
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ తన కాబోయే భార్య ధనశ్రీ వర్మతో కలిసి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంట్లో చహల్ తన చేతులతో లవ్ సింబల్ పెట్టగా ధనశ్రీ వర్మ పద్మాసనంలో కుర్చొని కనిపిస్తుంది. ఈ ఫోటోలో ఈ జంట ఎంతో ఆనందంతో నవ్వుతూ కనిపిస్తుంది. ‘మేము ఈ ప్రేమను ఫోటోలో ఉంచాం’ అని కెమెరా, గులాబీ ఎమోజీలతో ఫోటోకు శీర్షిక పెట్టారు. వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి తనకు కాబోయే భార్య మీద ఎంత ప్రేమ ఉందో చూపించారు. అభిమానులతో పాటు కొందరు ప్రముఖులు కూడా ఈ జంటను అభినందించారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టన్ట్ ప్రిన్స్ నరులా ఫోటోకు హార్ట్ ఎమోజీల పెట్టి స్పందించారు. (ఇంతకూ ధనశ్రీ ఎవరో తెలుసా!)
మా కుటుంబాలతో పాటు మేము ఈ పెళ్లకి ఒప్పుకున్నాం అని చహల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను భారత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా పలువురు సహచరులు అభినందించారు. యజువేంద్ర చాహల్ భారత్ తరఫున 52 వన్డేలు, 42 టీ 20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌లో చాహాల్ రాయల్ ఛాలెంజర్స్ తరుపున ఆడనున్నాడు.
చదవండి: 11 ఏళ్లకు వచ్చి ‘సున్నా’చుట్టి
Comments
Please login to add a commentAdd a comment