ఆయనే మళ్లీ పుట్టాడు.. నిఖిల్ ఎమోషనల్ పోస్ట్! | Nikhil Siddhartha Shares Emotional Post After Blessed With A Baby Boy | Sakshi
Sakshi News home page

Nikhil: నిఖిల్ దంపతులకు కుమారుడు.. ఎంత ముద్దుగా ఉన్నాడో చూశారా?

Published Thu, Feb 22 2024 7:00 AM | Last Updated on Thu, Feb 22 2024 8:42 AM

Hero Nikhil Couples Blessed with Baby Boy He shares Emotional Post - Sakshi

టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్‌ తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్‌, డాక్టర్‌ పల్లవి  2020లో పెద్దల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కొడుకు పుట్టిన సందర్భంగా హీరో నిఖిల్ ఎమోషనలయ్యారు. తన తండ్రి మళ్లీ తిరిగి వచ్చాడంటూ పోస్ట్ చేశారు. 

నిఖిల్‌ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఏడాది క్రితమే మా నాన్న మిస్సయ్యాను. ఇప్పుడు మా కుటుంబంలోకి మగ బిడ్డ అడుగుపెట్టారు. ఆయనే మళ్లీ తిరిగి వచ్చాడని అనుకుంటున్నా. మాకు అబ్బాయి జన్మించినందుకు చాలా సంతోషంగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా కుటుంబంలోకి తన తండ్రే మళ్లీ తిరిగి వచ్చాడంటూ ఎమోషనలయ్యారు నిఖిల్.  

ఇక నిఖిల్‌ సినీ  కెరీర్‌ విషయాకొస్తే.. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్‌’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు.  కార్తికేయ, స్వామిరారా సినిమాలతో హిట్స్‌ అందుకున్నాడు. కార్తికేయ 2తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం మరో పాన్‌ ఇండియా మూవీ ‘స్వయంభూ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. . చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్​ ఓ వారియర్​ పాత్రలో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement