ఐపీఎల్-2023 తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వెస్టిండీస్ సిరీస్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టన్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో చాహల్ చోటు దక్కింది. అయితే విండీస్ పర్యటనకు వెళ్లే ముందు చాహల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. చాహల్ గ్లోబల్ చెస్ లీగ్‌లో పాల్గొనేందుకు సిద్దమయ్యాడు.
ఈ లీగ్‌లో ఆల్పైన్ వారియర్స్ జట్టుతో చాహల్ జట్టుకట్టాడు. కాగా క్రికెట్, చెస్ రెండింటిలోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు చాహల్ అన్న సంగతి తెలిసిందే. చాహల్ ఓ వైపు క్రికెట్‌లో బీజీబీజీగా ఉన్నప్పటికీ.. ఖాళీ సమాయాల్లో మాత్రం చెస్‌మాస్టర్‌గా మారుతుంటాడు. ఇప్పుడు మరోసారి తన మాస్టర్‌మైండ్‌ను చూపించేందుకు చాహల్ సిద్దమయ్యాడు.
కాగా గ్లోబల్ చెస్ లీగ్ ప్రపంచ చెస్ ఫ్రాంచైజీ లీగ్‌లో అత పెద్దది. ఇక ఈ విషయాన్ని చాహల్ కూడా దృవీకరించాడు. స్టీల్ ఆర్మీ(ఆల్పైన్ వారియర్స్) జట్టులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆల్పైన్ వారియర్స్ ఛాంపియన్స్ నిలవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ స్టీల్ ఆర్మీ అంటూ ట్విటర్‌లో చాహల్ పేర్కొన్నాడు.
విండీస్‌తో వన్డేలకు భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment