంగా పవర్‌ప్లేను హైదరాబాద్ 30 పరుగులతోనే ముగించింది. ఘనమైన రికార్డులు, ఎన్నో అంచనాలతో తొలిసారి ఐపీఎల్లో అడుగు పెట్టిన ఇంగ్లండ్ హిట్టర్ హ్యారీ బ్రూక్ (21 బంతుల్లో 13; 1 ఫోర్) ప్రభావం చూపలేకపోయాడు. 13.25 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అతడు.. తొలి మ్యాచ్‌లో కనీసం ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. యజువేంద్ర చహల్ బౌలింగ్‌లో బ్రూక్ బౌల్డయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ (8) కూడా విఫలం కావడంతో 48 పరుగుల వద్ద హైదరాబాద్ సగం టీమ్ డగౌట్ చేరింది. తప్పనిసరి పరిస్థితుల్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 27; 3 ఫోర్లు) అవుట్ కావడంతో సన్‌రైజర్స్ గెలుపు ఆశలు కోల్పోయింది. చివర్లో సమద్ కొన్ని మెరుపులు మెరిపించినా అప్పటికే బాగా ఆలస్యమైపోయింది. ఇన్నింగ్స్ ఆఖరి రెండు ఓవర్లలో సమద్ 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టగా, ఉమ్రాన్ (19 నాటౌట్) 2 సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు. సన్‌రైజర్స్ తన తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఆడుతుంది. IPL 2023 SRH Vs RR Scorecard: స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) మయాంక్ (బి) ఫజల్ 54; బట్లర్ (బి) ఫజల్ 54; సామ్సన్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 55; పడిక్కల్ (బి) ఉమ్రాన్ 2; పరాగ్ (సి) ఫజల్ (బి) నటరాజన్ 7; హెట్‌మైర్ (నాటౌట్) 22; అశ్విన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–85, 2–139, 3–151, 4–170, 5–187. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–36–0, ఫజల్ హఖ్ 4–0–41–2, సుందర్ 3–0–32–0, నటరాజన్ 3–0–23–2, ఆదిల్ రషీద్ 4–0–33–0, ఉమ్రాన్ 3–0–32–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) బౌల్ట్ 0; మయాంక్ (సి) బట్లర్ (బి) చహల్ 27; త్రిపాఠి (సి) హోల్డర్ (బి) బౌల్ట్ 0; హ్యారీ బ్రూక్ (సి) చహల్ 13; సుందర్ (సి) హెట్‌మైర్ (బి) హోల్డర్ 1; ఫిలిప్స్ (సి) ఆసిఫ్ (బి) అశ్విన్ 8; సమద్ (నాటౌట్) 32; రషీద్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 18; భువనేశ్వర్ (బి) చహల్ 6; ఉమ్రాన్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–34, 4–39, 5–48, 6–52, 7–81, 8–95. బౌలింగ్: బౌల్ట్ 4–1–21–2, ఆసిఫ్ 3–0–15–0, హోల్డర్ 3–0–16–1, అశ్విన్ 4–0–27–1, చహల్ 4–0–17–4, నవదీప్ సైనీ 2–0–34–0. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Easy as you like 😉@yuzi_chahal wins the battle of the spinners 👌👌 Follow the match ▶️ https://t.co/khh5OBILWy#TATAIPL | #SRHvRR pic.twitter.com/7yIPE3juHm — IndianPremierLeague (@IPL) April 2, 2023 -
నెట్టింట చహల్ భార్య ధనశ్రీ వర్మ ఫొటోలు వైరల్.. ఈసారి కూడా!
Yuzvendra Chahal- Dhanashree Verma: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ సతీమణి, యూట్యూబర్ ధనశ్రీ వర్మకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, వృత్తిగత అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుందామె. ఇన్‌స్టాగ్రామ్‌లో ధనశ్రీకి యాభై లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఆమె పోస్టులకు లక్షల్లో లైకులు రావడం సహా అదే స్థాయిలో కొన్నిసార్లు ట్రోలింగ్ బారిన పడుతుందామె. గతంలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్- దేవిషా శెట్టి దంపతులతో పాటు.. మరో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో ఆమె దిగిన ఫొటో పలు అనుమానాలకు తావిచ్చింది. అప్పటికే తన ఇన్‌స్టా అకౌంట్లో ధనశ్రీ భర్త ఇంటి పేరును తొలగించడం.. ఆపై ఇలా వేరే క్రికెటర్‌తో కలిసి కనిపించడంతో విడాకుల వార్తలు తెరమీదుకు వచ్చాయి. చహల్- ధనశ్రీ స్వయంగా తాము కలిసే ఉంటున్నామని చెప్పిన తర్వాతే రూమర్లకు అడ్డుకట్ట పడింది. తాజాగా.. టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ సంగీత్‌లో పాల్గొన్న ధనశ్రీ షేర్ చేసిన ఫొటోలు మరోసారి నెట్టింట చర్చకు దారితీశాయి. పెళ్లికొడుకు శార్దూల్‌తో కలిసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- రితికా సజ్దే దంపతులు, ధనశ్రీ, శ్రేయస్ అయ్యర్ ఫొటో దిగారు. వీటిని ఇన్‌స్టాలో పంచుకున్న ధనశ్రీ 5 ఎక్స్ పవర్ అంటూ ఫైర్ ఎమోజీని జత చేసింది. దీంతో అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘చహల్ భాయ్ ఎక్కడ? మీరు ప్రతిసారి భాయ్‌ను కావాలనే అవాయిడ్ చేస్తారా? రూమర్లు రావాలని కోరుకుంటారా? అప్పుడు ఆ ఫొటోలతో.. ఇప్పుడు ఈ ఫొటోలతో ఎందుకిలా వదినమ్మా? చహల్ భయ్యా కూడా ఉంటే బాగుండేది’’ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘అప్పుడలా.. ఇప్పుడలా? ఏదో మతలబు ఉంది’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇలా ధనశ్రీ పేరు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే.. స్వదేశంంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో చహల్‌కు చోటు దక్కలేదు. చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్ బ్యాటర్ వల్లేనన్న ఆజం ఖాన్! ‘స్కై’తో నీకు పోలికేంటి? T20 WC 2023: అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒకే ఒక్కరు! View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
Ind Vs NZ: అతడిని కొనసాగించాల్సిందే.. పృథ్వీ షాను ఆడించండి!
India vs New Zealand, 3rd T20I- Predicted Playing XI: టీ20 సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది టీమిండియా. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని హార్దిక్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. 1955 నుంచి ఏ ఫార్మాట్లో కూడా భారత గడ్డపై సిరీస్ గెలవలేకపోయిన కివీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి అరుదైన రికార్డు సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య బుధవారం జరుగనున్న మూడో టీ20 మరింత రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో భారత తుది జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉమ్రాన్ వద్దు యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ టీ20 ఫార్మాట్లో మరింత రాటుదేలాల్సి ఉందన్న వసీం.. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ యజువేంద్ర చహల్‌నే మూడో టీ20లోనూ కొనసాగించాలని సూచించాడు. అదే విధంగా తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను తప్పించాలని.. అతడి స్థానంలో పృథ్వీ షాను ఆడించాలని విజ్ఞప్తి చేశాడు. ‘‘న్యూజిలాండ్ బ్యాటర్లు.. స్పిన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు. టీమిండియాకు చహల్ లాంటి అద్భుతమైన స్పిన్నర్ అందుబాటులో ఉన్నపుడు తప్పక అతడి సేవలు వినియోగించుకోవాలి. గతంలో నేను.. చెప్పినట్లుగానే ఉమ్రాన్ మాలిక్ ఇంకా పొట్టి ఫార్మాట్లో పూర్తిస్థాయిలో రాణించలేకపోతున్నాడు. పేస్‌లో వైవిధ్యం చూపిస్తేనే అనుకున్న ఫలితం రాబట్టగలడు. కాబట్టి మూడో టీ20లోనూ చహల్‌ను కొనసాగించాలి. అతడే బెటర్ ఆప్షన్’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ వసీం జాఫర్ వ్యాఖ్యానించాడు. పృథ్వీ షాను తీసుకురండి అదే విధంగా.. ‘‘టీమిండియా ఏమైనా మార్పులు చేయాలనుకుంటే.. శుబ్‌మన్ గిల్ స్థానంలో పృథ్వీ షాను తీసుకురావాలి. టీ20 క్రికెట్లోనూ అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠిల విషయంలో మాత్రం నాకెలాంటి ఆందోళనా లేదు’’ అని జాఫర్ చెప్పుకొచ్చాడు. కాగా కివీస్‌తో వన్డేలో సిరీస్‌లో డబుల్ సెంచరీ, శతకంతో చెలరేగిన గిల్.. టీ20లలో మాత్రం జోరు చూపించలేకపోతున్నాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో కేవలం 7, 11 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. మరోవైపు.. దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న పృథ్వీ షా చాలా కాలం తర్వాత టీమిండియాకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టీ20 తుది జట్ల అంచనా భారత్: శుబ్‌మన్ గిల్/పృథ్వీ షా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్‌పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్ న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఇష్ సోది, జాకోబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లేయిర్ టిక్నర్. చదవండి: Nitish Rana: నెగెటివ్ ట్వీట్‌ను లైక్ చేసిన క్రికెటర్.. కోపాన్ని చెప్పకనే చెప్పాడు KL Rahul: పెళ్లి వేడుక ముగిసింది.. ప్రాక్టీస్ మొదలైంది -
WC 2023: చహల్ కంటే అతడు బెటర్.. కుల్దీప్ కూడా..: టీమిండియా మాజీ సెలక్టర్
ICC ODI World Cup 2023- Kul-Cha Spin Duo: ‘‘సుదీర్ఘ కెరీర్లో ప్రతి బౌలర్ కెరీర్లో ఇలాంటి దశను ఎదుర్కోవడం సహజం. ప్రస్తుతం చహల్ అదే స్థితిలో ఉన్నాడు. మేనేజ్మెంట్ను రిక్వెస్ట్ చేసి తను దేశవాళీ క్రికెట్ ఆడితే బాగుంటుంది. పూర్తిస్థాయిలో తిరిగి ఫామ్‌లోకి రావాలంటే తను వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలి. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా చహల్ ఈ మేరకు సన్నద్ధం కావాల్సి ఉంది’’ అని టీమిండియా మాజీ సెలక్టర్ సునిల్ జోషి అన్నాడు. ఇక వన్డే ప్రపంచకప్-2023 నేపథ్యంలో తానైతే ‘కుల్-చా’ స్పిన్ ద్వయంలో కుల్దీప్ యాదవ్‌కే ఓటు వేస్తానని పేర్కొన్నాడు. చహల్ ఇప్పటి వరకు ఇలా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు వన్డేల్లో మూడు వికెట్లు పడగొట్టాడు లెగ్‌బ్రేక్ స్పిన్నర్ యజువేంద్ర చహల్. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 2/43, శ్రీలంకతో వన్డేలో 1/58 గణాంకాలు నమోదు చేశాడు. ఇక టీ20ల విషయానికొస్తే.. ఇప్పటి వరకు నాలుగు వికెట్లు చహల్ ఖాతాలో ఉన్నాయి. జడ్డూ ఉంటాడు.. బ్యాకప్‌గా అతడే ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో ముచ్చటించిన సునిల్ జోషి.. తన ప్రపంచకప్ జట్టులో చహల్‌కు చోటు ఇవ్వలేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు.. ‘‘15 మంది సభ్యులతో కూడిన జట్టు గురించి మాట్లాడినట్లయితే.. నా టీమ్‌లో జడేజా ఉంటాడు. ఒకవేళ తను ఫిట్‌గా లేనట్లయితే బ్యాకప్‌గా అక్షర్ పటేల్ ఉండాలి. ఆ తర్వాత వాషీ(వాషింగ్టన్ సుందర్). ఒకవేళ మరో లెగ్‌బ్రేక్ స్పిన్నర్ కావాలనుకుంటే రవి బిష్ణోయి జట్టులో ఉండాలి. ఎందుకంటే రవి నిలకడైన ప్రదర్శన కనబరచగలడు. వరుస విరామాల్లో వికెట్లు తీయగల సత్తా అతడికి ఉంది. అంతేకాదు.. రవి బిష్ణోయి.. చహల్ కంటే మెరుగ్గా ఫీల్డింగ్ చేయగలడు’’ అని సునిల్ జోషి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. భిన్న పరిస్థితుల నడుమ ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి చెబుతూ.. ‘‘కుల్దీప్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే, మరింత నిలకడగా రాణించాల్సి ఉంది. భారత్‌లో ప్రపంచకప్ జరుగబోతోంది. ఇక్కడ విభిన్న తరహా మైదానాలు ఉన్నాయి. పిచ్, వాతావరణ పరిస్థితులు ఎక్కడిక్కడ భిన్నంగా ఉంటాయి. కాబట్టి వరల్డ్‌కప్‌లో ఒక్కో జట్టును ఒక్కో మైదానంలో ఎదుర్కొనేందుకు ఏ మేర సంసిద్ధమవుతాడనే అంశం మీదే తన ప్రదర్శన ఆధారపడి ఉంటుంది’’ అని సునిల్ జోషి చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో కూడా కుల్దీప్ పాత్ర కీలకం కానుందని సునిల్ అంచనా వేశాడు. అదరగొడుతున్న కుల్దీప్ ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో రెండు వన్డేల్లో ఐదు వికెట్లు కూల్చిన కుల్దీప్.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో రెండు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ తర్వాత ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: న్యూజిలాండ్‌లా కాదు.. పాక్ ప్రధాన బలం అదే! అందుకే టీమిండియా బ్యాటర్లు..: పాక్ మాజీ బౌలర్ Savitri Devi: నిందలు పడి కూతుర్ని విజేతను చేసింది -
Ind Vs NZ: ఎట్టకేలకు వాళ్లిద్దరికి ఛాన్స్.. సిరాజ్, షమీ అవుట్
India vs New Zealand, 3rd ODI: న్యూజిలాండ్‌తో ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చిన మేనేజ్మెంట్.. ఉమ్రాన్ మాలిక్, యజువేంద్ర చహల్‌కు తుది జట్టులో చోటిచ్చింది. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కాగా గత రెండు మ్యాచ్‌లలో ఉమ్రాన్ మాలిక్, చహల్‌కు బెంచ్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పర్యాటక కివీస్ మంగళవారం నాటి ఇండోర్ వన్డేలో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ పాతబడే కొద్ది బ్యాటింగ్‌కు మరింత అనుకూలిస్తుంది. చిన్న గ్రౌండ్ కాబట్టి భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. ఇక్కడ మేము మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నాడు. జాకోబ్ డఫీ స్థానంలో హెన్రీ షిప్లేను ఆడిస్తున్నామని.. తమ జట్టులో ఇదొక్కటే మార్పు అని తెలిపాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే తుది జట్లు టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, ఉమ్రాన్ మాలిక్. న్యూజిలాండ్ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, జాకోబ్ డఫీ, బ్లేయర్ టిక్నర్ చదవండి: Mohammed Shami: షమీకి ఏడాదికి రూ. 7 కోట్లు! నెలకు 10 లక్షల భరణం ఇవ్వలేరా? కోర్టు తీర్పు ఇదే Rohit Sharma: రోహిత్ కెరీర్‌ను మలుపు తిప్పిన ధోని నిర్ణయం.. దశాబ్ద కాలంగా.. సూపర్ ‘హిట్టు’! -
టీమిండియాతో జూనియర్ ఎన్టీఆర్.. ఫొటో వైరల్!
గతేడాది ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లిన తారక్ ఇండియాకు తిరిగి వచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా విదేశాలకు వెళ్లిన యంగ్ టైగర్ న్యూ ఇయర్‌ను అక్కడే సెలబ్రెట్ చేసుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించిన సందర్భంగా మూవీ టీం, రామ్ చరణ్‌తో పాటు తన భార్య ప్రణతితో కలిసి అమెరికాలో సందడి చేశాడు. ఇక ఈ సందడి అనంతరం ఎన్టీఆర్ ఇండియాకు తిరిగొచ్చాడు. చదవండి: చిరంజీవి మెసేజ్‌లను అవాయిడ్ చేసిన స్టార్ యాంకర్! అసలేం జరిగిందంటే.. అయితే తాజాగా తారక్‌ను టీమిండియా కలిసిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం భారత జట్టు హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత జట్టులోని పలువురు క్రికెటర్లు తారక్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తో సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్, శార్దుల్, శుభమాన్ గిల్‌తో పాటు పలువురు ఉన్నారు. అయితే వీరు ఎక్కడ కలిశారన్నది మాత్రం క్లారిటీ లేదు. వారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఫుల్ లైటింగ్ సెట్, కార్లు ఉన్నాయి. చదవండి: విజయ్ వారసుడు ఓటీటీ స్ట్రీమింగ్ ఇక్కడే! అంతకు ముందే రిలీజ్? చూస్తుంటే ఇది ఓ లగ్జరీ కారు షోరూంలా కనిపిస్తోంది!. కాగా శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఘనంగా ముగించిన టీమిండియా సోమవారం (జనవరి 16న) హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జనవరి18న (బుధవారం) జరగనుంది. ఈ నేపథ్యంలో నిన్న భారత జట్టు హైదరాబాద్ చేరుకుంది. -
ఇంట్లో కూర్చుంటారా? కొరడా ఝులిపించిన బీసీసీఐ! రంగంలోకి సూర్య, చహల్
BCCI Directive To Players To Feature in Ranji Trophy During Beak?!: ఈ ఏడాది ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ ఈవెంట్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ గెలిచినా.. వన్డే సిరీస్ ఓడింది. అదే తరహాలో బంగ్లాదేశ్ చేతిలో కూడా పరాజయం పాలైంది. ఈ క్రమంలో తీవ్ర విమర్శలపాలైంది భారత జట్టు. ఇంట్లో కూర్చోవద్దు! ఇక టీ20 ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత సెలక్షన్ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ.. పలు ప్రక్షాళన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల పట్ల కూడా కఠిన వైఖరి అవలంబించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే జాతీయ జట్టుకు ఎంపిక కాని తరుణంలో విశ్రాంతికి పరిమితం కాకుండా.. దేశవాళీ క్రికెట్ ఆడటంపై దృష్టి సారించాల్సిందిగా క్రికెటర్లను ఆదేశించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలోని ఆఫీస్ బేరర్ల కొత్త బృందం.. క్రాంటాక్ట్ ప్లేయర్లు కచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రంగంలోకి సూర్య, చహల్ టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్ సహా స్పిన్నర్ యజువేంద్ర చహల్ తాజాగా రంజీ ట్రోఫీలో భాగం కావడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ రౌండ్లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి యువ క్రికెటర్లు తమ జట్ల తరఫున రంజీ బరిలో దిగగా.. డిసెంబరు 20న మొదలైన రెండో రౌండ్లో సూర్య, చహల్ కూడా వచ్చి చేరారు. ఈ విషయాల గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడారు. దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే ‘‘ఇటీవలి కాలంలో చాలా మంది భారత ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. ఫిట్‌గా ఉండాలంటే వాళ్లకు కచ్చితంగా ప్రాక్టీసు ఉండాలి. అన్ని ఫార్మాట్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండగలగాలి. అధ్యక్షుడు సూచించినట్లుగా టీమిండియా క్రికెటర్లందరూ దేశవాళీ క్రికెట్లోనూ ఆడాల్సి ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. కాగా ముంబై తరఫున మంగళవారం రంగంలోకి దిగిన సూర్య.. వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడుతూ మెరుపు ఇన్నింగ్స్(80 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్ సాయంతో 90 పరుగులు) ఆడాడు. రంజీ ట్రోఫీ ఆడుతున్న టీమిండియా ప్లేయర్లు ►సూర్యకుమార్ యాదవ్(ముంబై) ►యజువేంద్ర చహల్(హర్యానా) ►సంజూ శాంసన్(కేరళ) ►ఇషాన్ కిషన్(జార్ఖండ్) ►దీపక్ హుడా(రాజస్తాన్) ►హనుమ విహారి(ఆంధ్ర) ►ఇషాంత్ శర్మ(ఢిల్లీ) ►మయాంక్ అగర్వాల్(కర్ణాటక) ►అజింక్య రహానే(ముంబై) ►వృద్ధిమాన్ సాహా(త్రిపుర) చదవండి: వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు శతక్కొట్టిన దీపక్ హుడా.. 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో..! IPL 2023 Mini Auction: విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేయగలిగేది, సన్‌రైజర్స్ కెప్టెన్ కూడా అతడే! -
వర్షంతో మ్యాచ్ రద్దు.. వింత గేమ్ ఆడిన భారత్, కివీస్ ఆటగాళ్లు
న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరగాల్సిన తొలి టి20 వర్షార్పణమయింది. ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు కావడం అభిమానులను నిరాశపరిచింది. కనీసం టాస్ వేసే పరిస్థితులు లేకపోవడం.. మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్ రద్దుకే మొగ్గుచూపారు. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా రెండో టి20 మౌంట్ మౌంగానుయ్ వేదికగా ఆదివారం(నవంబర్ 20న) జరగనుంది. ఈ సంగతి పక్కనబెడితే.. వర్షంతో మ్యాచ్ రద్దు కావడంతో టీమిండియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు కలిసి ఒక కొత్త గేమ్ ఆడారు. ఫుట్‌వాలీ పేరుతో ఆడిన ఈ గేమ్‌లో ఏకకాలంలో ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడడంతో ఫుట్‌వాలీ అని పేరు పెట్టారు. స్కై స్టేడియం లోపల ఉన్న ఇండోర్ స్టేడియంలో మధ్యలో కుర్చీలు పెట్టి ఒకవైపు టీమిండియా ఆటగాళ్లు చహల్ సహా మరో ఇద్దరు ఆడగా.. అటు న్యూజిలాండ్‌వైపు కేన్ విలియమ్సన్ సహా మరో ఇద్దరు ఉన్నారు. ఇక మధ్యలో సంజూ శాంసన్, ఇష్ సోదీలు వారి ఆటను గమనిస్తూ ఎంకరేజ్ చేశారు.వర్షంతో మ్యాచ్ రద్దు కావడంతో టీమిండియా, కివీస్ ఆటగాళ్లు వింత గేమ్ ఆడి అభిమానులను కనీసం ఇలాగైనా ఎంటర్టైన్ చేశారంటూ కొందరు కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ, బ్లాక్స్‌క్యాప్స్ తమ ట్విటర్లో షేర్ చేసుకున్నాయి. #TeamIndia and New Zealand team enjoy a game of footvolley as we wait for the rain to let up.#NZvIND pic.twitter.com/8yjyJ3fTGJ — BCCI (@BCCI) November 18, 2022 Football volleyball while we wait for the rain to pass 🤞 ⚽️#NZvIND #CricketNation pic.twitter.com/dTU5Z2NbqH — BLACKCAPS (@BLACKCAPS) November 18, 2022 చదవండి: ఆగని వర్షం.. భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 రద్దు -
T20 WC: ప్రపంచకప్ జట్టులో చోటు దక్కనందుకు నేనేమీ నిరాశ చెందలేదు! అయితే..
T20 World Cup 2022 Indian Squad: ‘‘ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడం పట్ల నేనేమీ నిరాశ చెందలేదు. నా ఆటను మెరుగుపరచుకోవడంపైనే ప్రస్తుతం దృష్టి సారించాను. అందుకు తగ్గట్లుగా రోజురోజుకూ మెరుగవుతున్నాననే అనుకుంటున్నా’’ అని అన్నాడు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఉత్తమ ఆటగాళ్లలో అత్యుత్తమ ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కుతుంది.. కాబట్టి తానేమీ నిరుత్సాహపడలేదని వ్యాఖ్యానించాడు. చాలా రోజుల తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు ఈ చైనామన్ స్పిన్నర్. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా.. మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్‌లతో కలిసి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు కుల్దీప్ యాదవ్. తద్వారా పర్యాటక సౌతాఫ్రికాను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించి.. టీమిండియా విజయంలో పాలుపంచుకున్నాడు. మొత్తంగా 4.1 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్.. 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కకపోవడంపై పైవిధంగా స్పందించాడు. ఇక తాను వన్డేల్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తానన్న కుల్దీప్‌నకు... మరో స్పిన్ బౌలర్ యజ్వేంద్ర చహల్ గురించి ప్రశ్న ఎదురైంది. మీ స్పిన్ పార్ట్నర్ను మిస్ అవుతున్నారా అడుగగ్గా.. ‘‘ఇది నన్ను ఇరుకున పెట్టే ప్రశ్న(నవ్వుతూ). తను ఇప్పుడు.. టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. తను అక్కడ బాగా రాణించాలని కోరుకుంటున్నా. నేను ఇక్కడ వన్డేల్లో ఆడుకుంటా’’ అంటూ క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. కాగా తొలి మ్యాచ్‌లో సఫారీల చేతిలో ఓటమి పాలైన ధావన్ సేన.. ఆఖరి రెండు వన్డేల్లో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్-2022 భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్. స్టాండ్‌బై ప్లేయర్స్: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చహర్. చదవండి: T20 WC: ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా ఓటములకు కారణం అదే! మరీ పిరికిగా.. ఈసారైతే వాళ్లిద్దరు లేరు! దగా పడ్డ గంగూలీ.. ఐసీసీ పదవి కూడా లేనట్టే..! సిరాజ్‌తో కుల్దీప్ ముచ్చట.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ From getting close to picking up another hat-trick to winning Player of the Series award! Bowling stars @imkuldeep18 & @mdsirajofficial discuss it all as #TeamIndia win the #INDvSA ODI series. 👍 👍 - By @ameyatilak Full interview 🎥 🔽 https://t.co/JU9g2EqPte pic.twitter.com/DM1sj5PKr4 — BCCI (@BCCI) October 12, 2022 -
T20 WC 2022: ఈ ముగ్గురిని ఎంపిక చేసి తప్పుచేశారా? వీళ్లకు బదులు..
T20 World Cup 2022- Indian Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు ఇప్పటికే జట్లను ప్రకటించాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం సెప్టెంబరు 12న 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. నలుగురిని స్టాండ్ బైగా ఎంపిక చేసింది. ఇక వరల్డ్‌కప్ కంటే ముందు రోహిత్ సేన స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. అయితే, 2-1తో ట్రోఫీ కైవసం చేసుకున్నప్పటికీ బౌలింగ్ వైఫల్యం, ఫీల్డింగ్ తప్పిదాలు కలవరపెట్టే అంశాలుగా పరిణమించాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ ప్రధాన జట్టుకు ఎంపికైన కొంతమంది క్రికెటర్ల ఆట తీరు ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లను బీసీసీఐ ఎందుకు సెలక్ట్ చేసిందా? అని చాలా మంది పెదవి విరుస్తున్నారు. యజువేంద్ర చహల్ టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌లలో తుది జట్టులో చోటు దక్కించుకున్న అతడు 9.12 ఎకానమీతో బౌలింగ్ చేసి.. రెండే రెండు వికెట్లు తీశాడు. ఇక ఆసియా కప్-2022 టీ20 టోర్నీలోనూ సూపర్-4లో శ్రీలంకతో మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడం మినహా తన స్థాయికి తగ్గట్లు రాణించలేక నిరాశపరిచాడు యుజీ. ముఖ్యంగా స్లోగా బంతులు వేయడంలో విఫలమవుతున్నాడు. సమకాలీన లెగ్ స్పిన్నర్లు ఆస్ట్రేలియాకు చెందిన ఆడం జంపా, అఫ్గనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ మాదిరి రాణించలేకపోతున్నాడు. దీంతో.. అతడి స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయిని ప్రధాన జట్టుకు ఎంపిక చేసినా బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అనుభవం దృష్ట్యా యుజీకి ఓటు వేయడమే సబబు అంటున్నారు అతడి ఫ్యాన్స్. భువనేశ్వర్ కుమార్ టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరుగాంచిన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తేలిపోయాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన ఈ స్పీడ్‌స్టర్ 91 పరుగులు సమర్పించుకున్నాడు. గతేడాది వరకు టీమిండియా టీ20 అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా కొనసాగిన ఈ స్వింగ్ సుల్తాన్.. గాయం కారణంగా కొన్నిరోజులు జట్టుకు దూరమయ్యాడు. అయితే, తిరిగి జట్టులోకి వచ్చినా అవకాశాల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా డెత్‌ఓవర్లలో ఒత్తిడిని అధిగమించలేక విఫలమవుతున్నాడు. ఆసియా కప్-2022 టీ20 టోర్నీ, ఆసీస్‌తో సిరీస్‌లో డెత్ ఓవర్లలో అతడి వైఫల్యం కనబడింది. నకుల్ బాల్స్, కట్టర్లు వేయడంలో దిట్ట అయిన భువీ ప్రస్తుతం ఫామ్‌లేమితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వెటరన్ పేసర్‌కు బదులు స్టాండ్ బైగా ఉన్నా దీపక్ చహర్‌ను ఎంపిక చేసినా బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీపక్ హుడా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న దీపక్ హుడా.. ఆసీస్‌తో సిరీస్‌కు సైతం ఎంపికయ్యాడు. అయితే, ఒక్క మ్యాచ్‌లోనూ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇక వెన్ను నొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. దీంతో.. ప్రపంచకప్ స్టాండ్ బై ప్లేయర్లలో ఒకడిగా ఉన్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో దీపక్ స్థానాన్ని భర్తీ చేశారు. నిజానికి దీపక్ టాపార్డర్‌లో మెరుగ్గా రాణించగలడు. అవసరమైనపుడు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఒకవేళ గాయం నుంచి కోలుకుని ప్రపంచకప్ ఆరంభ సమయానికి అతడు అందుబాటులో ఉన్నా.. అతడు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా.. ఈ ఐదుగురు కచ్చితంగా తుది జట్టులో ఉంటారు. కాబట్టి టాపార్డర్‌లో దీపక్ హుడాతో పనిలేదు. ఇక బౌలింగ్ కారణంగా ఆల్‌రౌండర్ల జాబితాలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయనుకున్నా.. అక్షర్ పటేల్ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అదీ అసాధ్యంగానే కనిపిస్తుంది. అందుకే హుడాను ప్రపంచకప్‌నకు సెలక్ట్ చేసి కూడా పెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బ్యాకప్ బ్యాటర్ కావాలనుకుంటే లెఫ్ట్ హ్యాండర్ ఇషాన్ కిషన్ లేదంటే విలక్షణమైన బ్యాటర్‌గా పేరొందిన సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినా బాగుండేదంటున్నారు విశ్లేషకులు. జట్టులో మార్పునకు సమయం ఉన్న తరుణంలో ఇప్పటికైనా మార్పులుచేర్పులు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. చదవండి: Sandeep Lamichhane: స్టార్ క్రికెటర్ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు -
T20 WC: మరీ ఇంత దారుణమా? టీమిండియా ట్రోఫీ గెలవడం కష్టమే!
T20 World Cup 2022- Team India: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో టీమిండియా విజయావకాశాలపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందని.. ఇలాంటి జట్టుతో ట్రోఫీ గెలవడం కష్టమేనని పేర్కొన్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మొదటి టీ20లో 208 పరుగుల భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్ కాపాడుకోలేకపోయారని విమర్శించిన ఆకాశ్ చోప్రా.. టీమిండియా బౌలర్ల ఆట తీరు ఇలాగే ఉంటే మెగా టోర్నీలో ముందుకు వెళ్లడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చెత్త ఫీల్డింగ్, బౌలింగ్! ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు స్వదేశంలో ఆసీస్, దక్షిణాఫ్రికాతో టీమిండియా వరుస సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా కంగారూలతో తొలి టీ20లో 208 పరుగులు చేసిన టీమిండియా.. చెత్త ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అదే విధంగా.. ఆసియా కప్-2022లో సూపర్-4 దశలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సైతం టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌లోనూ ఓడి ఫైనల్ కూడా చేరకుండానే నిష్క్రమించింది ఈ డిఫెండింగ్ చాంపియన్. కాగా గాయం కారణంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మరో ఫాస్ట్‌బౌలర్ హర్షల్ పటేల్ ఈ టోర్నీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీళ్లతో ట్రోఫీ గెలవడం కష్టమే ఈ పరిణామాల నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తి చూపాడు. ముఖ్యంగా యజువేంద్ర చహల్ ఆట తీరుపై పెదవి విరిచాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘నా అభిప్రాయం ప్రకారం.. టీమిండియా బౌలింగ్ విభాగం బలహీనంగా ఉంది. వికెట్లు తీసే బౌలర్ ఒక్కరూ కనబడటం లేదు. లెగ్ స్పిన్నర్ యుజీ చహల్ ఫాస్ట్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. ఆసియా కప్‌లోనూ ఇలాగే ఆడాడు. స్లోవర్ బాల్స్ వేయకుండా అతడు వికెట్లు ఎలా తీస్తాడు? ఇక ఇప్పుడేమో హర్షల్, బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చారని.. అంతా బాగుంటుందని సంబరపడిపోతున్నారు. కానీ నాకెందుకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. బాధగా అనిపించినా ఇదే నిజం. ఐపీఎల్లో బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఈసారి మరీ అంత గొప్పగా ఏమీ ఆడలేదు. ఒక్క మ్యాచ్‌లో ఐదు లేదంటే ఆరు వికెట్లు తీసి మిగతా మ్యాచ్‌లలో చేతులు ఎత్తేయడం సరికాదు కదా! మన బౌలింగ్ బలహీనంగా ఉందనేది వాస్తవం. ఇలాంటి ఆట తీరుతో మనం ట్రోఫీ ఎలా గెలవగలం? రోజురోజుకీ మన విజయావకాశాలు సన్నగిల్లుతున్నాయి’’ అని పేర్కొన్నాడు. చదవండి: భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్ కాదు.. టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే: భారత మాజీ ఆటగాడు -
ఏఎన్ఐ పేరిట ట్వీట్! విడాకులంటూ వార్తలు.. స్పందించిన చహల్!
Yuzvendra Chahal- Dhanashree Verma: టీమిండియా స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్, అతడి సతీమణి, యూట్యూబర్ ధనశ్రీ వర్మ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు. కొన్ని రోజుల క్రితం ధనశ్రీ వర్మ టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంట్లో పార్టీకి హాజరైన నాటి నుంచి వీరి గురించి వదంతులు వ్యాపిస్తున్నాయి. చహల్ లేకుండానే పార్టీకి హాజరైన ధనశ్రీ వర్మ.. భారత జట్టు మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి సూర్య దంపతులతో ఫొటో దిగింది. దీనిని సూర్య భార్య దేవిషా శెట్టి ఇన్‌స్టాలో షేర్ చేయడంతో రూమర్లు వ్యాపించాయి. అదే సమయంలో ధనశ్రీ తన ఇన్‌స్టా బయో నుంచి చహల్ ఇంటిపేరును తొలగించడంతో వీరిద్దరూ విడిపోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. (PC: Yuzvendra Chahal) ఈ నేపథ్యంలో.. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ పేరిట నకిలీ అకౌంట్ల నుంచి వచ్చిన ట్వీట్ చహల్ అభిమానుల గుండెల్లో గుబులు రేపింది. ‘‘బ్రేకింగ్: క్రికెటర్ యజువేంద్ర చహల్ నటి ధనశ్రీ వర్మ పంజాబ్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు’’ అంటూ మూడు అకౌంట్ల నుంచి ట్వీట్ షేర్ అయింది. దీంతో చహల్- ధనశ్రీ పేర్లు ట్విటర్లో ట్రెండ్ అవుతున్నాయి. క్షణాల్లో ఈ వార్త వైరల్ అయింది. ఈ విషయాన్ని గమనించిన ఏఎన్ఐ వెంటనే రంగంలోకి దిగింది. ఆ మూడు ఫేక్ అకౌంట్లు అంటూ వివరణ ఇచ్చింది. ఈ మేరకు.. ‘‘ఏఎన్ఐ పేరును వాడుతూ ఈ మూడు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. ఇలాంటి వార్త అసలు ఎక్కడా రాలేదు’’ అని అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ట్వీట్ చేసింది. ఇది చూసిన చహల్ అభిమానులు ఫేక్ రాయుళ్లను ఏకిపారేస్తున్నారు. ‘‘మీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది.. పచ్చని జంట కాపురంలో నిప్పులు పోసేలా ఆ వార్తలు ఏంటి? మీకు బుద్ధిరాదా? సిగ్గు పడండి’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియా కప్-2022 ఆడే భారత జట్టుకు ఎంపికైన యజువేంద్ర చహల్.. మెగా ఈవెంట్లో సత్తా చాటేందుకు సంసిద్ధమవుతున్నాడు. ఇక ధనశ్రీని ప్రేమించిన చహల్ 2020 డిసెంబరులో ఆమెను వివాహమాడిన విషయం తెలిసిందే. సన్నిహితుల నడుమ అత్యంత వైభవోపేతంగా వీరి పెళ్లి జరిగింది. స్పందించిన చహల్.. తమ గురించి వస్తున్న రూమర్లపై యజువేంద్ర చహల్ స్పందించాడు. తమ బంధం గురించి పుట్టుకొస్తున్న ఇలాంటి పుకార్లు నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. దయచేసి ఇలాంటి వదంతులకు ముగింపు పలకాలంటూ గాసిప్ రాయుళ్లకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేశాడు. చదవండి: Yuzvendra Chahal: ఆ క్రికెటర్‌తో చహల్ భార్య ఫొటో! ఇన్‌స్టాలో ఇంటిపేరు తొలగించిన ధనశ్రీ.. హాట్‌టాపిక్‌గా.. IND vs ZIM ODI Series: సిరాజ్ గొప్ప బౌలర్.. అతడి బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు సాధిస్తే: జింబాబ్వే బ్యాటర్ Please note: All three are fake accounts impersonating ANI. No such news has been flashed. pic.twitter.com/rIRwhzneit — ANI (@ANI) August 18, 2022 -
Ind Vs Zim: నేను, నా భార్య ఖాళీగా ఉన్నపుడు చేసే పని అదే! నా ముద్దు పేరు..
India Vs Zimbabwe ODI Series- Sanju Samson: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే పర్యాటక దేశానికి చేరుకున్న ఈ కేరళ ఆటగాడు తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ర్యాపిడ్ ఫైర్ సెషన్లో భాగంగా తన ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. వీడియో ప్రకారం.. పలు ప్రశ్నలకు సంజూ సరదాగా సమాధానమిచ్చాడిలా! నా ముద్దు పేరు ఏమిటంటే?! ►బప్పు మీకు ఇష్టమైన ఆహారం? కానీ ఇప్పుడు తినలేకపోతున్నది? ►చాకొలెట్లంటే నాకు ఇష్టం. అయితే, ఈ పర్యటన వల్ల చాలా రోజుల నుంచే అవి తినడం మానేశాను. నిజానికి మా అమ్మ చేతి వంట అంటే నాకు మహాప్రీతి. అయితే, ఇప్పుడు ఇక్కడున్న కారణంగా ఆమె వంటలు తినే పరిస్థితి లేదు కదా! ఇష్టమైన ప్రదేశాలు ►మా స్వస్థలం కేరళలో నదీజలాలు ఎక్కువ. బీచ్‌లలో సమయం గడపటం అంటే నాకెంతో ఇష్టం. మీకు ఇష్టమైన ఆటగాడు? ►చాలా మంది ఉన్నారు. వారిలో ఎంఎస్ ధోని నా ఫేవరెట్. ఒకవేళ మీకు సూపర్ పవర్స్ వస్తే! ►నాకు ఇష్టమైన ప్రదేశాలన్నింటిని క్షణకాలంలో చుట్టేసి వస్తా. వెంటనే వాటిని మాయం చేస్తా కూడా! టీమిండియా క్రికెటర్లలో ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లను ఆకర్షించే కంటెంట్ కలిగి ఉండేది ఎవరు? ►మన సూపర్ స్టార్ యజువేంద్ర చహల్. ఖాళీగా ఉన్నపుడు మేము చేసే పని అదే! ►నేను, నా భార్య ఇంట్లో ఖాళీగా కూర్చున్నపుడు శిఖర్ భాయ్ రీల్స్ చూస్తూ ఉంటాం. నిజంగా అవెంతో ఆసక్తికరంగానూ.. సరదాగానూ ఉంటాయి. 2015లో అడుగుపెట్టి.. కాగా 1994, నవంబరు 11న త్రివేండ్రంలోని పల్లువిలలో జన్మించిన సంజూ శాంసన్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎదిగాడు. కుడిచేతి వాటం గల 27 ఏళ్ల సంజూ 2015లో జింబాబ్వేతో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇక గతేడాది జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా శిఖర్ ధావన్ సారథ్యంలోని జట్టుకు ఎంపికైన సంజూ శాంసన్.. వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఇటీవలి వెస్టిండీస్ టూర్లో వన్డే సిరీస్‌లో ఆడిన ఈ కేరళ బ్యాటర్.. టీ20 సిరీస్‌లోనూ భాగమయ్యాడు. అదే విధంగా 2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టిన సంజూ.. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్-2022లో రాజస్తాన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో బ్యాటర్‌గానూ.. కెప్టెన్‌గానూ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. ప్రతిభావంతుడైన ఆటగాడిగా నిరూపించుకున్నప్పటికీ సంజూకు టీమిండియాలో తగినన్ని అవకాశాలు రాలేదనే చెప్పాలి. పలు సందర్భాల్లో అతడు రాణించినప్పటికీ సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. దీంతో.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తూ సంజూకు మద్దతుగా నిలిచారు. కాగా జింబాబ్వే టూర్‌కు ఎంపికైన సంజూ.. ఆసియా కప్-2022 ఆడే భారత జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక సంజూ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... తన స్నేహితురాలు చారులతను ప్రేమించిన అతడు 2018, డిసెంబరులో ఆమెను వివాహమాడాడు. చదవండి: Ind VS Zim 1st ODI: ఓపెనర్లుగా వాళ్లిద్దరే! ఇషాన్‌కు నో ఛాన్స్! త్రిపాఠి అరంగేట్రం! India Tour Of Zimbabwe: విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బిక్క మొహం వేసిన ధవన్ His favourite sporting personality? 🤔 Food that he loves but cannot eat now? 🍲 His one nickname that not many are aware of? 😎 All this & much more in this fun rapid-fire with @IamSanjuSamson, straight from Harare. 👌 👌 - By @ameyatilak #TeamIndia | #ZIMvIND pic.twitter.com/IeidffhtMl — BCCI (@BCCI) August 17, 2022 -
Ind Vs WI: మీ అత్యుత్తమ స్పిన్నర్ ఎవరో తెలియదా? అతడి విషయంలో ఎందుకిలా?
India Vs West Indies 2nd ODI: వెస్టిండీస్‌తో రెండో వన్డేలో స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ విషయంలో కెప్టెన్ శిఖర్ ధావన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీమిండియా మాజీ బౌలర్ మురళీ కార్తిక్ విస్మయం వ్యక్తం చేశాడు. మ్యాచ్ 17వ ఓవర్ వరకు అతడి చేతికి బంతిని ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. దీపక్ హుడాతో బౌలింగ్ చేయడంలో తనకేమీ అభ్యంతరం లేదని, అయితే.. చహల్ ఉండగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం టీమిండియా విండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి వన్డే గెలిచిన ధావన్ సేన.. ఆదివారం(జూలై 24) నాటి రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ రెండింటిలోనూ చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా టీమిండియా వరుసగా 3 పరుగులు, 2 వికెట్ల తేడాతో గెలుపొందడం గమనార్హం. ఇక రెండో వన్డేలో విండీస్ ఓపెనర్ షాయి హోప్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన విషయం తెలిసిందే. 135 బంతులు ఎదుర్కొన్న అతడు 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. ఎట్టకేలకు 49వ ఓవర్ ఐదో బంతికి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో బ్యాటర్, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం 77 బంతుల్లో 74 పరుగులతో రాణించాడు. వీరిద్దరి విజృంభణతో నిర్ణీత 50 ఓవర్లలో ఆతిథ్య వెస్టిండీస్ 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. నాకైతే అర్థం కాలేదు! ఈ నేపథ్యంలో మురళీ కార్తిక్ మాట్లాడుతూ.. సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను రంగంలోకి దింపడానికి టీమిండియా యాజమాన్యం ఎందుకంత ఆలస్యం చేసిందో తనకు అర్థం కాలేదన్నాడు. ఈ మేరకు... ‘‘దీపక్ హుడా బౌలింగ్ చేయడం పట్ల నాకెలాంటి అభ్యంతరం లేదు. అయితే, మీ జట్టులో ఉన్న అత్యుత్తమ స్పిన్నర్ ఎవరో మీకు తెలిసి ఉండాలి కదా? అయినా చహల్‌ను 17వ ఓవర్ వరకు ఎందుకు తీసుకురాలేదు’’ అని మురళీ కార్తిక్ ప్రశ్నించాడు. వికెట్లు పడగొట్టే సత్తా ఉన్న చహల్ చేతికి త్వరగా బంతిని ఇవ్వకపోవడం సరికాదని ఈ మాజీ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయకపోవడంతో విండీస్ టీ20 మాదిరి చెలరేగిందని, సరైన వ్యూహాలు అమలు చేస్తే తక్కువ స్కోరుకు ఆతిథ్య జట్టును కట్టడి చేసే అవకాశం ఉండేదని ఫ్యాన్ కోడ్‌తో పేర్కొన్నాడు. కాగా వెస్టిండీస్‌తో రెండో వన్డేలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్, ఆఫ్ స్పిన్నర్ దీపక్ హుడా.. 9 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 42 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కైలీ మేయర్స్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లెగ్ స్పిన్నర్ చహల్ 9 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మొదటి వన్డేలో అర్ధ శతకంతో మెరిసిన బ్రాండన్ కింగ్‌ను ఈ మ్యాచ్‌లో డకౌట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. India pull off a thriller in the final over to win by 2 wickets. #WIvIND #MenInMaroon pic.twitter.com/0xnSYNMyzC — Windies Cricket (@windiescricket) July 24, 2022 ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టాస్: విండీస్- బ్యాటింగ్ వెస్టిండీస్ స్కోరు: 311/6 (50 ఓవర్లు) సెంచరీతో చెలరేగిన షై హోప్(115 పరుగులు) భారత్ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు) విజేత: భారత్.. 2 వికెట్ల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అక్షర్ పటేల్ (64 పరుగులు, ఒక్క వికెట్) అర్ధ సెంచరీలతో రాణించిన శ్రేయస్ అయ్యర్(63), అక్షర్ పటేల్(64), సంజూ శాంసన్(54) చదవండి: IND vs WI: ధోని 17 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన అక్షర్ పటేల్.. తొలి భారత ఆటగాడిగా! Ind Vs WI 1st ODI: 3 పరుగుల తేడాతో విజయం.. ధావన్ సేనకు భారీ షాక్! ఆలస్యంగా వెలుగులోకి.. -
Ind Vs Ire: అంతా నేనే అని విర్రవీగకూడదు.. పాండ్యాపై నెటిజన్ల ఫైర్!
India vs Ireland T20 Series: ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరీ ఇంత స్వార్థం పనికిరాదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్‌గా ఉన్నపుడు జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలని, అంతే తప్ప నేనే అంతా నడిపిస్తున్నా కదా అని విర్రవీగకూడదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. సీనియర్లను చూసి కాస్త నేర్చుకో అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కై టీమిండియా ఐర్లాండ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్లిన్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. ఇక టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. కెప్టెన్‌గా తొలి విజయం.. అయినా లక్ష్య ఛేదనకు దిగిన పాండ్యా సేన 9.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు సాధించింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలో నిలిచింది. 3 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసిన యజువేంద్ర చహల్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. అంతాబాగానే ఉన్నా హార్దిక్ పాండ్యాపై అభిమానుల ఆగ్రహానికి కారణం.. అరంగేట్ర ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ పట్ల వ్యవహరించిన విధానం. ఈ మ్యాచ్‌లో స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్‌తో ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేయించిన పాండ్యా.. తాను మాత్రం రెండు ఓవర్లు వేశాడు. దీంతో.. ఇటీవలి కాలంలో బౌలింగ్‌లో మరీ అంత గొప్ప ప్రదర్శన లేకున్నా నువ్వు మాత్రం రెండు ఓవర్లు వేశావు.. ఉమ్రాన్‌కు మాత్రం ఒకే ఓవర్ ఎందుకు ఇచ్చావు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్‌గా ఇలాగేనా వ్యవహరించేది.. ముందు జట్టు గురించి ఆలోచించాలి.. ఆ తర్వాతే నీ గురించి అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఉమ్రాన్ మాలిక్ తన ఓవర్లో 14 పరుగులు ఇచ్చాడు. కాగా ఐపీఎల్-2022లో 14 సార్లూ ‘ఫాస్టెస్ట్ బాల్’ అవార్డు గెలుచుకున్న ఉమ్రాన్ మొత్తంగా 22 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కలేదు. చదవండి: ENG vs IND: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..! IND vs IRE: చరిత్ర సృష్టించిన హార్ధిక్ పాండ్యా.. తొలి భారత కెప్టెన్‌గా..! For his economical spell of 1/11 - @yuzi_chahal was the player of the match in the 1st T20I 👏👏 A 7-wicket win for #TeamIndia to start off the 2-match T20I series against Ireland 🔝#IREvIND pic.twitter.com/eMIMjR9mTL — BCCI (@BCCI) June 26, 2022 -
IPL 2022: ఏంటో! చహల్, హసరంగ కూడా ఆ చెత్త జాబితాలో..!
IPL 2022: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ అంటే క్రికెట్ ప్రేమికులకు ఎక్కడా లేని ఉత్సాహం. అభిమానులు ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తుంటే స్టేడియం ఈలలతో మారుమోగిపోవాల్సిందే! భారీ హిట్టర్లు, ఫ్యాన్స్‌కు ఇలా పండుగ చేసుకుంటే.. పాపం ఆ బ్యాటర్ ప్రతాపానికి బలైపోయిన బౌలర్ మాత్రం ఉసూరుమంటాడు. ఒక్క పరుగు కూడా ఫలితాన్ని తారుమారు చేయగల సందర్భాల్లో ఇలా జరిగితే ఆ బౌలర్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కొంతమందేమో వికెట్లు పడగొట్టినా పరుగులు ఎక్కువగా సమర్పించుకుని విమర్శల పాలవుతారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న టాప్-5 బౌలర్లు ఎవరో గమనిద్దాం! 1.మహ్మద్ సిరాజ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎంతో ఇష్టపడి మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఒకడు. అయితే, ఈ సీజన్లో అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్-2022లో 15 మ్యాచ్‌లు ఆడిన అతడు 514 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 31 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ఐపీఎల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు ఇచ్చిన బౌలర్‌గా సిరాజ్ చెత్త రికార్డు తన పేరిట నమోదు చేసుకున్నాడు. 2. వనిందు హసరంగ ఐపీఎల్-2022 సీజన్లో శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా 26 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్‌నకు అడుగు దూరంలో నిలిచిపోయాడు. అయితే, ఎక్కువ సిక్స్‌లు ఇచ్చిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఆర్సీబీ తరఫున ఆడిన అతడు 16 మ్యాచ్‌లలో సిక్సర్ల రూపంలో 180 పరుగులు(30 సిక్స్‌లు) సమర్పించుకున్నాడు. మొత్తంగా 430 పరుగులు ఇచ్చాడు. 3. యజువేంద్ర చహల్ ఐపీఎల్-2022లో పర్పుల్ క్యాప్ విన్నింగ్ బౌలర్ యజువేంద్ర చహల్. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన టీమిండియా సీనియర్ స్పిన్నర్.. మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు. ఒక 4 వికెట్, 4 వికెట్హాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు సంపాదించాడు. అంతాబాగానే ఉన్నా ఐపీఎల్-2022లో తాను సమర్పించుకున్న 527 పరుగులలో 27 సిక్సర్ల రూపంలో ఉండటం గమనార్హం. 4. శార్దూల్ ఠాకూర్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 473 పరుగులు ఇచ్చి 15 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23 సిక్సర్లు ఉన్నాయి. మెగా వేలంలో 10.75 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న ఢిల్లీ ఫ్రాంఛైజీ అంచనాలకు అనుగుణంగా ఈ సీమర్ రాణించలేదనే చెప్పాలి. 5. కుల్దీప్ యాదవ్ ఒకానొక దశలో పర్పుల్ క్యాప్ కోసం చహల్‌తో పోటీ పడ్డాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌లలో ఈ చైనామన్ స్పిన్నర్ 21 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 419 పరుగులు ఇచ్చాడు. ఇందులో 22 సిక్సర్ల రూపంలో ఇచ్చినవే. ఇక తనదైన శైలితో రాణించిన కుల్దీప్ యాదవ్ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. చాలా కాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జూన్ 9 నుంచి భారత్‌లో టీమిండియాతో టీ20 సిరీస్ ఆడనున్న దక్షిణాఫ్రికాతో పోరుకు అతడు సిద్ధమవుతున్నాడు. చదవండి: Ind Vs SA T20 Series: టీమిండియాను తక్కువగా అంచనా వేయలేం.. కానీ విజయం మాదే: బవుమా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022 Prize Money: ఐపీఎల్ ‘విజేతలు’.. ఎవరెవరి ప్రైజ్‌మనీ ఎంతంటే!
IPL 2022- All Awards- Winners Prize Money: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్-2022 సీజన్ అట్టహాసంగా ముగిసింది. ఈ ఎడిషన్‌తో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే ట్రోఫీ గెలిచి సత్తా చాటింది. ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్‌ను మట్టికరిపించి విజేతగా నిలిచింది. తద్వారా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సీవీసీ క్యాపిటల్స్ యాజమాన్యానికి మధుర జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇక టైటిల్ విజేతతో పాటు ఇతర అవార్డులు గెల్చుకున్న ఆటగాళ్లు, వారి ప్రైజ్‌మనీపై ఓ లుక్కేద్దాం. ఐపీఎల్–2022 అవార్డులు ట్రోఫీ విజేత: గుజరాత్ టైటాన్స్ ప్రైజ్‌మనీ: 20 కోట్ల రూపాయలు రన్నరప్: రాజస్తాన్ రాయల్స్ ప్రైజ్‌మనీ: 12.50 కోట్ల రూపాయలు ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) జోస్ బట్లర్ (రాజస్తాన్; 863) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ బట్లర్ (రాజస్తాన్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ బట్లర్ (రాజస్తాన్; 45) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ బట్లర్ (రాజస్తాన్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ బట్లర్ (రాజస్తాన్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) యజువేంద్ర చహల్ (రాజస్తాన్; 27) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ ఉమ్రాన్ మలిక్ (హైదరాబాద్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ ఎవిన్ లూయిస్ (లక్నో) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ దినేశ్ కార్తీక్ (బెంగళూరు) ప్రైజ్‌మనీ: టాటా పంచ్ కారు ‘ఫెయిర్ ప్లే’ ఆఫ్ ద సీజన్: గుజరాత్, రాజస్తాన్ మొత్తం ఫోర్లు: 2017 .. మొత్తం సిక్స్‌లు: 1062 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి 👇 Hardik Pandya: సాహో హార్దిక్.. గతంలో కెప్టెన్సీ అనుభవం లేదు.. అప్పటికే ఎత్తుపల్లాలు.. అయినా ఐపీఎల్ చరిత్రలో యజ్వేంద్ర చహల్ సరికొత్త రికార్డు 𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🏆 🙌 That moment when the @gujarat_titans captain @hardikpandya7 received the IPL trophy from the hands of Mr. @SGanguly99, President, BCCI and Mr. @JayShah, Honorary Secretary, BCCI. 👏 👏#TATAIPL | #GTvRR pic.twitter.com/QKmqRcemlY — IndianPremierLeague (@IPL) May 29, 2022 -
IPL 2022: ఆ ఇద్దరి అద్భుత ఫామ్.. ఇక టీమిండియాలో
IPL 2022 Kuldeep Yadav- Yuzvendra Chahal: టీమిండియా స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్- యజువేంద్ర చహల్ ఐపీఎల్-2022లో అదరగొడుతున్నారు. అత్యధిక వికెట్ వీరులకు ఇచ్చే పర్పుల్ క్యాప్ పోటీపడుతున్నారు.ఈ ఎడిషన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న కుల్దీప్ ఇద్దరూ ఎనిమిదేసి మ్యాచ్‌లు ఆడారు. చహల్ 18 వికెట్లు పడగొట్టి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉండగా.. కుల్దీప్ 17 వికెట్లతో అతడి వెనకాలే ఉన్నాడు. కాగా కుల్-చాగా పేరొందిన ఈ రిస్ట్ స్పిన్నర్ ద్వయం ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గత సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో భాగమైన కుల్దీప్‌నకు అసలు ఎక్కువగా ఆడే అవకాశమే రాలేదు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చహల్ 18 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ క్రమంలో వీరిద్దరికి ఆయా ఫ్రాంఛైజీలు ఉద్వాసన పలికాయి. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా ఆర్సీబీతో అనుబంధం పెనవేసుకున్న చహల్‌ను ఆ ఫ్రాంఛైజీ వదిలేయడాన్ని అతడితో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ చహల్ కోసం పోటీపడి 6.50 కోట్లు వెచ్చించి సొంతం చేసుకోగా.. కుల్దీప్ యాదవ్‌ను ఢిల్లీ 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ వీరిద్దరు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇక టీ20 ప్రపంచకప్ టోర్నీ సమీపిస్తున్న తరుణంలో కుల్-చా అద్భుత ఫామ్ టీమిండియాకు సానుకూల అంశంగా పరిణమించింది. వీరిద్దరు ఇలాగే రాణిస్తే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చహల్, కుల్దీప్లను ట్విటర్ వేదికగా అభినందించాడు. ‘‘కఠిన పరిస్థితులు దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులను ఆపలేవు. అలాంటి వారిలో వీరిద్దరు కూడా ఉంటారు. కుల్-చా.. ఇద్దరూ ఫామ్‌లోకి రావడం భలే బాగుంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా కేకేఆర్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా వసీం జాఫర్ ఈ మేరకు ట్వీట్ చేశాడు. చదవండి👉🏾 Rovman Powell Biography: చిన్న ఇల్లు.. కటిక పేదరికం.. ఎన్నో కష్టాలు.. అన్నింటినీ జయించి.. ఇప్పుడిలా! చదవండి👉🏾Kuldeep Yadav: నాకు పెద్దన్న లాంటివాడు.. పర్పుల్ క్యాప్ అతడిదే: కుల్దీప్ Tough times don't last tough people do. And these two are as tough as they come. So good to see KulCha back in form together 😊 #KKRvDC #IPL2022 pic.twitter.com/4bJTdTj8cI — Wasim Jaffer (@WasimJaffer14) April 28, 2022 Special celebration 🙌 Game-changing spell 🔥 The KulCha bond 🤗@kuldeepyadav & @Sakariya55 sum up @DelhiCapitals' winning return at Wankhede. 👌 👌 - By @28anand Full interview 🎥 🔽 #TATAIPL | #DCvKKR https://t.co/MSf5fwCf5R pic.twitter.com/X2NJp72rED — IndianPremierLeague (@IPL) April 29, 2022 -
IPL 2022: నాకు పెద్దన్న లాంటివాడు.. పర్పుల్ క్యాప్ అతడిదే: కుల్దీప్
IPL 2022KKR Vs DC- Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్.. గత సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ చైనామన్ బౌలర్‌కు పెద్దగా ఆడే అవకాశం రాలేదు. టీమిండియాలోనూ అతడి పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేది. ప్రాబబుల్స్‌లో చోటు దక్కినా తుదిజట్టులో ఆడే అవకాశం కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. గతేడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో పునరాగమనం చేసి సత్తా చాటినా మరో ఛాన్స్ కోసం ఎదురుచూడక తప్పని దుస్థితి. ఇందుకు తోడు గాయాల బెడద. ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఇంకా ఏదో వెలితి. అయితే, ఐపీఎల్-2022లో మాత్రం అదరగొట్టే ప్రదర్శనతో ఆ లోటును తీర్చుకుంటున్నాడు కుల్దీప్ యాదవ్. మెగా వేలంలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీ తనపై పెట్టిన పెట్టుబడి, అంచనాలకు మించి రాణిస్తున్నాడు ఈ స్పిన్నర్. కెప్టెన్ రిషభ్ పంత్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వరుస విజయాల్లో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలుస్తున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లోనూ 4 వికెట్లతో రాణించి ఈ అవార్డు అందుకున్నాడు కుల్దీప్ యాదవ్. కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇంద్రజిత్, సునిల్ నరైన్, రసెల్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘నేనిప్పుడు మంచి బౌలర్ అయి ఉండవచ్చు.. అయితే గతంలో కంటే ఇప్పుడు మానసికంగా మరింత దృఢంగా తయారయ్యా. జీవితంలో ఫెయిల్ అవుతున్న సమయంలో అవకాశం వస్తే దానిని ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది. నాకిప్పుడు ఫెయిల్ అవుతానన్న భయం లేదు. రసెల్ వికెట్ తీయడం కోసం నా ప్రణాళికను పక్కాగా అమలు చేసి విజయం సాధించా. నా కెరీర్లో బెస్ట్ ఐపీఎల్ సీజన్ ఇది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. అదే విధంగా శ్రేయస్ అయ్యర్ వంటి కీలక బ్యాటర్ వికెట్ తీయడం తమకెంతో ముఖ్యమని, ఆ పని చేసినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇక ఐపీఎల్-2022లో ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో 18 వికెట్లు తీసిన రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. తాజా మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో 17 వికెట్లతో కుల్దీప్ రెండో స్థానానికి దూసుకువచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య పోటీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక ఢిల్లీ మ్యాచ్ అనంతరం కుల్దీప్ ప్రదర్శనను కొనియాడుతూ చహల్.. ‘‘ కుల్దీప్.. చాంపియన్’’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘అతడి(చహల్)తో నాకు ఎప్పుడూ పోటీ ఉండదు. తను నా పెద్దన్న లాంటి వాడు. ఎల్లప్పుడూ నాకు అండగా నిలబడ్డాడు. గాయంతో బాధ పడుతున్న సమయంలో నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఈసారి పర్పుల్ క్యాప్ అతడే గెలుస్తాడని అనుకుంటున్నా’’ అని 27 ఏళ్ల కుల్దీప్ యాదవ్ చహల్‌పై అభిమానం చాటుకున్నాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ మ్యాచ్- 41: కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లు కేకేఆర్- 146/9 (20) ఢిల్లీ- 150/6 (19) చదవండి👉🏾Shreyas Iyer: మా ఓటమికి కారణం అదే.. మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Special celebration 🙌 Game-changing spell 🔥 The KulCha bond 🤗@kuldeepyadav & @Sakariya55 sum up @DelhiCapitals' winning return at Wankhede. 👌 👌 - By @28anand Full interview 🎥 🔽 #TATAIPL | #DCvKKR https://t.co/MSf5fwCf5R pic.twitter.com/X2NJp72rED — IndianPremierLeague (@IPL) April 29, 2022 A return to winning ways for the Delhi Capitals! 👏 👏 The Rishabh Pant-led side beat #KKR by 4 wickets & seal their 4⃣th win of the #TATAIPL 2022. 👍 👍 Scorecard ▶️ https://t.co/jZMJFLuj4h #DCvKKR pic.twitter.com/QCQ4XrJn0P — IndianPremierLeague (@IPL) April 28, 2022 Kul kul kul kuldeeeeeeeeeeeeepppp 🔥🔥 champion ❤️🤗 #IPL2022 #KKRvDC — Yuzvendra Chahal (@yuzi_chahal) April 28, 2022 -
ఆమె కంటే మేమే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాం చహల్!
IPL 2022 RR Vs KKR: ఐపీఎల్-2022లో యజువేంద్ర చహల్ అదరగొడుతున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ స్పిన్నర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో 176 పరుగులు ఇచ్చి 17 వికెట్లు పడగొట్టాడు. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో చహల్ ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన పూర్తి బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఈ బౌలర్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. ముఖ్యంగా 17వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్, శివమ్ మావి, ప్యాట్ కమిన్స్‌ను వరుసగా పెవిలియన్‌కు పంపి తన తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అంతకు ముందు వెంకటేశ్ అయ్యర్‌ను అవుట్ చేశాడు. ఇలా ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి చహల్ కేకేఆర్ పతనాన్ని శాసించాడు. తద్వారా రాజస్తాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించిన చహల్ సతీమణి ధనశ్రీ వర్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. భర్త గెలుపును సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషంతో పొంగిపోయింది. కాగా చహల్ హ్యాట్రిక్ నేపథ్యంలో ఆర్ఆర్ సిబ్బందితో కలిసి చహల్‌ను ఆమె సరదాగా ఇంటర్వ్యూ చేసింది. ‘‘నేను బబుల్ వెలుపల ఉన్నాను కదా? ఎలా అనిపిస్తోంది’’? అని ధనశ్రీ అడుగగా.. ఈ ఫీలింగ్ చాలా బాగుందంటూ చహల్ కౌంటర్ ఇచ్చాడు. ‘‘హ్యాట్రిక్ డే కదా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? అని ధనశ్రీ అనగానే... అవును మరి మొదటి హ్యాట్రిక్ కదా! అంటూ చహల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ధనశ్రీతో పాటు ఆమె పక్కనే ఉన్న రాజస్తాన్ సిబ్బంది.. ‘‘నువ్వు ఐదు వికెట్లు తీశావు కదా! పర్పుల్ క్యాప్ తిరిగి వచ్చేసింది. నిజానికి ఈమె కంటే మేమే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాం’’ అంటూ ధనశ్రీని ఉద్దేశించి సరాదా వ్యాఖ్యలు చేశారు. కాగా కేకేఆర్‌తో మ్యాచ్‌తో ఏకంగా ఐదు వికెట్లు తీసిన చహల్.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్-1లో నిలిచి.. పర్పుల్ క్యాప్‌ను మరోసారి సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ కేకేఆర్‌పై 7 పరుగుల తేడాతో గెలుపొందింది. చదవండి: ‘అమ్మ చెప్పింది.. శ్రేయస్ అయ్యర్ నన్ను పెళ్లి చేసుకుంటావా?’ View this post on Instagram A post shared by Rajasthan Royals (@rajasthanroyals) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చహల్, కుల్దీప్పై సంజూ ప్రశంసలు.. అశ్విన్ విషయంలో అందుకే అలా!
రెండు విజయాలు.. ఆ తర్వాత ఓటమి.. తాజాగా మరో గెలుపుతో రాజస్తాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్లో ఏడో స్థానానికే పరిమితమైన సంజూ సేన.. ఐపీఎల్-2022 ఎడిషన్ ఆరంభంలో మాత్రం అదరగొడుతోంది. తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయాలు నమోదు చేసిన రాజస్తాన్.. ఆర్సీబీ చేతిలో మాత్రం ఓడింది. అయితే, ఆదివారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో కేవలం 3 పరుగుల తేడాతో గెలుపొందింది. సమిష్టి కృషితో ఈ సీజన్లో మూడో విజయం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ... జట్టు సభ్యులపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మేరకు.. ‘‘టేబుల్ టాపర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. కుల్దీప్ సేన్ తన మొదటి మూడు ఓవర్లు ఎలా వేస్తాడో గమనించి ఆఖర్లో అవకాశం ఇవ్వాలని భావించాం. అనుకున్నట్లుగానే తను పూర్తి ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా వైడ్ యార్కర్లు వేయాలన్న ప్రణాళికను పక్కాగా అమలు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వైడ్ యార్కర్లతో తను చెలరేగిన తీరును మేము చూశాం. ఇక బౌల్ట్ గురించి చెప్పాలంటే.. తను మొదటి బంతి వేసే ముందుకు నా దగ్గరకు వచ్చి... తాను ఎలా బౌలింగ్ చేయబోతున్నాడో చెప్పాడు’’ అని సంజూ తెలిపాడు. అదే విధంగా.. ‘‘హెట్‌మైర్‌తో నా సంభాషణ చాలా సరదాగా ఉంటుంది. తిన్నావా.. బాగా నిద్రపోయావా... అంతా బాగానే ఉందా! అని మాట్లాడుకుంటూ ఉంటాం. అతడి ఆట తీరు అమోఘం. తన అనుభవం మాకెంతగానో పనికివచ్చింది’’ అని హెట్‌మెయిర్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘చహల్.. ఒకటి నుంచి ఇరవై ఓవర్లలో ఎప్పుడైనా తన సేవలను ఉపయోగించుకోవచ్చు. టీమిండియాలో అత్యుత్తమ లెగ్ స్పిన్నర్నున మేము ఎందుకు వదులుతాం. ప్రత్యర్థి జట్టు మీద ఒత్తిడి పెంచాలంటే తను రంగంలోకి దిగాల్సిందే’’ అని సంజూ.. యజువేంద్ర చహల్‌ను కొనియాడాడు. ఇక అశ్విన్ రిటైర్డ్ అవుట్ గురించి చెబుతూ.. ‘‘క్లిష్ట పరిస్థితులు ఎదురైన సమయంలో ఈ అప్షన్ ఉపయోగించుకోవాలని మేము ముందే అనుకున్నాం. ఇది జట్టు నిర్ణయం’’ అని సంజూ స్పష్టం చేశాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అశ్విన్ రిటైర్డ్ ఔట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రియాన్ పరాగ్ క్రీజులోకి వచ్చాడు. చదవండి: IPL 2022: కుల్దీప్.. కుల్దీప్.. అదరగొట్టారుగా! ఇద్దరూ సూపర్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్సీబీ తప్పు చేసింది.. కోహ్లి అవుటైతే మరీ ఇంత సంతోషమా?
అన్నదమ్ములైనా, ప్రాణ స్నేహితులైనా.. వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు ఒక్కసారి మైదానంలో దిగారంటే ప్రత్యర్థులుగా మారిపోవాల్సిందే! తమ జట్టుకు న్యాయం చేసే క్రమంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు తీవ్రంగా పోటీ పడాల్సిందే! ఆ సమయంలో ఎలాంటి సెంటిమెంట్లకు తావుండదు మరి! రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... . అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి అనూహ్య రీతిలో అవుటైన సంగతి తెలిసిందే. తొమ్మిదో ఓవర్లో యజువేంద్ర చహల్ విల్లేకు బంతిని సంధించగా.. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ పాదరసంలా కదిలి బాల్‌ను చహల్ వైపునకు వేశాడు. వెంటనే బంతిని అందుకున్న చహల్ బెయిల్స్‌ను పడగొట్టాడు. దీంతో కోహ్లి రనౌట్‌గా వెనుదిరిగాడు. కాగా గతంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన చహల్‌కు ఆ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లితో అనుబంధం ఉంది. ఐపీఎల్‌తో పాటు టీమిండియాలో ఇద్దరూ ఎన్నో మ్యాచ్‌లలో కలిసి ఆడారు. కోహ్లి సలహాలు, సూచనల మేరకు చహల్ తన ప్రణాళికలు అమలు చేసేవాడు. అయితే, మెగా వేలం నేపథ్యంలో ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో రాజస్తాన్ చహల్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీతో ఆడిన తొలి మ్యాచ్‌లోనే చహల్ అదరగొట్టాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉండగా.. కోహ్లి రనౌట్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కోహ్లి రనౌట్, ఆ వెంటనే తర్వాతి బంతికే విల్లీ అవుటయ్యాడు. ఈ క్రమంలో చహల్ భార్య ధనశ్రీ వర్మ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. పట్టరాని సంతోషంతో ధనశ్రీ ఎగిరి గంతేసిన విధానం చూసి.. ‘‘అయ్యో.. చహల్‌ను రిటైన్ చేసుకోలేదని ఆర్సీబీపై అంతగా పగబట్టారా వదినమ్మా? కోహ్లి అవుట్ అయితే మరీ ఇంత ఆనందమా? లేదంటే ఆర్సీబీ వికెట్లు పడగొడుతున్నందుకా?’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా చహల్ ఇటీవల మాట్లాడుతూ..వాస్తవానికి ఆర్సీబీనే తనను రిటైన్ చేసుకునేందుకు గానీ, వేలంలో తిరిగి దక్కించుకునేందుకు గానీ ఆసక్తి చూపలేదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధనశ్రీ సంబరాలు చూసి.. ‘‘చహల్ ఎంతగా బాధపడ్డాడో.. ఇప్పుడు ధనశ్రీ ఆనందం చూస్తే అర్థమవుతోంది. చహల్‌ను వదిలేసి ఆర్సీబీ తప్పుచేసింది’’ అంటూ మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. చదవండి: IPL 2022: ‘అత్యుత్తమ ఫినిషర్’.. కెరీర్ ముగిసిపోలేదని నాకు నేనే చెప్పుకొన్నా! ఇప్పుడిలా.. Dhanashree reaction after #yuzvendrachahal take david willey wickets #RRvsRCB pic.twitter.com/9nCYIY6GKX — swadesh ghanekar (@swadeshLokmat) April 5, 2022 When @imVkohli got out look at her reaction 😭😭😢😢 !! #RCBvsRR #RRvsRCB #RRvRCB #RCBvRR #Chahal #Kohli #RR #RCB #IPL #IPL2022 #ViratKohli pic.twitter.com/2QSNijcsdw — Akash (@Raju_SSMB) April 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: రాజస్థాన్ రాయల్స్ నూతన కెప్టెన్‌గా యుజ్వేంద్ర చహల్..!
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్) అధికారిక ట్విటర్ ఖాతా నుంచి పోస్టైన ఓ ట్వీట్ క్రికెట్ ఫాలోవర్స్‌ను తికమక పెట్టింది. క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభానికి పట్టుమని 10 రోజుల సమయం కూడా లేని తరుణంలో కెప్టెన్‌ను మార్చేసామని, సంజూ శాంసన్‌పై వేటు వేసి, కొత్త కెప్టెన్‌గా యుజ్వేంద్ర చహల్‌ను నియమించామని ఆర్ఆర్ బుధవారం ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ చేసింది రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కాదని తేలింది. Meet RR new captain @yuzi_chahal 🎉 🎉 pic.twitter.com/ygpXQnK9Cv — Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022 విచిత్ర ప్రవర్తనతో నిత్యం వార్తల్లో నిలిచే చహల్.. అభిమానులను ఫూల్స్ చేసేందుకు జట్టు ట్విటర్ హ్యాండిల్‌ను హ్యాక్ చేసి తనను తాను కెప్టెన్‌గా ప్రకటించుకున్నాడని, జట్టు యాజమాన్యానికి తెలిసే చహల్ ఈ పని చేశాడని అతని తదుపరి ట్వీట్లను బట్టి స్పష్టమవుతుంది. చహల్ సరదాగా చేసిన ఈ పని ఆర్ఆర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. లీగ్ ప్రారంభానికి ముందు ఇలాంటి మతిలేని పనులేంటని నెటిజన్లు చహల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆర్ఆర్ నిజంగానే ఈ నిర్ణయం తీసుకుందని కొందరు అభిమానులు షాక్‌కు గురి కాగా, మరికొందరేమో యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు. RR me twitter account me in login kar Diya hai … bola tha admin job pange mat Lena 🤣🤣 https://t.co/k3yNd6VsEx — Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022 కాగా, చహల్.. ఆర్ఆర్ అధికారిక ట్విటర్‌ను ఆపరేట్ చేసే వ్యక్తి (జేక్ లష్ మెక్‌క్రమ్) నుంచి పాస్వర్డ్ తీసుకున్నాడని, ఇందుకు గాను అతనికి ధన్యవాదాలు కూడా తెలిపాడని, ఈ తంతు మొత్తం యాజమాన్యం కనుసన్నల్లోనే జరిగిందని తెలిసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇలాంటి మెంటల్ పని చేసినందుకు గాను చహల్‌తో పాటు ఆర్ఆర్ యాజమాన్యంపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇదిలా ఉంటే, గత సీజన్ వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చహల్‌ను ఐపీఎల్ 2022 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఉలిక్కిపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు.. బస్సుపై దాడికి పాల్పడ్డ దుండగులు -
మా ఇద్దరిలో ఎవరు బాగా చేశారో చెప్పండి..
ఢిల్లీ: టీమిండియా ఆటగాడు యజ్వేంద్ర చహల్ తన భార్య ధనశ్రీ వర్మతోకలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాప్ సింగర్ మేఘన్ వాంద్జిక్ పాటకు ఇద్దరు కలిసి స్టెప్పులేశారు. ముందు ఫార్వర్డ్ స్టెప్ వేసిన ధనశ్రీ డ్యాన్స్ మొదలుపెట్టగా.. ఆ తర్వాత చహల్ ఆమెకు జతకలిశాడు. ఇద్దరు కలిసి బాడీ మూమెంట్స్ ఏం లేకుండా కేవలం ఫుట్వర్క్పైనే డ్యాన్స్ చేయడం ఆకట్టకుంది. మాములుగానే డ్యాన్స్‌తో పాటు ఎక్స్‌ప్రెషన్స్‌తో ధనశ్రీ దుమ్ములేపితే.. చహల్ కూడా భార్య ట్రైనింగ్‌లో బాగానే రాటుదేలినట్లుగా కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ చహల్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. మా ఇద్దరిలో ఎవరి ప్రదర్శన బాగుందే మీరే చెప్పండి అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక కివీస్‌తో జరగనున్న ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు చహల్ ఎంపిక అవ్వలేదు. అయితే జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియా రెండోజట్టులో మాత్రం చహల్ చోటు దక్కించుకున్నాడు. శ్రీలంక గడ్డపై చహల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు లంక గడ్డపై ఆడిన 6 టీ20 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో ఆర్సీబీ తరపున పాల్గొన్న చహల్ మొదటి రెండు మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోయాడు. అనంతరం జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీశాడు. చదవండి: వచ్చే డబ్ల్యూటీసీలో అన్ని మ్యాచ్‌లకు సమాన పాయింట్లు View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) -
చాహల్ భార్యతో చిందేసిన అయ్యర్..
న్యూఢిల్లీ: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్, సహచర ఆటగాడు యుజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మతో కలిసి చిందేశాడు. 'రోజస్' అంటూ సాగే ఓ పాటకు వీరిద్దరూ ప్రొఫెషనల్ డ్యాన్సర్లలా ఇరగదీశారు. వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను అయ్యర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. మా పాదాల వైపు చూస్తున్నారా అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఐదు లక్షలకు పైగా లైక్‌లు సాధించిన ఈ వీడియోను టీమిండియా ఆటగాళ్లు చాహల్, లోకేశ్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, అక్షర్ పటేల్, అశ్విన్‌లు తెగ మెచ్చుకున్నారు. వీరిద్దరి డ్యాన్స్ మూమెంట్స్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా వీడియోలో ధనశ్రీ హావభావలకు నెటిజన్లు మంత్రముగ్దులయ్యారు. ఆమెను ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్‌తో పోలుస్తూ ఆకాశానికెత్తారు. ఇదివరకే యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ధనశ్రీ.. తాజా వీడియోతో మరింత పాపులారిటిని సొంతం చేసుకుంది. కాగా, ధనశ్రీ వర్మను చాహల్ గతేడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఓ పక్క ధనశ్రీ యూట్యూబ్ వేదికగా డ్యాన్స్‌లతో అదరగొడుతుంటే, మరో పక్క చాహల్ తన మణికట్టు మాయాజాలంతో టీమిండియాకు మరపురాని విజయాలందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. చాహల్ కూడా తన పేరిట యూట్యూబ్ ఛానల్‌ను నడిపిస్తున్నప్పటికీ.. దాన్ని కేవలం ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితం చేశాడు. View this post on Instagram A post shared by Shreyas Iyer (@shreyas41) -
రవీంద్ర-చహల్ విజయం
వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ గెలిచిన ఉత్సాహంతో భారత జట్టు అదే వేదికపై టి20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో సాధారణ స్కోరే సాధించినా... యజువేంద్ర చహల్, నటరాజన్ బౌలింగ్‌తో విజయం దిశగా సాగింది. అంతకుముందు కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీకి తోడు రవీంద్ర జడేజా మెరుపులు జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా, ఆతిథ్య జట్టు మాత్రం అతి సాధారణ ప్రదర్శనతో తేలిపోయింది. అయితే విజయంలోనూ జడేజా–చహల్ ‘కన్కషన్’ వివాదం మ్యాచ్ ఫలితంకంటే ఎక్కువ చర్చ రేపింది. కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో ఆస్టేలియాను ఓడించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, రవీంద్ర జడేజా (23 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. అనంతరం ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులకే పరిమితమైంది. ఫించ్ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), డార్సీ షార్ట్ (38 బంతుల్లో 34; 3 ఫోర్లు), హెన్రిక్స్ (20 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. గాయపడ్డ జడేజా స్థానంలో ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’గా తుది జట్టులోకి వచ్చిన స్పిన్నర్ యజువేంద్ర చహల్ (3/25) మూడు కీలక వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన నటరాజన్ (3/30) కూడా ఆకట్టుకున్నాడు. జడేజా మెరుపులు... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. ధావన్ (1)ను స్టార్క్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఐపీఎల్లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రాహుల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. అబాట్ బౌలింగ్‌లో రాహుల్ వరుసగా 4, 6 కొట్టగా పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 42 పరుగులకు చేరింది. అయితే తర్వాతి ఓవర్లోనే కోహ్లి (9)ని అవుట్ చేసి స్వెప్సన్ దెబ్బ తీశాడు. 37 బంతుల్లో రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, సామ్సన్ (15 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే ఆరు పరుగుల వ్యవధిలో భారత్ సామ్సన్, మనీశ్ పాండే (2), రాహుల్ వికెట్లు కోల్పోయింది. హార్దిక్ (16) కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ దశలో జడేజా ఇన్నింగ్స్ జట్టుకు చెప్పుకో దగ్గ స్కోరును అందించింది. హాజల్‌వుడ్ వేసిన 19వ ఓవర్లో తొలి బంతిని ఫోర్‌గా మలచిన జడేజా... చివరి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 4 బాదాడు. చివరి ఓవర్లో కూడా అతను మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఆకట్టుకున్న నటరాజన్... సాధారణ లక్ష్య ఛేదనను ఆసీస్ ఓపెనర్లు డార్సీ షార్ట్, ఫించ్ మెరుగ్గానే ప్రారంభించారు. దీపక్ చహర్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లతో 14 పరుగులు వచ్చాయి. షమీ ఓవర్లోనూ 12 పరుగులు రాబట్టిన ఆసీస్ పవర్‌ప్లేలో 53 పరుగులు నమోదు చేసింది. తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో పాండే, కోహ్లి క్యాచ్‌లు వదిలేసినా... స్పిన్నర్ చహల్ రాకతో మ్యాచ్ మలుపు తిరిగింది. తొలి వికెట్‌కు 46 బంతుల్లో 56 పరుగులు జోడించిన అనంతరం హార్దిక్ పాండ్యా పట్టిన అద్భుత క్యాచ్‌తో ఫించ్ వెనుదిరిగాడు. చహల్ తన తర్వాతి ఓవర్లోనే స్మిత్ (12)ను కూడా అవుట్ చేశాడు. ఈసారి సామ్సన్ సూపర్ క్యాచ్ అందుకోగా, మ్యాక్స్‌వెల్ (2)ను ఎల్బీగా అవుట్ చేసిన నటరాజన్ తన కెరీర్లో తొలి వికెట్ సాధించాడు. ఆ తర్వాత హెన్రిక్స్ కొంత ప్రయత్నించడం మినహా ఆసీస్ గెలుపునకు చేరువగా రాలేకపోయింది. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 27 పరుగులు కావాల్సి ఉండగా ఆ జట్టు 15 పరుగులే చేసింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) అబాట్ (బి) హెన్రిక్స్ 51; ధావన్ (బి) స్టార్క్ 1; కోహ్లి (సి అండ్ బి) స్వెప్సన్ 9; సామ్సన్ (సి) స్వెప్సన్ (బి) హెన్రిక్స్ 23; మనీశ్ పాండే (సి) హాజల్‌వుడ్ (బి) జంపా 2; హార్దిక్ (సి) స్మిత్ (బి) హెన్రిక్స్ 16; జడేజా (నాటౌట్) 44; సుందర్ (సి) అబాట్ (బి) స్టార్క్ 7; దీపక్ చహర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–11; 2–48; 3–86; 4–90; 5–92; 6–114; 7–152. బౌలింగ్: స్టార్క్ 4–0–34–2; హాజల్‌వుడ్ 4–0–39–0; జంపా 4–0–20–1; అబాట్ 2–0–23–0; స్వెప్సన్ 2–0–21–1; హెన్రిక్స్ 4–0–22–3. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డార్సీ షార్ట్ (సి) హార్దిక్ (బి) నటరాజన్ 34; ఫించ్ (సి) హార్దిక్ (బి) చహల్ 35; స్మిత్ (సి) సామ్సన్ (బి) చహల్ 12; మ్యాక్స్‌వెల్ (ఎల్బీ) (బి) నటరాజన్ 2; హెన్రిక్స్ (ఎల్బీ) (బి) చహర్ 30; వేడ్ (సి) కోహ్లి (బి) చహల్ 7; అబాట్ (నాటౌట్) 12; స్టార్క్ (బి) నటరాజన్ 1; స్వెప్సన్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–56; 2–72; 3–75; 4–113; 5–122; 6–126; 7–127. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–29–1; సుందర్ 4–0–16–0; షమీ 4–0–46–0; నటరాజన్ 4–0–30–3; చహల్ 4–0–25–3. హార్దిక్ పాండ్యా అద్భుత క్యాచ్ కండరాల నొప్పితో కూలబడ్డ జడేజా -
‘ప్రేమను ఫోటోలో ఉంచాం’
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ తన కాబోయే భార్య ధనశ్రీ వర్మతో కలిసి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంట్లో చహల్ తన చేతులతో లవ్ సింబల్ పెట్టగా ధనశ్రీ వర్మ పద్మాసనంలో కుర్చొని కనిపిస్తుంది. ఈ ఫోటోలో ఈ జంట ఎంతో ఆనందంతో నవ్వుతూ కనిపిస్తుంది. ‘మేము ఈ ప్రేమను ఫోటోలో ఉంచాం’ అని కెమెరా, గులాబీ ఎమోజీలతో ఫోటోకు శీర్షిక పెట్టారు. వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి తనకు కాబోయే భార్య మీద ఎంత ప్రేమ ఉందో చూపించారు. అభిమానులతో పాటు కొందరు ప్రముఖులు కూడా ఈ జంటను అభినందించారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టన్ట్ ప్రిన్స్ నరులా ఫోటోకు హార్ట్ ఎమోజీల పెట్టి స్పందించారు. (ఇంతకూ ధనశ్రీ ఎవరో తెలుసా!) మా కుటుంబాలతో పాటు మేము ఈ పెళ్లకి ఒప్పుకున్నాం అని చహల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను భారత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా పలువురు సహచరులు అభినందించారు. యజువేంద్ర చాహల్ భారత్ తరఫున 52 వన్డేలు, 42 టీ 20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్లో చాహాల్ రాయల్ ఛాలెంజర్స్ తరుపున ఆడనున్నాడు. View this post on Instagram We keep this love in a photograph 📸 🌹 A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on Aug 13, 2020 at 3:51am PDT చదవండి: 11 ఏళ్లకు వచ్చి ‘సున్నా’చుట్టి -
ఇంతకూ ధనశ్రీ ఎవరో తెలుసా!
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. చహల్ కొంతకాలంగా ధనశ్రీ వర్మ అనే యువతిని ప్రేమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తననే పెళ్లి చేసుకోబోతున్నానని, ఇవాళ (శనివారం) రోకా కార్యక్రమం కూడా జరిగినట్లు చహల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రోకా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ అవును ‘మేము ప్రేమించుకున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి ఈ ధనశ్రీ వర్మ ఎవరా? అని తెలుసుకునేందుకు నెటిజన్లు, చహల్ అభిమానులు గూగుల్‌లో వెతకడం మొదలు పెట్టారు. అయితే ఈ ధనశ్రీ.. ఓ డ్యాన్సర్, కొరియోగ్రఫర్. తన పేరు మీద సొంతంగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. (చదవండి: టీమిండియా క్రికెటర్ చహల్ పెళ్లి ఆమెతోనే) అతే విధంగా బాలీవుడ్ ట్రాక్స్ డ్యాన్సర్‌తో పాటు హిప్ హాప్లో శిక్షణ కూడా ఇస్తూ ఉంటుంది. అంతేకాదు తను ఫేమస్ యూట్యూబర్ కూడా. యుట్యూబ్లో తనకు 1.5 మిలియన్న్ల ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కాగా ధనశ్రీ వర్మ జూలై 23 చహల్ పుట్టిన రోజు సంద్భంగా శుభకాంక్షలు చెబుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో సల్మాన్ ఖాన్ ‘భరత్’లోని ఓ స్లో మోషన్ సాంగ్‌కు చహల్ డ్యాన్స్ చేస్తున్నవీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. “డ్యాన్స్ టీచర్‌గా నేను మీ వికెట్ తీశానని చెప్పాలనుకుంటున్నాను @yuzi_chahal23 మీరు ఎప్పుడు సరదాగా ఉండే విద్యార్థి, అద్భుతమైన వ్యక్తి కూడా” అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. దీనికి చహల్ ‘ధన్యవాదాలు’ అంటూ హర్ట్ ఎమోజీని జోడించి సమాధానం ఇచ్చాడు. -
యువరాజ్‌పై కేసు నమోదు
చండీగఢ్ : టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌పై హర్యానాలోని హిసార్ జిల్లా హన్సి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. యుజువేంద్ర చహల్‌ను కులం పేరుతో కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా దళిత హక్కుల కార్యకర్త, న్యాయవాది రజత్ కల్సాన్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు యూవీపై కేసు నమోదు చేయాలంటూ హన్సీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన యూవీపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని పోలీసులను ఒత్తిడి చేశారు. వివరాల్లోకి వెళితే.. రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడుతూ టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను సరదాగా కామెంట్ చేసే క్రమంలో కులం పేరు వాడటంతో అది కాస్తా వివాదానికి దారి తీసింది. టిక్‌టాక్‌లో చాహల్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్ చేస్తున్నాడని, వీళ్లకేం పని లేదంటూ వాల్మీకి సమాజాన్ని కించపరిచేలా యువీ వ్యాఖ్యలు చేశాడు.(యువీకి సరికొత్త తలనొప్పి) దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారమే రేగింది.ఒక కులాన్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేస్తావా అంటూ యువీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక కులం పేరుతో యువరాజ్ కామెంట్ చేయడం నిజంగా సిగ్గు చేటని సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఏ పరిస్థితుల్లోనైనా మతాన్ని, కులాన్ని, జాతిని, వర్ణాన్ని ఉద్దేశించి మాట్లాడటం అవతలి వాళ్లను కించపరచడమేనంటూ విమర్శలు కురిపించారు. ఈ క్రమంలోనే యువరాజ్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ‘యువరాజ్ సింగ్ మాఫీ మాంగో’(యువరాజ్ క్షమాపణలు చెప్పాలి) పేరుతో ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు.(ధోని.. నా హెలికాప్టర్ షాట్లు చూడు!) -
'సిక్స్ కొడితే ఆ బంతిని బ్యాట్స్‌మన్ తెచ్చుకోవాలి'
ముంబై : కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో క్రీడలన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమవడంతో వారంతా ఫామ్‌ను అందుకునేందుకు చాలా సమయం పడుతుందని టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ అంటున్నాడు. అందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను ఏదైనా సిరీస్ లేక టోర్నమెంట్ ముందు నిర్వహిస్తే ఆటగాళ్లు మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చహల్ మాట్లాడుతూ..' కరోనా ప్రభావం తగ్గి మైదానంలోకి దిగితే ఆటగాళ్లు ఫామ్‌ను అందుకోవడానికి సమయం తీసుకుంటారు. నా దృష్టిలో మిగతా సిరీస్‌లను నిలిపివేసి ఐపీఎల్‌ను నిర్వహిస్తే బాగుంటుంది. ఐపీఎల్‌ను నిర్వహించాలనుకుంటే మాత్రం రెండు నెలలు నిర్వహిస్తే ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ దొరుకుతుంది. దీంతో రాబోయే సిరీస్‌లకు ఇది మంచి అవకాశంగా మారుతుందంటూ' పేర్కొన్నాడు.(నాకు సచిన్ వార్నింగ్ ఇచ్చాడు..: గంగూలీ) బంతిని షైన్ చేసేందుకు సలైవాను ఉపయోగిస్తున్నారని, దీనివల్ల బౌలర్లకు మేలు జరగుతుందనే అభిప్రాయం ఉంది. దీనిపై నువ్వేమంటావు అని చాహల్‌ను ప్రశ్నించగా.. ' బంతిని పాతబడే కొద్ది దానిని షైన్ చేయకపోతే మాకు స్వింగ్ చేసే అవకాశం ఉండదు. అప్పుడు వికెట్లు రావడం కూడా కష్టమవుతుంది. ఇక బ్యాట్స్‌మెన్ ఎప్పుడైనా సిక్స్ కొడితే ఆ బంతిని తిరిగి తెచ్చుకోవాలనే కొత్త రూల్‌ను క్రికెట్లో యాడ్ చేయాల్సి వస్తుంది.. ఎందుకంటే అది బ్యాట్స్‌మెన్‌కు ప్రతీ బంతిని సిక్స్ కొట్టే అవకాశం ఇస్తుందని' నవ్వుతూ తెలిపాడు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించినా ప్రపంచకప్ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేగాక పరిస్థితులు ఇలాగే ఉంటే టీ 20 ప్రపంచకప్ 2021 ఫిబ్రవరి- మార్చిలో జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఐసీసీ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అక్టోబర్ వరకు కూడా కరోనా ప్రభావం తగ్గకపోతే ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇలా నిర్వహించడానికి ఐసీసీ సిద్ధంగా లేనట్లు తెలుస్తుంది. (పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై నిషేధం) -
ఆడకుండా.. నన్ను కిడ్నాప్ చేశారు: అశ్విన్
చెన్నై: తనను క్రికెట్ మ్యాచ్ ఆడనీయకుండా ‘ప్రత్యర్థి జట్టు’ అభిమానులు కిడ్నాప్ చేశారని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. బజ్జీలు, వడలు కొనిపెట్టి.. బంతి విసిరితే.. చేతివేళ్లు కత్తిరిస్తామని చాలా మర్యాదగా హెచ్చరించారని చెప్పాడు. భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు టాప్ స్పిన్నర్‌గా వెలుగొందిన అశ్విన్.. క్రికెట్ మ్యాచ్ కారణంగా తాను టీనేజ్‌లో ఎదుర్కొన్న అనుభవాల గురించి పంచుకున్నాడు. ‘‘బాల్యంలో నా స్నేహితులతో కలిసి రోడ్ల మీద క్రికెట్ ఆడేవాడిని. అయితే మా నాన్నకు ఈ విషయం ఎంతమాత్రం నచ్చేది కాదు. అలాంటి సమయంలో ఒకానొక రోజు మేం ప్రత్యర్థి జట్టుతో ఫైనల్ మ్యాచ్‌లో తలపడాల్సి వచ్చింది. ఆరోజు ఓ నలుగురు వ్యక్తులు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద వచ్చారు. పద మనం వెళ్లాలి అంటూ తొందరపెట్టారు. దాంతో డౌట్ వచ్చి మీరెవరు అని ప్రశ్నించాను. నువ్విక్కడ మ్యాచ్ ఆడుతున్నావంట కదా. అందుకే తీసుకువెళ్లడానికి వచ్చాం. పద అన్నారు. వాళ్ల మాటలు విని.. అబ్బో నాకోసం బండి పంపించారా అని సంబరపడ్డాను. తర్వాత పాష్ ఏరియాలో టీ షాపునకు నన్ను తీసుకువెళ్లారు. బజ్జీలు, వడలు కొనిపెట్టారు. నువ్వేం భయపడకు..నీతోనే ఉంటాం అని చెప్పారు. ఇంతలో మ్యాచ్‌కు టైం అయ్యిందని వాళ్లను తొందర పెట్టగా.. మెల్లగా అసలు విషయం బయటపెట్టారు. వాళ్లు ప్రత్యర్థి జట్టుకు చెందిన వాళ్లట. మ్యాచ్ ఆడితే నా చేతివేళ్లు కట్ చేస్తామన్నారు. సరే నేను ఎక్కడికీ వెళ్లను అని చెప్పాను. ఆ తర్వాత వాళ్లే నన్ను ఇంటి దగ్గర దిగబెట్టారు’’అని అశ్విన్ సరదా సంఘటనను గుర్తు చేసుకున్నాడు. కాగా గత కొంతకాలంగా అశ్విన్ టెస్టు ఫార్మాట్‌కే పరిమితం అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్ వంటి యువ స్పిన్నర్లు భారత జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లుగా మారిపోవడంతో అశ్విన్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. -
అరె! అచ్చం బుమ్రాను దింపేశాడుగా
-
అరె! అచ్చం బుమ్రాను దింపేశాడుగా
ఆక్లాండ్ : టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 26 ఏళ్ల బుమ్రా తన వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్‌తో అన్ని ఫార్మాట్లలో రాణిస్తూ ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో కివీస్‌కు చెందిన ఒక కుర్రాడు అచ్చం బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను దించేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వీడియోలో ఆ కుర్రాడు అచ్చం బుమ్రా తరహాలోనే బంతిని పట్టుకొని స్లోరన్అప్తో బౌలింగ్ వేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కివీస్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ కుర్రాడి బౌలింగ్‌ను వీడియో తీసి ట్విటర్లో షేర్ చేశాడు. తర్వాత ఆ కుర్రాడిని దగ్గరకు పిలిచి అచ్చం బుమ్రాలాగే బౌలింగ్ వేశావంటూ అభినందించాడు. కాగా టీమిండియా ప్రసుత్తం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. శనివారం రెండో వన్డే ప్రారంభానికి ముందు నెట్స్‌లో బౌలింగ్ సాధన చేస్తున్న బుమ్రా, యుజువేంద్ర చాహల్ వద్దకు కివీస్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్ వచ్చి కుర్రాడి బౌలింగ్ వీడియో క్లిప్పింగ్‌ను చూపించాడు.ఆ వీడియో చూసి బుమ్రా నవ్వుకోగా, చాహల్ మాత్రం ' అరె!అచ్చం బుమ్రా బౌలింగ్‌ను దించేశాడు. బుమ్రా కంటే ఈ కుర్రాడి బౌలింగే బాగుంది' అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. -
కుల్దీప్ ఇన్.. చహల్ ఔట్
హామిల్టన్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. చహల్ స్థానంలో కుల్దీప్ తుది జట్టులోకి వచ్చాడు. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ చేజింగ్‌కే మొగ్గు చూపాడు. ‘ఇది బౌలింగ్ అనుకూలించే పిచ్ కనుక మేం ఫీల్డింగ్ ఎంచుకున్నాం. ఇక్కడ గత మ్యాచ్‌లో మేం ఘోరపరాభావాన్ని చవిచూశాం. ఇదో పెద్ద గేమ్. చేజింగ్‌లో మాకు మంచి రికార్డుంది. మా జట్టులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. చహల్ స్థానంలో కల్దీప్ తుది జట్టులోకి వచ్చాడు.’ అని టాస్ సందర్భంగా రోహిత్ పేర్కొన్నాడు. ఇక ఆతిథ్య జట్టులో కూడా స్వల్ప మార్పు చోటు చేసుకుంది. కివీస్ తరఫున బ్లెయిర్ టిక్నెర్ అంతర్జాతీయ క్రికెట్లోకి ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. ఫెర్గూసన్ స్థానంలో అతను తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుని ఈ పర్యటనను ఘనంగా ముగించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతుండగా.. కివీస్ మాత్రం టీ20 సిరీస్ నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. తుది జట్టు: భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, పంత్, విజయ్ శంకర్, ధోని, దినేశ్ కార్తీక్, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, కుల్దీప్, ఖలీల్ న్యూజిలాండ్: సీఫెర్ట్, మున్రో, విలియమ్సన్, రాస్ టేలర్, మిషెల్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, సౌతీ, సోధి, టిక్నెర్. -
చివరి వన్డేలో రోహిత్ సేన ఘనవిజయం
-
కివీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా
-
కివీస్ గడ్డపై టీమిండియా నయా చరిత్ర
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 4-1తో సిరీస్ నెగ్గి 52 ఏళ్లుగా సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది. 1967 నుంచి కివీస్ పర్యటనకు వెళుతున్న టీమిండియా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో సిరీస్ విజయాన్ని (2008-09 పర్యటనలో) అందుకుంది. తాజాగా 4-1తో అతిపెద్ద సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుని నయా చరిత్రను సృష్టించింది. చివరి మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో సమిష్టిగా రాణించి విజయాన్నందుకున్న రోహిత్ సేన నాలుగో వన్డే పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను హైదరాబాదీ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు (90: 113 బంతులు, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ (45: 64 బంతులు, 4 ఫోర్లు)లు అద్భుత భాగస్వామ్యంతో ఆదుకున్నారు. చివర్లో కేదార్ జాదవ్ (34: 45 బంతుల్లో, 3ఫోర్లు), పాండ్యా (45: 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)లు రాణించడంతో భారత్ ఆతిథ్య జట్టుకు 253 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం ఈ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కివీస్ 217 పరుగులకు కుప్పకూలింది. దీంతో రోహిత్ సేన 35 బంతులు మిగిలి ఉండగానే 35 పరుగులతో విజయం సాధించింది. అంతకు ముందు లక్ష్యఛేదనకు దిగిన కివీస్‌ను షమీ దెబ్బతీశాడు. ఓపెనర్లు హెన్రీ నికోల్స్(8), కొలిన్ మున్రోలను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే రాస్ టేలర్‌ను పాండ్యా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో లాథమ్, విలియమ్సన్‌లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. క్రీజులో పాతుకుపోతూ ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని పార్ట్‌టైమ్ బౌలర్ కేదార్ జాదవ్ విడగొట్టాడు. కెప్టెన్ విలియమ్సన్(39)ను క్యాచ్ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఐదో వికెట్‌కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరికొద్ది సేపటికే లాథమ్(37), గ్రాండ్‌హోమ్(11)లను చహల్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. మరో 41 పరుగుల అనంతరం నీషమ్(44) రనౌట్‌గా వెనుదిరిగాడు. చివర్లో సాట్నర్(22), అశ్లే(10), బోల్ట్(1)ల వికెట్లు కూడా త్వరగా కోల్పోవడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో చహల్‌కు మూడు, పాండ్యా, షమీలకు రెండు వికెట్లు పడగా.. భువన్వేశర్, జాదవ్‌లకు తలో వికెట్ దక్కింది. గట్టెక్కించిన రాయుడు-శంకర్ భారత ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్ ద్వయం హెన్రీ, బౌల్ట్‌లు పదునైన బంతులతో చెలరేగడంతో భారత టాప్-4 బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ(2), శిఖర్ ధావన్ (6), శుభ్‌మన్ గిల్(7), ఎంఎస్ ధోని(1)లు స్వల్పస్కోర్లకే పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో భారత్ 18 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట పరిస్థితిలో అంబటి రాయుడు- విజయ్ శంకర్ భారత ఇన్నింగ్స్‌ను గట్టెక్కించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీకి చేరువైన విజయ్ శంకర్(45: 64 బంతులు, 4 ఫోర్లు) లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జాదవ్‌తో రాయుడు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ దశలో రాయుడు 86 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో కెరీర్లో 10వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీకి చేరువయ్యే క్రమంలో అనవసర షాట్‌కు ప్రయత్నించి రాయుడు(90) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో ఆరో వికెట్‌కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే మరో 13 పరుగుల వ్యవధిలో జాదవ్ (34: 45 బంతుల్లో, 3ఫోర్లు)ను హెన్రీ బౌల్డ్ చేశాడు. కసి కసిగా.. పాండ్యా! అనంతరం క్రీజులోకి వచ్చిన హర్దిక్ పాండ్యా వచ్చి రావడంతోనే కసిగా ఆడాడు. ముఖ్యంగా అస్లే వేసిన 47 ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్‌లతో చెలరేగాడు. వచ్చిన బంతి వచ్చినట్టు బౌండరీకి తరలించాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్స్‌లతో 45 పరుగులు చేసిన పాండ్యా.. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో నిషేధానికి గురై ఆటకు దూరమైన పాండ్యా.. ఆడుతున్నంత సేపు ఆ కసిని బంతి మీద చూపించినట్లు కనిపించింది. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన సత్తా ఏంటో నిరూపించి జట్టుకు తన అవసరం ఏంటో గుర్తు చేశాడు. -
మా ఆటగాళ్లను అవమానిస్తారా: గావస్కర్
మెల్బోర్న్ : క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. తమ ఆటగాళ్లకు ముష్టి వేసినట్లు 500 యూఎస్ డాలర్ల(రూ.35వేలు) బహుమతిగా ఇచ్చి అవమానిస్తారా? అని నిలదీశారు. మూడు వన్డేల సిరీస్ గెలిస్తే ముష్టేసినట్లు ఓ ట్రోఫీతో సరిపెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మెల్బోర్న్ వేదికగా జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించగా.. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. మ్యాచ్ అనంతరం నిర్వాహకులు ధోని, చహల్‌లకు ఈ ట్రోఫీలతో పాటు నగదు బహుమతిగా చెక్కులు అందజేశారు. ఈ చెక్కుల విషయమే సునీల్ గావస్కర్‌కు ఆగ్రహం తెప్పించింది. మరి దారుణంగా నిర్వాహకులు 500 యూఎస్ డాలర్ల(రూ.35వేలు) చెక్కులను అందజేశారు. దీనిపై గవాస్కర్ సోనీ సిక్స్‌తో మాట్లాడుతూ.. సీఏ, టోర్నీ నిర్వాహకులను తప్పుబట్టారు. ‘మరి కనికరం లేకుండా.. ఏందీ ఈ 500 యూఎస్ డాలర్లు. సిరీస్ గెలిస్తే భారత జట్టుకు కేవలం ట్రోఫీ మాత్రమే దక్కింది. టోర్నీ నిర్వాహకులు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వలేకపోయారు. బ్రాడ్కాస్ట్ హక్కుల పేరిట చాలా సొమ్ముచేసుకున్నారు. అయినా ఆటగాళ్లకు మంచి నగదు బహుమతి ఎందుకు ఇవ్వలేదు? ఆటగాళ్ల వల్లనే స్పాన్సర్ వస్తారు. వారి వల్లనే డబ్బులు వస్తాయి. ఒక్కసారి వింబుల్డన్‌లో ఆటగాళ్లకు ఇచ్చే నగదు బహుమతిని చూడండి. ఆటగాళ్ల వల్లనే క్రీడల్లో డబ్బులు వర్షం కురుస్తోంది. వారికి గౌరవప్రదమైన క్యాష్ రివార్డ్స్ ఇవ్వండి’ అని గవాస్కర్ చురకలంటించాడు. ఇక భారత అభిమానులు సైతం గవాస్కర్ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నారు. సోషల్ మీడియా వేదికగా టోర్నీ నిర్వాహకులపై మండిపడుతున్నారు. ‘ఎవడికి కావాలి ఈ ముష్టి’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ముమ్మాటికి భారత ఆటగాళ్లను అవమానించడమేనని, వెంటనే సీఏ భారత ఆటగాళ్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. -
కోహ్లి ఔట్.. హాఫ్ సెంచరీ మిస్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో భారత్.. కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 113 పరుగుల వద్ద కోహ్లి (46: 66 బంతుల్లో 3 ఫోర్లు) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రిచర్డ్సన్ వేసిన 29 ఓవర్ చివరి బంతి కోహ్లి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ క్యారీ చేతిలో పడింది. దీంతో కోహ్లి నలుగు పరుగుల తేడాతో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. ఇక 10 పరగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లికి లైఫ్ లభించింది. స్టాన్లేక్ బౌలింగ్‌లో కోహ్లి ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ హ్యాండ్స్కోంబ్ అందుకోలేకపోయాడు. కోహ్లి వికెట్ అనంతరం క్రీజులోకి జాదవ్ వచ్చాడు. 32 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఇంకా భారత విజయానికి 111 పరుగుల అవసరం. -
ధోని అదిరే స్టంపింగ్ చూశారా?
మెల్బోర్న్ : టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని మరోసారి తన మార్క్కీపింగ్తో ఔరా అనిపించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్‌ను తనదైన స్టంపింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. గత మ్యాచ్‌లో శతకంతో మెరిసిన షాన్ మార్ష్.. తాజా మ్యాచ్‌లో ధోని దెబ్బకు 39 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. తొలుత మార్ష్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వదిలేసిన ఈ సీనియర్ వికెట్ కీపర్.. కొద్దిసేపటికి ఆ తప్పిదాన్ని చురుకైన స్టంపింగ్‌తో సరిదిద్దుకున్నాడు. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ వేసిన వైడ్ బంతిని ముందుకొచ్చి ఆడబోయిన మార్ష్.. ధోని వ్యూహానికి అడ్డంగా దొరికిపోయాడు. ఈ మ్యాచ్‌లో 6 వికెట్లతో చెలరేగిన చహల్‌కు ఇది తొలి వికెట్ కావడం ఇక్కడ విశేషం. దీంతో వన్డేల్లో అత్యధికసార్లు స్టంపౌట్ అయిన రెండో బ్యాట్స్‌మన్‌గా షాన్‌మార్ష్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 60 మ్యాచ్‌ల్లో ఈ లెఫ్టార్మ్ బ్యాట్స్‌మన్ ఆరు సార్లు స్టంపౌట్ కావడం గమనార్హం. ఈ జాబితాలో మార్ష్ కన్నా ముందు ఇంగ్లండ్ ఆటగాడు నాసీర్ హుస్సేన్ (77 మ్యాచ్‌ల్లో 8 స్లార్లు) ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సార్లు స్టంపౌట్ అయిన బ్యాట్స్‌మన్‌గా కూడా మార్షే నిలిచాడు. మార్ష్ తరువాత టామ్ మూడీ (52 మ్యాచ్‌ల్లో 5 సార్లు) ఉన్నాడు. ధోని క్యాచ్ మిస్.. పెదవి విరిచిన కోహ్లి అంతకుముందు భారత పార్ట్‌టైం స్పిన్నర్ కేదార్ జాదవ్ వేసిన 17వ ఓవర్లో షాన్ మార్ష్ బంతిని కట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లింది. కానీ.. ఆ బంతిని ధోని జారవిడచడంతో.. సునాయస క్యాచ్ నేలపాలైంది. రెండో వన్డేలో శతకం బాది మంచి ఫామ్‌లో ఉన్న షాన్ మార్ష్.. ఔట్ అయ్యే మంచి అవకాశం చేజారడంతో బౌలర్ కేదార్ జాదవ్, కెప్టెన్ కోహ్లిలు పెదవి విరిచారు. ఇది టీవీలో స్పష్టంగా కనిపించింది. ఇక నిలకడలేమి ఆటతో విమర్శలు ఎదుర్కొన్న ధోని ఈ సిరీస్‌తో గాడిలో పడ్డాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఈ మాజీ కెప్టెన్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రెండో వన్డేలో విలువైన పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
ధోని అదిరిపోయే స్టంపింగ్ చూశారా?
-
టీ20 ర్యాంకుల్లో అరుదైన సందర్భం.!
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకుల్లో అరుదైన సందర్భం చోటుచేసుకుంది. బౌలింగ్ విభాగంలో తొలి ఐదు స్థానాలు లెగ్ స్పిన్నర్లే సొంతం చేసుకున్నారు. 759 రేటింగ్ పాయింట్లతో అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ తొలి స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ షాదాబ్‌ఖాన్ 733 పాయింట్లతో రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. 706 పాయింట్లతో భారత స్పిన్నర్ యుజువేంద్ర చహల్ మూడో ర్యాంకు సాధించాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోది(700), వెస్టిండీస్ స్పిన్నర్ సామ్యుల్ బద్రీ (671) నాలుగు, ఐదు ర్యాంకుల్లో ఉన్నారు. ఐపీఎల్-11 సీజన్లో రషీద్ ఖాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తుండగా చహల్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. గత సీజన్లో బెంగళూరుకు ఆడిన సామ్యుల్ బద్రీని ఈ సారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కనికరించలేదు. ఇష్ సోదీ సైతం అన్‌సోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయాడు. -
చిందేసిన కోహ్లి, చాహల్
సాక్షి, బెంగళూరు : క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-11వ సీజన్ మరో మూడో రోజుల్లో మొదలు కానుంది. అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టేశాయి. కేవలం ఆటతోనే సరిపెట్టకుండా స్టెప్పులేసి మరీ అభిమానులను ఆకట్టుకోవడానికి రాయల్ చాలెంజర్స్(ఆర్సీబీ) బెంగుళూరు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఆర్సీబీ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఆటగాళ్లు యజువేంద్ర చాహల్, బ్రెండన్ మెకల్లమ్ చిందులేశారు. ‘ఐపీఎల్ కోసం లెజెండ్స్‌తో వార్మప్ మొదలెట్టేశా’ అంటూ కోహ్లి, మెక్‌కల్లమ్‌ను ట్యాగ్ చేస్తూ 12 సెకన్ల నిడివి ఉన్న డాన్స్ వీడియోను చాహల్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో కోహ్లి తనదైన శైలిలో రెచ్చిపోగా మెక్కల్లమ్, చాహల్‌లు అతన్ని అనుకరించే ప్రయత్నం చేశారు. ఏప్రిల్ 8న ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్)తో తలపడనుంది. విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ వంటి స్టార్లతో పాటు యువ ఆటగాళ్లతో ఎంతో పటిష్టమైన జట్టుగా పేరున్నప్పటికీ ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ అందుకోలేకపోయింది. ఫైనల్‌కు చేరిన ప్రతిసారీ అభిమానులను నిరాశపర్చింది. క్రిస్‌గేల్‌ను వదులుకున్న ఆర్సీబీ ఈసారి బ్రెండన్ మెకల్లమ్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డీకాక్‌లను జట్టులోకి తీసుకోవడం ద్వారా బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టపరచుకుంది. ఇక ఆర్సీబీ బౌలర్లు చాహల్, వాషింగ్టన్ సుందర్, ఎమ్ అశ్విన్, పవన్ నేగీలు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కట్టడిచేసేందుకు తమ బౌలింగ్‌కు పదునుపెడుతున్నారు. -
‘ఆ ఇద్దరి వల్లే భారత్‌కు విజయాలు’
సాక్షి, స్పోర్ట్స్ : భారత మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహలే భారత విజయాలకు కారణమని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ పాల్ ఆడమ్స్ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరితోనే కోహ్లిసేన బలంగా ఉందని తెలిపారు. బ్యాటింగ్‌కే ఎకువ ప్రాధాన్యత ఇచ్చే ప్రస్తుత తరుణంలో ఇద్దరు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకోవడం గొప్ప విషయమన్నారు. వారు మణికట్టు బౌలర్లే అయినప్పటికి వారు వేసే బంతుల్లో చాలా వైవిధ్యం ఉందని కొనియాడారు. బ్యాట్స్‌మన్‌కు అందకుండా బంతులు వేస్తూ సమర్ధవంతమైన ప్రదర్శనను కనబరుస్తున్నారని ఈ మాజీ క్రికెటర్ తెలిపారు. బ్యాటింగ్‌కు అనుకూలించే జోహన్నెస్‌బర్గ్ మైదానంలో ఆతిథ్య జట్టు ఒక్క స్పిన్నర్‌ను కూడా బరిలోకి దింపలేదన్నారు. కానీ భారత్ మాత్రం ఈ ఇద్దరిని ఆడించి ప్రత్యేకంగా నిలిచిందన్నారు. దక్షిణాఫ్రికాలో తొలి సారి పర్యటిస్తున్నా ఆ యువస్పిన్నర్లలో ఏ మాత్రం భయం కనిపించలేదన్నారు. వారు ఒక మ్యాచ్‌లోనే ఒత్తిడికి లోనయ్యారని, తర్వాతీ మ్యాచుల్లో బ్యాటింగ్‌పిచ్‌లపై సైతం రాణించారని ఆడమ్స్ ప్రశంసించారు. చాహల్ స్థిరంగా రాణిస్తూ బంతిని చాలా బాగా తిప్పేస్తున్నాడని, యాదవ్ గూగ్లీలు బ్యాట్స్‌మన్‌కు ఏమాత్రం అర్థం కావడంలేదన్నారు. ఇక ఐపీఎల్‌తో వారు మరింత రాటుదేలుతారని చెప్పుకొచ్చారు. సఫారీ పర్యటనలో భారత్ 5-1తో వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించడంలో ఈ యువ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఆరు వన్డేల్లో ఏకంగా 33 వికెట్లు పడగొట్టారు. -
చహల్ నెం.1 కుల్దీప్ నెం.13
సాక్షి, హైదరాబాద్: భారత యువ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో నాలుగు వికెట్లు చేజిక్కించుకొని ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో తొలిస్థానంలో నిలిచాడు. 11 మ్యాచ్‌లు ఆడిన చహల్ 23 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా 17వికెట్లతో అప్ఘనిస్థాన్ యువ బౌలర్ రషీద్ ఖాన్, కె విలియమ్స్(వెస్టిండీస్)లు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. డెత్ బౌలర్ల స్పెషలిస్టు, భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 11 వికెట్లతో 9వ స్థానంలో నిలవగా. .చైనామన్ కుల్దీప్ యాదవ్ 7 మ్యాచుల్లో 7 వికెట్లతో 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. సీనియర్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు ప్రత్యామ్నాయంగా పొట్టి ఫార్మట్‌లో ఈ యువ స్పిన్ బౌలర్లను బీసీసీఐ పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకతో రెండో టీ20లో తొలుత దారుణంగా పరుగుల సమర్పించిన చహల్(4-52), కుల్దీప్(3-52)లు చివర్లో 7 వికెట్లు పడగొట్టి భారత్‌కు భారీ విజయాన్నందించారు. -
తొలి టీ20లో భారత్ ఘనవిజయం
కటక్: శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ (4-23) మాయాజాలానికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో లంకపై భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో 3 టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాట్స్‌మెన్‌లో ఉపుల్ తరంగ 23( 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు), కుశాల్ పెరీరా(19), డిక్వెల్లా(13), చమీరా(12)లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వడంతో శ్రీలంక 87 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లలో చాహల్ (4), పాండ్యా(3), కుల్దీప్ యాదవ్(2) వికెట్లు తీయగా.. ఉనద్కత్ ఒక వికెట్ తీశాడు. రాహుల్ హాఫ్ సెంచరీ.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్ రోహిత్(17) నిరాశపర్చగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 61 (48 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్సు) అర్ధ సెంచరీతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. మరో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 24(20 బంతులు, 3 ఫోర్లు).. చివర్లో ధోని 39(22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సు), మనీష్ పాండే 32(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) రాణించడంతో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భారత్ లక్ష్యం 216
సాక్షి, విశాఖ: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో లంక భారత్‌కు 216 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. లంక బ్యాట్స్మన్లలో తరంగ 95 ( 82 బంతులు, 12 ఫోర్లు, 3 సిక్సులు) సదీర సమరవిక్రమా 42(57 బంతుల్లో 5 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తయడంతో లంక 44.5 ఓవర్లకు 215 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఇక భారత బౌలర్లలో చహల్, కుల్దీప్లు మూడేసి వికెట్లు తీయగా పాండ్యా రెండు, బుమ్రా, భువనేశ్వర్‌లు ఒక వికెట్ తీశారు. లంక ఆరంభం అదుర్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక ఓపెనర్ గుణతిలక మరో సారి నిరాశపరిచాడు. అయినా మరో ఓపెనర్ తరంగ, సమరవిక్రమాతో కలిసి మంచి శుభారంభాన్ని అందించాడు. ఈ ఇద్దరు సమన్వయంతో ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీలకు తరలించారు. పాండ్యా వేసిన 8 ఓవర్లో తరంగ ఏకంగా 5 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి లంక వికెట్ నష్టపోయి 68 పరుగుల చేసింది. అనంతరం మరింత స్పీడ్ పెంచిన ఈ జోడి స్కోరు బోర్డును వేగంగా పరుగెత్తించింది. ఈ దశలోనే తరంగ 36 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్లో 36వ అర్ధ సెంచరీ సాధించాడు. జట్టు స్కోర్ 136 పరుగుల వద్ద సదీర చహల్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి ధావన్‌కు చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 121 పరుగుల భాగ స్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మాథ్యూస్‌తో తరంగా ఏమాత్రం వేగం తగ్గించుకుండా పరుగులు చేశాడు. మలుపు తిప్పిన ధోని స్టంప్ అవుట్.. భారత చైనామన్ కుల్దీప్ యాదవ్ వేసిన 27 ఓవర్ తొలి బంతిని ఉపుల్ తరంగ క్రీజు దాటి ఆడబోగా.. బంతిని అందుకున్న ధోని అంతే వేగంతో వికెట్లను కొట్టేశాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరగా రిప్లయ్‌లో తరంగ సరిగ్గా తన లెగ్ ఆన్ది లైన్‌పై పెట్టె సమయంలో ధోని వికెట్లను గీరేశాడు. థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో తరంగ సెంచరీ చేజారింది. ఈ వికెట్ అనంతరం శ్రీలంక పేక ముక్కల్లా కుప్పకూలింది. ఇదే ఓవర్లో డిక్వెల్లా(8) అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఏ బ్యాట్స్‌మన్ నిలదొక్కుకోలేకపోయారు. మథ్యూస్(17), పెరీరా(6), పతిరణ(7) అఖిల ధనుంజయ(1), లక్మల్(1)లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివర్లో గుణరత్నే(17) కూడా అవుటవ్వడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 44.5 ఓవర్లకే ముగిసింది. -
కోహ్లీ సక్సెస్ సీక్రెట్ లీక్ అయింది!
బెంగళూరు: ఐపీఎల్-9 తొలి దశలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటకు ప్రస్తుతం వారి హార్డ్ హిట్టింగ్ షో ఇన్నింగ్స్ లకు ఎలాంటి సంబంధమే లేదు. అప్పుడు వరుస ఓటములు.. ఇప్పుడు భారీ విజయాలతో ప్రత్యర్థి జట్లను అలవోకగా మట్టికరిపిస్తూ ప్లే ఆఫ్స్ కు దూసుకుపోతోంది. బుధవారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టును 82 పరుగుల భారీ తేడాతో బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం బెంగళూరు బౌలర్ యుజువేంద్ర చాహల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. బెంగళూరు టాప్-4 బ్యాట్స్ మన్ కు బౌలింగ్ చేయాలనుకుంటాన్నారా అన్న ప్రశ్నకు.. వామ్మో వారికి బౌలింగ్ చేయాలని మాత్రం తాను భావించడం లేదని చెప్పాడు. విరాట్ భారీ ఇన్నింగ్స్ ల సీక్రెట్ గురించి కూడా మాట్లాడాడు. కోహ్లీ ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యమిస్తాడని, అందుకే జిమ్ లో ఎక్కువ సమయం గడుపుతాడని చాహల్ అన్నాడు. నెట్స్ లో అధికంగా శ్రమించడం కోహ్లీకి కలిసొచ్చిందని, పిచ్ మధ్యలోకి వచ్చి సిక్స్ లు కొట్టడం ప్రాక్టీస్ చేయడంతో సులువుగా భారీ షాట్లు కొడుతున్నాడని తమ జట్టు కెప్టెన్ సక్సెస్ సీక్రెట్ ను వెల్లడించాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్ లాంటి ఆటగాళ్లు ఉంటడం బెంగళురుకు కలిసొచ్చే అంశమని చెప్పుకొచ్చాడు. బౌలర్లు రాణించడంతో టోర్నీలో పాయింట్ల పట్టికలో తమ జట్టు రెండో స్థానానికి చేరుకుందన్నాడు. బెంగళూరు విజయాలలో బ్యాట్స్ మన్ మాత్రమే కాదు బౌలర్లు కూడా కీలకపాత్ర పోషిస్తున్నామని ఆ జట్టు బౌలర్ యుజువేంద్ర చాహల్ అభిప్రాయపడ్డాడు. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరడంలో బౌలర్లు కూడా తీవ్రంగా శ్రమించారని, ముఖ్యంగా జోర్డాన్ రాకతో తమ బౌలింగ్ మరింత బలోపేతమైందని చెప్పాడు. తొలి రెండు మ్యాచులలో అంతగా రాణించని జోర్డాన్ కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో రాణించాడు.