India vs New Zealand, 3rd ODI: న్యూజిలాండ్‌తో ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చిన మేనేజ్‌మెంట్.. ఉమ్రాన్ మాలిక్, యజువేంద్ర చహల్‌కు తుది జట్టులో చోటిచ్చింది. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
కాగా గత రెండు మ్యాచ్‌లలో ఉమ్రాన్ మాలిక్, చహల్‌కు బెంచ్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పర్యాటక కివీస్ మంగళవారం నాటి ఇండోర్ వన్డేలో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ పాతబడే కొద్ది బ్యాటింగ్‌కు మరింత అనుకూలిస్తుంది.
చిన్న గ్రౌండ్ కాబట్టి భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. ఇక్కడ మేము మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నాడు. జాకోబ్ డఫీ స్థానంలో హెన్రీ షిప్లేను ఆడిస్తున్నామని.. తమ జట్టులో ఇదొక్కటే మార్పు అని తెలిపాడు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే
తుది జట్లు
టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, జాకోబ్ డఫీ, బ్లేయర్ టిక్నర్
చదవండి: Mohammed Shami: షమీకి ఏడాదికి రూ. 7 కోట్లు! నెలకు 10 లక్షల భరణం ఇవ్వలేరా? కోర్టు తీర్పు ఇదే
Rohit Sharma: రోహిత్ కెరీర్‌ను మలుపు తిప్పిన ధోని నిర్ణయం.. దశాబ్ద కాలంగా.. సూపర్ ‘హిట్టు’!
Comments
Please login to add a commentAdd a comment