chess tounry
-
వెస్టిండీస్ టూర్‌కు ముందు చాహల్ కీలక నిర్ణయం.. మరో లీగ్‌లో ఆడేందుకు!
ఐపీఎల్-2023 తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వెస్టిండీస్ సిరీస్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టన్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో చాహల్ చోటు దక్కింది. అయితే విండీస్ పర్యటనకు వెళ్లే ముందు చాహల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. చాహల్ గ్లోబల్ చెస్ లీగ్‌లో పాల్గొనేందుకు సిద్దమయ్యాడు. ఈ లీగ్‌లో ఆల్పైన్ వారియర్స్ జట్టుతో చాహల్ జట్టుకట్టాడు. కాగా క్రికెట్, చెస్ రెండింటిలోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు చాహల్ అన్న సంగతి తెలిసిందే. చాహల్ ఓ వైపు క్రికెట్లో బీజీబీజీగా ఉన్నప్పటికీ.. ఖాళీ సమాయాల్లో మాత్రం చెస్మాస్టర్గా మారుతుంటాడు. ఇప్పుడు మరోసారి తన మాస్టర్‌మైండ్‌ను చూపించేందుకు చాహల్ సిద్దమయ్యాడు. కాగా గ్లోబల్ చెస్ లీగ్ ప్రపంచ చెస్ ఫ్రాంచైజీ లీగ్‌లో అత పెద్దది. ఇక ఈ విషయాన్ని చాహల్ కూడా దృవీకరించాడు. స్టీల్ ఆర్మీ(ఆల్పైన్ వారియర్స్) జట్టులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆల్పైన్ వారియర్స్ ఛాంపియన్స్ నిలవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ స్టీల్ ఆర్మీ అంటూ ట్విటర్లో చాహల్ పేర్కొన్నాడు. విండీస్‌తో వన్డేలకు భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్. చదవండి: -
రన్నరప్ హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: కెరీర్లో తొలి మాస్టర్స్ టోర్నమెంట్ టైటిల్ గెలిచే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ చేజార్చుకున్నాడు. చైనాలో శనివారం ముగిసిన షెన్జాన్ మాస్టర్స్ అంతర్జాతీయ టోర్నమెంట్లో హరికృష్ణ రన్నరప్‌గా నిలిచాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణ ఆరు పాయింట్లతో రెండో స్థానంతో సంతృప్తి పడ్డాడు. నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ అనీశ్ గిరి 6.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. చివరిదైన పదో రౌండ్లో హరికృష్ణ 72 ఎత్తుల్లో లిరెన్ డింగ్ (చైనా) చేతిలో ఓడిపోగా... అనీశ్ గిరి 97 ఎత్తుల్లో జకోవెంకో (రష్యా)పై గెలుపొంది టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. లిరెన్ డింగ్ (5.5 పాయింట్లు) మూడో స్థానంలో... రాపోర్ట్ (హంగేరి–5 పాయింట్లు) నాలుగో స్థానంలో... జకోవెంకో, యాంగి యు (చైనా– -
ప్రతిభకు ’చెద’రంగం
రాష్ట్ర ఎస్జీఎఫ్ పోటీల నిర్వహణలో అక్రమాలు చెస్ టోర్నీలో ప్రతిభావంతులకు దక్కని చోటు కొన్ని రౌండ్లు ఆడకున్నా పాయింట్ల కేటాయింపు సస్పెన్షన్‌లో ఉన్న వ్యక్తే చీఫ్ ఆర్బిటర్ సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చెస్ జట్ల ఎంపికలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పిల్లల ప్రతిభకు పదునుపెట్టి మెరికల్లాంటి వారిని ఎంపిక చేయాల్సి ఉండగా.. ఎక్కడా అలా జరగడంలేదు. అయిన వారి కోసం ప్రతిభావంతులను పక్కన పెట్టిన బాగోతం తాజాగా బయటపడింది. నిబంధనలకు తిలోదకాలిచ్చి టోర్నీలు నిర్వహిస్తున్నట్లు తేలింది. 62వ జాతీయ స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర స్థాయి(వేర్వేరు వయోవిభాగాలు) చెస్ జట్ల కోసం ఈనెల 17, 18వ తేదీన రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలోని సెరెనిటీ స్కూల్లో సెలక్షన్స జరిగారుు. ఆటగాళ్లను ఎంపిక చేసే బాధ్యతల్ని రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కు అప్పగించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుంచి వచ్చిన చెస్ క్రీడాకారులు (బాలలు, బాలికలు) అండర్ -14, 17, 19 విభాగాల్లో పాల్గొన్నారు. రెండు రోజులు ఐదు రౌండ్ల పాటు కొనసాగిన ఈ టోర్నీకి డైరక్టర్‌గా రమేష్ రెడ్డి, చీఫ్ ఆర్బిటర్‌గా శ్రీకృష్ణ అలియాస్ ధన వ్యవహరించారు. పక్కనపెట్టిన వ్యక్తికే పట్టం.. సస్పెన్షన్ వేటు పడిన వ్యక్తినే ఆర్బిటర్‌గా కొనసాగించి టోర్నీని నిర్వహించారు. అండర్-11 విభాగంలో రాష్ట్ర చెస్ చాంపియన్‌షిప్‌లో అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంటూ చీఫ్ ఆర్బిటర్ శ్రీకృష్ణపై నెల క్రితం తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆరు నెలలపాటు సస్పెన్షన్ విధించింది. నిషేధం ఉన్న కాలంలో ఏ టోర్నీకి కూడా ఆర్బిటర్‌గా వ్యవహరించకూడదని ఆ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయి నా నిబంధనలకు విరుద్ధంగా జాతీయ స్థాయి జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేసే బాధ్యతలను ఉద్దేశపూర్వకంగా అప్పగించినట్లు తెలుస్తోంది. మరోపక్క ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లోనూ ఇతను ఆర్బిటర్ కొనసాగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా అతన్ని తప్పించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అవకతవకలకు సాక్ష్యాలు... ఈనెల 17న నాగారంలో జరిగిన స్టేట్ స్కూల్ గేమ్స్ చెస్ టోర్నీలో తొలిరోజు పాల్గొనని ఇద్దరు క్రీడాకారులను (అండర్-17, అండర్ -19 బాలికల విభాగం) పాల్గొన్నట్టుగా చూపించారు. అంతేగాక వారిని రెండో రోజునుంచి ఆడించారు. వాస్తవంగా తొలిరోజు ఆడని వారికి రెండో రోజు అవకాశం కల్పించకూడదు. వీరిద్దరిలో ఒకరు అండర్-19 విభాగంలో రాష్ట్రస్థారుు జట్టుకు ఎంపిక కావడం గమనార్హం. పైగా వీరిద్దరూ 17వ తేదీన రాష్ట్రంలోనే లేరు. ఇదే తేదీన కోల్‌కతాలో జరిగిన జాతీయ అండర్-17 బాలికల చదరంగ పోటీల్లో పాల్గొన్నారు. వాస్తవంగా తొలిరోజు జరిగిన రెండు రౌండ్లలో పాల్గొనకుండా అధిక పాయింట్లు సంపాదించడం చదరంగ చరిత్రలో సాధ్యపడిన దాఖలాలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు. అండర్-14 బాలికల విభాగంలో తమకు కావాల్సిన క్రీడాకారిణి కోసం ప్రతిభ గల వ్యక్తిని పక్కనబెట్టారు. అది కూడా దాదాపు 1500 రేటింగ్ గల క్రీడాకారిణిని. ప్రతి రౌండ్‌కు ప్రత్యర్థులను నిర్ణయించే ప్రక్రియలో లోపాల కారణంగా అనర్హులకు టీంలో చోటు కల్పించారు. అండర్-17 బాలికల విభాగంలో మరో అక్రమం చోటుచేసుకుంది. ఓ బాలికకు ఫిడే రేటింగ్ ఉన్న అంశంపై గోప్యత పాటించారు. ఈ క్రీడాకారిణిని.. అసలు రేటింగ్ లేనివారితో తలపడేలా చేశారు. ఫలితంగా గోప్యత పాటించిన క్రీడాకారిణి 4 పాయింట్లు సాధించి జాతీయ టోర్నీ ఆడే టీంకు ఎంపికకావడం గమనార్హం. లోపాలు ఎక్కడా బయటపడకుండా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా అవకతవకలకు అవకాశం ఉండే ‘స్విస్ పర్ఫెక్ట్’ సాఫ్ట్‌వేర్‌పై ఫెడరేషన్ నిషేధం విధించింది. దాంతో ఏ చెస్ అసోసియేషన్ కూడా కొన్నాళ్లుగా వినియోగించడం లేదు. అరుుతే ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక టోర్నీలకు ఇదే సాఫ్ట్‌వేర్‌ను వాడారు. ఈ కారణంగానే ప్రతిభ గల క్రీడాకారులను పక్కన బెట్టడం సాధ్య పడింది. టోర్నీని ఆరు రౌండ్లు నిర్వహించాల్సి ఉండగా.. ఐదింటితోనే ముగించేశారు. నియమ నిబంధన ప్రకారం క్రీడాకారుల సంఖ్య 40 దాటితే టోర్నీ 6 రౌండ్లు సాగాలి. క్రీడాకారుల సంఖ్య తగ్గితే 5 రౌండ్లకే పరిమితం కావాలి. కానీ అండర్-14 బాలుర విభాగంలో 48 మంది పోటీపడినప్పటికీ.. 5 రౌండ్లతోనే మమ అనిపించారు. తద్వారా ప్రతిభ గలవారికి చోటుదక్కలేదు. తిరిగి నిర్వహించాలి... తాజా వివాదంపై ఆటగాళ్ల తల్లిదండ్రులు కొందరు నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలపై జిల్లా విద్యాధికారి (డీఈఓ) బుధవారం విచారణ కూడా జరిపారు. అయితే సాంకేతికపరంగా జరిగిన కొన్ని లోపాలను సాకుగా చూపిస్తూ నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఇప్పటికే ఎంపికై న ఆటగాళ్లే జాతీయ స్థాయిలో పోటీ పడే అవకాశం కనిపిస్తున్నాయి. దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ‘పారదర్శకంగా, అత్యంత పకడ్బందీగా జరగాల్సిన టోర్నీలో అవకతవకలు జరుగుతుండటం దురదృష్టకరం. లోటుపాట్ల విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉన్నా వారు పట్టించుకోవడం లేదు. అక్రమాలు జరిగిన టోర్నీని రద్దు చేసి ఎటువంటి మచ్చలేని ఆర్బిటర్ల ఆధ్వర్యంలో తిరిగి నిర్వహించాలి. అవకతవకలపై నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి‘ అని చెస్ క్రీడాకారుడి తండ్రి ఒకరు వ్యాఖ్యానించారు. అరుుతే ఈ ఆరోపణలను శ్రీకృష్ణ ఖండించారు. ‘నిబంధనలకు అనుగుణంగానే సెలక్షన్సను నిర్వహించాము. ఎటువంటి అవకతవకలు జరగలేదు. పారదర్శకంగా ఎంపిక నిర్వహించామని చెప్పేందుకు మా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి‘ అని ఆయన వివరణ ఇచ్చారు. -
చెస్ చాంప్స్ బాలకిషన్, ఆయూష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల చెస్ టోర్నమెంట్లో బాలకిషన్, ఆయూష్ చాంపియన్లుగా నిలిచారు. బేగంపేటలోని ఏ9 అకాడమీలో ఆదివారం జరిగిన ఓపెన్ కేటగిరీ తుదిరౌండ్ గేమ్‌ని బాలకిషన్ (5)... భరత్ కుమార్ (4.5)తో మ్యాచ్ డ్రా చేసుకొని విజేతగా నిలిచాడు. జూనియర్ విభాగంలో ఆయూష్ (4.5)... ధనుశ్ రెడ్డి (4.5)తో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. కానీ మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఆయూష్ విజేతగా నిలిచాడు. అనంతరం టీఎస్‌సీఏ కార్యదర్శి ఎ. వెంకటేశ్వర రావు, ఇంటర్నేషనల్ మాస్టర్ పి.డి.ఎస్ గిరినాధ్, సీనియర్ చెస్ కోచ్ రవి, ఈవెంట్ కన్వీనర్ స్రవంతి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇతర కేటగిరీల విజేతలు: అండర్-13 బాలికలు: 1. సాయి ప్రియ 2. శ్రేయ; అండర్-11 బాలురు: 1. సాయి మణీంద్ర, 2. ప్రభంజన్; అండర్-11 బాలికలు: 1. శ్రీయ, 2. అద్వైత; అండర్-9 బాలురు: 1. ధనుశ్ రెడ్డి, 2. సమీర్; అండర్-9 బాలికలు: 1. శ్రీ భవాగ్ని, 2. శాన్వి; అండర్-7 బాలురు: 1. లుకా జైన్, 2. సుహాస్; అండర్-7 బాలికలు: 1. రిమితా రెడ్డి, 2. అంకితా రెడ్డి.