
సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో భారత్.. కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో భారత్.. కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 113 పరుగుల వద్ద కోహ్లి (46: 66 బంతుల్లో 3 ఫోర్లు) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రిచర్డ్సన్ వేసిన 29 ఓవర్ చివరి బంతి కోహ్లి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ క్యారీ చేతిలో పడింది. దీంతో కోహ్లి నలుగు పరుగుల తేడాతో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. ఇక 10 పరగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లికి లైఫ్ లభించింది. స్టాన్‌లేక్ బౌలింగ్‌లో కోహ్లి ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ హ్యాండ్స్‌కోంబ్ అందుకోలేకపోయాడు. కోహ్లి వికెట్ అనంతరం క్రీజులోకి జాదవ్ వచ్చాడు. 32 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఇంకా భారత విజయానికి 111 పరుగుల అవసరం.